రాశి ఫలాలు - శనివారం- 13-06-2020. గ్రహగతులను అనుసరించి మీకు ఈ రోజు ఎలా ఉండబోతుంది ? Daily Horoscope in Telugu - Astrology
మేష రాశి
పనులు అతి కష్టం మీద పూర్తి అవుతాయి. శ్రమ అధికంగా ఉంటుంది. సమస్య చిన్నదే అయినప్పటికీ దానిని మీరు పెద్దగా ఊహించుకోవడం వల్ల మనశ్శాంతిని కోల్పోతారు. నూతన పెట్టుబడులు పెట్టాలనుకునే వారికి కాలం అనుకూలంగా ఉంది ఆ పెట్టుబడి స్థిరాస్తులలో పెడితే మరింత లాభం చూసే అవకాశం ఉంది. అకారణ కలహా సూచన ఉంది. ప్రేమ వ్యవహారాలకు అంత అనుకూలంగా లేదు. ఈరోజు మీరు చేసే ఒక పని మీకు ఎంతగానో ఉపయోగపడుతుంది. సమాజంలో మీ కీర్తి ప్రతిష్టలను పెంచి, ప్రశంసల జల్లు కురిపించేదిగా ఉంటుంది. జీవిత భాగస్వామితో కొద్దిపాటి విభేదాలు ఏర్పడే అవకాశం ఉంది.
వృషభ రాశి
ఆధ్యాత్మిక చింతన పెరుగుతుంది. ఇతరులకు సహాయం చేయడం, దానధర్మాలు చేయడం వంటివి చేసే అవకాశం ఉంది. మానసిక ప్రశాంతత ఏర్పడుతుంది. భవిష్యత్తు గురించి ధనాన్ని పొదుపు చేసే దిశగా మీ ప్రయత్నాలు ఉంటాయి. ప్రతీ పనిని మరింత ఆత్మస్థైర్యంతో మీరు పూర్తి చేయగలుగుతారు. కాన్ఫిడెన్స్ పెరుగుతుంది. చెయు ప్రతీ పనియందు మీ కుటుంబ సభ్యుల సహకారం ఉండడం మీకు కొండంత బలాన్నిస్తుంది. అవివాహితులకు వివాహ యోగం ఉంది. దాంపత్య జీవితం చాలా సంతోషంగా ఉండబోతుంది. పనులు సకాలంలో పూర్తి అయ్యి మీరు ఆశించిన దానికంటే మెరుగైన ఫలితాలు అందుకుంటారు. ఈ రోజు మీకు చాలా బాగుండబోతుంది.
మిథున రాశి:
నూతన పెట్టుబడులు పెట్టడానికి కాలం అంత అనుకూలంగా లేదు. మీ సహాయం కోరి కొంతమంది మీ దగ్గరికి వచ్చే అవకాశం ఉంది. ఎన్ని సమస్యలు ఉన్నా పైకి మాత్రం నవ్వుతూ కనిపిస్తారు. ప్రేమికులకు కాలం అంత అనుకూలంగా లేదు. ఇద్దరి మధ్య గొడవలు ఏర్పడే అవకాశం ఉంది. మీరు గతంలో చేసిన కొన్ని పనుల వల్ల ప్రశంసలు అందుకునే అవకాశం ఉంది. మీ మనసుకు నచ్చిన వారితో సమయాన్ని గడిపి మానసిక ప్రశాంతతను పొందుతారు.
కర్కాటక రాశి:
ఆర్థికంగా చాలా బాగుండ బోతుంది. నూతన వ్యాపారాలు ప్రారంభించటానికి అవసరమైన ధనం ఈరోజు మీకు చేతికి అందే అవకాశం ఉంది. నూతన వృత్తి, వ్యాపారాలు కోసం మీరు చేసే ప్రయత్నాలు సానుకూల పడతాయి. కుటుంబ సభ్యులతో కలిసి సమయాన్ని సరదాగా గడుపుతారు. దాంపత్య జీవితం సుఖమయంగా ఉండబోతుంది. ఎక్కువ సమయాన్ని వినోదానికి ఖర్చు చేసే అవకాశం ఉంది. ప్రయాణాలు చేసే అవకాశం ఉంది. షాపింగ్ నిమిత్తం కొద్దిపాటి ఖర్చులు అయితే ఉండే అవకాశం ఉంది.
సింహరాశి:
పనులు సకాలంలో పూర్తి అయ్యి ఆశించిన ఫలితాలు కంటే మెరుగైన ఫలితాలను ఇస్తాయి. ఈరోజు ఎదురయ్యే ఒక సంఘటన డబ్బు విలువ ఏంటో మీకు తెలిసేలా చేస్తుంది. స్నేహితులతో కలిసి సమయాన్ని సరదాగా గడుపుతారు. విద్యార్థులు చాలా సంతోషంగా ఉండబోతున్నారు. దాంపత్య జీవితం సుఖమయంగా ఉండబోతుంది. కుటుంబ సభ్యులతో కలిసి బయటకు వెళ్లే అవకాశం ఉంది.
కన్యారాశి:
ఈరోజు మీ మనసుకు నచ్చిన పనులు చేయడానికి ఎక్కువగా మొగ్గు చూపుతారు. అందాన్ని మెరుగు పరుచుకునే దిశగా ప్రయత్నాలు ఉంటాయి. గతంలో ఎవరితో అయినా కొద్దిపాటి మనస్పర్ధలు ఉంటే ఈ రోజు సమసిపోతాయి. పనులు సకాలంలో పూర్తి చేసి ఆశించిన ఫలితాలు అందుకుంటారు. పై అధికారులచే మన్ననలు అందుకుంటారు. దాంపత్య జీవితం సుఖమయంగా ఉండబోతుంది.
తులారాశి:
చాలా సంతోషంగా ఉంటారు. దూరపు బంధువులను కలుసుకునే అవకాశం ఉంది. కుటుంబ సభ్యులతో కలిసి సరదాగా సమయాన్ని గడుపుతారు. ప్రేమికులకు కాలం అనుకూలంగా ఉంది. దాంపత్య జీవితం సుఖమయంగా ఉండబోతుంది. చాలా యాక్టివ్గా సంతోషంగా ఈరోజు మీరు ఉంటారు. ఈ రోజు మీకు చాలా బాగుంది.
వృశ్చిక రాశి:
చిన్న పిల్లలతో కలిసి సమయాన్ని సరదాగా గడుపుతారు. ఇది మీకు చాలా మానసిక సంతోషాన్నిస్తుంది. ఎంతోకాలంగా మీకు ఉన్న స్ట్రెస్ ఈరోజు తగ్గిపోతుంది. ఆదాయంతో పాటు కొద్దిపాటి ఖర్చులు కూడా ఉండబోతున్నాయి. గతంలో మీరు చేసిన ప్రయత్నాలకు గాను ఫలితాలను అందుకునే సమయంగా దీనిని చెప్పవచ్చు. విజయం వరిస్తుంది. ఆర్థికంగా అద్భుతంగా ఉండబోతుంది. ఆకస్మిక ధనప్రాప్తి ఉంది. వివాహ ప్రయత్నాలు చేసే వారికి ఒక మంచి సంబంధం సెట్ అవుతుంది. మరింత పట్టుదలతో పనులు పూర్తి చేస్తారు. ఈ రోజు మీకు చాలా బాగుంది.
ధనుస్సు రాశి:
ఆర్థికంగా బాగా ఉండబోతుంది. ఆకస్మిక ధనప్రాప్తి ఉంది. బంధుమిత్రులతో సమయాన్ని సరదాగా గడుపుతారు. ఆహ్వానాలు అందుతాయి. శుభవార్తలు వింటారు. ప్రేమికులకు అంత అనుకూలంగా లేదు. ఇద్దరి మధ్య కొద్దిపాటి విభేదాలు ఏర్పడే అవకాశం ఉంది. ఎవరు ఎన్ని విధాలుగా మీ గురించి చెడుగా చెప్పుకున్నా, మీరు పట్టించుకోరు. వారి పాపాన వారే పోతారని వదిలేస్తారు. కొంతమంది బయట వ్యక్తుల కారణంగా భార్యాభర్తల మధ్య కొద్దిపాటి గొడవలు ఏర్పడే అవకాశం ఉంది. ఏమైనా ఈ రోజు మీకు మిశ్రమ ఫలితాలను గ్రహస్థితి సూచిస్తుంది.
మకర రాశి:
మానసికంగా చాలా సంతోషంగా ఉంటారు. మీ మనసుకు నచ్చిన పని మాత్రమే మీరు చేస్తారు. ఎవరు ఎన్ని అనుకున్నా మీరు పట్టించుకోరు. కొంతమందికి భూ సంబంధిత తగాదాలు ఇబ్బందిపెట్టే అవకాశం ఉంది. ప్రేమికులకు అంత అనుకూలంగా లేదు. ఇద్దరి మధ్యా మనస్పర్థలు ఏర్పడే అవకాశం ఉంది. కొన్ని సందర్భాల్లో అసలు ఏం జరుగుతుందో కూడా తెలియని సందిగ్ధత ఏర్పడుతుంది. దంపతుల మధ్య కొద్దిపాటి విభేదాలు ఏర్పడే అవకాశం ఉంది. చిన్న కారణం పెద్ద గొడవకు దారితీసే అవకాశాలు ఉన్నాయి. కాబట్టి జాగ్రత్తగా ఉండాలి. లేనిపోని విభేదాలకు దూరంగా ఉండాలి. ఏదేమైనా ఈ రోజు మీకు మిశ్రమ ఫలితాలనే గ్రహస్థితి సూచిస్తుంది.
కుంభరాశి:
నిర్ణయాలు తీసుకునేటప్పుడు ఒకటికి రెండుసార్లు ఆలోచించి తీసుకోవాలి. నూతన పెట్టుబడులకు కాలం అనుకూలంగా లేదు. మీ మాట తీరు ఇతరుల మనస్సును నొప్పించేదిగా ఉండే అవకాశం ఉంది. అనవసరంగా మీరు చేసే ఖర్చుల వల్ల ఇబ్బందులను ఎదుర్కొనే పరిస్థితి వస్తుంది. కావున అనవసర ఖర్చులు తగ్గించుకోవాలి. మీరు చేసే కొన్ని పనులు మీ కుటుంబ సభ్యులకు ఆందోళన కలిగిస్తాయి. కోపాన్ని, ఒత్తిడిని అదుపులో పెట్టుకోవాలి. లేకపోతే లేనిపోని గొడవలకు ఇది దారితీస్తుంది. ప్రేమికులకు అంత అనుకూలంగా లేదు. నమ్మిన వారు మోసం చేసే అవకాశం ఉంది. ఎక్కువ సమయాన్ని ఏకాంతంగా గడపడానికి ఇష్టపడతారు. ఈరోజు మిశ్రమ ఫలితాలను గ్రహస్థితి మీకు సూచిస్తుంది.
మీన రాశి:
మనశ్శాంతిని కోల్పోతారు. ఏ పని చేద్దాం అన్నా పరిస్థితులు అనుకూలించవు. పనులలో జాప్యం ఏర్పడే అవకాశం ఉంది. ఆర్థికపరమైన ఇబ్బందులు ఎదుర్కొనే అవకాశం ఉంది. అవివాహితులకు వివాహ యోగం ఉంది. నూతన పరిచయాలు ఏర్పడతాయి. ఎక్కువ సమయాన్ని వినోదానికి ఖర్చు చేసే అవకాశం ఉంది. మనసుకు నచ్చిన వారితో సమయాన్ని సరదాగా గడుపుతారు. ఇది మీకు మానసిక ప్రశాంతతను కలిగిస్తుంది. దాంపత్య జీవితం సుఖమయంగా ఉండబోతుంది. ఈరోజు మీకు బాగానే ఉంది.
శుభం భూయాత్
Comments
Post a Comment
ఇక్కడ మీ కామెంట్ రాయండి