రాశి ఫలాలు - శనివారం - 06-06-2020. గ్రహగతులను అనుసరించి మీకు ఈ రోజు ఎలా ఉండబోతుంది ? Daily Horoscope in Telugu - Astrology


మేష రాశి
మానసిక ప్రశాంతత లోపిస్తుంది ఒత్తిడి అధికంగా ఉంటుంది యోగా మెడిటేషన్ వంటివి చేయడం ద్వారా ఇలాంటి ఒత్తిడులను అధిగమించవచ్చు ఆర్థికంగా బాగుంది రాబడి పెరుగుతుంది ఆశించిన స్థాయిలో మీ ఆదాయం ఉండడం చాలా సమస్యల నుండి బయట పడేస్తుంది వృత్తి ఉద్యోగ పరంగా అనుకూలంగా ఉండబోతుంది ప్రేమ వ్యవహారాలు అనుకూలంగా ఉండబోతున్నాయి మీ మనసుకు నచ్చిన వారితో సమయాన్ని సంతోషంగా గడుపుతారు మీ పాత లేదా చిన్ననాటి స్నేహితులను కలుసుకునే అవకాశం ఉంది దంపతుల మధ్య అన్యోన్యత పెరుగుతుంది సమస్యలను అధిగమించగలుగుతారు. ఈ రోజు మీకు బాగానే ఉంది

వృషభ రాశి
ఆర్థిక పరిస్థితి మెరుగుపడుతుంది గతంలో మీరు పెట్టిన పెట్టుబడులు ఇప్పుడు లాభాలు వస్తాయి రాబడి పెరుగుతుంది ఇతరుల సహాయంతో కొన్ని సమస్యల నుండి బయటపడగలుగుతారు ఆత్మస్థైర్యాన్ని పెంచుకునే దిశగా ప్రయత్నాలు ఉంటాయి కోచింగ్ తీసుకోవడం వంటివి చేసే అవకాశం ఉంది మీ మాట తీరు వల్ల ఈరోజు మీ జీవిత భాగస్వామితో కొద్దిపాటి మనస్పర్ధలు ఏర్పడవచ్చు వారిని మీరు మానసికంగా బాధ పెట్టిన వారు కూడా అయ్యే అవకాశం ఉంది కాబట్టి మాట్లాడేటప్పుడు మీ కోపాన్ని మీ ఒత్తిడిని అదుపులో ఉంచుకోండి అది మీ బంధాన్ని కాపాడుతుంది. సమయాన్ని వృధా ఖర్చు చేస్తారు ఎక్కువగా ఒంటరిగా ఉండడానికి ఇష్టపడతారు ఏదేమైనా ఈ రోజు మీకు మిశ్రమ ఫలితాలను గ్రహస్థితి సూచిస్తుంది

మిథున రాశి
ఆరోగ్యం మందగిస్తుంది ఆర్థిక పరిస్థితి అంతగా బాగోలేదు లేనిపోని ఇబ్బందులు ఎదురయ్యే అవకాశం ఉంది అప్పు చేసే పరిస్థితే గోచరిస్తుంది లోపల ఎన్ని బాధలు ఉన్నా పైకి మాత్రం సంతోషంగా ఉంటారు అది మీ చుట్టుపక్కల ఉన్న వారిని కూడా సంతోషంగా ఉంటుంది మీకు బాగా కావలసిన వారితో గొడవలు ఏర్పడే అవకాశం ఉంది తద్వారా మీ బంధం తెగిపోయే అవకాశం ఉంది మీరు చాలా జాగ్రత్తగా ఉండడం అవసరం ఆటంకాలు ఆక్సిడెంట్ వంటివి అయ్యే అవకాశం ఉంది అనవసరపు ప్రయాణాలు వాయిదా వేయడం చాలా మంచిది దంపతుల మధ్య అన్యోన్యత లోపిస్తుంది

కర్కాటక రాశి
మానసికంగా చాలా సంతోషంగా ఉంటారు. కొద్దిపాటి ఖర్చులు ఉంటాయి. అవి వైద్యం నిమిత్తం అయ్యేవి గా ఉండే అవకాశం ఉంది. సమయానికి ధనం చేతికి అందుతుంది. తద్వారా చాలా సమస్యల నుండి గట్టెక్క గలుగుతారు. మీ మనసుకు నచ్చిన వారితో కలిసి సంతోషంగా సమయాన్ని వెచ్చిస్తారు. అది మీ మానసిక సంతోషానికి కారణం అవుతుంది. ఎప్పటినుంచో చేయాలి అనుకున్న పని ఒకటి ఇప్పుడు పూర్తి అవుతుంది. దాంపత్య జీవితం సుఖమయంగా ఉండబోతుంది. కంటి సంబంధ వ్యాధులు ఇబ్బంది పెట్టే అవకాశం ఉంది.

సింహరాశి
ఆత్మస్థైర్యం పెరుగుతుంది. ఆర్థిక పరిస్థితి మెరుగుపడుతుంది. ధనం సమయానికి చేతికి అందుతుంది. మొండి బకాయిలు వసూలవుతాయి. మానసిక ప్రశాంతత లభిస్తుంది. కుటుంబ సభ్యులతో సమయాన్ని సరదాగా గడుపుతారు. మీ సహాయం కోరి వచ్చిన వారి యొక్క అంతరార్ధం ఏమిటో కూడా ఒకసారి గ్రహించండి. మిమ్మల్ని మోసం చెయ్యాలి అని కొందరు ప్రయత్నిస్తారు. మీ మంచితనాన్ని అదునుగా తీసుకుని ఇటువంటి ప్రయత్నాలు చేసే అవకాశం ఉంది. కావున జాగ్రత్తగా ఉండవలెను. ప్రేమ వ్యవహారాల కూడా కాలం అనుకూలంగా ఉంది. వ్యవహార జయం ఉంది. ప్రేమికులు చాలా సంతోషంగా ఉండగలుగుతారు. దాంపత్య జీవితం సుఖమయం ఉండబోతుంది. ఈ రోజు మీకు బాగానే ఉంది.

కన్య రాశి
లేనిపోని ఆలోచనలతో సతమతమవుతారు. భవిష్యత్తు గురించి కొన్ని ఆలోచనలు చేస్తారు. నూతన పెట్టుబడులు దిశగా మీ ప్రయత్నం ఉంటాయి. ఖాళీ సమయం ఎక్కువగా దొరుకుతుంది. తద్వారా అనేక ఆలోచనలు వచ్చి మానసిక ప్రశాంతతను కోల్పోతారు. యోగా మెడిటేషన్ వంటివి చేయడం చెప్పదగిన సూచన. ఆర్థికపరమైన ఇబ్బందులు ఎదురయ్యే అవకాశం ఉంది. మీ ఖర్చులను అదుపులో ఉంచుకోవడం ఎంతైనా ఉత్తమం. జీవిత భాగస్వామితో కొద్దిపాటి మనస్పర్థలు ఏర్పడే అవకాశం ఉంది. ప్రేమికులకు చాలా అనుకూలంగా ఉంది. ఇష్టమైన వారితో సమయాన్ని గడుపుతారు. మీ చిన్ననాటి లేదా పాత స్నేహితులను కలుసుకునే అవకాశం ఉంది. దాంపత్య జీవితం సుఖమయంగా ఉండబోతుంది. మీ తోటి వారితో లేదా పై అధికారులతో కొద్దిపాటి సంఘర్షణలు ఏర్పడవచ్చు. కోపాన్ని అదుపులో ఉంచుకోవడం ద్వారా ఇలాంటి గొడవల నుండి తప్పించుకోవచ్చు.

తులారాశి
మానసిక ప్రశాంతతను కోల్పోతారు. ఒత్తిడి అధికంగా ఉంటుంది. లేనిపోని ఇబ్బందులు ఎదురవుతాయి. గతంలో చేసిన కొన్ని పొరపాట్లు వల్ల, ఇప్పుడు బాధ పడవలసి వస్తుంది. లేనిపోని ఖర్చులను తగ్గించుకోవాలి. ఈరోజు జరిగే కొన్ని సంఘటనల వల్ల ఆర్థికపరమైన ఇబ్బందులు ఎదుర్కోవలసి వస్తుంది. కొన్ని కీలకమైన పరిస్థితుల్లో మీ తోబుట్టువులు మీకు అండగా నిలుస్తారు. గతంలో ఎవరితో అయినా కొద్దిపాటి విభేదాలు ఉంటే అవి ఈరోజు సమసిపోతాయి. సమస్యలను పరిష్కరించే దిశగా చేసే ప్రయత్నాలు ఫలిస్తాయి. కుటుంబ కలహాలు మీ మానసిక ఆందోళనకు ప్రధాన కారణం అవుతాయి. దాంపత్య జీవితం అంత సాఫీగా ఉండదు. ఈరోజు మీకు మిశ్రమ ఫలితాలను గ్రహస్థితి సూచిస్తుంది.

వృశ్చిక రాశి
ఎన్నడూ లేనంత ఖాళీ సమయం ఈ రోజు మీకు దొరుకుతుంది. మీ అందాన్ని ఆరోగ్యాన్ని మెరుగుపరుచుకునే దిశగా మీ ప్రయత్నాలు ఉంటాయి. నూతన పెట్టుబడులు పెట్టడానికి ఇది అంత అనుకూల సమయం కాదు. చూడ్డానికి ప్రతిది లాభాలను ఇచ్చే వ్యాపారంగా ఉన్నప్పటికీ అనుకోకుండా నష్టాలను చవి చూసే అవకాశం ఉన్నందున ఈ విధమైనటువంటి సూచన చేయడం జరుగుతుంది. మీకు బాగా ఇష్టమైన వారు కొన్ని సమస్యల్లో ఉండడం మీకు కొంత ఆందోళన కలిగిస్తుంది. ప్రేమికులకు కాలం అనుకూలంగా ఉంది. మీ మనసుకు నచ్చిన వారితో సమయాన్ని సంతోషంగా గడుపుతారు. ఆయన వారితో మీరు బయటకు వెళ్ళే అవకాశం ఉంది. ఈరోజు మీకు మానసికంగా చాలా సంతోషం కలుగుతుంది.

ధనుస్సు రాశి
గతంలో ఆగిపోయిన పనులు పునః ప్రారంభించగా మీ ప్రయత్నాలు ఉంటాయి. మీ మనసుకు నచ్చిన పనులు మాత్రమే మీరు చేస్తారు. గతంలో మీరు పెట్టిన పెట్టుబడులు ఇప్పుడు లాభాలు వస్తాయి. ఆర్థికంగా గతంకంటే బాగుంది. రావలసిన బాకీలు వసూలవుతాయి. సమయానికి ధనం చేతికందుతుంది. స్నేహితులతో సమయాన్ని సరదాగా గడుపుతారు. ఎంత అనుకూలంగా ఉన్నా కూడా ఏదో ఒక లోటు అయితే ఉంటుంది. అది మిమ్మల్ని 7778877 పూర్తిగా ఎంజాయ్ చెయ్యని ఇవ్వకుండా ఆపుతుంది. ఒంటరిగా ఉండటానికి ఎక్కువగా ఇష్టపడతారు. మీ జీవిత భాగస్వామితో వాగ్వాదం ఏర్పడే అవకాశం ఉంది. అయితే ఇది అంత పెద్దగా ఏమీ ఉండదు. కాబట్టి చింతించనవసరం లేదు. అయితే కుటుంబ కలహాలు మిమ్మల్ని బాగా ఇబ్బంది పెడతాయి. ఈరోజు మీకు మిశ్రమ ఫలితాలని గ్రహస్థితి సూచిస్తోంది.

మకర రాశి
కుటుంబ సంబంధ తగాదాలు ఏర్పడే అవకాశం ఉంది. ఆస్తిపాస్తులు ఏమైనా రావాల్సి ఉంటే అది వాయిదా పడడం గాని, వాటి విషయాల్లో ఆటంకాలు ఎదురు రావడమో గాని జరుగుతుంది. కోపం లో ఉన్నప్పుడు మీరు తీసుకునే కొన్ని నిర్ణయాల వల్ల ఆర్థిక పరమైన నష్టాలను చవిచూడాల్సి వస్తుంది. మీ స్నేహితులను కలుసుకుని సమయాన్ని సరదాగా గడుపుతారు. ఇది మీ మానసిక ఆందోళనను కాస్త తగ్గిస్తుంది. ప్రేమ వ్యవహారాలకు అంత అనుకూల సమయం కాదు. ఇద్దరి మధ్య కొద్దిపాటి విభేదాలు ఏర్పడే అవకాశం ఉంది. నూతన పరిచయాలు అవుతాయి. సమాజంలో ఉన్నత స్థాయిలో ఉన్న వ్యక్తులతో ఈ పరిచయాలు ఏర్పడతాయి. దాంపత్య జీవితం అంత సానుకూలంగా ఉండదు. కొద్దిపాటి గొడవలు ఏర్పడే అవకాశం ఉంది.

కుంభరాశి
ఆరోగ్యం మందగిస్తుంది. వృత్తి సంబంధమైన ఒత్తిడులు అధికంగా ఉంటాయి. అతికష్టం మీద కాని పనులు పూర్తి కావు. లేని పోనీ ఆలోచనలతో ఇబ్బంది పడతారు. ఆర్థికపరమైన ఇబ్బందులు ఎదుర్కోవలసి పరిస్థితులు ఏర్పడతాయి. అందరినీ నమ్మడం ద్వారా మోసపోయే అవకాశాలు ఉన్నాయి. సంతానం విషయంలో కాస్త సంతృప్తి ఏర్పడుతుంది. ఇది మీ మానసిక ఆందోళనను కాస్త తగ్గిస్తుంది. అవివాహితులకు వివాహ యోగం ఉంది. ఎక్కువ సమయాన్ని వినోదానికి ఖర్చు చేస్తారు. దాంపత్య జీవితం సుఖమయంగా ఉండబోతుంది. ఈరోజు మీకు బాగానే ఉంది.

మీన రాశి
అందాన్ని ఆరోగ్యాన్ని మెరుగు పరుచుకునే దిశగా ప్రయత్నాలు ఉంటాయి. ఆర్థిక పరమైన అభివృద్ధి చూడగలుగుతారు. వృత్తి ఉద్యోగ పరంగా అనుకూలంగా ఉంది. గతం కంటే ప్రస్తుత పరిస్థితులు బాగున్నాయి. నమ్మిన వ్యక్తులు మోసం చేసే అవకాశం ఉంది. ప్రేమ వ్యవహారాలకు కాలం అనుకూలంగా ఉంది. ఆవివాహితులకు వివాహయోగం ఉంది. గత కొద్ది రోజులుగా ఎన్నడూ లేనంత ఖాళీ సమయం ఈరోజు మీకు దొరుకుతుంది. దాన్ని మీరు వినోదానికి ఖర్చు చేస్తారు. మానసిక ప్రశాంతత ఏర్పడుతుంది. ఒత్తిళ్లు తగ్గుతాయి. దాంపత్య జీవితం సుఖమయంగా ఉండబోతుంది. మీ ప్రతీ కష్టాన్ని మీ జీవిత భాగస్వామి పంచుకోవడం కొండంత అండగా ఉంటుంది. పని భారం తగ్గుతుంది. ఈరోజు మీ మనసుకు నచ్చిన పనిని చేస్తారు. తద్వారా మానసిక సంతోషాన్ని పొందగలుగుతారు. ఈ రోజు మీకు చాలా బాగుంది.

శుభం భూయాత్ 

Comments