రత్నాన్ని ధరించటం ద్వారా అదృష్టాన్ని ఎలా పొందవచ్చు ? కష్టాల నుండి అనతి కాలంలోనే ఎలా బయట పడవచ్చు ? రత్నధారణ ఎలా చేయాలి ? ఒరిజినల్ రత్నాన్ని ఎలా గుర్తించాలి ? వంటి అనేక విశేషాలు వివరించటమైనది

హైందవ మిత్రులకు నమస్కారం,
మిత్రులారా ఒక సాధారణ జాతకాన్ని విశేష జాతకంగా మార్చుకోవటానికి మన హైందవ గ్రంధాలూ అనేక మార్గాలు సూచించటం జరిగింది. అందులో ఒక్కొక్కటిగా మెల్లి మెల్లిగా తెలుసుకుందాం. అందులో భాగం గా ఈ రోజు మనం రత్నాల గురించి తెలుసుకుందాం.
మిత్రులారా ప్రతీ మనిషి తన పుట్టుక రిత్య కొన్ని దోషాలను కలిగి ఉండటం సహజం. అవి వారు పుట్టిన సమయం లో గ్రహస్థితిని ఆధారంగా చేసుకుని ఏర్పడితే, కొన్ని పూర్వీకుల వల్ల వస్తాయి(పిత్రుదోషం వంటివి) అయితే మనిషి తనకు ఉండే అనేక సమస్యలకు కారణం వారి గ్రహ స్థితి మరియు తన జాతకంలో ఉన్నటువంటి దోషాలు అని గ్రహించాలి. నిజానికి ఒక వ్యక్తి జాతకం లో గ్రహస్థితి బాగుంటే తను మట్టి పట్టుకున్నా బంగారం అవుతుంది. అలానే ఒక వ్యక్తి జాతకంలో గ్రహస్థితి బాగుండక పోతే తను బంగారం పట్టుకున్నా మట్టి అవుతుంది అని ఎంతో మంది జ్యోతిష్యులు, పెద్దవాళ్ళు చెప్తుంటే వినే ఉంటారు. అయితే ప్రతీ మనిషి తన జాతకాన్ని అద్బుతంగా మార్చుకోగల మార్గాలను మన శాస్త్రాలు ఎన్నో తెలియ చేసాయి. ఉదాహరణకు ఈ రోజు అంశాన్నే పరిగణలోకి తీసుకుంటే అసలు రత్నాన్ని ఎందుకు ధరించాలి, ఎవరు ధరించాలి, ఎలా ధరించాలి, ధరించటం వళ్ళ కలిగే ప్రయోజనాలి ఏమిటి లాంటివి మనం చూడాలి.
రత్నాన్ని సాధారణంగా రెండు రకాలుగా సూచిస్తారు. అవి మీ జన్మ నక్షత్రాన్ని బట్టి అయితే ఒకటి అలానే మీకు ప్రస్తుతం నడుస్తున్న గ్రహచారాన్ని బట్టి అయితే మరొకటి సూచిస్తారు. కొన్ని సార్లు రెండు ఒకటే అవుతాయి. అంటే మీ జన్మ నక్షత్రాన్ని బట్టి పెట్టుకున్న రత్నమే ప్రస్తుత గ్రహస్థితికి కుడా సంబందించినది అయితే దానినే మీకు సూచించటం జరుగుతుంది. అయితే ఈ రెండు రకాలు ప్రధాన ఆధారాలుగా ఒక రత్నాన్ని సూచించటానికి ఉన్నాయి. (రాశిని బట్టి లేదా ఇతరవాటిని ఆధారంగా చేసుకుని కుడా రత్నధారణ సూచిస్తుంటారు కొందరు)
రత్నాన్ని ధరించటం వలన ప్రధానంగా ఉండే లాభాలు ఏమిటంటే ఒక వ్యక్తి జాతకంలో ఆ గ్రహానికి సంబందించిన ప్రతికూల ప్రభావాన్ని తగ్గించి, ఆ వ్యక్తిని కష్టాల నుండి, అనారోగ్య సమస్యల నుండి రక్షిస్తుంది. అలానే ఒక వ్యక్తి ఉన్నత స్థితికి చేరుకోవడానికి ఇది ఉపకరిస్తుంది. ఉదాహరణకు, ఈ రోజు పెట్టిన ఫోటోలో రత్నం పచ్చ, ఇది జ్యేష్ట నక్షత్రం వారు ధరించాలి.

దీనిని ధరించటం వలన వ్యాపారం లో అద్బుత ప్రతిభ కనబరుస్తారు. ఏదైనా ఒక సమస్యలో ఉండిపోతే అంటే ఉదాహరణకు వ్యాపారస్తులకు కొన్ని సార్లు అనుకోకుండా వ్యాపారాలు స్తంభించి పోతాయి. అటువంటప్పుడు సరైన పరిహారాలు పాటించి ఒరిజినల్ రత్నాన్ని ధరించి నట్లయితే స్తబించినవ్యాపారాలు తిరిగి పుంజుకుంటాయి. ముందుకు నడుస్తాయి. అయితే ఈ రత్నం వ్యాపారం చేసే వారికి విశేషంగా లభిస్తుంది. ఉదాహరనకు సాధారణంగా వ్యాపారం అంటే ఒడిదుడుకులు, ఆటంకాలు, వ్యతిరేకత వంటివి సాధారణం. అయితే దీనిని ధరించటం వలన అవి తగ్గి, మెరుగైన ఫలితాలు అందుకుంటారు. అలానే ప్రతీ రత్నం మీకు ఎంత గానో ఉపయోగ పడుతుంది. అయితే దీనిని జన్మ నక్షత్రాన్ని బట్టి ధరించే వారు జీవితాంతం ఉంచుకోవాలి. అలానే ప్రస్తుత గ్రహస్థితి ఆధారంగా రత్నాన్ని ధరించే వారు ఆ గ్రహ స్థితి మారిన వెంటనే దాన్ని తీసేయాలి. ఉదాహరణకు శని గ్రహం చాలా మందిని అనేక విధాలుగా ఇబ్బంది పెడతాడు. ఆయన భారి నుండి రక్షించుకోవటానికి నీలం ధరిస్తారు. నిజానికి మీరు సరైన రత్నాన్ని, సరైన పరిహరలతో, దాన జపాలతో(పరిహారాలు అందరికీ ఒక్కటే కాదు. వారి జాతకాన్ని బట్టి వారు పాటించాల్సిన పరిహారాలు వేరు వేరుగా ఉంటాయి), సూచించిన మూహుర్తంలో, సూచించిన వేలుకి ధరిస్తే నలభై నుండి తొంభై రోజులలో దాని ఫలితం చూస్తారు. నిజానికి అంతకంటే తక్కువ సమయంలోనే ఫలితాన్ని పొందినవారు ఎందఱో. అయితే మీరు పరిహారాలు తప్పక పాటించాలి.
ఉదాహరణకు మిమ్మల్ని ఏదైనా దానం (మినుములు, పెసలు, నల్లనువ్వుల వంటివి) ఇవ్వమంటే అది ఇచ్చే విధానం కుడా చెప్పడం జరుగుతుంది. అలానే మీరు సుమారు కొన్ని వారల పాటు పాటించాల్సిన పరిహారాలు(మీ సమస్య/జాతకాన్ని బట్టి) కుడా చెప్పటం జరుగుతుంది. వాటిని మీరు భక్తి శ్రద్దలతో పాటించి, రత్నాన్ని చెప్పిన విధంగా ధరించినపుడు మాత్రమే మీరు అద్బుత ఫలితాలను అందుకోగలుగుతారు. ఈ రత్నాలు మనకు ఉండే గ్రహ దోషాలను తగ్గించి మన కష్టాలనుండి బయట పడేందుకుగాను, సుఖమయ జీవితాన్ని పొందేందుకు గాను ఎంతగానో ఉపకరిస్తాయి. అయితే ప్రస్తుతం చాలా మంది మాకు మెస్సేజ్ లో చెప్పేది పలానా వారు మాకు పలానా రత్నం ఇచ్చారు. అలేనే హోమం చేయించాలి, పరిహారాలు చేయించాలి అని డబ్బులు కుడా తీసుకున్నారు. కాని ఫలితం శూన్యం అని.అయితే ఇక్కడ గమనించాల్సిన విషయం. రత్న ధారణ సమయంలో మీరు పాటించే విధి విధానాలు.

అలానే ఆ రత్నం యొక్క నాణ్యత. ఒక రత్నాన్ని ఒరిజినల్ (మంచి ఫలితాలను ఇస్తుంది) అని సులభంగా చెప్పాలి అంటే ఆ రత్నాన్ని చూసినపుడు లోపల ఎలాంటి నల్లని రంగు గల పదార్ధాలు ఉండకుండా స్పష్టంగా ఉంటుంది. నేను పెట్టిన ఫోటో చుడండి అవగాహన వస్తుంది. అలానే రత్నం ఒక్కో కేరెట్ ఖరీదు రెండు వేలకు తక్కువగా ఉండదు(ఒక్కో రత్నం ఒక్కో రేటు ఉంటుంది). అలానే ఏ రత్నాన్ని ఏ మెటల్ లో చేయించుకోవాలో అందులోనే చేయించుకోవాలి. అప్పుడే ఉత్తమ ఫలితాలు అందుకోగలుగుతారు.
ఉదాహరణకు శనికి సంబంధించి నీలం పెట్టుకుంటే దానిని వెండిలో మాత్రమే చేయించుకోవాలి. అప్పుడే ఉత్తమ ఫలితాలు వస్తాయి. అలానే పరిహారాలు మీరు కుడా తప్పకుండా పాటించాలి. మీ బదులు వేరేవారు పాటిస్తే మీకేం ఫలితం వస్తుంది? అయితే మీరు చేయలేనివి లేదా మీకు రానివి లేదా మేము చేయాల్సిన కొన్ని పరిహారాలు మేము చేస్తాం. కాని మీరు కుడా తప్పకుండా మేము చెప్పిన పరిహారాలు కొన్ని వారల పాటు (మీ సమస్యను బట్టి) పాటించాలి. అప్పుడే మీకు ప్రతిఫలం వస్తుంది. ఇది ఒక సూచన మాత్రమే. తప్పుగా అనుకోకండి. ఎందుకంటే ఎంతో మంది ఎన్నో కష్టాలు అనుభవిస్తునారు. దానికి మేమే పరిహారాలు చేసేస్తాం మీరు హాయిగా ఉండండి అనడం సబబు కాదు. అలా చెప్పినా అది ప్రతిఫలం ఇవ్వదు అని నా అభిప్రాయం (కొన్నీ అరుదైన సందర్బాలలో తప్పితే, ఉదాహరణకు మంచంపై నుండి లేవలేని పరిస్థితిలో ఉన్న భార్య పేరు చెప్పి, భర్త దానం చేయవచ్చు. నిజానికి భర్త చేసే పుణ్యం లో సగ భాగం బార్యకు వెళ్తుంది అని శాస్త్ర వచనం) ప్రతీ ఒక్కరు తమ వంతుగా భగవంతుని యందు భక్తిని కలిగి ఉండాలి, అలానే మీ కష్టాలనుండి పయట పడేయమని భగవంతున్ని ప్రార్ధించాలి.
చెప్పిన పరిహారాలు, జాగ్రత్తలు పాటించాలి. అలా చేస్తే తప్పక ఫలితం వస్తుంది. మీరు పూర్వ కాలపు రాజుల చిత్రాలను చూస్తే వారు ధరించినటువంటి రత్నాలను చూడవచ్చు. అలానే మనకు పూర్వికులు ఆరు వారల నగలు అని అంటూ ఉండేవారు వాటిని నిజానికి ఈ రత్నాలతో పొదగబడిన ఆభరణాలుగా చేయించే వారు. ఎందుకంటే ఇవి ధరించటం వలన గ్రహదోషాలు తగ్గుముఖం పట్టి, జీవితం సాఫీగా ఉంటుంది అని పూర్వ కాలం నుండి ఉన్న నమ్మకం.
ఏదేమైనా ప్రతీ ఒక్కరూ తమ నక్షత్రానికి సరిపడే రత్నాన్ని శాస్త్రోతంగా ధరించడం మంచిది. దిని వలన ఉత్తమ ఫలితాలను సొంతం చేసుకోవచ్చు. మరొక సారి ఏ రత్నం ఎవరు ధరించాలి, అది ధరించటం వలన మీకు ఎలాంటి ప్రతిఫలం వస్తుంది లాంటి అంశాలు మీకు తెలియ పరుస్తాను. అయితే ఇది కేవలం ఒక అవగాహనా కోసం మాత్రమే కాని మీ జాతకం చూసుకోకుండా మార్కెట్ లో దొరికేవి కొనేసి ధరించేయమని కాదు. కేవలం ఒక అవగాహనా వస్తుంది అని.
ఆ వ్యాసం రాసినప్పుడు మన హైందవుల టెలిగ్రామ్ గ్రూప్ లో పెడతాను చదవండి. అలానే నేను ఏమైనా చెప్పటం మర్చిపోయినా, మీకు ఏమైనా సందేహాలు ఉన్నా క్రింది కంమెంట్లలో తెలియ చేయండి. అలానే త్వరలో సాధారణ జాతకాన్ని విశేష జతకంగా మార్చే అంశంలో భాగంగా రుద్రాక్షలు, యంత్రాలు, మొక్కలు, దైవారాధన వంటి అనేక అంశాలను మీకు తెలియ చేస్తాను. అవి మీరు మిస్ అవకుండా ఉండాలి అంటే మన టెలిగ్రాం గ్రూప్ లో ఉండండి. నిత్యం మన పోస్ట్ లు చూస్తూ ఉండండి. ఒకవేళ మీరు ఇంకా మన టెలిగ్రాం గ్రూప్ లో జాయిన్ అవ్వక పోతే ఈ క్రింది లింక్ ద్వారా జాయిన్ అవ్వండి. జాయిన్ అయ్యాక మీ మిత్రులను కుడా యాడ్ చేయండి.
శుభం
If date of birth is not available what can we do
ReplyDeleteNamskaram sir ...
ReplyDeleteNaa peru MUJJE RAVI KUMAR
DOB:21/11/1985
NAAKU EE RATNAM PETTUKOVAALI.. ME DAGGARA ORIGINAL RATNAALU DORUKUTHAAYAA.. NAAKU KAAVALASINA RATNAM COST ENTHA CHPPANDI SIR
మేము త్వరలో మన టెలిగ్రాం గ్రూప్ లో మెస్సేజ్ పెడతాము. అప్పుడు మీ వివరాలు ఇవ్వండి. ఏ రత్నం ధరించాలి, ఏ రోజు ధరించాలి, ఎలాంటి పరిహారాలు పాటించాలి వంటివి చెప్తాము. దయచేసి వేచి ఉండండి.
DeleteMaddala siva chandra mouli
ReplyDeleteRi
ReplyDelete