యంత్రాలు - వాటి యొక్క ఫలితాలు (క్లుప్తంగా)

గమనిక: యంత్రాల యొక్క ఫలితం మీరు పూజించే విధానం పై కూడా ఆధారపడి ఉంటుంది. కావున, యంత్రాలు తీసుకున్నవారికి ఆ యంత్రాన్ని ఏ విధంగా నిత్యం పూజించాలి (పూజ చేసే విధానం), ఏ మంత్రాన్ని ఎన్ని సార్లు ఎప్పటి వరకూ ఏ విధంగా జపించాలి, నైవేద్యం ఏమి పెట్టాలి వంటి వివరాలు అన్నీ కూడా యంత్రాలతో పాటు మీకు రాసి పంపించబడతాయి. 

ప్రతీ ఒక్కరు ఈ వ్యాసాన్ని పూర్తి గా చూడవలసిందిగా మా మనవి. ఎందుకంటే ముందు భాగంలో కొన్ని యంత్రాల గురించి వివరించి అవి ఎలాంటి ఫలితాన్ని ఇస్తుందని శాస్త్రం తెలియచేసిందో క్లుప్తంగా చెప్పడం జరిగింది. ఆఖరిలో యంత్ర సంస్కరణల గురించి వివరించడం జరిగింది. అంటే అసలు ఒక యంత్రాన్ని చెయ్యాలి అంటే ఎంత సమయం పడుతుంది. ఏ విధంగా చెయ్యాలి వంటి అనేక విషయాలు ఆఖరిలో వివరించటం జరుగుతుంది అలానే ఇక్కడ ఒకటి కంటే ఎక్కువ యంత్రాల గురించి వివరించడం కారణంగా మీరు కన్ఫ్యూస్ అవ్వకుండా ఎవరు ఏ యంత్రాలను ఉపయోగించాలి అనేది కూడా సజెస్ట్ చెయ్యడం జరిగింది. కావున ఈ వ్యాసాన్ని ప్రతీ ఒక్కరూ పూర్తిగా చూసినా తమరికి ఏ ఏ యంత్రాలు అవసరమవుతాయో ఒక ఆవగాహన వస్తుంది. అంతే కాదు ఇక్కడ యంత్రాల గురించి చాలా చాలా క్లుప్తంగా వివరించడం జరిగింది అంటే చాలా తక్కువగా చెప్పడం జరిగింది. ఎందుకంటే ఒక యంత్రం యొక్క శక్తిని మరియు దాని విశిష్టతను గురించి, దానిని ఆరాధించడం వలన కలిగే ఫలితాల గురించి ఎంత చెప్పినా తక్కువే. ఒక్క మాటలో చెప్పాలంటే విగ్రహాలను కూడా యంత్రం పై ప్రతిష్టిస్తారు. తద్వారా ఈ యంత్రంలోని శక్తీ ఆ విగ్రహ రూపంలో భక్తులకు చేరి వారి అభీష్టాలను నెరవేరుస్తుంది అని విశ్వాసం. అంతటి శక్తివంతమైన ఈ యంత్రాలను సరైన విధానంలో పూజలు జపాలు వంటివి చేసి ఆక్టివేట్ చేస్తే అద్భుత ఫలితాలను అందిస్తాయి. మనిషికి ఉండే అనేక కష్టాల నుండి ఉపశమనం పొందటానికి ఈ యంత్రాలు ఎంతగానో ఉపయోగపడతాయి. ఆర్ధిక సమస్యలు, శత్రు బాధ, అనారోగ్య సమస్యలు, ఎంత కష్టపడినా పనులు ముందుకు నడవకపోవడం, వ్యాపారాలు స్తంభించడం, నరదిష్ఠి ఎక్కువగా ఉండటం, ప్రయోగ బాధలు, మనశాంతి లేకపోవడం వంటి అనేక సమస్యల నుండి మనల్ని మన కుటుంబ సభ్యులను రక్షించే శక్తీ ఈ యంత్రాలకు ఉంటుంది. అంతటి విశిష్టత కలిగినవి కాబట్టే వీటి గురించి తెలిసిన వారెవరూ కూడా వీటిని పూజించకుండా ఉండరు. ఇంకా చెప్పాలంటే నిజానికి యంత్రాలు చాలా మంది దృష్టిలో ఒక బొమ్మలా ఉండినా కూడా ఒక్కసారి సరైన విధానంలో చేసిన యంత్రాన్ని ప్రతిష్టేపిస్తే వాటి పని అది చేసుకుపోతుంది. ఉదాహరణకు నరఘోష యంత్రం ఇంటి బయట పెడితే లోపలకి ఎలాంటి దుష్టశక్తులు కూడా ప్రవేశించకుండా రక్షిస్తుంది. అయితే ఇటువంటివి కంటికి కనబడవు కాబట్టి కొంతమందికి నమ్మశక్యంగా లేకపోవచ్చు కానీ.ఈ యంత్రాల యొక్క గొప్పదనాన్ని తక్కువగా మాత్రం అంచనా వేయలేము. అంతటి విశిష్టత కలిగిన ఈ యంత్రాలను సరైన రీతిలో జపాలు, పూజలు వంటివి చేసి వాటిని ఉత్తేజ పరిస్తే అవి ఆక్టివేట్ అయ్యి పనిచెయ్యడం మొదలుపెడతాయి. అయితే ఇప్పుడు కొన్ని యంత్రాల గురించి క్లుప్తంగా తెలుసుకుందాం. అలానే ఆఖరిలో ఎవరికి ఏవి అనుకూలమైనవి అనేవి కూడా చూద్దాం.

ముందుగా మనం శ్రీ యంత్రం గురించి తెలుసుకుందాం.

శ్రీ యంత్రం అంటే సాక్షాత్తు ఆ అమ్మవారి రూపం. ఏ దేవాలయం చూసినా కూడా మనకు శ్రీ యంత్రం దర్శన మిస్తుంది. అది శ్రీ యంత్ర రూపంలో కానీ శ్రీ మేరు రూపంలో కానీ ఉండి భక్తులచే విశేష పూజలు అందుకుంటుంది. ఈ యంత్రాన్ని నిజానికి ప్రతీ గృహంలోనూ ఉండాల్సిన యంత్రంగా మనం పరిగణించాలి. ఈ యంత్రం గృహస్థునికి అష్టైశ్వర్యాలను ప్రసాదిస్తుంది అనడంలో ఎలాంటి సందేహం లేదు. అంతటి మహిమాన్వితమైన యంత్రం ఈ శ్రీ యంత్రం. అన్ని యంత్రాలకు అగ్ర యంత్రంగా, అన్ని యంత్రాలకంటే అత్యంత శీఘ్రముగా ఫలితాన్నిచ్చే యంత్రంగా దీనిని చెప్పవచ్చు. శ్రీ అంటే లక్ష్మి దేవి నామం, లక్ష్మీ అంటే ఐశ్వర్యం. యంత్రం అంటే పరికరం. అంటే ఐశ్వర్యాన్ని ప్రసాదించే ఒక పరికరం అని దీని అర్ధం. ఎవరైతే ఈ యంత్రాన్ని ప్రతీ నిత్యం భక్తి శ్రద్దలతో పూజించి కుంకుమార్చన వంటివి చేస్తారో వారికి జీవితంలో విజయం తథ్యం అని చెప్పవచ్చు. ఈ యంత్రాన్ని పూజించే వారికి ఏ లోటూ లేకుండా అమ్మవారు చూసుకుంటారు. ఒక్క మాటలో చెప్పాలంటే ఏ గృహంలో అయితే శ్రీ యంత్రం నిత్యం పూజలందుకుంటుందో ఆ గృహం అష్టైశ్వర్య భోగభాగ్యాలకు నిలయం అని చెప్పవచ్చు. అందుకే ప్రతీ ఆలయంలో, అలానే వ్యాపారస్తుల గృహంలో దీనిని ఉపయోగిస్తారు. అయితే ఈ యంత్రం ఆక్టివేట్ చెయ్యబడింది తీసుకోవాలి. అలానే సరైన విధంగా అర్చించాలి. అప్పుడే శీఘ్ర ఫలితాలను అందుకోవడానికి గాని ఆస్కారం ఉంటుంది. అయితే ఆక్టివేట్ చెయ్యడమంటే అర్ధం ఈ వీడియో ఆఖరిలో వివరించబడింది గమనించగలరు. యంత్రాన్ని పూజించే విధానం యంత్రం ద్వారా ఒక కాగితంలో రాసి పంపించబడుతుంది. 


గమనిక: ఏ గ్రహంలో అయితే నిత్యం ఈ యంత్రం పుజించబడుతుందో ఆ గృహంలో ఐశ్వర్యానికి లోటు ఉండదు అని చెప్పడంలో ఎలాంటి సందేహం లేదు. అయితే ఈ యంత్రాన్ని ఆరాధించే విధానం సమర్పించే నైవేద్యం వంటివి కూడా ముఖ్య పాత్ర పోషిస్తాయి. వాటిని యంత్రంతో పాటు పంపిస్తాము.

ఇక తదుపరి యంత్రం నరఘోష యంత్రం:

ఈ యంత్రాన్ని ప్రతీ ఒక్కరి గృహం బయటా స్థాపించాలి. ఎందుకంటే నేటి కాలంలో ప్రతీ ఒక్కరు ఎదుర్కొంటున్న సమస్య నరగోష . అందుకనే దీని గురించి మన పూర్వికులు ముందుగానే ఉహించి అనేక పరిహారాలు తెలియచేసారు. వాటిలో గృహానికి అయితే అత్యంత ప్రభావ వంతంగా పని చేసే వాటిలో యంత్రాన్ని ప్రధానంగా చెప్పడం జరిగింది. నరఘోషకి నలరాయి కూడా బద్దలవుతుంది అనే సామెత వినే ఉంటారు. అంటే నారగోష అంత ప్రమాదకరం. ఐశ్వర్య వంతుండు కూడా బికారి అయిపోయేంత దిష్టి ఈ నరఘోషకు ఉంటుంది. కాబట్టి జనులందరూ ఈ నరఘోషకు తగిన పరిహారాలు చేసుకోవాలి. గృహ నిర్మాణం జరిగేటప్పుడే తగిన యంత్రాన్ని లేదా పరికరాన్ని స్థాపించాలి. అప్పుడు ఎలాంటి ఆటంకం లేకుండా గృహం నిర్మాణం విజయవంతంగా పూర్తి అయ్యి ,అందుండు వారికి సకల శుభాలను ప్రసాదిస్తుంది. అలానే ప్రతీ గృహం ముందూ ఈ యంత్రాన్ని స్థాపించడం వళ్ళ ఎలాంటి చెడు దృష్టి గృహం మీద పడకుండా రక్షిస్తుంది. అంతే కాదు ఎలాంటి చెడు ప్రయోగాలను కూడా గృహంలోకి రాకుండా గృహస్థుణ్ణి రక్షిస్తుంది. అంతటి శక్తివంతమైన ఈ యంత్రాన్ని సరైన రీతిలో పూజించింది తీసుకోవాలి. అప్పుడే ఫలితాలు ఉంటాయి. 


వాస్తు యంత్రం:

ఈ సృష్టిలో పంచభూతాలు మన పరిసరాలు మొదలగునవి అంటే మన చుట్టూ ఉండేవి మనలని ఎంతగా ప్రభావితం చేస్తాయో, మనం నివాసం ఉండే గృహం కూడా అంతే ప్రభావం చూపిస్తుంది. గృహం అద్భుతంగా వాస్తు ప్రకారం నిర్మించుకుంటే ఆ ఇంట సిరి సంపదలకు, అష్టైశ్వర్యాలకూ లోటుండదు. అదే గృహానికి ఏమైనా వాస్తు దోషాలు ఉంటె ఆ దోషాల యొక్క ప్రభావం ఆ గృహస్థులు చవిచూడాల్సిందే. వాస్తు దోషం వలన కలిగే కొన్ని చెడు ప్రభావాలను కనుక చూస్తే, ఇంటి గృహస్థునకు శత్రువులు పెరిగిపోవడం, ఎంత కష్టపడినా ఫలితం ఉండకపోవడం, జీవితంలో ఎదుగుదల లేకపోవడం, ఆర్ధిక పతనం, వ్యాపారంలో తీవ్ర నష్టాలూ, నిజానికి కొన్ని దోషాల వళ్ళ వ్యాపారంలో తీవ్ర నష్టాలూ సంభవించి ఆ గృహాన్ని అమ్ముకునే పరిస్థితి గోచరిస్తుంది. అలానే భార్యా భర్తల మధ్య గొడవలు, కుటుంబ తగాదాలు, కోర్టు కేసులు, అంతు చిక్కని అనారోగ్య సమస్యలు, నిత్యం ఎదో ఒక రోగం, ఆ రోగానికి అనవసర ఖర్చు, తద్వారా ఆదాయాన్ని మించిన ఖర్చు, ఇంకా కొన్ని రకాల ప్రమాదకర దోషాల వళ్ళ మరణం కూడా సంభవించే అవకాశం ఉంది. అంతటి ప్రమాదకరమైన వాస్తు దోషాల నుండి రక్షించేందుకు మనకు అనేక యంత్రాలను సూచించటం జరిగింది. అయితే వాటిలో ఒక్కో యంత్రం ఒక్కో దోషానికి ప్రధానంగా సూచిస్తారు. అయితే గృహంలో ఒకటికంటే ఎక్కువ దోషాలు ఉన్నప్పుడు, లేదా గృహంలో వాస్తు దోషం అయితే ఉంది కానీ ఆ దోషం ఏమిటో నాకు తెలియడం లేదు అనుకున్నప్పుడు ఆ గృహస్థులు ఈ వాస్తు యంత్రాన్ని స్థాపించాలి. నిజానికి ప్రతీ ఇంటి యందు ఇది ఉండటం మంచిది. దీని ద్వారా వాస్తు దోషాలు తగ్గుముఖం పట్టి కొంత ఉపశమనం గృహస్థునికి లభిస్తుంది. తద్వారా పనులు దిగ్విజయంగా పూర్తి అయ్యి ఆశించిన ఫలితాలు అందుకోవడంతో పాటు గృహస్థులు మనశాంతిగా ఉండగలుగుతారు. 


శ్రీ శీతల మాతా మహా యంత్రం:

అత్యంత శక్తీ వంతమైన యంత్రాలలో ఇది ఒకటి. ఎంత ప్రయత్నించినా పనులు ముందుకు నడవనప్పుడు ఈ యంత్రాన్ని ఆరాధిస్తారు. ఒక్కోసారి పనులు అవ్వకపోవడం. ఎంత ప్రయత్నించినా ఏదొక ఆటంకం రావడం. వ్యాపారాలు స్థంభించుకుపోవడం వంటి వాటి నుండి బయట పడటానికి దీనిని ఆరాధిస్తారు. ఇది చాలా శక్తివంతమైన యంత్రం. దుర్గ దేవి యొక్క మరొక రూపం అయిన అమ్మవారి యంత్రం ఇది. ఒక్క మాటలో చెప్పాలంటే వ్యక్తి తన గమ్యాన్ని చేరుకోవడంలో వచ్చే ఆటంకాలను తొలగించి ఒక మార్గాన్ని చూపించే యంత్రమే ఈ శీతల మాతా మహా యంత్రం. ఎలాంటి ఆటంకం అయినా అమ్మవారి దయవల్ల తొలగి మీ కోర్కెలు సిద్ధింపచేసే యంత్రమే ఈ మహా యంత్రం. అది ఇల్లు కట్టుకునేటప్పుడు వచ్చే ఆటంకాలు కానీ, పిల్లల చదువులో లేదా ఉద్యోగంలో వచ్చే ఆటంకాలు కానీ, వ్యాపారాల లో వచ్చే ఆటంకాలు కానీ, ఏదైనా స్థంభించుకుని పోయి ముందుకు నడవనప్పుడు, ఎన్ని బేరాలు వచ్చిన అమ్మకం పెట్టిన వస్తువు అమ్ముడు పోకుండా ఉండినప్పుడు ఈ యంత్రం ఉపకరిస్తుంది. అంతటి శక్తివంతమైన ఈ యంత్రాన్ని సరైన రీతిలో చేసింది తీసుకోవాలి. అలానే చెప్పిన విధంగా ఆరాధించాలి.


బగళాముఖీ యంత్రం:

వ్యాపారస్తుల పాలిట కామధేనువు, కల్పవృక్షంగా ఈ యంత్రాన్ని పేర్కొనవచ్చు. ఇది ఒక అద్భుత యంత్రం. వ్యాపారస్తులకు వ్యాపార స్థలంలో స్థాపించడానికి బహుశా దీన్ని మించిన యంత్రం మరొకటి లేదనే చెప్పాలి. అంతటి అద్భుతమైన యంత్రం ఈ బంగాళాముఖి యంత్రం. దశమహావిద్యల్లో ఒకటిగా విరాజిల్లే బగళాముఖీ దేవి యొక్క యంత్రం ఇది. అత్యంత త్వరితంగా, అత్యంత శీఘ్రముగా ఫలితాలను ఇవ్వటంలో ఈ యంత్రానికి సాటి మరొకటి లేదు. వ్యాపారంలో నష్టాలూ వస్తున్నా, శత్రువులు ఇబ్బంది పెడుతున్నా, పోటీ ప్రపంచంలో నెట్టుకు రాలేకపోతున్నా, సమస్య ఎలాంటిదైనా కూడా కేవలం ఈ యంత్రాన్ని భక్తి శ్రద్దలతో పూజించి ప్రతీ నిత్యం ఉభయ సంధ్యలలో ధూపం వేసిన అనతి కాలంలోనే ఆ వ్యాపారం లాభాల బాటలో నడుస్తుంది అనడంలో ఎలాంటి సందేహం లేదు. అయితే ఇది శాస్త్రోక్తంగా చెయ్యబడింది అయ్యి ఉండాలి. అలా చేసిన యంత్రాన్ని గురువు ద్వారా గ్రహించి పూజించాలి.


మహా మృత్యుంజయ యంత్రం:

సాక్షాత్ శివస్వరూపం అయిన ఈ యంత్రాన్ని పూజించడం వలన అపమృత్యు దోషాలు హరిస్తాయి. అనారోగ్య సమస్యలతో బాధపడేవారు ఈ యంత్రాన్ని పూజించాలి. అలానే ఆక్సిడెంట్లు  ఎక్కువగా అవుతున్నప్పుడు, తరచూ అనారోగ్య సమస్యలు ఎదుర్కొంటున్నప్పడుడు, గాయాలు అవుతున్నప్పుడు. శత్రువులు ఎక్కువగా ఇబ్బంది పెడుతున్నప్పుడు, కాలసర్ప దోషం ఉండినప్పుడు. ఈ యంత్రాన్ని అర్చించాలి. ఈ యంత్రాన్ని నిత్యం భక్తి శ్రద్దలతో పూజించుట వలన శివానుగ్రహం ద్వారా అపమృత్యు దోషాలు తొలగి, సంపూర్ణ ఆరోగ్యం ఏర్పడే అవకాశం ఉంది. అలానే శత్రువులు మీపై చేసే చెడు ప్రయోగాలు మీకు తగలకుండా ఈ యంత్రం కాపాడుతుంది. దీర్ఘాయువును ప్రసాదిస్తుంది. సమస్త విపత్తుల నుండి రక్షణ కల్పిస్తుంది. ఒక్క మాటలో చెప్పాలంటే మీ ప్రాణానికి ఆరోగ్యానికి ఎలాంటి హాని జరుగకుండా రక్షిస్తుంది ఈ మహా మృత్యుంజయ యంత్రం. ఇది అత్యంత శక్తివంతమైన యంత్రం. దీనిని పూర్వ కాలంలో రాజులు కూడా విశేషంగా కొలిచేవారట. అంతటి మహిమాన్వితమైన యంత్రం ఇది. అటువంటి ఈ యంత్రాన్ని సరైన రీతిలో ఆక్టివేట్ చేసింది తీసుకుని సరైన విధంగా ప్రతీ నిత్యం భక్తి శ్రద్దలతో పూజించినా విశేష ఫలితాలు అందుకునే అవకాశం ఉంటుంది.

గమనిక: ఏ గృహంలో అయితే ఇది నిత్యం పుజించబడుతుందో ఆ గృహస్తునకు సంపూర్ణ ఆరోగ్యంతో పాటు కాలసర్ప దోషాలు వంటివి నివృత్తి అవుతాయి. అపమృత్యు దోషాలు, ఆక్సిడెంట్ లు అవ్వడం వంటివి కూడా సమసిపోతాయి.


జనాకర్షణ యంత్రం:

వ్యాపారాలు స్థంభించినప్పుడు లేదా బేరాలు తక్కువగ ఉండినప్పుడు, జనాలు ఎక్కువగా షాప్కి రానప్పుడు ఈ యంత్రాన్ని బయట తగిలించడం ద్వారా మెరుగైన ఫలితాలను అందుకుంటారు. అలానే ఏ కారణం చేత ఆ వ్యాపారం నడవట్లేదు అంటే నరదిష్ఠి వలన, లేదా వాస్తు పరంగా మంచిదికాదు లేదా ఇతర ఏ కారణం అయినా కూడా ఈ యంత్రం వాటి నుండి ఉపశమనం పొందేందుకు ఉపకరిస్తుంది. అంటే ఈ యంత్రం పెట్టిన తరువాత గతం కంటే కొద్దిగా మెరుగైన ఫలితాలు అందుకోవడానికి గాను ఆస్కారం ఉంది. అయితే ఈ యంత్రం తో పాటు లక్ష్మీ యంత్రం కానీ శ్రీ యంత్రం కానీ ప్రతీ నిత్యం ఆరాధించినా మెరుగైన ఫలితాలు పొందటానికిగాను ఆస్కారం ఉంటుంది. 


ఇక మిగిలిన యంత్రాలను మీ సమస్యను బట్టి సూచించుట ఉత్తమం. యంత్రాల యొక్క పూర్తి ఫలితాన్ని ఎప్పుడు పొందుతారు అంటే యంత్రాన్ని ఆరాధించే వారికీ వాటి పై మరియు వాటి అధిష్టాన దేవత యందు పూర్తి భక్తి విశ్వాసాలు కలిగి యంత్రాన్ని సరైన విధానంలో నిత్యం ఆరాధించినా వీటి యొక్క ఫలితాలు పొందటానికి గాను ఆస్కారం ఉంటుంది. యంత్రాల యొక్క ఫలితాన్ని స్వీయ అనుభవంతో తెలుసుకోవాలేగాని వర్ణింపనలవికాదు. యంత్రాల వలన సకల దోషముల నుండి బయటపడి అద్భుత ఫలితాలు పొందటానికి గాను ఆస్కారం ఉంటుంది. అలానే యంత్రాన్ని మార్కెట్ లో దొరికేది తెచ్చుకుని పెట్టుకుంటే ఫలితాలు వచ్చే అవకాశాలు ఉండవు. వాటిని సరైన రీతిలో జపాలు అవి చేసి ఉత్తేజపరిచి యంత్రాలను ఒక గురువు ద్వారా గ్రహించి వాటిని పూజా మందిరంలో లేదా వ్యాపార స్థలంలో స్థాపించి వారు చెప్పిన విధంగా చేసుకుంటే వాటి యొక్క ఫలితాలు పొందటానికి గాను ఆస్కారం ఉంటుంది. ఇక యంత్రాలను ఉత్తేజపరచటం లేదా ఆక్టివేట్ చెయ్యడం అనేది చాలా మంది చాలా పద్ధతులు అనుసరించినప్పటికీనీ ఇక్కడ వైదిక పద్ధతిలో ఎలా చేయవచ్చునో క్లుప్తంగా వివరిస్తాను. ఇది కేవలం అవగాహనా కోసం మాత్రమే గాని మారెఉద్దేశంతోనూ కాదు మంత్రం సిద్ధి లేని వారు వీటి గురించి తెలియనివారు ఇది చూసి చెయ్యవద్దని మా సలహా. ఎందుకంటే ఇక్కడ కూడా చాలా క్లుప్తంగా మాత్రమే వివరిస్తున్నాం కనుక పూర్తి విధి విధానాలు మీకు తెలియకపోవచ్చు. అలానే ఒక్కో యంత్రాన్ని ఒక్కో విధంగా చెయ్యాలి కాబట్టి ఇది అందరికీ సాధ్యపడదు.

ఇక యంత్రాన్ని చెయ్యడం విషయానికి వస్తే సిద్ధి పొందిన ఒక వ్యక్తి ఏ యంత్రాన్ని చేయాలి అనుకున్నారో ఆ యంత్రానికి అధిష్టాన దేవత యొక్క మంత్రాన్ని యంత్రానికి ఎన్నిసార్లు జపం ఆచరించాలి అని తెలియచేసారో ఆ జప సంఖ్యను పదకొండు లేదా ఇరువై ఒకటి లేదా నలభై రోజులకు రోజుకి ఇన్ని వేల సార్లు అని నిర్ణయించుకుని ఒక శుభ ముహూర్తంలో యంత్రాన్ని తెచ్చి వాటికి పూర్తి న్యాస విధిని అనుసరించి దేవత యొక్క ఆవాహన దగ్గరనుండి పంచామృత స్నానం ధ్యానం వంటివి చేసి షోడశ ఉపచారా పూజలు వంటివి చేసి అప్పుడు మంత్ర జపం మొదలు పెట్టి ఆ జప శక్తిని ఆ యంత్రానికి దారబోసి ఆ యంత్రానికి మహా నైవేద్యం సమర్పించి ధూపం చూపించి చెయ్యాలి. ఈ విధంగా ఎన్ని రోజులు అనుకుంటే అన్ని రోజులు చెయ్యాలి. ఆ తదుపరి ఆ యంత్రాన్ని ఎవరికి అయితే ఇవ్వాలి అనుకుంటున్నారో వారికి ఇచ్చి వారు ఆ యంత్రాన్ని ఎక్కడ ఉంచాలి ఏ విధంగా ఆరాధించాలి వంటి వివరాలను వారికి తెలియచెయ్యాలి.అయితే ఇక్కడ  తంత్ర పద్దతులలో యంత్రాలను చేసే వారు ఒక పద్దతిని వైదిక పద్దతిలో ఒక విధానాన్ని ఇలా ఒక్కొక్కరు ఒక్కో విధానాన్ని అనుసరించడం జరుగుతుంది. అలానే మంత్రం నిత్యం అనుష్ఠానం చేసుకునేవారికి యంత్రాలను చెయ్యడం చాలా సులభం అవుతుంది. 

ఇక ఎవరు ఏ ఏ యంత్రాలను ఆరాధించాలి చూస్తే 

గృహస్థు శ్రీ యంత్రాన్ని లేదా లక్ష్మీ యంత్రాన్ని లేదా అష్టలక్ష్మీ యంత్రాన్ని ప్రతీ నిత్యం ఆరాధించాలి. అలానే ఇంటిబయట నరఘోష యంత్రం తప్పని సరిగా ఉంచుకోవాలి.  ఒకవేళ గృహానికి ఏమైనా వాస్తు దోషాలు ఉంటె అప్పుడు వాస్తు యంత్రం కూడా ఉంచుకోవాలి. అలానే అనారోగ్య సమస్యలతో బాధపడేవారు మహా మృత్యుంజయ యంత్రాన్ని ప్రతీ నిత్యం ఆరాధించాలి.

ఇక వ్యాపారస్తుల విషయానికి వస్తే 

వ్యాపార సంస్థకు బయట నరఘోష యంత్రాన్ని, జనాకర్షణ యంత్రాన్ని స్థాపించి, వ్యాపార స్థలంలో బగళాముఖీ యంత్రాన్ని స్థాపించాలి. దీని వలన వ్యాపారాలు బాగా జరగటానికిగాను ఆస్కారం ఉంటుంది. అలానే ఒకవేళ వ్యాపారం స్థంభించిపోయినా, లేదా ముందుకు నడవక పోయినా శ్రీ శీతల మహా యంత్రాన్ని వ్యాపార స్థలంలో ఉంచితే  మంచిది. అలానే ప్రతీ ఒక్కరు కూడా శ్రీ యంత్రాన్ని తప్పకుండా ఆరాధించాలి. తద్వారా అనేక సమస్యల నుండి ఉపశమనం పొందటానికిగాను ఆస్కారం ఉంటుంది. 

ఇంకనూ మీకు ఏమైనా సందేహాలు ఉంటె మమ్మల్ని సంప్రదించవచ్చు. 

గమనించండి: ఇంతకు ముందు తాబేలు ఉంగరాలు తీసుకున్న 99% అందరికీ శుభఫలితాలు వచ్చేయని తెలియచెయ్యడానికి సంతోషిస్తున్నాం. ఎప్పటినుండో అనుకున్న సొంత గృహ నిర్మాణం మొదలు అవ్వడం, కొంత మందికి వ్యాపారంలో బాగా కలసి రావడం, మాక్సిమం అందరికీ ఆర్ధికంగా అభివృద్ధి మొదలవడం వంటి అనేక విధాలా మేము పూజించి ఇచ్చిన ఆ ఉంగరం ధరించిన వారు పొందగలిగారు. ఈ విషయాలు వారే స్వయంగా చెప్పడంతో పాటు కొంత మంది వీడియో రూపంలో వారి అనుభవాన్ని కూడా వివరించడం జరిగింది. వారందరికీ పేరు పేరునా కృతజ్ఞతలు తెలుపుకుంటున్నాం. త్వరలో వారి అభిప్రాయాన్ని ఒక వీడియో రూపంలో చేసే ప్రయత్నం చేస్తాం. యంత్రాలు ఇతర ఆధ్యాత్మిక వస్తువుల యొక్క ఫలితాలు అందరికీ ఒకే విధంగా ఉంటాయని కాని, వెంటనే ఫలితం వచ్చేస్తుంది అని  కాని చెప్పలేము. నిజానికి ఎ వస్తువు అయినా కచ్చితంగా ఫలితం వచ్చేస్తుంది అనే గారంటీ ఇవ్వలేము.. ఎందుకంటే అందరికీ అన్ని వస్తువులు అన్ని సమయాల్లో ఫలితం ఇవ్వకపోవచ్చు లేదా వాటి యొక్క ఫలితం గ్రహించే శక్తీ దానిని ఉపయోగించే వారికి తెలియకపోవచ్చు. ఉదాహరణకు నరఘోష యంత్రాన్ని తీసుకుంటే దానిని స్థాపించిన దగ్గర నుండి దాని పని అది చేసుకుంటుంది. అయితే ఇది మన కంటికి కనబడదు కాబట్టి మనం అది పనిచేస్తుంది అని గ్రహించలేం. అయితే ఇక్కడ శ్రీ యంత్రం వంటివి ఆరాధిస్తే మెల్లి మెల్లిగా క్రమేపి మీకు ఫలితం కనబడినా ఇవి ఆధ్యాత్మిక వస్తువులు కాబట్టి గ్యారంటీ అనేది మాకు తెలిసినంత వరకూ ఏ జ్యోతిష్యులు ఇవ్వలేరు అని గ్రహించాలి. అయితే అలా అని ఫలితం లేదు అని చెప్పడం మా ఉద్దేశం కాదు. ఇది చెప్పడానికి గల ప్రధాన కారణం కొంతమంది ఉద్దేశపూర్వకంగా కొని ఫలితం లేదు అని ఉద్దేశ పూర్వకంగా మన హైందవ వస్తువుల యందు నమ్మకం పోగొట్టే ప్రయత్నం చేయవచ్చు. ఎందుకంటే టెలిగ్రామ్ లో నేను గ్రూప్ క్రియేట్ చేసినప్పుడు కొంతమంది ఇతరులు జాయిన్ అయ్యి మన గ్రూప్ లో మహిళలకు మెస్సేజ్ పెట్టడం జరిగింది ఆవిధంగా చెయ్యడం వలన వారు గ్రూప్ నుండి ఎగ్జిట్ అవుతారు తద్వారా భక్తి సమాచారాన్ని/ ధర్మ ప్రచారాన్ని ఆపివేయవచ్చు అనేది వారి ఉద్దేశం కావొచ్చు. అయితే కొంత మంది మహిళలు మాకు స్క్రీంషాట్ తో సహా పంపడం వళ్ళ ఎవరైతే మెస్సేజ్ చేసారో వారిని గ్రూప్ నుండి రిమూవ్ చేసి, బ్లాక్ చెయ్యడం జరిగింది. కాబట్టి ఇటువంటి వారు ఉన్న కారణంగా ముందుగానే గ్యారంటీ ఉండవు అనే పదాన్ని ఉపయోగించాల్సిన పరిస్థితి వస్తుంది. 

జై హింద్.


Comments