రాశి ఫలాలు - గురువారం- 04-06-2020. గ్రహగతులను అనుసరించి మీకు ఈ రోజు ఎలా ఉండబోతుంది ? Daily Horoscope in Telugu - Astrology

మేష రాశి
ఈరోజు పనులలో జాప్యం ఏర్పడవచ్చు పనులు అతి కష్టం మీద కానీ పూర్తి అయ్యే అవకాశం లేదు శ్రమ అధికంగా ఉంటుంది చేపట్టిన పనులు సకాలంలో పూర్తి కాకుండా ఇబ్బందిపెడతాయి తద్వారా మీకు మానసిక ఒత్తిడి పెరుగుతుంది ఆర్థికపరమైన ఇబ్బందులు కూడా ఈరోజు అధికంగానే ఉండే అవకాశం ఉంది అయితే మీకున్న బంధువులు స్నేహితులు సహాయంతో ఆర్థిక పరిస్థితులను అధిగమించ గలుగుతారు వ్యాపారస్తులకు సామాన్యంగా ఉండబోతుంది మీ స్నేహితులను కలుసుకునే అవకాశం ఉంది ప్రయాణాలు చేస్తారు ప్రేమికుల మధ్య కాస్త ఎడబాటు ఏర్పడుతుంది ఒంటరితనాన్ని ఫీల్ అవుతారు ఉద్యోగ పరంగా అంత అనుకూలంగా లేదు మీ పై అధికారుల నుంచి ఒత్తిడి తప్పనిసరిగా ఉండే అవకాశం ఉంది ఆధ్యాత్మిక చింతన ఏర్పడుతుంది భక్తి భావాన్ని కలిగి ఉంటారు దాంపత్య జీవితం సాధారణంగా ఉండబోతుంది
వృషభ రాశి
నిరుత్సాహంగా నిరాశగా ఉంటారు ఎంత కష్టపడినా మీరనుకున్న లక్ష్యాన్ని చేరుకోలేక పోవడం దీనికి కారణమవుతుంది అయితే మీకు వచ్చే ఈ ఆటంకాలు అన్ని కూడా అశాశ్వత మణి మీకు అర్థమవుతుంది తద్వారా ఆత్మస్థైర్యం పెరుగుతుంది రాబడిని పెంచుకునే దిశగా మీ ప్రయత్నాలు ఉంటాయి అనేక ఆదాయ మార్గాలను సృష్టించుకోవాలి ఒకే ఆదాయ మార్గం మీద ఆధారపడకూడదు అనే ఆలోచన చేస్తారు ఆ దిశగా ప్రయత్నాలు కూడా చేస్తారు లేనిపోని ఖర్చులు అధికంగా ఉండబోతున్నాయి ప్రేమికులకు అంత అనుకూల సమయం కాదు వృత్తి ఉద్యోగ పరంగా చాలా అనుకూలంగా ఉండబోతుంది
మిథున రాశి
ఆరోగ్యాన్ని మెరుగు పరుచుకునే దిశగా మీరు చేసే ప్రయత్నాలు ఫలిస్తాయి గతం కంటే మెరుగ్గా ప్రస్తుత ఆరోగ్య పరిస్థితి ఉండబోతుంది సమయాన్ని వినోదానికి ఎక్కువగా ఖర్చు చేసే అవకాశం ఉంది శుభవార్తలు వింటారు ఆహ్వానాలు అందుతాయి మీ మనసుకు నచ్చిన వారితో సమయాన్ని వెచ్చిస్తారు చాలా సంతోషంగా ఉండగలుగుతారు ఈరోజు జరిగే కొన్ని సంఘటనలు మీ మానసిక ఆనందానికి కారణం అవుతాయి నూతన వ్యాపారాలు ప్రారంభించటానికి గా మీ ప్రయత్నాలు ఉంటాయి సమయాన్ని ఎక్కువగా గతంలో ఆగిపోయిన పనులను ప్రారంభించడానికి కేటాయించాల్సి వస్తుంది దాంపత్య జీవితం బాగుండ బోతుంది
కర్కాటక రాశి
ఈరోజు మీ మనసుకు నచ్చిన పనులను మాత్రమే చేయాలని అనుకుంటారు ఎవరేమి చెప్పినా మీరు అనుకున్నది మాత్రమే చేస్తారు ఎంతోకాలం తర్వాత కాస్త శ్రమ తగ్గుతుంది మానసిక ప్రశాంతత ఏర్పడుతుంది ఆర్థికపరమైన ఇబ్బందులు ఎన్ని ఉన్నా కానీ ప్రస్తుత గ్రహస్థితి ఆధారంగా చేసుకుని అవి మిమ్మల్ని అంతగా బాధ పెట్టేలా ఉండవు మీ జీవిత భాగస్వామితో గతంలో ఏవైనా కొద్దిపాటి మనస్పర్ధలు ఉంటే అవి ఈరోజు తొలగిపోయి చాలా అన్యోన్యంగా ఉండగలుగుతారు సభ్యులతో కలిసి బయటికి వెళ్లే అవకాశం ఉంది అది షాపింగ్ కానీ పార్కు పిక్నిక్ ఇలాంటివి కానీ అయి ఉండవచ్చు ఈరోజు జరిగే కొన్ని సంఘటనలు చిరకాలం గుర్తుండే విగా ఉంటాయి మీ అసలైన మిత్రులు ఎవరో ఈరోజు మీరు గుర్తించగలుగుతారు ఇన్ని రోజులు వారు మీకు సహాయం చేయడం వల్ల మీరు ఈ పరిస్థితుల్లో ఉన్నారని అర్థం చేసుకుని చాలా సంతోషంగా ఉంటారు అలాగే వారికి రుణపడి ఉంటారు ఈ కృతజ్ఞతాభావం మీరు వారికి కూడా మంచి చేసేలా చేస్తుంది తద్వారా మీ బంధం మరింత బలం అవుతుంది విద్యార్థులు చదువు కంటే ఎక్కువగా ప్రేమ వ్యవహారాలకు స్నేహితులకు ఇతర వినోదానికి ఏ సమయాన్ని ఎక్కువగా కేటాయిస్తారు దాంపత్యం జీవితం సుఖమయంగా ఉండబోతుంది
సింహరాశి
కంటే చాలా మెరుగ్గా మీ ఆరోగ్యం ఉంటుంది ఖర్చులు తగ్గించుకుని భవిష్యత్తు గురించి పొదుపు చేయాలి అనే ఆలోచన చేస్తారు ఈరోజు మీ కోపాన్ని ఒత్తిడిని అదుపులో ఉంచుకోవాలి ఎందుకంటే ఈరోజు అకారణ కలహ సూచనలు ప్రధానంగా సూచిస్తున్నాయి కాబట్టి ఇతరులతో మాట్లాడేటప్పుడు కాస్త జాగ్రత్తగా ఉండాలి కోపాన్ని ఒత్తిడిని అదుపులో ఉంచుకోవడం చాలా ముఖ్యమైనది ఎందుకంటే చేతులు కాల్చుకున్న ఆకులు పట్టుకోవడం వృధా ప్రయత్నం మీకు లకు అనుకూలంగా దీన్ని చెప్పుకోవచ్చు ప్రియమైన వారితో సమయాన్ని సంతోషంగా గడుపుతారు దంపతుల మధ్య కొద్దిపాటి వివాదాలు ఏర్పడే అవకాశం ఉంది మెరుగుపరుచుకునే దిశగా ప్రయత్నాలు చేస్తారు ఈరోజు మీకు బాగానే ఉంది
కన్యారాశి
ఆధ్యాత్మిక చింతన ఏర్పడుతుంది దేవాలయ దర్శనాలు పూజలు వంటివి ప్రధానంగా సూచిస్తున్నాయి మనసంతా భక్తి భావంతో నిండి ఉంటుంది మానసిక ప్రశాంతతను కలిగిఉంటారు భవిష్యత్తును ఊహించుకుని చాలా సంతోషంగా ఉండగలుగుతారు ఎందుకంటే ప్రస్తుత పరిస్థితుల్లో గతం కంటే ఎంతో మెరుగ్గా ఉండబోతున్నాయి భవిష్యత్తుకు సంబంధించిన ప్రణాళికలు చేస్తారు ఆ దిశగా అడుగులు వేస్తారు నూతన వ్యాపారాలు ప్రారంభించటానికి యత్నాలు సానుకూలమవుతాయి గతంలో మీకు ఎవరైనా ధనము ఇవ్వవలసి ఉంటే ఆ ధనం ఈరోజు మీ చేతికి అందుతుంది ఆర్థిక పరిస్థితి మెరుగ్గా ఉండబోతుంది సంబంధ బాంధవ్యాలు మెరుగుపడతాయి పాత స్నేహితుల నుంచి ఆహ్వానాలు అందుతాయి దూర ప్రయాణాలు చేసే అవకాశం ఉంది మానసికంగా చాలా సంతోషంగా ఉండగలుగుతారు ఈ కలలు నెరవేరే సమయం గా దీన్ని చెప్పవచ్చు ప్రేమ వ్యవహారాలకు సమయం అంత అనుకూలంగా లేదు ప్రేమికుల మధ్య కొద్దిపాటి విభేదాలు ఏర్పడ్డాయి వ్యాపారాలు లాభాల బాటలో నడుస్తున్నాయి వృత్తి ఉద్యోగ పరంగా అనుకూలంగా ఉండబోతుంది దాంపత్య జీవితం సాధారణంగా ఉండబోతుంది
తులారాశి
గతంలో ఎన్నడూ లేనంత ఖాళీ సమయం ఈ రోజు మీకు దొరుకుతుంది ఆర్థిక పరమైన ఇబ్బందులు ఉంటాయి లేనిపోని ఖర్చులు అధికంగా ఉంటాయి సభ్యుల యొక్క సహాయ సహకారాలు మీవెంటే ఉండటం బలాన్నిస్తుంది కొంతమందికి ఉద్యోగంలో ప్రమోషన్ ఇంక్రిమెంట్లు దక్కే అవకాశం ఉంది వ్యాపారానికి సంబంధించిన కొన్ని కీలక అగ్రిమెంట్లు ఈరోజు చేసే అవకాశం ఉంది పనులన్నీ త్వరగా పూర్తిచేసుకుని మీ మనసుకు నచ్చిన వారితో సమయాన్ని గడపాలని ఆలోచన చేస్తారు అయితే మీ ప్రయత్నాలకు కొద్దిపాటి ఆటంకం ఏర్పడే అవకాశం ఉంది ఏదేమైనా ఈరోజు మీకు మిశ్రమ ఫలితాలనే గ్రహస్థితి సూచిస్తుంది.
వృశ్చిక రాశి
ధనాన్ని వృధా ఖర్చు చేయకుండా భవిష్యత్తు కోసం పొదుపు చేయాలి అనే ఆలోచన చేస్తారు ప్రశాంతత లభిస్తుంది అవివాహితులకు వివాహ యోగం ఉంది ప్రేమ వ్యవహారాలకు కాలం అనుకూలంగా ఉంది మనసుకు నచ్చిన వారితో సమయాన్ని సరదాగా గడుపుతారు నమ్మిన వారు మోసం చేసే అవకాశం ఉంది ముఖ్యంగా వ్యాపార పరమైన విషయాలలో కీలకమైన విషయాలు ఎవరితోనూ చర్చించకుండా ఉండటం చాలా మంచిది ఎన్నడూ లేనంతగా ఈరోజు మీకు ఖాళీ సమయం దొరుకుతుంది ఈ సమయాన్ని మీ ప్రియమైన వారి కోసం వెచ్చిస్తారు ప్రేమ వ్యవహారాలు సానుకూలమవుతాయి వ్యవహార జయం ఉంది ఈరోజు మీకు బాగానే ఉంది
ధనుస్సు రాశి
నూతన వ్యాపారాలు ప్రారంభించాలి అనుకునేవారికి అనుకూల కాలంలో దీనిని చెప్పవచ్చు అయితే మీరు పెట్టిన పెట్టుబడులు స్థిరాస్థి కి సంబంధించిన వారు అద్భుతమైన లాభాలను పొందగలుగుతారు ఇతరుల విషయంలో జోక్యం లేనిపోని విభేదాలకు కారణమవుతుంది నిందలు పడాల్సిన పరిస్థితి వస్తుంది హలో ఉంచుకోవాలి లేకపోతే సమస్యలు తీవ్రరూపం దాల్చే అవకాశం ఉంది ప్రేమ వ్యవహారాలు అనుకూలంగా ఉంటాయి ఈ రాశిలోని కొంతమందికి నూతన బంధం ఏర్పడే అవకాశం ఉంది అది ప్రేమ కానీ పెళ్లి కానీ అయి ఉండవచ్చు నిరుద్యోగులకు ఉద్యోగ అవకాశం ఉంది మీ మొండి పట్టుదల మీరు అనుకున్న లక్ష్యాన్ని సాధించే దిశగా ఉంటుంది ఈరోజు మీకు అనుకూలంగానే ఉండబోతుంది
మకర రాశి
చాలా సంతోషంగా ఉండగలుగుతారు మీ సమయాన్ని ఎక్కువగా వినోదానికి అందానికి మెరుగులు దిద్దుకోవడానికి ఉపయోగించే అవకాశం ఉంది కుటుంబంలో శాంతి ఏర్పడుతుంది గతంలో ఏమైన కొద్దిపాటి విభేదాలు ఎవరితోనైనా ఉంటే వాటంతట అవే సమసిపోయి పరిస్థితులు సానుకూల పడతాయి ప్రేమ వ్యవహారాలకు సామాన్యంగా ఉండబోతుంది ఇంటా బయట పూర్తి అనుకూలత ఏర్పడుతుంది అన్నిటా మీదే పైచేయి అవుతుంది దాంపత్య జీవితము సాధారణంగా ఉండబోతుంది మీ ఇష్టమైన వారి గురించి ఆలోచిస్తారు అలాగే వారి గురించి సమయాన్ని కేటాయించాలని ప్రయత్నిస్తారు అయితే నీ ప్రయత్న లోపం వాళ్ల ఆటంకాలు ఏర్పడి మీకు చిరాకు కలిగిస్తాయి ఇదేమైనా ఈరోజు మీకు మానసికంగా సంతోషాన్ని కలిగించేదిగా ఉంటుంది
కుంభరాశి
మానసిక ఆందోళన పెరుగుతుంది చేపట్టిన పనులు సకాలంలో ఆగిపోవడం ఎంత కష్టపడినా మీరనుకున్న లక్ష్యాన్ని చేరుకోవడం వంటివి మీకు కోపాన్ని కలిగిస్తాయి నూతన పెట్టుబడులు పెట్టాలనుకునే వారికి కాలం అనుకూలంగా ఉండేది అయితే ఇవి స్థిరాస్తి సంబంధించినవైతే మరింత లాభాలను చూడగలుగుతారు వర్క్ లైఫ్ బ్యాలెన్స్ అనేది కాస్త ఇబ్బందిగా మారుతుంది జీవిత భాగస్వామితో కొద్దిపాటి విభేదాలు ఏర్పడే అవకాశం ఉంది అందరి సమస్యలు మీకే చెప్పుకోవడం మీకు మరింత చిరాకు కలిగిస్తుంది అసలే మీ సమస్యలతో మీరు ఇబ్బంది పడుతుంటే ఇతర సమస్యలు కూడా మీతో చెప్పుకోవడం మిమ్మల్ని పరిష్కరించ  మనడం వల్ల మీ కోపం మరింతగా పెరుగుతుంది. ఈరోజు మీకు మానసిక ప్రశాంతత విషయంలో తప్పితే మిగిలిన అన్నిటా బాగుంది
మీన రాశి
ఆరోగ్యం మెరుగుపడుతుంది ఆరోగ్యాన్ని మెరుగు పరుచుకునే దిశగా మీ ప్రయత్నాలు ఉంటాయి నూతన అవకాశాలను అంది పుచ్చుకుంటారు మీ స్నేహితులతో సమయాన్ని సరదాగా గడుపుతారు కొద్దిపాటి ఖర్చులు అయితే తప్పనిసరి. ప్రేమికులకు అనుకూల కాలంగా దీనిని చెప్పవచ్చు మీ మనసుకు నచ్చిన వారితో సమయాన్ని సంతోషంగా గడుపుతారు నూతన పందాలు ఏర్పడే అవకాశం ఉంది పోటీ పరీక్షల్లో విజయం సాధిస్తారు దాంపత్య జీవితం సుఖమయంగా ఉండబోతుంది ఈ రోజు మీకు చాలా బాగుండ  బోతుంది.
Comments
Post a Comment
ఇక్కడ మీ కామెంట్ రాయండి