మనం చాల సార్లు శివుని ఆత్మలింగం గురించి విన్నాం. కాని నిజంగా ఆ ఆత్మ లింగం ఉన్న ప్రదేశం ఇప్పటికి ఉంది. అదికూడా మన దక్షిణ భారతదేశం లోనే అని మీకు తెలుసా. అవును ఇది నిజం పూర్వం రావణుడు ఆత్మలింగం పట్టికేలుతుండగా వినాయకుడు అడ్డుక్కోన్నప్పుడు శిలగా మారిన ఆ ఆత్మలింగం ఇప్పటికి ప్రశిద్ద పుణ్యక్షేత్రంగా భక్తులచే పూజ లందుకొంటుంది. ఈ రోజు ఆ క్షేత్రం గురించి పూర్తి వివరాలు పురాణ కథ మరియు ఆ క్షేత్ర ఫోటోలతో సహా తెలుసుకొందాం...
(పురాణం కథను వివరించేటట్టు ఆ ప్రాంతం లో ఏర్పాటు చేసిన బొమ్మలు)
రావణాసురుడు, శివుని గురించి అకుంఠిత తపస్సు చేసి మెప్పించి ఆత్మలింగాన్ని భూలోకానికి తెస్తాడు. కాని శివుడిచ్చిన ఆత్మలింగం స్వభావం ప్రకారం భూమిమీద ఆలింగం ఎక్కడ పెడితే అక్కడ స్థాపితం అయి, అక్కడ నుండి తిరిగి ఎత్త శక్యం కాదని శివుడు చెబుతాడు. రావణాసురుడు ఆత్మలింగాన్ని లంకలో ప్రతిష్ఠిస్తే ప్రతికూల చర్యలు జరుగుతాయని భావించి దేవతలు విష్ణువును వేడుకొనగా విష్ణువు తనమాయతో సూర్యాస్తమయం అయ్యేటట్లు చేస్తాడు. అప్పుడు రావణుడు సూర్యాస్తమయం అయిందని భావించి సంధ్య వార్చుకోవడానికి సంసిద్ధుడు అవుతాడు.
(వినయకునితో నారదుడు సంభాషణ పై ఏర్పాటు చేసిన బొమ్మలు)
ఈ విషయం తెలుపుకొన్న నారదుడు వినాయకుని వద్దకు వెళ్ళి రావణాసురుడి వద్ద నుండి ఆత్మలింగం తీసుకొని భూమి మీద పెట్టాలని చెబుతాడు. అప్పుడు వినాయకుడు నారదుడు కోరినట్లు రావణాసురుడు సంధ్యవార్చుకొనే సమయానికి బ్రాహ్మణ వేషంలో వెడతాడు.
(రావణుడు బాలుని రూపంలో వచ్చిన వినయకునితో సంభాషణా చిత్రం)
ఆ బ్రాహ్మణ బాలకుడిని చూసిన వెంటనే రావణాసురుడు తాను సంధ్యవార్చుకొనవలసిన కారణమున ఆ బాలకుడిని లింగాన్ని పట్టుకొనవలసిందిగా కోరుతాడు. అప్పుడు వినాయకుడు లింగం చాలా బరువు ఉంటే తాను ఎక్కువ సేపు మోయలేనని, మోయలేకపోయే సమయం వచ్చినప్పుడు మూడు సార్లు పిలుస్తానని రావణాసురుడు రాకపోతే ఆలింగాన్ని భూమి పైన పెడతానని చెబుతాడు. రావణాసురుడు అందుకు అంగీకరించగా, వినాయకుడు లింగాన్ని తన చేతులలోకి తీసుకొంటాడు.
(వినాయకుడు రావణుని పిలవటం)
రావణాసురుడు సంధ్యవార్చు కోవడానికి వెళ్ళగానే గణపతి లింగాన్ని మోయలేక పోతున్నట్లు మూడు సార్లు పిలుస్తాడు. సంధ్య మధ్యలో ఉండడంతో రావణాసురుడు అక్కడకు వచ్చేటప్పటికే వినాయకుడు లింగాన్ని భూమి మీద నిలుపుతాడు. రావణాసురుడు వచ్చి లింగాన్ని భూమి మీద నిలిపినందుకు గణపతి నెత్తిమీద మొట్టుతాడు, గణపటి నెత్తికి గుంట పడుతుంది. వినాయకుడు భూమి మీద నిలిపిన స్థలం గోకర్ణ, మురుడేశ్వర లింగం పడిన భాగాలలో ఒక ప్రదేశం.
(రావణుడు కోపంతో ఆత్మలింగాన్ని కదపటానికి ప్రయత్నిస్తున్న దృశ్యం)
విష్ణువు తన మాయని తొలగించగా వెంటనే సూర్యుడు ఆకాశంలో మళ్ళి కనిపిస్తాడు. ఈ విషయాన్ని గ్రహించి రావణుడు ఎంతో కోపోద్రిక్తుడై ఆత్మలింగాన్ని తన చేతులతో పెకలించ ప్రయత్నం చేస్తాడు. ఆత్మలింగం పైనున్న కవచాన్ని విచ్ఛిన్నం చేసి విసిరివేస్తే గోకర్ణకు 23 కి.మి. దూరంలో సజ్జేశ్వర అనే ప్రదేశంలో పడుతుంది. లింగంపై నున్న మూత తొలగించి విసిరి వేస్తే అది గోకర్ణకు 27 కి.మి దూరంలో ఉన్న గుణేశ్వరలో పడుతుంది. లింగం పైనున్న వస్త్రాన్ని విసిరివేస్తే అది కందుక పర్వతంపై నున్న మృదేశ్వరలో పడుతుంది. ఆపేరు కాలక్రమంలో మురుడేశ్వరగా మారింది.
(ఆ విధంగా ప్రతిష్టేపించబడిన ఆత్మలింగం యొక్క ఫోటో ఇది. ఇక్కడ ఉన్న ప్రత్యేకత ఏమిటంటే, భక్తులు స్వామి వారికి నేరుగా అభిషేకం చేసుకోవచ్చు, ముట్టుకోవచ్చు)
మరిన్ని ఫోటోలు...
(ఆలయ ప్రవేశ ద్వారం)
(ఆలయంలో ఉన్న నందీశ్వరుడు)
(అక్కడి పూజారులు ఆత్మలింగానికి పుజలు అందిస్తున్న దృశ్యం)
(భక్తుడు ఆత్మ లింగాన్ని తాకే దృశ్యం)
(ఆలయ ప్రాంగణం)
(ఆలయం బయట వివిధ పూజ సామాగ్రి అమ్మే దుకాణాలు)
(ప్రతీ ఏటా నిర్వహించే రధ యాత్రలో భక్తులు రధాన్ని లాగటం)
Address:ఈ దేవాలయం కర్ణాటక రాష్ట్రంలోని గోకర్ణ అనే గ్రామం లో ఉంది. గోకర్ణ గ్రామం కర్ణాటక రాష్ట్రం ఉత్తర కన్నడ జిల్లాలో ఉంది. బెంగళూరుకి 545 కి.మి., ఉత్తర కన్నడ జిల్లా రాజధాని కార్వార్ కి 55 కి.మి దూరంలో ఉంది.
ఈ రోజు ప్రచురించిన ఈ క్షేత్ర విశేషాలు మీకు నచినట్లయితే మీ విలువైన అభిప్రాయాన్ని క్రింది కామెంట్ లలో మాకు తెలియచేయప్రార్ధన. ఇలాంటి మరెన్నో విషయాలను నేరుగా మీ మెయిల్ ద్వారా చదవడానికి పైన ఉన్న subscribe అనే ఆప్షన్ మీద క్లిక్ చేసి మే ఈమెయిలు ఎంటర్ చేసి మీ మెయిల్ ఓపెన్ చేసి చూడండి ఒక కన్ఫర్మేషున్(confirmation) లింక్ వస్తుంది. దాని మీద క్లిక్ చేయండి. అంతే, ఇలాంటి అనేక విషయాలు మీ మెయిల్ కి ప్రతీ రోజు ఉచితంగా వస్తాయి. జై హింద్
Super
ReplyDeleteచక్కగా వీడియో లాగా ఉంది. చదివినట్టు లేదు . వీడియో చూసినట్లు ఉంది . థాంక్యూ .
ReplyDeleteChaala bagunnai andi. Maa andariki ee visheshalu panchutunnanduku meeku sarvada runapadi untam🙏🙏🙏
ReplyDeleteచాల మంచి విషయాలు తెలియ పరిచినందు చాల,చాల ధన్యవాదాలు
ReplyDeleteOm nama sivaya
ReplyDeleteLavithagroup@gmail.com
ReplyDelete