తన తలను తానే నరుక్కొన్న దేవి గుడి మన ఆంధ్ర రాష్ట్రంలో ఉంది. ఎక్కడో తెలుసా ? పూర్తి వివరాలు ఫొటోలతో...
అవును, తన తలను తానే నరుక్కొన్నట్టుగా ఈ దేవి గురించి మనకు ఎన్నో హిందూ గ్రంధాలు తెలియచేస్తున్నాయి. అదేంటి దేవి తన తలను తానే నరుక్కొందా ? ఎవరు ఆవిడా ? ఏంటి కదా ? అని సందేహ పడుతున్నారా. అయితే ఇది చదవండి.
(ఆలయ ప్రాంగణం యొక్క ఫోటో - భయటి నుండి)
ఒకనాడు పార్వతీ దేవి మందాకినీ నదిలో స్నానమాచరిస్తుండగా. తనతో వచ్చిన సేవకురాల్లు ఇద్దరకూ ఆకలి వేయసాగింది. అప్పుడు ఆ తల్లి పార్వతీ దేవీని తమ ఆకలి తీర్చమని ప్రార్ధించగా, ఆ తల్లి వారి ఆకలి తీర్చడానికి ఆ ప్రదేశం అంతా శోధించిన అనంతరం, ఏమి దొరకని పక్షాన. పార్వతి దేవి ఆమె యొక్క శిరస్సును, ఆమే శిరచ్చేదనం గావించి, వారి ఆకలి తీరుస్తుంది.
(ఆలయం లోపలి భాగం ఫోటో)
అలా తన తలను నరుక్కొన్న సమయంలో ఆ తల్లి యొక్క మొండెం నుండి ఆ రక్తం మూడు పాయలుగా బయలుదేరింది. వాటిలో రెండు ధారలను ఆకలి తీర్చమని ప్రార్దించిన వారి నోటిలోనికి మరియొక ధార శిరచ్చేదనం చేయగా శరీరమునుండి వేరు అయిన ఆ శిరస్సు యొక్క నోటిలోనికీ ప్రవహిస్తాయి. ఆ విధంగా పార్వతి దేవి ఎత్తిన అవతారాన్ని చిన్నమస్తా అని అంటారు.
(ఇదే ఆంధ్రా లో కొలువై ఉన్న, ఎవరికీ అంతగా తెలియని చిన్నమస్తా దేవి యొక్క విగ్రహం)
ఈమెను సాధారణ మానవులు ఆరాధించరు. తాంత్రికులు, అఘోరాలు వంటి వారు, అతీత శక్తులు కావాలి అనుకునేవారు ఈమెను ఆరాధిస్తారు.
(ఆలయ ప్రాంగణంలో చెట్టుకింద ఉన్న మహా కాళీ యొక్క విగ్రహం)
ఈమె యొక్క రూపం బహు భీకరంగా ఉంటుందని, ఈమెనే మహా కాళీ యొక్క రౌద్ర రూపంగా భావిస్తారని అంటారు.
(ఆలయ ప్రాంగణంలో నేటికీ ఉన్న చెట్లు)
ఈమె యొక్క దేవాలయాలు చాల తక్కువ సంఖ్యలో ఉంటాయట. భారత దేశంలో ఉత్తర భాగం వైపూ, అదే విధంగా నేపాల్ లోనూ ఉన్నాయట.
(ఆలయ ప్రాంగణం లో ఉన్నటువంటి పుట్ట మరియు దానికింద శివలింగం)
ఈమె రతీ మన్మధులపై నుంచుని అతి భీకర రూపంతో దర్శనమిస్తుంది. ఈమెనే దశ మహా విద్యలలోని ఒక అవతారంగా తాంత్రిక గ్రంధాలలో చెప్పబడ్డాయి.
(ఆలయం లోపలి ఒక భాగం )
ఈమెను ఉపాసించే విధి విధానాలు మన హిందూ శాస్త్రాలలో తాంత్రిక గ్రంధాలలో వివరించబడ్డాయి.
(వెలుపల ఉన్న చెట్లు మరియు ఆలయ భాగం)
అంతటి మహిమ గల ఆ తల్లి యొక్క దేవాలయం మన ఆంధ్ర రాష్ట్రంలో కూడా శ్రీశైలంలో ఉందని కొందరు చెప్తే విన్నాము. ఎవరో ఒకరు దానిని వీడియో కూడా తీసి ఉంచారు. అందులో ఫోటోలని మీకు ఇక్కడ చూడటానికి గాను ఇవ్వటం జరిగింది.
దీనికి సంబందించిన అధిక వివరాలు అంటే చిన్నమస్తా దేవి యొక్క తాంత్రిక విద్యను అభ్యసించే విధి విధానాలను త్వరలోనే ఈ బ్లాగ్ లో ప్రచురిస్తాము. మీరు వాటిని మిస్ అవకుండా ఉండాలి అంటే వెంటనే పైన ఉన్న subscribe అనే ఆప్షన్ మీద క్లిక్ చేసి మే ఈమెయిలు ఎంటర్ చేసి మీ మెయిల్ ఓపెన్ చేసి చుడండి ఒక కన్ఫర్మేషున్ లింక్ వస్తుంది. దాని మీద క్లిక్ చేయండి. అంతే ఇలాంటి అనేక విషయాలు మీ మెయిల్ కి ప్రతీ రోజు ఉచితంగా వస్తాయి. జై హింద్
Very good message posting one of the interesting sacret place
ReplyDelete