రాశి ఫలాలు - మంగళవారం- 09-06-2020. గ్రహగతులను అనుసరించి మీకు ఈ రోజు ఎలా ఉండబోతుంది ? Daily Horoscope in Telugu - Astrology


మేష రాశి: పట్టుదలతో చేపట్టిన పనులు పూర్తి చేస్తారు. అయితే, పనులలో జాప్యం జరిగే అవకాశం ఉంది కావున జాగ్రత్త వహించాలి. అకారణ కలహా సూచనలు ఉన్నాయి. కావున మాట్లాడేటపుడు జాగ్రత్త అవసరం. 

వృషభ రాశి: ఈ రోజు వీరికి బాగుంది. బందుమిత్రుల సహాయ సహకారాలు అందుకుంటారు. సమయానికి పనులు పూర్తి అవుతాయి, ధనం అందుతుంది. ఒత్తిడి తగ్గి, మానసిక ఆనందాన్ని పొందగలుగుతారు(ప్రశాంతత లభిస్తుంది). 

మిథున రాశి: నమ్మినవారు మోసం చేసే అవకాశం ఉంది. జాగ్రత్త అవసరం. ఉహించని సంఘటనలు మీ మానసిక ప్రశాంతతను దెబ్బతీస్తాయి. అనుకోని కర్చులు సూచిస్తున్నాయి. 

కర్కాటక రాశి: అంతర్గత శత్రు వర్గ పూరు ఒకింత ఇబ్బంది కలిగించినా, ఆత్మస్థైర్యంతో మీరు తీసుకునే నిర్ణయాలు సత్ఫలితాలను ఇస్తాయి. చిరకాల స్వప్నం నెరవేరే శుభ తరుణం. 

సింహ రాశి: చేసే పనులలో ఆటంకాలు వస్తాయి, గణపతిని పూజించటం ద్వారా వాటిని అధికమించోచ్చు. అయితే ప్రతీ పనిలోనూ మీకు మీరు నమ్ముకున్నవారు అండాదండగా ఉంది. మీరు చేసే పనులు పూర్తి అయ్యేలా సహకరిస్తారు. అయితే మీకు ఉన్న ఒత్తిడి కారణంగా కొంత కోపం వచ్చే అవకాశం ఉంది. దానిని ఇతరుల మీద చూపించకపోవడం ఉత్తమం. 

కన్య రాశి: పనులు పూర్తి అయ్యే పద్ధతి చూసి మీకే ఆశ్చర్యం వేస్తుంది. ఇది నిజమా అని. అంత సులభంగా, ఉహించని విధంగా, అద్బుతంగా పనులు పూర్తి అయ్యి, మీరు ఆశించిన ఫలితాన్ని ఇస్తాయి. దీనికి మీకు నడుస్తున్న గ్రహస్తితే కారణం. శుభవార్తలు వినే అవకాశం ఉంది. మిత్రులతో సంభాషణ మానసిక ఉల్లాసాన్ని ఇస్తుంది. అంతా శుభమే. 

తులా రాశి: ఈ రోజు మంచి రోజుగా చెప్పవచ్చు. పనిలో అద్బుత ప్రతిభను కనబరుస్తారు. అధికారుల మన్ననలు అందుకుంటారు. ఇంటా బయటా అనుకూలం. గౌరవ మర్యాదలు పెరుగుతాయి. అయితే కొద్దిపాటి విబేదాలు వచ్చే అవకాశం ఉంది. కావున మాట్లాడేటపుడు ఆచి తూచి మాట్లాడాలి. 

వృశ్చిక రాశి: వ్యాపారాలు ఉహించని రీతిలో అభివృద్ధి బాటలో నడుస్తాయి. నూతన ఆదాయ మార్గాలు ఏర్పరచు కోవటానికి మీరు చేసే ప్రయత్నాలు ఫలిస్తాయి. ప్రతీ పనిలో లేదా నిర్ణయాలు తీసుకునేతపుడు నేర్పుతో బుద్దిబలంతో నిర్ణయాలు తీసుకోవాలి. వ్యవహార జయం ఉంది. ఆశించిన ఫలితాలు అందుకుంటారు. 

ధనుస్సు రాశి: మంచి సూచిస్తుంది. మీరు చేసే ప్రతీ పనిలో కుటుంబ సభ్యుల సహాయ సహకారాలు ఉంటాయి. కార్య జయం ఉంది. ఆశించిన ఫలితాలకు చేరువ అవుతారు. మాట్లాడేటపుడు జాగ్రత్త అవసరం. అకారణంగా విబేదాలు వచ్చే అవకాశం ఉంది. అంతా శుభమే. 

మకర రాశి: ఎంతో కాలంగా మీరు పడే శ్రమకు ఇకనుండి శుభ ఫలితాలు రాబోతున్నాయి. ఇక మీకు తెలియని దానిలో ఇతరుల సహాయం మీకు అందటం, ఆ పని పూర్తి అయ్యి ఆశించిన ఫలితం ఇవ్వటం. మీ సంతోషానికి అవధులు లేకుండా చేస్తుంది. సమయానికి ధనం చేతికి అందుతుంది. మంచి రోజు. కార్య జయం ఉంది. 

కుంభ రాశి: ప్రతీ పనిలో ఒకింత అడ్డులు ఆటంకాలు వచ్చే అవకాశం ఉంది. అయితే నేర్పుతో వాటిని అధికమించాలి. గతంలో స్తంభించుకు పోయిన ఒకపని ఉహించని రీతిలో ఇప్పుడు ముందుకు నడుస్తుంది. అధిమికు ఆనందాన్ని ఇస్తుంది. శుభవార్తలు వినే అవకాశం ఉంది. 

మీన రాశి: ప్రస్తుతం మీకు మంచి సమయం నడుస్తుంది. మానసిక ఉల్లాసాన్ని పొందగలుగుతారు. కుటుంబ సభ్యులతో సమయాన్ని కేటాయిస్తారు. సమయానికి ధనం చేతికి అందుతుంది. మీ తెలివితేటలతో పనులు సునాయసంగా పూర్తి చేసి, అందరి మన్ననలూ పొంతుతారు. మంచి కాలం నడుస్తుంది. అంతా శుభమే. 

ప్రతీ రోజు రాశిఫలాలు పొందటానికి టెలిగ్రామ్ లోని మన ఛానల్ ను క్రింది లింక్ క్లిక్ చేసి ఫాలో ఆవ్వండి. https://t.me/HinduDharmamVardhillaliChannel

జై హింద్ 

Comments