అష్టావక్ర మహర్షి చెప్పిన విధంగా పరులను హేళన చేస్తే ఏ విధమైన కర్మ ఫలం మీరు పొందుతారు అనేది ఆఘాసురుడు కథ ద్వారా తెలుసుకోండి
మన పురాణాలూ ఇతిహాసాలు మహాకావ్యాలు మనకు ఎంతో జ్ఞానం ప్రసాదించినవి. కాని నేడు మారుతున్న కాలానుగునంగా మన వాళ్ళలో ముఖ్యంగా కొత్తతరం వారికి మన ధర్మ శాస్త్రాల మీద కనీస అవగాహన కూడా లేకపోవటం బాదాకరం. అందుకనే మన ధర్మ శాస్త్రాలలో చెప్పబడిన అనేక విషయాలను కథల రూపంలో అది కూడా ప్రతీ మనిషిలోను మంచిని, సత్యాన్ని, ధర్మాన్ని నింపే వాటిగా మరియు ప్రతీ మనిషికి అసలు మన హిందూ ధర్మ శాస్త్రాలు మనిషి ఏవిధంగా బ్రతకాలి ? ఏది తప్పు ? ఏది ఒప్పు ? పెద్దవారిని ఎలా గౌరవించాలి ? చిన్నవారిని ఎలా ప్రేమించాలి ? మూగ జివులయందు ఎలా దయ కలిగి ఉండాలి ? లాంటి అనేక విషయాలకు సంబందించిన భక్తి కథలను ఇక్కడ అందించదలచాము. అందులో భాగంగా నేడు పరనింద చేయుటవలన కలిగే దోషం ఏ విధంగా ఉంటుందో అనే అంశం మీద ఒక చిన్న కథను తీసుకోవటం జరిగింది.
కథ: ఒక నాడు శ్రీకృష్ణుడు, గోపబాలురతో కలసి సరదాగా ఆడుకుంటున్న సమయంలో బకాసురిని జ్యేష్ట పుత్రుడు అయిన అఘాసురుడు ఒక పెద్ద సర్పరూపంలో వచ్చి వీరందరినీ మింగేయాలి అని అనుకుని పెద్దగా నోరు తెరుస్తాడు. ఆ నోరు ఎంత పెద్దగా ఉందంటే, సర్పం యొక్క క్రింది పెదవి భూ భాగాన్నీ, పై పెదవి ఆకాశాన్ని తాకేంత పెద్దగా నోరు తెరచి, మొత్తాన్ని మిoగేయాలని చూసాడు. అప్పుడు గోపబాలురు ఈ సర్పం మనలను ఎలానో మింగేస్తుంది. అప్పుడు మనకు శ్రీ కృష్ణుడే దిక్కు, కృష్ణుడే మనల్ని రక్షించాలి అనుకుంటారు. అనుకున్న విధంగా గోవులతో కలసి మొత్తం గోపబాలురు సర్పం యొక్క నోటిలోకి వెళిపోతారు. వారితో పాటు శ్రీ కృష్ణుడు కుడా వేలిపోతడు. అలా వారందిరిని మింగిన పాము కొద్ది క్షణాల్లోనే విషాన్ని విడుదలచేయటంతో గోపబాలురు, గోవులు మరణిస్తాయి. అప్పుడు శ్రీ కృష్ణుడు వెంటనే ఆ సర్పం యొక్క నవరంద్రలను మూసి సర్పం యోక్క ఉదరభాగం ఉబ్బిపోయి పగిలిపోయేలా చేస్తాడు. ఆ విధంగా సర్పంయోక్క ఉదరభాగం ఉబ్బి,పగిలిన తరువాత శ్రీ కృష్ణుడు దానినుండి బయటకు వస్తాడు. వచ్చిన వెనువెంటనే భగవంతుడైన శ్రీ కృష్ణుడు గోవులనూ, గోపబాలురను బ్రతికించి, సర్పరుపంలో వచ్చిన రాక్షసుడు అయిన ఆఘాసురిడికి శాపవిముక్తిని కలిగిస్తాడు.
అప్పుడు ఆఘాసురుడు కృష్ణునికి నమస్కరించి జరిగిన వృత్తాంతము ఈ విధంగా చెప్తాడు. శ్రీ కృష్ణ నేను సంఖుడు అనే రాక్షసుని కుమారుడను, ఆఘాసురుడు అనే నామధేయం కలవాడిని. నేను సుందరాంగుడు, భలిష్టుడైనప్పటికి నాకు పరులను నిందించే స్వభావం ఉండేది. ఆ స్వభావంతో ఒకనాడు అష్టావక్ర మహర్షిని చూసి ఇన్ని వంకరలు ఉన్నాయే అని నవ్వి, హేళన చేసి అతడిని నిందించి, అతడికి బాద, కోపం తెప్పించాను. ఋషి అయిన ఆయన వెంటనే ఆగ్రహం చెంది.
ఓరి, అష్టావక్రుడినైన నన్ను చూసి కనీస దయ చూపకుండా, ఋషిననే మాట మరిచి నన్ను హేళన చేసి హేళన చేస్తావా? నీవు సర్పం అయిపోవుదువుగాక అని శపించాడు. తక్షణమే క్షమించి శాపవిమోచనం ప్రసాదించమని కోరిన నాకు, నాయన పరనింద చాల పాపకార్యం. పరులని నిందించుట వలన వారి పాపంలో సగ భాగం నిందిన్చినవారికి, నిందిన్చినవారి పుణ్యంలో సగ భాగం వారికి వెళిపోతుంది.
అంతే కాదు పరనింద మహా పాపం. దానికి తగిన కర్మ ఫలాన్ని ప్రతీ ఒక్కరూ అనుభవించక తప్పదు అని చెప్పి. నీకు ద్వాపర యుగంలో పరమాత్ముడు శ్రీ కృష్ణుడి రూపంలో అవతరిస్తాడు. ఆ సమయంలో శ్రీ కృష్ణుడి చేతిలో నీకు శాపవిమోచనం అవుతుంది. అని చెప్పాడు. కావున పరమాత్మా, నేటితో నేను చేసిన పాపం పోయి, నాకు శాపవిమోచనం కలిగింది. అని ఆఘాసురుడు చెప్పి వెళ్ళిపోతాడు.
కావున హైందవ మిత్రులారా ఎప్పుడూ కూడా ఎవరినీ దూశించకూడదు. మన హిందూ ధర్మ శాస్త్రాలలో చెప్పిన పాప కర్మలలో అత్యంత దుర్మార్గమైన వాటిలో ఇది ఒకటి. పరనింద మహా పాపం, దానితో వచ్చే కర్మ ఫలం ఘోరాతి ఘోరం. కావున ఎవరూ కూడా నేటి నుండి పరులను నిందించవద్దు. ఈ విషయాన్ని మన హిందూ సమాజం మొత్తానికి తెలియచేయండి. ఇటువంటి అనేక విషయాలు మన టెలిగ్రామ్ గ్రూప్ ద్వారా అందరికీ చేరవేసే ప్రయత్నం చేద్దాం. కావున తామెల్లరు మన టెలిగ్రాం గ్రూప్ లో ఉండి, ఇలాంటి అనేక విషయాలు విని తరిస్తారని. అందరూ మన హిందూ ధర్మం లో చెప్పబడినట్టుగా నీతిగా, న్యాయంగా, ధర్మంగా నడుచుకుంటూ, పరులకు సహాయం చేస్తూ పుణ్యాన్ని పొందగలరని కోరుకుంటున్నాము. ఇంకా ఎవరైనా మన టెలిగ్రాం గ్రూప్ లో లేనట్లయితే క్రింది లింక్ ద్వారా ఇప్పుడే జాయిన్ అవ్వండి. మీ మిత్రులను కూడా మన టెలిగ్రామ్ గ్రూప్ లో యాడ్ చేసి సహకరించండి. అలానే మీ విలువైన అభిప్రాయాన్ని క్రింది కంమెంట్లలో తెలియచేయండి.
Daya
ReplyDeleteElanti old storys nu andhachessthunnadhuku chala thanks 🙏
ReplyDeleteChala viluvaina samachara ni andinchina meeku mayokka dhanyavadamulu.
ReplyDeleteధన్యవాదములు
ReplyDelete