సూర్యాస్తమయం తర్వాత నవగ్రహాల చుట్టూ ప్రదక్షిణ ఎందుకు చేయకూడదు ?


ప్రతీ శివాలయంలోనూ నవగ్రహాలను ప్రతిష్ట పిస్తారు. వీటిని సాధారణంగా సూర్యోదయం తర్వాత, సూర్యాస్తమయం ముందు సందర్శిస్తారు. ప్రజలకు సూర్యోదయం తర్వాత నవగ్రహాల చుట్టూ తిరగకూడదని గట్టి విశ్వాసం ఉంది. దానికి కారణం కూడా లేకపోలేదు. నవ అంటే తొమ్మిది అంటే ఇవి మొత్తం తొమ్మిది గ్రహాలు ఉంటాయి. అవే సూర్య, చంద్ర, కుజ, బుధ, గురు, శుక్ర, శని, రాహు, కేతువులు. ప్రజలు ఈ నవగ్రహాల ప్రతికూల ప్రభావం వాళ్ళ ఎలాంటి బాధలు పడకూడదని వీటిని ప్రార్ధించటానికి వస్తారు. ఏ ఏ గ్రహానికి ఏ ఏ దానాలివ్వాలో అవిఎప్పుడు ఇవ్వాలో తెలుసుకుని ఇవ్వటం పూర్వం నుంచీ జరుగుతుంది. కానీ ఈ నవగ్రహాలను సూర్యాస్తమయం తర్వాత దర్శించకూడదు అనటానికి గల కారణం. ఈ గ్రహాలలో సూర్య భగవానుడు అధిపతి. కాబట్టి సూర్యుడు అస్తమించాకా వీటి నుంచి ప్రత్యక్ష ప్రభావం వచ్చే అవకాశాలు తగ్గిపోతాయని కేవలం పరోక్షంగా (తక్కువ) మాత్రమే ప్రతిఫలం ఉంటుందని కొంతమందికి నమ్మకం. అంటే సూర్యోదయం తర్వాత, సూర్యాస్తమయానికి ముందు దర్శిస్తే ఎక్కువ ఫలితం ఉంటుందని. విశేషించి సూర్యోదయం తర్వాత ఉదయాన్నే దర్శిస్తే గొప్ప ఫలితం ఉంటుందని చాల మంది విశ్వాసం.

ఈ బ్లాగ్ లోనే నవగ్రహాల దోషాలకు ఎలాంటి యంత్రాలు ధరించాలి, ఎలాంటి శ్లోకాలు పఠించాలి. ఎలాంటి పరిహారాలు చేయించాలి లాంటివి ఇవ్వటం జరిగింది. పైన భక్తి శక్తీ అనే పేరు మీద క్లిక్ చేస్తే మొత్తం అన్ని వ్యాసాలు కనబడతాయి. మీకు కావలసినవి తీసుకుని చదవండి.

ఇలాంటి మరిన్ని విశేషాలు తెలుసుకొనేందుకు పైన భక్తి - శక్తీ పేరు కింద కనబడుతున్న subscribe అనే ఆప్షన్ పై క్లిక్ చేసి subscribe అవ్వండి(ఉచితం). ఈ పోస్ట్ ను షేర్ చేయటం ద్వారా మరింత మందికి సహాయపడండి.


శుభం భూయాత్

Comments

Post a Comment

ఇక్కడ మీ కామెంట్ రాయండి