అష్టకష్టాలు అనుభవించటానికి నలమహారాజు చేసిన ఆ తప్పు ఏమిటి ?


పూర్వం నలమహారాజును కష్టాలు పెట్టడానికి గాను దేవతలు జేష్టాదేవిని అడుగగా. అప్పుడు జేష్టా దేవి నలమహారాజును దేవతల ఆజ్ఞ మేరకు అష్టకష్టాలపాలు చేయటానికి ఎంతగానో ప్రయత్నించింది.  ఎంతగా  ప్రయత్నించినా నలమహారాజు దరికి చేరలేక పోయింది.(జ్యేష్ఠ అంటే దారిద్య్ర దేవత అని చెప్తారు) అయితే చాల కాలం ప్రయత్నించిన జ్యేష్ఠాదేవికి ఒక నాడు నలమహారాజు తొందరగా వెళ్ళాలి అనే సంకల్పంతో కాళ్ళూ సరిగ్గా కడుక్కోకుండా పొడులు ఉంచి అంటే అసంపూర్ణంగా కడుక్కొని వెళ్లిపోతాడు. అంతే, వెంటనే జ్యేష్ఠాదేవి నలమహారాజు కాళ్లకు ఉన్న చిన్న పొడి ద్వారా (పొడి అంటే కాళ్ళూ సరిగ్గా కడుక్కొక్కపోవటం వాళ్ళ ఏర్పడిన కాళీ ప్రదేశం- మిగతా ప్రదేశం అంతా నీళ్ల చే తడిపి ఉంటుంది గా కాళ్ళూ కడుకున్నప్పుడు) జ్యేష్ఠ లక్ష్మి నలమహారాజుని చేరి దేవతల ఆజ్ఞ మేరకు నలమహారాజును సకల కష్టాలపాలు చేస్తుంది. అందువల్లే ఎప్పుడు కాళ్ళూ కడుక్కున్నా పొడులు లేకుండా శుభ్రంగా కడుక్కోవాలి అని మన పెద్దవాళ్ళు అంటారు. అంతటి నలమహారాజుకే తప్పలేదు. సామాన్యులం మనమెంత అని.

ఇలాంటి మరిన్ని విషయాలు నేరుగా మీ ఇమెయిల్ కి ఉచితంగా పొందటానికి  వెంటనే పైన కనబడుతున్న subscribe అనే option మీద క్లిక్ చేసి మీ email అడ్రస్ ని ఎంటర్ చేయండి. అంతే ప్రతీ విషయం మీ మెయిల్ కి ఉచితంగా పంపించబడుతుంది. అంతే కాదు మీకు ఎలాంటి సందేహం ఉన్నా (ఆద్యాత్మికత కు సంబంధించి) కింద కామెంట్ లో రాయండి. వెంటనే మీ ప్రశ్నకి సమాదానం తెలుపుతాము. ఉదా: మా మిత్రుడు అడిగాడు, ధర్మాత్ముడు అయిన కర్ణుడు ఎందుకు అన్ని కష్టాలను అనుభవిస్తాడు అని. దాని పై వెంటనే ఈ బ్లాగ్ లో పోస్ట్ పెట్టి, ఆయనకు తెలియచేయటం జరిగింది.

శుభం భూయాత్

Comments

Post a Comment

ఇక్కడ మీ కామెంట్ రాయండి