రాశి ఫలాలు - శుక్రవారం- 05-06-2020. గ్రహగతులను అనుసరించి మీకు ఈ రోజు ఎలా ఉండబోతుంది ? Daily Horoscope in Telugu - Astrology

మేష రాశి
గతంలో మీరు చేసిన కొన్ని ఇట్లు వల్ల ఈరోజు ఇబ్బందులు ఎదుర్కోవాల్సి వస్తుంది కొన్ని సంఘటనల వల్ల ఒత్తిడి అధికంగా ఉంటుంది నిర్ణయాలు తీసుకోవడంలో కన్ఫ్యూజన్ ఏర్పడుతుంది ఆర్థికపరమైన విషయాలు సానుకూల పడతాయి ఎవరి దగ్గర నుండి అయినా అప్పు గురించి ప్రయత్నిస్తుంటే ఈ రోజు మీకు ధనం అందుతుంది బ్యాంకు లోన్ లు వంటి వాటి ద్వారా మీకు ధనం లభిస్తుంది పిల్లాపాపలతో సమయాన్ని సరదాగా గడుపుతారు ఇది మీకు మానసిక సంతోషాన్ని కలిగిస్తుంది ప్రేమ వ్యవహారాలకు కాలం అనుకూలంగా ఉంది వ్యవహార జయం ఉంది కళాకారులకు ప్రశంసలు లభిస్తాయి అభినందనలు అందుకుంటారు మీ శ్రమకు తగిన గుర్తింపు లభిస్తుంది ఈ రోజు మీకు బాగానే ఉంది
వృషభ రాశి
ఆరోగ్యం మెరుగుపడుతుంది అందర్నీ గుడ్డిగా నమ్మకూడదు కొంతమంది మిమ్మల్ని మోసం చెయ్యాలి అని ప్రయత్నిస్తారు కాబట్టి జాగ్రత్తగా ఉండాలి మరీ ముఖ్యంగా ఆర్థికపరమైన విషయాలలో తగు జాగ్రత్త అవసరం లేనిపోని ఖర్చులు తగ్గించుకోవాలి లేకపోతే ఇది మీ ఆర్థిక పరిస్థితి ని దిగజారుస్తుంది కుటుంబంలో కొద్దిపాటి తగాదాలు ఏర్పడే అవకాశం ఉంది ముఖ్యంగా మీ సంతానంతో. స్నేహితులతో కలిసి ఈ సమయాన్ని సరదాగా గడుపుతారు ఆశించిన ఫలితాలను అందుకుంటారు వ్యాపారపరంగా బాగుంది
మిధున రాశి
మీరు చేసే పనులు ఇతరులకు స్ఫూర్తిదాయకంగా ఉంటాయి సమాజంలో గౌరవ మర్యాదలు ఏర్పడతాయి మీ పలుకుబడి మరింతగా పెరుగుతుంది ఇతరులకు సహాయం చేయాలి అనే మీ నేచర్ ప్రశంసించే తగినది మీ సహాయం కోరి వచ్చిన వారికి కాదనకుండా సహాయం చేస్తారు అది మీ మంచితనానికి నిదర్శనం మీలాగే మీ చుట్టూ ఉండే వారిని కూడా చాలా సంతోషంగా ఉండగలుగుతారూ. ఆర్థికపరమైన విషయాలలో కొన్ని కీలక నిర్ణయాలు తీసుకుంటారు అంటే అవి నూతన పెట్టుబడులకు సంబంధించినవి కానీ పొదుపు లేదా మదుపు వంటి వాటికి సంబంధించిన గాని అయ్యి ఉండవచ్చు గతంలో ఆగిపోయిన పనులను పున ప్రారంభించేందుకు ప్రయత్నిస్తారు దంపతుల మధ్య అన్యోన్యత పెరుగుతుంది వృత్తి ఉద్యోగ పరంగా నూతన అభివృద్ధిని చూడగలుగుతారు ఈరోజు మీకు బాగానే ఉంది
కర్కాటక రాశి
ఈరోజు మీరు ప్రతి చిన్న విషయానికి కోప్పడతారు చాలా చిరాకుగా ఉంటుంది కోపం ఒత్తిడి అధికంగా ఉంటుంది మానసిక ప్రశాంతత లోపిస్తుంది లేనిపోని ఖర్చులను అదుపులో ఉంచుకోవాలి లేకపోతే ఆర్థికపరమైన ఇబ్బందులు ఎదురవుతాయి పని ఒత్తిడి అధికంగా ఉంటుంది అయితే కుటుంబ సభ్యులు స్నేహితులతో కలిసి సరదాగా ఉండటం ద్వారా ఒత్తిడిని తగ్గించుకో గలుగుతారు మధ్యాహ్నం నుంచే అన్నీ సర్దుకుంటాయి వృత్తి ఉద్యోగ పరంగా అద్భుతంగా ఉండబోతుంది ఎంతో కాలంగా మిమ్మల్ని వేధిస్తున్న పనులన్నీ కూడా ఒక కొలిక్కి వస్తాయి మీ మాట తీరు అద్భుతంగా ఉండబోతుంది ఈరోజు మీకు బాగానే ఉంది
సింహరాశి
ఈరోజు చాలా ప్రశాంతంగా ఉంటారు ఖర్చులు కొద్దిగా అధికంగా ఉంటాయి అవి ఆరోగ్య పరమైన విషయాలు గురించి అయి ఉంటాయి అంటే మందుల ఖర్చు నిమిత్తం లేదా వైద్యం నిమిత్తం అయి ఉండవచ్చు మీరు చెయ్యు ప్రతి పనియందు మీ బంధు వర్గం వారి సహాయ సహకారాలు ఉండటం చే పనులు మరింత త్వరగా పూర్తవుతాయి నూతన బంధాలు ఏర్పడే అవకాశం ఉంది అవివాహితులకు వివాహ యోగం ఉంది నూతన ఉద్యోగ యోగం ఉంది కెరీర్ పరంగా కొంత అభివృద్ధిని చూస్తారు మీరు చెయ్యి వృత్తి ఉద్యోగ పరంగా అద్భుత విజయాలను అందుకుంటారు వ్యాపారాలు లాభసాటిగా నడుస్తాయి ఇంటా బయట పూర్తి అనుకూలత ఏర్పడుతుంది అన్నిటా మీదే పైచేయి అవుతుంది ఈ రోజు మీకు చాలా బాగుంది
కన్య రాశి
ఈరోజు మీ అశ్రద్ధ వల్ల కొద్దిపాటి గాయాలు ఏర్పడే అవకాశం ఉంది కాబట్టి చాలా జాగ్రత్తగా ఉండాలి ప్రతి పనిని శ్రద్ధగా జాగ్రత్తగా చేయాలి ఖర్చులు అధికంగా ఉండబోతున్నాయి ముఖ్యంగా సంతానం విషయంలో ఊహించని విధంగా ఖర్చులు వస్తాయి కుటుంబంలో అంత సంతోషం ఉండదు అశాంతి ఏర్పడుతుంది లోపల ఎన్ని బాధలు ఉన్నా కూడా పైకి మాత్రం నవ్వుతూ ఉంటారు నూతన వ్యాపార నిర్ణయాలు తీసుకునే ముందు ఒకటికి రెండుసార్లు ఆలోచించి అన్ని విషయాలు లోతుగా పరిశీలించిన పిమ్మటే ముందుకు వెళ్లాలి. మీ జీవిత భాగస్వామితో కలిసి బయటకు వెళ్లే అవకాశం ఉంది అది షాపింగ్ నిమిత్తం కావచ్చు లేక ఇతర నిమిత్తం కావచ్చు ఏదేమైనా ఈ రోజు మీకు మిశ్రమ ఫలితాలను గ్రహస్థితి సూచిస్తుంది అయితే ఆరోగ్య విషయంలో జాగ్రత్త అవసరం.
తులారాశి
భాగస్వామ్య వ్యాపారాలు ద్వారా నష్టం ఎదురయ్యే అవకాశం ఉంది కొద్దిపాటి మానసిక ఆందోళన ఏర్పడుతుంది ఈ విషయాల్లో చాలా జాగ్రత్త అవసరం తెలియకుండా ఎందులోనూ పెట్టుబడులు పెట్టరాదు ఈరోజు ఒక కీలక విషయం మీకు తెలుస్తుంది మీరు చేసే ప్రతి పనికి ఇతరులు సహాయం ఉంటుంది తద్వారా పనులు సకాలంలో పూర్తి అయ్యి మీరు ఆశించిన ఫలితాలు అందుకోగలుగుతారు ఏదైనా చెయ్యాలి అనే ఆలోచన చేస్తారు భవిష్యత్తుకు సంబంధించి కొన్ని ప్రణాళికలు చేస్తారు వాటిని అమలు చేసే దిశగా ప్రయత్నాలు కూడా ఉంటాయి అయితే ప్రస్తుతం చేసే పనులన్నీ కూడా చాలా నెమ్మదిగా మందకొడిగా ముందుకు సాగుతాయి మీకు ఎన్ని కష్టాలు ఉన్నా కూడా మీ జీవిత భాగస్వామిని చూసేసరికి ఆ కష్టాలన్నీ మాయమై సంతోషం ఏర్పడుతుంది అంతటి అన్యోన్యత మీ భార్య భర్తల మధ్య ఏర్పడుతుంది
వృశ్చిక రాశి
ఏ పనినైనా చాలా ఆత్మస్థైర్యం తో చేస్తారు చేపట్టిన పనులు సకాలంలో పూర్తి అయ్యి మీరు ఆశించిన ఫలితాలను ఇస్తాయి మీ మొండితనంతో మీరనుకున్న లక్ష్యాన్ని చేయగలుగుతారు గతం కంటే మెరుగ్గా ప్రస్తుత పరిస్థితి లు ఉండబోతున్నాయి జీవితం మరింత మెరుగ్గా ఉండబోతుంది అనడానికి ఇదే నిదర్శనంగా నిలుస్తుంది ఖర్చులు ఎంత తగ్గించుకోవాలి అనుకున్నా కానీ ఏదో ఒక రూపంలో ఖర్చులు వస్తూనే ఉంటాయి అది మీకు ఆర్థిక పరమైన ఇబ్బందులను క్రియేట్ చేస్తుంది ఇతరులు మిమ్మల్ని విమర్శించే అవకాశం ఉంది అయితే అటువంటి వారిని పట్టించుకోవడం మీ సమయాన్ని వృధా చేసుకోవడమే అని మీరు భావిస్తారు నూతన అలవాట్లను ఏర్పరచుకుంటారు ప్రేమికులకు అంత అనుకూల సమయం కాదు ఇద్దరి మధ్య కొద్దిపాటి విభేదం ఏర్పడే అవకాశం ఉంది వృత్తి ఉద్యోగ పరంగా చాలా అనుకూలంగా ఉంది దూర ప్రయాణాలు చేసే అవకాశం కూడా ఉంది అయితే ఈ ప్రయోజనాలు మీకు చాలా బాగా కలిసి వస్తాయి ఆశించిన ఫలితాలు అందుకుంటారు ఈరోజు మీకు బాగానే ఉంది
ధనుస్సు రాశి
మెరుగుపడుతుంది ఆర్థికంగా బాగుంది రాబడి పెరుగుతుంది మీకు ఎవరైనా ధనం ఇవ్వవలసి ఉంటే ఈరోజు మీకు ఆ ధనం అందే అవకాశం ఉంది. ఆధ్యాత్మిక చింతన ఏర్పడుతుంది దైవ దర్శనాలు దానధర్మాలు చేసే అవకాశం ఉంది మానసిక ప్రశాంతత ఏర్పడుతుంది గతంలో మీ జీవిత భాగస్వామితో ఏర్పడిన మనస్పర్ధల ను తొలగించే విధంగా మీ ప్రయత్నాలు ఉంటాయి ఎంతో కాలంగా మీరు అనుకున్న పని ఇప్పుడు పూర్తి అవుతుంది మీ గమ్యాన్ని మీరు చేరుకునే దిశగా ప్రయత్నాలు ఉంటాయి దంపతుల మధ్య అన్యోన్యత పెరుగుతుంది ఈరోజు మీకు బాగుంది
మకర రాశి
ఈ రోజు మీకు చాలా అనుకూలంగా ఉండబోతుంది భవిష్యత్ అంతా మీదే అని నమ్మకం ఏర్పడుతుంది మీ కలలను నెరవేర్చుకునే దిశగా ప్రయత్నాలు ఉంటాయి నూతన పెట్టుబడులు పెట్టడానికి ఇది సరైన సమయం కాదు గతంలో ఎవరితోనైనా కొద్దిపాటి విభేదాలు ఉంటే అది ఈరోజు సమసిపోతాయి ప్రేమికులకు చాలా అనుకూలంగా ఉండబోతుంది ఇద్దరూ ఒకరినొకరు అర్థం చేసుకుని సంతోషంగా ఉంటారు మీరు చేసే పనులు వారికి చాలా సంతోషాన్ని ఇస్తాయి ఈ రోజు మీరు చాలా సంతోషంగా యాక్టివ్గా ఉంటారు మీ స్నేహితులతో కలసి సమయాన్ని సరదాగా గడుపుతారు ప్రయాణాలు చేసే అవకాశం ఉంది అన్నిటా మీదే పైచేయి అవుతుంది ఇతరులను నీ మాటలతో వశపరచుకుని విధంగా మీ మాట తీరు ఉంటుంది అంత అద్భుతంగా మీరు మాట్లాడగలుగుతున్నారు మీ శ్రమకు తగిన గుర్తింపు లభిస్తుంది సమస్యలన్నీ ఒక కొలిక్కి వస్తాయి జీవిత భాగస్వామితో చాలా సంతోషంగా ఉంటారు దంపతుల మధ్య అన్యోన్యత పెరుగుతుంది ఈరోజు మీకు చాలా బాగుంది
కుంభరాశి
ఒంటరితనాన్ని ఫీల్ అవుతారు మీ కుటుంబ సభ్యులతో కలిసి సమయాన్ని గడుపుతారు రాష్ట్ర సంబంధ విషయాలు కాస్త ఇబ్బంది పెట్టే పరిస్థితి ఏర్పడుతుంది లేనిపోని ఖర్చులు అధికంగా ఉంటాయి ముఖ్యంగా కోర్టు తగాదాలు వంటి వాటికి ఖర్చు చేసే అవకాశం ఉంది జీవిత భాగస్వామితో మీకున్న కొద్దిపాటి విభేదాలను సరి చేసుకునే విధంగా మీ ప్రయత్నాలు ఉంటాయి ప్రేమికులకు అంత అనుకూలం కాదు గతంలో ఆగిపోయిన పనులన్నీ కూడా ఇప్పుడు పున ప్రారంభం అవుతాయి దూర ప్రయాణాలు చేసే అవకాశం ఉంది విలువైన వస్తువులను చాలా జాగ్రత్తగా చూసుకోవాలి లేకపోతే అవి పోగొట్టుకొనే అవకాశం ఉంది. ఈరోజు మీకు బాగానే ఉంది.
మీన రాశి
ఎంతోకాలంగా మిమ్మల్ని ఇబ్బంది పెడుతున్నారు సమస్యలన్నీ కూడా ఒక కొలిక్కి వస్తాయి వాటి పరిష్కార దిశగా మీరు చేసే ప్రయత్నాలు ఫలిస్తాయి నూతన పరిచయాలు పెరుగుతాయి ఇది మీకు భవిష్యత్తులో ఎంతగానో ఉపయోగపడతాయి ఆర్థిక పరంగా సామాన్యంగా ఉండబోతుంది కుటుంబ సభ్యులతో సమయాన్ని గడుపుతారు మీ మనసుకు నచ్చిన వారిని గతంలో విడిపోయిన వారిని చూసే లేదా కలుసుకునే అవకాశం ఉంది వ్యాపార పరంగా చాలా బాగుంది వ్యాపారాలు విస్తరిస్తారు ఆగిపోయిన పనులు అన్నీ కూడా ఇప్పుడు పూర్తి అవుతాయి వృత్తి ఉద్యోగ పరంగా అనుకూలంగా ఉండబోతోంది దేవాలయ దర్శనం చేసుకునే అవకాశం ఉంది ప్రేమికులకు అనుకూలంగా ఉంది ఈరోజు మీకు బాగానే ఉంది
Comments
Post a Comment
ఇక్కడ మీ కామెంట్ రాయండి