
ప్రతీ ముప్పై సంవత్సరాలకొకసారి శని రోహిణి నక్షత్రం లోకి ప్రవేశిస్తుంది. పరిపాలకులు, రాజులకు, రాజ్యాలకు అది అత్యంత గడ్డుకాలంగా పరిగణిస్తారు. శాస్త్రాలు కూడా శని రోహిణి లోకి ప్రవేశించినపుడు రాజులూ, రాజ్యాలకు పెద్దగా హాని జరుగుతుందని తెలియ చేస్తున్నాయి. పూర్వం దశరథ మహారాజు రాజ్యాన్ని పరిపాలిస్తుండగా శని రోహిణి ప్రవేశ సమయం వచ్చింది. అది తెలుసుకున్న రాజు. భయంతో రాజ్యానికి, రాజ్యం లోని ప్రజలకు మరియు ఇతరులందరికీ ఎలాంటి హాని/చేడు జరుగకూడదని, వెంటనే దశరధుడు శనిని ప్రార్ధించడం మొదలుపెట్టాడు. దశరధుని ప్రార్థనకు సంతోషించిన శని భగవానుడు ప్రత్యక్షమవుతాడు. అప్పుడు దశరధుడు శని వళ్ళ ప్రజలు, రాజ్యం మొదలగునవి ఇబ్బంది పడకూడదని ప్రార్థిస్తాడు. దానికి అంగీకరించిన శని, దశరధుని కాలంలో రోహిణిలోకి ప్రవేశించడు. కాబట్టి, దశరధుడు ఏ శ్లోకం తో శని దేవుని అనుగ్రహం పొందాడో, ఆ స్తోత్రాన్నే "దశరథ శని స్తోత్ర అని లేదా దశరథ కృత శని స్తోత్ర అని అంటారు" ఇందుమూలంగా, శని బాధకు ఎవరైతే గురి అవుతారో (శని గ్రహ ప్రతికూల ప్రభావం వళ్ళ అంటే ఏలినాటి శని, అర్దష్టమ శని, జన్మ శని, వగైరా ) వారు దశరధుడు రచించి, స్తుతించిన ఈ స్తోత్రాన్ని ప్రతీ నిత్యం ప్రాతఃకాలమున పారాయణ చేసినా, వారికి శని పీడ అనేది ఉండదు. దీనిని అనేక మంది చదివి ఎంతో ఉపశమనం పొంది, ఆనందంగా ఉన్నారు. ఈ శ్లోకం ఇచ్చినంత ఉపశమనం (ప్రతిఫలం) వేరే ఏ ఇతర శ్లోకాలు ఇంత త్వరగా ఇవ్వవేమో. కాబట్టి ప్రజలంతా ఈ శ్లోకాన్ని పఠించి శని గ్రహ అనుగ్రహానికి పాత్రులు కాగలరని ఆశిస్తున్నాము.
నమః కృష్టాయ నీలాయ l శిఖి ఖండ నిభాయచ l
నమో నీల మధూకాయ l నీలోత్పల నిభాయచ l
నమో నిర్మాంస దేహాయ l
దీర్ఘ
శ్రుతి
జటాయచ
l
నమో విశాల నేత్రాయ l
శుష్కోదర
భయానక
l
నమః పౌరుష గాత్రాయ l
స్థూల
రోమాయతే
నమః
l
నమో నిత్యం క్షుధార్తాయ l నిత్య తృప్తాయతే నమః l
నమో దీర్ఘాయ శుష్కాయ l
కాలదంష్ట్ర
నమోస్తుతే
l
నమస్తే ఘోర రూపాయ l
దుర్నిరీక్ష్యాయతే
నమః
l
నమస్తే సర్వ భక్షాయ l
వలీముఖ
నమోస్తుతే
l
సూర్య పుత్ర నమస్తేస్తు l భాస్కరోభయ దాయినే l
అధో దృష్టే నమస్తేస్తు l సంవర్తక నమోస్తుతే l
నమో మందగతే తుభ్యం l
నిష్ర్పభాయ
నమోనమః
l
తపసా జ్ఞాన దేహాయ l
నిత్యయోగ
రతాయచ
l
జ్ఞాన చక్షుర్నమస్తేస్తు l కశ్యపాత్మజ సూనవే l
తుష్టో దదాసి రాజ్యం తం
l క్రకుద్ధో హారసి తత్ క్షణాత్ l
దేవాసుర మనుష్యాశ్చ l సిద్ధ విద్యాధరో రగాః l
ఇటువంటి అనేక విషయాలు తెలుసుకోవడానికి సబ్స్క్రయిబ్ / ఫాలో అవ్వండి. మీ వ్యక్తిగత జాతక వివరాలు - పరిహారాలు కొరకు మమ్ములను ఈ బ్లాగ్ లో కాంటాక్ట్ ఫార్మ్ ద్వారా సంప్రదిన్చావాచ్చు (ఉచితంగా తెలుసుకోండి)
Super article
ReplyDelete