రాశి ఫలాలు - భుధవారం- 03-06-2020. గ్రహగతులను అనుసరించి మీకు ఈ రోజు ఎలా ఉండబోతుంది ? Daily Horoscope in Telugu - Astrology

మేష రాశి 
మీరు ఎంతో కాలంగా ఎదురు చూస్తున్న పనులన్నీ ఇప్పుడు ఒక్కొక్కటిగా పూర్తిచేయడం ప్రారంభమవుతుంది అయితే మీరు గతం కంటే కొంచెం అధికంగా కష్టపడితే మాత్రమే మీరు అనుకున్న లక్ష్యాలను చేరుకోగలుగుతారు నూతన పెట్టుబడులు పెట్టాలి అని అనుకునేవారికి బంగారంలో కానీ ఇతర స్థిరాస్తి లో గాని పెట్టుబడి పెడితే అద్భుతంగా కలిసివస్తుంది మీ పాత స్నేహితులను కలుసుకొని సమయాన్ని ఆనందంగా వారితో గడుపుతారు మానసిక ప్రశాంతత మీకు లభిస్తుంది ప్రేమికులకు చాలా అనుకూలంగా ఈ రోజున చెప్పుకోవచ్చు వ్యవహార జయం ఉంది వృత్తి ఉద్యోగ పరంగా అభివృద్ధి ఉంది ఉద్యోగస్తులకు ప్రమోషన్లు ఇంక్రిమెంట్లు వంటివి లభిస్తాయి వ్యాపారస్తులు వ్యాపారాలను విస్తరించే దిశగా ప్రయత్నాలు చేస్తారు ఆర్థికంగా ఈ రాశి వారికి చాలా బాగుంది మీరు చేసే పని ఏదైనా కూడా విజయం తప్పక వరిస్తుంది అని చెప్పవచ్చు ఈ రోజు మీకు చాలా బాగుంది
వృషభ రాశి
మనసు నిలకడ ఉండదు లేనిపోని ఆలోచనలు ఇబ్బంది పెడతాయి మానసిక ఆందోళన చెందుతారు మెడిటేషన్ వంటివి చేయడం ద్వారా మానసిక ప్రశాంతత ను సొంతం చేసుకోవచ్చు ఆర్థికపరంగా ఈరోజు అంతగా బాగోలేదు ఖర్చులు అధికంగా ఉండబోతున్నాయి మీరు ఎవరికైనా ధనం ఇవ్వవలసి ఉంటే వారు మీపై ఒత్తిడి తీసుకు వచ్చే అవకాశం ఉంది అలానే మీకు ఎవరైనా ధనం ఇవ్వవలసి ఉంటే వారు ఏదో ఒక కారణం చెప్పి తప్పించుకుంటారు అంటే ఈరోజు ఈ విధంగా చూసినా కూడా ఆర్థికపరమైన ఇబ్బందులు అయితే తప్పనిసరి సంతానం విషయంలో సంతృప్తి ఏర్పడుతుంది దాంపత్య జీవితం సుఖమయంగా ఉంటుంది మీ శ్రమకు తగిన గుర్తింపు లభిస్తుంది ఈరోజు మీకు ఒక ఆర్థిక విషయంలో తప్పితే మిగిలిన అన్నిటా చాలా అనుకూలంగా ఉండబోతుంది సమాజంలో గౌరవ మర్యాదలు పెరుగుతాయి ఇంటా బయట పూర్తి అనుకూలత ఏర్పడుతుంది సాయంత్రానికల్లా అన్నీ సద్దుమణిగి సంతోషంగా ఉండగలుగుతారు ఈరోజు మీకు బాగానే ఉంది.
మిథున రాశి
మానసిక ప్రశాంతత లభిస్తుంది. పని ఒత్తిడి తగ్గుతుంది పనులు సకాలంలో విజయవంతంగా పూర్తి చేసి మీరు అనుకున్న లక్ష్యాలను చేరుకుంటారు మీ ఆత్మస్థైర్యం పెరుగుతుంది మరింత ఉత్సాహంతో ముందుకు వెళ్తారు అయితే ఈరోజు మీకు బాగా విలువైన కావలసిన వస్తూనే పా కొట్టుకునే అవకాశం అయితే ఉంది కాబట్టి ఈ విషయంలో చాలా జాగ్రత్తగా ఉండాలి ఈ రోజంతా చాలా సంతోషంగా ఆనందంగా సరదాగా గడుపుతారు ప్రేమికులకు అనుకూల సమయం గా చెప్పుకోవచ్చు గతంలో మీరు చేసిన పనుల తాలూకు ఫలితాన్ని ఇప్పుడు మీరు అందుకోగలుగుతారు అలాగే ఉద్యోగస్తులకు ప్రమోషన్లు దక్కే అవకాశం కూడా ఉంది నిరుద్యోగులకు నూతన ఉద్యోగం కూడా కలదు వ్యాపారాలు పుంజుకుంటాయి గతం కంటే మెరుగ్గా మీ ఆర్థిక పరిస్థితి ఉండబోతుంది
కర్కాటక రాశి
గతంలో ఎన్నడూ లేనంత ఖాళీ సమయంలో ఈ రోజు మీకు దొరుకుతుంది. గతంలో మీ అనుభవాలను ఆధారంగా చేసుకుని ఉన్న ధనాన్ని భవిష్యత్తు కోసం పొదుపు చేయాలి అనే ఆలోచన చేస్తారు ఈరోజు ఇతరులతో మాట్లాడేటప్పుడు మీ కోపాన్ని అదుపులో ఉంచుకోవాలి లేకపోతే లేనిపోని విభేదాలకు ఇది కారణం అవుతుంది భార్యాభర్తల మధ్య అన్యోన్యత పెరుగుతుంది గతంలో ఏవైనా కొద్దిపాటి మనస్పర్ధలు ఉంటే అవి ఈరోజు సమసిపోతాయి వృత్తి ఉద్యోగ పరంగా పూర్తి అనుకూలంగా ఉండబోతుంది ఈ రోజంతా మీరు చాలా సంతోషంగా ఉండగలుగుతారు ఈరోజు అధిక సమయాన్ని మీ జీవిత భాగస్వామితో గడిపే అవకాశం ఉంది. మీకు బాగానే ఉంది.
సింహరాశి
గతంలో మీరు మొదలు పెట్టిన పనులు ఇప్పుడు పూర్తి అయ్యి మీరు ఆశించిన ఫలితాలను ఇస్తాయి విజయం వరిస్తుంది చాలా సంతోషంగా ఉండగలుగుతారు మానసిక ప్రశాంతత పెరుగుతుంది మీ మనసుకు నచ్చిన వారితో సమయాన్ని వెచ్చించి సంతోషంగా ఉంటారు ఎవరైనా కోర్టు తగాదాల్లో గనుక ఉంటే వారికి సానుకూలంగా తీర్పు వెలువడే అవకాశం ఉంది మీ పెద్దల నుండి మీకు రావలసిన ఆస్తిపాస్తులు ఏమైనా ఉంటే అవి మీకు దక్కే అవకాశం ఉంది సమాజంలో గౌరవ మర్యాదలు పెరుగుతాయి ప్రేమ వ్యవహారాలు చాలా బాగుంది కార్యజయం ఉంది నూతన వ్యాపారాలు పెట్టే దిశగా ఆమె ప్రయత్నాలు జరుగుతాయి మీరు దూర ప్రయాణాలు చేసే అవకాశం ఉంది ఈ ప్రయాణాలు మీకు భవిష్యత్తులో ఎంతో ఉపయోగకరంగా ఉండబోతున్నాయి జీవిత భాగస్వామితో చాలా సంతోషంగా సమయాన్ని గడుపుతారు ఈ రోజు మీకు చాలా బాగుండ బోతుంది.
కన్యారాశి
ఆరోగ్యం మెరుగుపడుతుంది ఎంతోకాలం నుంచి మిమ్మల్ని ఇబ్బంది పెడుతున్న సమస్యలు ఒక్కొక్కటిగా పరిష్కారమవుతాయి ఆర్థికంగా బాగుంది రాబడి పెరుగుతుంది ప్రేమ వ్యవహారాలకు అంతా అనుకూలంగా పనిభారం పెరుగుతుంది ఇతరులు చేయాల్సిన పని కూడా మీరే చేయవలసిన పరిస్థితి వస్తుంది దీంతో కాస్త ఒత్తిడి శ్రమ అధికంగా ఉంటుంది సమయాన్ని అధికంగా వినోదానికి ఖర్చు చేయాలి అని మీరు ఆలోచిస్తారు మీ జీవిత భాగస్వామితో కొద్దిపాటి వివాదాలు ఏర్పడే అవకాశం ఉంది కావున ఈ విషయంలో జాగ్రత్త వహించండి ఈరోజు కొంత ధనాన్ని మీకు కావలసిన వస్తువులు కొనుక్కోవడానికి గాను మీరు వెచ్చిస్తారు. ఈరోజు మీకు బాగానే ఉంది
తులారాశి
ఆరోగ్యం మందగిస్తుంది. ఆర్థికంగా బాగా ఉండబోతుంది భవిష్యత్తుకు సంబంధించిన ప్రణాళికలు చేస్తారు వారి సహాయ సహకారాలు మీకు వెన్నంటి ఉంటాయి కొంతమంది సలహాల చేత నూతన వ్యాపారాలు ప్రారంభించటానికి ప్రయత్నాలు చేస్తారు అదృష్టం వరిస్తుంది సమాజంలో గౌరవ మర్యాదలు పెరుగుతాయి మిమ్మల్ని చూసి చాలామంది పడే విధంగా మీరు చేసే పనులు ఉంటాయి ప్రేమ వ్యవహారాలు అనుకూలంగా ఉండబోతున్నాయి అవకాశాలను అంది పుచ్చుకుంటారు నిరుద్యోగులకు ఉద్యోగం ఉంది మీకు అసలు ఖాళీ ఉండదు ఏదో ఒక పనిలో మీరు నిమగ్నమై ఉంటారు దాంపత్య జీవితం సుఖమయంగా ఉండబోతుంది
వృశ్చిక రాశి
ఏ పని చేయాలన్నా కొంత భయం ఉంటుంది గత అనుభవాలను ఆధారంగా చేసుకుని మీకు కాస్త భయం అపనమ్మకం ఏర్పడుతుంది దీనివల్ల చేయాల్సిన పనులు పెండింగ్ లో పడతాయి సమయం వృధాగా ఖర్చయిపోతుంది ఆర్థిక పరంగా అంత అనుకూలంగా లేదు భవిష్యత్తు కోసం ధనాన్ని పొదుపు చేయడం చాలా మంచిది సంతానం విషయంలో మీకు సంతృప్తి ఏర్పడుతుంది మీ మనసుకు నచ్చిన వారితో సమయాన్ని వెచ్చించి సంతోషంగా ఉండగలుగుతారు గతంలో ఆగిపోయిన పనులన్నీ కూడా పూర్తి అవుతాయి టీ ఉద్యోగపరంగా అనుకూలంగా ఉండబోతుంది అయితే ఈ రోజు కొద్దిపాటి విభేదాలు ఏర్పడే అవకాశం ఉంది అకారణ కలహ సూచన ప్రధానంగా సూచిస్తుంది ఈ ఒక్క విషయం తప్పితే మిగిలిన అన్ని విషయాల్లోనూ బాగానే ఉంది
ధనుస్సు రాశి
గతం కంటే మెరుగ్గా ఉండబోతుంది పనులు సకాలంలో పూర్తి చేసి ఆశించిన ఫలితాలను అందుకుంటారు మీకు రావలసిన ధనం అందుతుంది ఆర్థికంగా గతం కంటే బాగుంటుంది వ్యాపారస్తులు నష్టాల నుంచి కోలుకుంటారు జీవిత భాగస్వామితో సమయాన్ని సరదాగా గడుపుతారు ఎంతో కాలంగా మీరు ఎదురుచూస్తున్న అవకాశం ఒకటి మీకు వచ్చే అవకాశం ఉంది నిరుద్యోగులకు ఉద్యోగం ఉంది మీ కలలు నెరవేరే కాలంగా చెప్పవచ్చు సమయాన్ని వినోదానికి ఖర్చు చేస్తారు ఇక ప్రశాంతత మీకు లభిస్తుంది ఏదేమైనా ఈరోజు గతం కంటే చాలా మెరుగ్గా ఉండబోతుంది
మకర రాశి
ఒత్తిడిని కోపాన్ని అదుపులో పెట్టుకోవాలి లేకపోతే లేని పోని విభేదాలకు ఇది కారణం అవుతుంది మీరు చేసే పని అందు కొన్ని ఆటంకాలు ఏర్పడతాయి దీనికి కారణం నిజానికి మీరే. కాబట్టి ఏ పని చేసినా ఇతరుల యొక్క సలహాలు స్వీకరించడం మంచిది తద్వారా పనులు సకాలంలో పూర్తి చేయగలరు ధనాన్ని ఇప్పటినుంచి పొదుపు చేయడం చాలా మంచిది ఎందుకంటే రానున్న భవిష్యత్తులో మీకు కొద్దిగా ఆర్థికపరమైన ఇబ్బందులు ఏర్పడతాయి ధనాన్ని పొదుపు చేయడం ఒక అలవాటుగా ఏర్పరుచుకోవాలి మీ అమాయకత్వాన్ని మంచితనాన్ని ఇతరులు వారి స్వార్ధ ప్రయోజనాలకు వాడుకునే అవకాశం ఉంది కాబట్టి ఎవరు మంచి వారు ఎవరు చెడ్డ వారు ముందుగానే గ్రహించి వారికి సహాయం చేయడం నేర్చుకోండి ఇంటర్వ్యూలలో విజయం వరిస్తుంది నిరుద్యోగులకు ఉద్యోగం ఉంది అవివాహితులకు మంచి సంబంధం సెట్ అవుతుంది దాంపత్య జీవితం ఆనందంగా ఉండబోతుంది ఈరోజు మీకు బాగానే ఉంది
కుంభరాశి
అనవసర ప్రయాణాలు అధికమవుతాయి అనుకోకుండా మీరు దూర ప్రయాణాలు చేయవలసి వస్తుంది ఇది మీ శారీరక శ్రమను పెంచే విధంగా ఉంటుంది అయితే మీరు ఎక్కడున్నా మీ చుట్టూ ఉండే వారిని చాలా సంతోషంగా సరదాగా ఉండగలగడం బాగా కలిసి వస్తుంది నూతన పరిచయాలు పెరుగుతాయి సంబంధ బాంధవ్యాలు మెరుగుపడతాయి వ్యవహారాలు అంతా అనుకూలంగా ఉండవు వ్యాపారాలు అద్భుతంగా ఉండబోతున్నాయి ఆర్థికంగా చాలా బాగుండ బోతుంది మీరు చేసే ప్రయాణాలలో వ్యాపారపరమైన అది అయితే గనుక అద్భుత విజయాలను సొంతం చేసుకోగలుగుతారు సమయాన్ని సినిమా చూడడానికి పాటలు వినడానికి వెచ్చించే అవకాశం ఉంది ఈరోజు మీకు బాగానే ఉంది
మీన రాశి
మానసిక అధికమవుతుంది కొంతమంది మిమ్మల్ని ఇబ్బంది పెడతారు ఇది మీకు చాలా చిరాకు కలిగిస్తుంది మీ మంచితనాన్ని ఆసరాగా తీసుకుని వారి స్వార్థ ప్రయోజనాల కు మిమ్మల్ని  ఉపయోగించుకుంటారు. ఇతరులు నమ్మడం ద్వారా మోసపోయే అవకాశాలు అధికంగా ఉన్నాయి నూతన పెట్టుబడులు పెట్టడానికి ఇది అంత అనుకూల సమయం కాదు ఆర్థికపరమైన ఇబ్బందులు చుట్టుముట్టే అవకాశం ఉంది మీకు బాగా కావాల్సిన వారికి అనారోగ్యం చేయడం మీ మానసిక ఆందోళనకు కారణం అవుతుంది ఇతరులకి మీరు నిస్వార్థంగా సహాయం చేస్తారు అది మీ మంచితనానికి నిదర్శనం. కోతుల మధ్య కొద్దిపాటి విభేదాలు ఏర్పడే అవకాశం ఉంది మీకు ఎంత సమయం ఉన్నా కానీ మీరు అనుకున్నది సాధించే దిశగా ప్రయత్నాలు వైపే చేయలేకపోతారు దానికి అనేక కారణాలు అడ్డు వస్తాయి. ఏదేమైనా మీకు ఈ రోజు మిశ్రమ ఫలితాలను గ్రహస్థితి లు సూచిస్తున్నాయి.
ప్రతీ రోజు రాశిఫలాలు పొందటానికి టెలిగ్రామ్ లోని మన ఛానల్ ను క్రింది లింక్ క్లిక్ చేసి ఫాలో ఆవ్వండి. https://t.me/HinduDharmamVardhillaliChannel
జై హింద్ 
Comments
Post a Comment
ఇక్కడ మీ కామెంట్ రాయండి