తాంత్రిక విద్యలు ప్రారంభం

నేటి కాలంలో చాలామంది తాంత్రిక విద్యలయందు మక్కువతో ముందు, వెనకా ఆలోచించకుండా ఎక్కడో చదివో లేక ఎక్కడో చూసి, ఒక గురువు గాని, ఆ విద్య యందు గాని ఎలాంటి సమాచారం లేకుండా, దానిని అభ్యసించడానికి ప్రయత్నిస్తున్నారు. కానీ ఏదైనా నేర్చుకొనేముందు ముఖ్యంగా ఇలాంటి విద్యలు నేర్చుకొనే ముందు ఆ విద్య గురించి పూర్తి సమాచారం మరియు అవగాహనా ఉన్నప్పుడే దానిని అభ్యసించాలి. అది కూడా ఒక గురువు సమక్షంలో ఆయన చెప్పిన విధంగా చేయాలి. లేని యెడల ఏదైనా మధ్యలో సందేహం వచ్చినా లేక తప్పు జరిగినా తదుపరి పరిణామాలకు మీరు బాధ్యులు అవ్వాలి. అందుకే ఏ విద్యను అభ్యసించటానికైనా అసలు ఆ విద్య ఏమిటి, ఎవరికి సంబంధించింది, ఎలా వచ్చింది, ఎలా అభ్యసించాలి, ఎందుకు అభ్యసించాలి, అభ్యసిస్తే ఏమి వస్తుంది(ఎలాంటి శక్తీ వస్తుంది), అభ్యసించిన అనంతరం మంచితో పాటు ఏమైనా చెడు జరిగే అవకాశం ఉందా (కొన్ని విద్యలలో మంచితో పాటు చెడు జరిగే అవకాశం ఉంది. వాటి గురించి త్వరలో వివరిస్తాము), అసలు ఎలాంటి చెడు జరిగే అవకాశం ఉంది, ఒక వేళా ఏదైనా చెడు జరిగితే ఏమి చేయాలి, అత్యవసర పరిస్థితిలో ఎవరు ఆదుకుంటారు. అసలు ఎవరి సమక్షంలో ఏపని చేయాలి, గురువు అంటే ఎవరు, ఎలాంటి గురువు దగ్గర ఏ విద్యను అభ్యసించాలి, విద్యను అభ్యసించటం తో పాటు ఒకవేళ వద్దూ అనుకుంటే వదిలేయవచ్చా, వదిలేయడానికి కూడా వీలు ఉన్న విద్యలేమిటి, అవి ఏవి లాంటి అనేక ప్రశ్నలకి పూర్తి సమాచారం ఇక్కడ ప్రచురించటం జరుగుతుంది. 

ఇక్కడ అసలు తాంత్రిక విద్యలు ఎలా ఆవిర్భవించాయి. వాటిని నేర్చుకోవటం ద్వారా ఏం జరుగుతుంది. ఎన్ని రకాల విద్యలు ఉన్నాయి (ఉచ్చాటన, వశీకరణ, స్థంభన మొదలగునవి). వాటిని ఎలా అభ్యసించాలి. లాంటి అనేక విషయాలు మరియు విద్యను అభ్యసించే విధానం ఇక్కడ త్వరలో వివరించబడుతుంది. ఎందుకంటే నేడు చాల మంది ఎలాంటి సమాచారం లేకుండా ఎవరో ఎక్కడో ఎదో చెప్పారని, వాటిని ఆచరిస్తే ఏవో అతీత శక్తులు వస్తాయని పూర్తి విధి విధానాలు తెలియకుండా వాటిని అభ్యసించే ప్రయత్నం చేసి కొంతమంది ప్రతీకూల ప్రభావాలను చవిచూసినవారు లేకపోలేదు. కాబట్టి ఇక్కడ తాంత్రిక విద్యల గురించి సమాచారంతో పాటు నేర్చుకొనే విధానం కూడా ఇవ్వటానికి ప్రయత్నిస్తాము. కానీ ఇది మిమ్ములను నేర్చుకోమని ప్రత్సాహించటం ఏమాత్రము కాదు. కేవలం సమాచారం కోసమే, గురువు లేకుండా ఆచరించే ఏ విధ్య అయినా వ్యర్థమని పాఠకులు గమనించగలరని మా ప్రార్ధన. అధిక వివరాలు త్వరలోనే ప్రచురిస్తాము..

గమనిక: ఇక్కడ ప్రచురించే ఏది మా వ్యక్తి గత అభిప్రాయం కాదు. కేవలం కొన్ని పుస్తకాల మరియు అందుబాటులో ఉన్న సమాచారాన్ని, కొంతమంది వ్యక్తుల అనుభవాలను ఆధారంగా చేసుకొని వ్యాసాలు రాసే ప్రయత్నం చేస్తున్నాం. 

మీరు వీటిని మిస్ అవకుండా ఉండాలంటే వెంటనే పైన ఉన్న subscribe అనే ఆప్షన్ మీద క్లిక్ చేసి మే ఈమెయిలు ఎంటర్ చేసి మీ మెయిల్ ఓపెన్ చేసి చూడండి ఒక కన్ఫర్మేషున్(confirmation) లింక్ వస్తుంది. దాని మీద క్లిక్ చేయండి. అంతే, ఇలాంటి అనేక విషయాలు మీ మెయిల్ కి ప్రతీ రోజు ఉచితంగా వస్తాయి. 

మీ విలువైన అభిప్రాయాన్ని క్రింది కామెంట్ లలో మాకు తెలియచేయప్రార్ధన. జై హింద్    

Comments

  1. Subscribe అని ఎక్కడా లేదు.phone number ఉంటే చెప్పండి.youtube channel link ఇవ్వండి

    ReplyDelete
  2. Subscribe leydu denikaina manchi cheyali aney sankalpam vumtey chalu

    ReplyDelete

Post a Comment

ఇక్కడ మీ కామెంట్ రాయండి