మేష రాశి వారు అద్బుతంగా రాణించే 10 రంగాలు - ఈ వృత్తులలో గనుక వారు ఉంటే ఇక వారి పంట పండినట్టే - అదృష్టం వెన్నంటి ఉంటుంది.

గతంలో మనం మేష రాశి వారి గురించీ, వారి గుణ గణాల గురించి క్లుప్తంగా తెలుసుకున్నాం. అయితే ఇప్పుడు మేష రాశి వారు ఏ వృత్తులను ఎంచుకోవడం ద్వారా అద్బుతంగా రానిస్తారో చూద్దాం. అంటే మేష రాశి వారు గనుక ఇలాంటి వృత్తులలో ఉన్నారంటే అద్బుతమైన ఫలితాలను సొంతం చేసుకోగలుగుతారు. మిగిలిన అన్ని వృత్తుల కంటే ఈ వృత్తులలో వారికి రాణింపు ఎక్కువగా ఉంటుంది. పేరు ప్రఖ్యాతలు, సంపద, సంతోషం ఇలా అన్ని విధాలా బాగుంటుంది. అయితే ఆ వ్రుత్తులేంటో ఒకసారి చూద్దాం.
క్రీడా సంబందిత వృత్తులలో:
సాధారణంగా మేషరాశి వారు సమాజంలో ఉన్నత స్థాయిలో ఉండాలని, గౌరవ ప్రతిష్టలు సంపాదించాలని ఎక్కువగా ఆరాటపడుతుంటారు. ఒక్క మాటలో చెప్పాలి అంటే ఒక సెలబ్రిటీ స్టేటస్ కావాలి అనుకుంటారు. అలానే వీరికి పట్టుదల ఎక్కువగా ఉంటుంది. వీరు అనుకున్నది సాధించే వరకూ నిద్రపోరు. ఆనలే వీరు ఎప్పుడు ఎనర్జిటిక్ గా ఉంటారు. కాబట్టి వీరు గాని క్రీడా సంబంధ వాటిలో గనుక ఉంటె అద్బుతంగా రాణిస్తారు. అంటే ఒక క్రీడాకారుడిగా ఉండటం. ఎందుకంటే వీరికి పైన చెప్పిన వాటితో పాటు, లీడర్షిప్ క్వాలిటీస్ ఎక్కువగా ఉండటం వల్ల. క్రీడా రంగంలో మీ టీం ని మీరు అద్బుతంగా ఆర్గనైజ్ చేయగలుగుతారు, మీ టీం ని విజయ దిశగా తీసుకువెళ్ళి, అద్బుత విజయాలను సాధించి, ఒక వెలుగు వెలుగుతారు. అలానే వీరు ఇదే కోవకు చెందిన ఇతర ఏ వృత్తుల లోనైనా అద్బుతంగా రాణిస్తారు. ఈ కోవకు చెందిన ఇతర వృత్తులు అంటే ఉదాహరణకు బాడీ బిల్దర్, జిమ్ కోచ్, వంటి ఏ అనుబంధ రంగం లోనైనా వీరు అద్బుతంగా రాణించ గలుగుతారు.
ఇక రెండవది బ్రెయిన్ సర్జన్:
మేష రాశి వారు నిర్ణయం తీసుకున్నంత త్వరగా మరెవరూ నిర్ణయం తీసుకోలేరు అంటే అతిశయోక్తి కాదు. వీరు ఏ నిర్ణయమైన క్షణాల్లో తీసుకుని, ఏ సమస్య అయిన చాలా తెలివిగా, చాకచక్యంగా పరిష్కరించగలుగుతారు. కాబట్టి వీరికి అద్బుతంగా సూట్ అయ్యే మరొక రంగంగా వైద్య వృత్తిని సూచించవచ్చు. వీరు చేసే ప్రతీ పనీ, పూర్తి అనుభవం, నైపుణ్యంతో చేయడం ఈ రాశి వారి ప్రత్యేకత. అలానే వీరు చాలెంజింగ్ వర్క్ అంటే చాలా ఇష్టపడతారు. కాబట్టి వీరికి బ్రెయిన్ సర్జన్ వ్రుత్తి అద్బుతంగా సూట్ అవుతుంది. ఎందుకంటే మానవ శరీరంలో అతి ముఖ్యమైన భాగం బ్రెయిన్. అలానే ఏదైనా ఒక వైద్య సంబంధ విషయం మీరు గమనించినట్లయితే ఒక రోగి మరొక రోగికి పూర్తి భిన్నంగా ఉంటాడు. ఈ వ్యత్యాసం ఇద్దరు రోగులు ఒకే విధమైన వ్యాధితో బాధపడేవారు అయినా కూడా ఉంటుంది. దీనికి అనేక కారణాలు ఉండవచ్చు. ఉదాహరణకు ఈ ఇద్దరిలోని ఒకరికి లేదా ఇదారికి ఈ వ్యాధితో పాటు ఇతర వ్యాధులు ఉండవచ్చు లేదంటే వారి వయస్సు గాని, మనస్తత్వం కాని వేరుగా ఉండవచ్చు. కాబట్టి ఒక రోగిని డీల్ చేసినట్టుగా ప్రతీ రోగిని డీల్ చేయడం అశంభవం. ఎందుకంటే అందరూ ఒకేలా ఉండరు. కాబట్టి వీరు అప్పటికప్పుడు నిర్ణయాలు తీసుకోవాల్సిన పరిస్థితులు అధికంగా ఉంటాయి. అలానే వీరు తీసుకునే నిర్ణయాలు కూడా చాలా జాగ్రత్తతో, తెలివిగా తీసుకోవాలి. ఈ విషయంలో వీరు నిశ్రేష్టులు కాబట్టి వీరికి వైద్య వ్రుత్తి అద్బుతంగా సూట్ అవుతుంది. అలానే దిని అనుబంధ వృత్తులు కూడా వీరికి బాగా కలసి వస్తాయి అంటే నర్సుగా, మానసిక వైద్యులుగా ఉండటం వంటి మొదలగు వృత్తులు వీరికి బాగా కలసి వస్తాయి.
ఇక మూడవది అన్త్రపోలోజిస్ట్ అంటే సామాజిక శాస్త్రవేత్త:
మనం నిత్యం చూస్తుంటాం ఏదైనా ఒక సమస్య ఏర్పడితే దానికి కారణం అయిన వారిని వారు ఎంత పెద్ద హోదాలో ఉన్నా కూడా లెక్క చేయకుండా ధైర్యంగా కొంత మంది ఎదిరించటం వారు చేసిన తప్పులను భయం లేకుండా సాక్ష్యాలతో సహా బయటపెట్టి నష్టపోయిన వారికి సహాయం చేయడం వంటివి చేస్తుంటారు. అలానే మనం నిత్యం చదివే వార్తలు, క్రైమ్ న్యూస్, వంటివి ఎంతో లోతుగా వాటిపై రిసెర్చ్ చేసి మనకు అందిస్తారు. వీరు చేసే ప్రతీ కామెంట్ వెనుకా ఒక ఆధారం ఉంటుంది. కాబట్టి ఈ వృత్తులను చాలా కటినతరమైన వ్రుత్తులుగా కూడా చెప్పవచ్చు. ఎందుకంటే ఇవి చేయాలి అంటే ధైర్య సాహసాలతో పాటు లోతుగా అధ్యయనం చేయగల సమర్ధత, మరియు వాటిని క్షుణ్ణంగా పరిశిలించి విశ్లేషించే నైపుణ్యం, తెలివి కూడా ఉండాలి. సరిగ్గా ఇలాంటి లక్షణాలే మేష రాశి వారికి ఉంటాయి. మేష రాశి వారు చాలా ధైర్య వంతులు, ఎవరికీ బయపడరు. వీరికి సాహస నిర్నయాలన్నా, సాహసోపేతమైన పనులన్నా చాలా ఆశక్తి అలానే వీరికి రిస్క్ తీసుకోవడం అంటే చాలా ఇంట్రెస్ట్. వీరు అనుకుంటారూ రిస్క్ తీసుకోకపోతే లైఫ్ లో ఎంటర్ టైన్న్మెంట్(entertainment) ఎం ఉండదు అని. కాబట్టి వీరికి ఈ రంగం అద్బుతంగా సూట్ అవుతుంది. అలానే దీని అనుబంధ రంగాలు అయిన ఫోటో గ్రఫి, రిపోర్టర్, వంటి రంగాలు కూడా బాగా సూట్ అవతాయి.
ఇక నాలుగవది వ్యాపారం:
వ్యాపారం చేయడం అంటే అంత సులభం కాదు. దానికి ఎంతో తెలివి, నైపుణ్యం, ఓర్పు, రిస్క్ తీసుకునే ధైర్యం వంటి అనేక క్వాలిటీస్ ఉండాలి. వ్యాపారం మొదలు పెట్టిన దగ్గరనుండి ప్రోడక్ట్ మార్కెట్ లో రిలీస్ చేసే వరకూ ఎంతో శ్రమ దాగి ఉంటుంది. వ్యాపారాన్ని మొదలు పెట్టడానికి అనేక కారణాలు ఉంటాయి. నిజానికి ఇప్పటి వరకూ ఉన్న వ్యాపారాలు అన్నీ కూడా మనం పడే సమస్యలను పరిష్కరించే వాటిగానే ఉన్నాయి. ఉదాహరణకు ఈ మధ్యనే వచ్చిన జియో నుండి ఎప్పటి నుండో మార్కెట్ లో ఉన్న సబ్బులు ఇతర ప్రొడక్ట్స్ అన్నీ కూడా ఏదోఓక సమస్యను పరిష్కరించేవిగానే ఉన్నాయి. ఉదాహరణకు మన దేశంలో ఇంటర్నెట్ అందరికీ అందుబాటు ధరలలో లేని సమయంలో జియో అత్యంత చవక ఇంటర్నెట్ సదుపాయాన్ని తీసుకువచ్చి దానికి అనుసంధానంగా ఇతర యాప్ లు లాంచ్ చేసి ఒకపక్క వినియోగదారుని సమస్యను పరిష్కరించటం తో పాటు మరొక పక్క వారి వ్యాపారాలను అద్బుతంగా సాగిస్తున్నారు. ఇలాంటి మంచి ఐడియాస్ తో ఒక మంచి వ్యాపారం పెట్టి ఎన్ని ఒడిదుడుకులు ఎదురయినా తట్టుకుని వ్యాపారాన్ని విజయ పదంలో నడిపించే సామర్ధ్యం ఈ రాశి వారికి మెండుగా ఉంటుంది. కాబట్టి వీరు వ్యాపారానికి అద్బుతంగా సూట్ అవుతారు. ఎందుకంటే వీరు నిర్ణయాలు తీసుకునే విధానం, సమస్యలను అడ్రస్ చేసే ధైర్యం, ఏ విషయాన్నైనా లోతుగా విశ్లేషించి క్షుణ్ణంగా పరిసిలించే వీరి తత్వం. అన్నిటికంటే ముఖ్యంగా ప్రతీ సమస్యని పరిష్కరించే ధైర్య సాహసాలు కలిగిఉండటం. ఎలాంటి ఇబ్బందులు ఎదురయినా చేపట్టిన పనిని వదలకుండా విజయవంతంగా పూర్తి చేయడం వంటి లక్షణాలు వీరికి వ్యాపారం అద్బుతంగా సూట్ అయ్యేలా చేస్తాయి. అలానే వీరు అద్బుత విజయాలను కూడా ఈ రంగంలో దక్కించుకుని ఉన్నత స్థానాన్ని చేరుకుంటారు. ఎంతో మందికి ఆదర్శంగా నిలుస్తారు.
ఇక అయిదవది పోలిస్ మరియు మిలిటరీ రంగం అంటే రక్షణ లేదా భద్రతా రంగం:
మిలిటరీ మరియు పోలిస్ రంగం అంటే ధైర్య సాహసాలకు పెట్టింది పేరుగా ఉంటుంది. అయితే ఇక్కడ కూడా వీరు ఒక సమస్యను పరిష్కరించే దిశగానే ప్రయత్నిస్తారు. అలానే ఆ సమస్యను పరిష్కరించేటప్పుడు చాలా జాగ్రత్త ఓపిక నైపుణ్యం అవసరం. ఇక్కడ ఏ మాత్రం తప్పు జరిగినా అన్యాయంగా ఒక నిర్దోషి బలి కావాల్సిన పరిస్థితి రావచ్చు. కావున వీరు చేసే పని సహస నిర్ణయాలతో పాటు చాలా తెలివిగా సమస్యను పరిష్కరించేవిగా ఉంటాయి. కాబట్టి మేష రాశి వారికి వారి లక్షణాల ఆధారంగా అద్బుతంగా సూట్ అయ్యే మరొక రంగంగా ఈ పోలిస్ మరియు మిలిటరీ రంగాన్ని చెప్పుకోవచ్చు. అలానే దిని అనుబంధ రంగంలో కూడా వీరు అద్బుతంగా రాణిస్తారు. అంటే ఉదాహరణకు డిటెక్టివ్, క్రైమ్ ఇన్వెస్టిగేటర్ వంటి వృత్తులు.
ఇక ఆరవది స్టాక్ మార్కెట్:
స్టాక్ మార్కెట్ లో ఎప్పుడు ఏ షేర్ ఎంత పెరుగుతుందో, ఎంత తగ్గుతుందో చెప్పాలి అంటే దానికి ఎంతో రిసేచ్ తో కూడిన ఏనాలసిస్ ఉండాలి. నిజానికి చాలా మంది ప్రతీ రోజూ ఈ షేర్ అంత పెరుగుతుంది లేదా ఈ షేర్ అంత తగ్గుతుంది అని సూచిస్తుంటారు. అలానే చాలా మంది చెప్పినవి అలానే జరుగుతుంటాయి. దానికి కారణం వారు ఆ కంపెని గురించి, దాని చరిత్ర మరియు ప్రస్తుత పరిస్థితి వంటి మొదలగు విషయాలు క్షుణ్ణంగా పరిశిలించి గతంలో ఆ షేర్ ఎలా ట్రేడ్ అయ్యిందో వంటి వాటిని పరిగినలోకి తీసుకుని వారి నైపుణ్యాన్ని, తెలివిని ఉపయోగించి అద్బుతంగా స్పెక్యులేట్ చేస్తుంటారు. నిజానికి కొంత మంది చెప్పినవి అలా జరుగుతాయి కూడా. దానికి కారణం వారికి ఉండే రిసేచ్ స్కిల్స్స్ మరియు భవిష్యత్తును ఉహించి సరైన నిర్ణయాలు తీసుకునే తత్వం. కాబట్టి ఇలాంటి లక్షణాలు ఉన్న మేషరాశి వారికి ఇదొక అద్బుత రంగంగా చెప్పుకోవచ్చు. అలానే ఇంతకు ముందు చెప్పినట్టుగా వీరు ఈ షేర్ మార్కెట్ నే వ్యాపారంగా కూడా మలచుకోవచ్చు. అంటే ఇందులో పెట్టుబడి పెట్టి అద్బుత లాభాలను అందుకోవచ్చు. అయితే ఇది అనుభవజ్ఞులకు మరియు దానిలో పూర్తి పరిజ్ఞానం ఉన్న వారికి అద్బుతంగా కలసి వస్తుంది. అలానే కొట్టగా కెరీర్ ప్రారంభించాలి అనుకునే వారికి ఇది చాలా బాగా సూట్ అయ్యే రంగంగా చెప్పవచ్చు.
ఏడవది ఫైర్ ఫైటర్:
ఎప్పుడైనా ఏదైనా ఒక ప్రమాదం జరిగితే అక్కడకు చేరుకొని మంటలను అదుపు చేయడం, ప్రజల ప్రాణాలను రక్షించటం వంటివి వీరు చేస్తుంటారు. వీరు చేసే ఈ పనిలో సాధారణంగా వీరు నిర్ణయాలు తీసుకోవడానికి ఎక్కువ సమయం ఉండదు. అలానే వీరు చేసే ప్రతీ పని చాలా ధైర్య సాహసాలతో కూడుకున్నది అయి ఉంటుంది. ఎందుకంటే వీరు భయపడినా నిర్ణయం తీసుకోవడం ఆలస్యం అయినా ఎంతో మంది ప్రాణాలు గాల్లో కలసిపోయే అవకాశం ఉంటుంది. అదే సమయంలో వీరు అక్కడ ఉన్న ప్రజలకు అనేక విధాలుగా సహాయాలు చేయాల్సిన పరిస్థతి వస్తుంది. కొన్ని సందర్బాలలో వారికి తిండి పెట్టడం, నష్ట పోయిన వారిని ఒదార్చటం, వారికీ తగిన సహాయం చేయటం వంటివి వీరు చేస్తుంటారు. కాబట్టి ధైర్య సాహసాలు కలిగిన మేష రాశి వారికి ఈ రంగం ఎంతో బాగా సూట్ అవుతుంది. ఎందుకంటే వీరు నిర్ణయాలు తీసుకోవడంలో దిట్ట మాత్రమే కాకుండా ఇతరులకు సహాయం చేయడానికి కూడా ఎప్పుడూ వెనకాడరు. కాబట్టి ఈ రంగంలో వీరు అద్బుతంగా రాణిస్తారు.
ఇక ఎనిమిదవది నిర్మాత:
ఇక్కడ నిర్మాత అంటే కేవలం సినిమాలు తీసేవారే అని అర్ధం కాదు. మ్యూజిక్ అయినా, డాన్స్ అయినా, షార్ట్ ఫిలిమ్స్ అయినా అలానే ఒక రేడియో అయినా కాని వీరు ఆర్గనైజ్ చేయవచ్చు. ఎందుకంటే వీరికి ఆర్గనైజింగ్ స్కిల్ల్స్ అధికంగా ఉంటాయి. కాబట్టి వీరికి ఈ రంగం కూడా అద్బుతంగా సూట్ అవుతుంది.
తొమ్మిదవది ఎమర్జెన్సీ రంగం:
ఈ రంగం ఏదైనా కావచ్చు వైద్య రంగం, లేదా ఏదైనా ఇతర ఎమర్జెన్సీ టేక్నిశియన్ గా వీరు చేయవచ్చు. ఎమర్జెన్సీ అనగానే అప్పటికప్పుడు ఎలాంటి అలస్యం లేకుండా తగిన సేవ అందించటం. రంగం ఏదైనా ఇది ముఖ్యం. ఉదాహరణకు వైద్య రంగమే అనుకుందాం. ఒక పేషెంట్ కి ఎమర్జెన్సీ ట్రీట్మెంట్ అందిచాల్సిన పరిస్థితి వస్తే కంగారు పడకుండా తెలివిగా ఏ మాత్ర వేయాలి లేదా ముందుగా ఏ ఇంజక్షన్ చేయాలి అనేది అలోచించి ఆ సమయంలో తగిన వైద్యం అందించగలగాలి. అంతే కాదు ఆ పేషెంట్ దగ్గరకి అంత త్వరగా చేరుకోవడం కూడా చాల ముఖ్యం. అంటే ఇక్కడ తన దగ్గరకి వెళ్ళటం, త్వరగా నిర్ణయాలు తీసుకోవడం, తగిన చికిత్స అందించి, వారి ప్రాణాలను కాపాడటం వంటివన్నీ కూడా అతి తక్కువ సమయంలో, ఎలాంటి తప్పు జరుగకుండా చేయాల్సిన పనులు. కాబట్టి ఇలాంటివాటిని సమర్ధవంతంగా నిర్వహించాలి అంటే అది మేష రాశి వారు మాత్రమే చేయగలుగుతారు అనడంలో ఎలాంటి సందేహం లేదు. కాబట్టి వీరికి ఈ రంగం అద్బుతంగా సూట్ అవుతుంది. ఎందుకంటే మీ వ్రుత్తి ధర్మాన్ని నిర్వహించటం తో పాటు ఎంతో మందికి సహాయం చేసినవారు కూడా అవుతారు. అది మీకు ఎంతో సంతృప్తిని ఇస్తుంది.
పదవది మెంటార్ గా ఉండటం:
మెంటార్ అంటే ఒక మార్గాన్ని చూపే వ్యక్తి. అంటే ఒక గైడెన్స్. ఏ పని ఎలా సక్రమంగా చేయాలో. ఎలా చేయడం ద్వారా ఆశించిన ఫలితాన్ని తక్కువ సమయంలో తక్కువ శ్రమ మరియు కర్చుతో అందుకోవచ్చో వంటి దిశా నిర్దేశాలు చేసే వారే మెంటార్ లు. ఈ పదాన్ని మనం తరచూ స్టార్ట్ అప్స్ లోనూ, కళా రంగంలోనూ వింటూ ఉంటాం. అయితే మేష రాశి వారు వారికి ఉండే తెలివి, సమస్యను పరిష్కరించే నైపుణ్యం, అన్ని కోణాల్లో ఆలోచించే శైలి, నిర్ణయాలు తీసుకునే విధానం చాలా అద్బుతంగా ఉంటుంది. కావున వీరు మరొకరికి మెంటార్ గా ఉండి దిశా నిర్దేశం చేయడం ద్వారా వీరికి సంతృప్తి తో పాటు మరొకరికి సహాయం చేసి, వారికి స్పూర్తిగా ఉండే అవకాశం కూడా ఉంటుంది. అలానే ఈ రంగంలో వీరు ఆర్ధికంగా కూడా మంచి రాణింపు కలిగి ఉంటారు.
అలానే మరొక వీడియో లో మీరు ఎలాంటి వ్యాపారాలను చేయడం ద్వారా అద్బుతంగా కలసి వస్తుంది అనే విషయాలను కూడా తెలుసుకుందాం. అలానే ఈ రాశి వారు లక్ష్మీ దేవి అనుగ్రహం కోసం పటించాల్సిన మంత్రాలూ, సమస్త దోష నివారణార్ధం చేయాల్సిన పరిహారాలు, జపించాల్సిన మంత్రాలూ వంటి అనేక విషయాలు అతి త్వరలోనే తెలుసుకుందాం. అయితే వాటిని మీరు మిస్ అవకుండా ఉండాలి అంటే వెంటనే మీరు మన youtube ఛానల్ ను సబ్స్క్రయిబ్ చెసుకుని పక్కనే ఉన్న బెల్ సింబల్ ను ప్రెస్ చేయండి. తద్వారా మీకు నోటిఫికేషన్ రూపంలో అప్డేట్స్ వస్తాయి. జై హింద్.
Comments
Post a Comment
ఇక్కడ మీ కామెంట్ రాయండి