రాశి ఫలాలు - మంగళవారం- 26-05-2020. గ్రహగతులను అనుసరించి మీకు ఈ రోజు ఎలా ఉండబోతుంది ? Daily Horoscope in Telugu - Astrology


మేష రాశి: ఆలోచనలు కలసి వస్తాయి. చేపట్టిన ప్రతీ పని దిగ్విజయంగా పూర్తి చేయగలుగుతారు. కోర్కెలు నెరవేరే సమయంగా చెప్పవచ్చు. నిరుద్యోగులకు ఉద్యోగ యోగం ఉంది. ఆర్ధికంగా చాలా బాగుండబోతుంది. అయితే ఈ రోజు మీకు ఆదాయంతో పాటు కర్చులు కూడా అదే విధంగా ఉండబోతున్నాయి. అలానే ముఖ్యమైన వస్తువులను పోగొట్టుకునే అవకాశం ఉంది. సభలు, సమావేశాలలో పాల్గొంటారు. నూతన పరిచయాలు పెరుగుతాయి. ప్రేమికులకు కాలం అనుకూలంగా ఉంది. నూతన వ్యాపారాలు మొదలు పెట్టడానికి ఇది అంత అనుకూల సమయం కాదనే చెప్పాలి. ప్రతీ రోజు రాశిఫలాలు పొందటానికి టెలిగ్రామ్ లో మన ఛానల్ ను ఈ లింక్ ద్వారా ఫాలో అవ్వండి. లింక్: https://t.me/HinduDharmamVardhillaliChannel

వృషభ రాశి: ప్రస్తుత రోజుల్లో మీరు ఎంత జాగ్రత్తగా ఉంటె భవిష్యత్తులో అంత మంచి జరుగుతుంది. ముఖ్యంగా ఆర్ధిక పరంగా. అనవసరంగా అందరికీ ధనం ఇవ్వడం, అవసరం లేకపోయినా ప్రతీదీ కొనడం వంటి వాటిద్వారా మీకు సమస్యలు ఏర్పడే అవకాశం ఉంది. మానసిక ప్రశాంతత లోపిస్తుంది. చేయు వ్రుత్తి, వ్యాపారాల యందు బయటి వ్యక్తుల సహాయం ద్వారా శుభాలు జరుగుతాయి. మీ ఆత్మీయుల సహాయ సహకారాలు మీకు వెన్నంటి ఉంటాయి. భార్య భర్తల మధ్య కొద్దిపాటి మనస్పర్ధలు, అవగాహనా లోపం ఏర్పడే అవకాశం ఉంది. ప్రతీ రోజు రాశిఫలాలు పొందటానికి టెలిగ్రామ్ లో మన ఛానల్ ను ఈ లింక్ ద్వారా ఫాలో అవ్వండి. లింక్: https://t.me/HinduDharmamVardhillaliChannel

మిథున రాశి: చాలా సంతోషంగా ఉండగలుగుతారు. వ్యాయామం వంటివి చేయడానికి మక్కువ చూపుతారు. ఆరోగ్యాన్ని మెరుగు పరచుకునే దిశగా మీరు చేసే ప్రయత్నాలు సత్ఫలితాలను ఇస్తాయి. అలానే మీ జీవన శైలిని మార్చుకునే ప్రయత్నం చేస్తారు. సంతానం విషయంలో కొంత ఆందోళనా, అసంతృప్తి ఏర్పడుతుంది. వ్రుత్తి, ఉద్యోగ పరంగా అనుకూలంగా ఉండబోతుంది. అయితే కుటుంబ విషయంలో కాస్త జాగ్రత్త అవసరం. అందరూ మీకు అండదండగా ఉన్నా కూడా మీకు ఎదో ఒక ఆందోళన అయితే ఉంటుంది. అది త్వరలోనే తీరుతుంది. కావున చింతించవలదు. మీ సమయాన్ని భగవంతుని ఆరాధనకు వెచ్చించండి. తద్వారా మీకు అంతా శుభమే జరుగుతుంది. ప్రతీ రోజు రాశిఫలాలు పొందటానికి టెలిగ్రామ్ లో మన ఛానల్ ను ఈ లింక్ ద్వారా ఫాలో అవ్వండి. లింక్: https://t.me/HinduDharmamVardhillaliChannel

కర్కాటక రాశి: ఆరోగ్యం మెరుగుపడుతుంది. అన్ని విధాల అనుకూలంగా ఉండబోతుంది. ఆదాయం పెరుగుతుంది. నూతన ఆదాయ మార్గాలు పెరుగుతాయి. వ్యాపార పరంగా ఇతరులతో, ముఖ్యంగా కొత్త కష్టమర్లతో మాట్లాడేటపుడు ఓపికగా మాట్లాడాలి. లేని యడల లేనిపోని వివాదాలు ఏర్పడటం, వ్యాపారం మందగించటం వంటివి జరిగే అవకాశం ఉంది. మీ మనసుకి నచ్చిన వారితో సమయాన్ని వెచ్చించడం ద్వారా మీకు మనస్సంతి ఏర్పడుతుంది. అలానే మీరు కలసుకునే కొంతమంది వ్యక్తులు మీ ఆత్మస్థైర్యాన్ని మరింత పెంచే విధంగా మీకు స్ఫూర్తి ఇస్తారు. తద్వారా మీరు మరిన్ని విజయాలను సొంతం చేసుకోగలుగుతారు. ప్రతీ రోజు రాశిఫలాలు పొందటానికి టెలిగ్రామ్ లో మన ఛానల్ ను ఈ లింక్ ద్వారా ఫాలో అవ్వండి. లింక్: https://t.me/HinduDharmamVardhillaliChannel

సింహ రాశి: ఒత్తిడి అధికంగా ఉంటుంది. పనులు అతి కష్టం మీద కాని పూర్తి కావు. ఈ రోజు జరిగే కొన్ని సంఘటనలు మీకు కొంత ఆందోళనను కలిగిస్తాయి. పని ఒత్తిడి తీవ్రంగా ఉండబోతుంది. అయితే మీ జీవిత భాగస్వామి మీకు పూర్తి సహాయ సహకారాలు అందించటం ద్వారా మీకు పని ఒత్తిడి, శ్రమ తగ్గుతుంది. అలానే ఈ రోజు మీరు మీ కుటుంబ సబ్యులు, స్నేహితులు, అత్మియులతో సమయాన్ని వెచ్చించటం ద్వారా మానసిక సంతోషాన్ని పొందగలుగుతారు. అవివాహితులకు వివాహ యోగం ఉంది. నూతన పరిచయాలు పెరుగుతాయి. ప్రతీ రోజు రాశిఫలాలు పొందటానికి టెలిగ్రామ్ లో మన ఛానల్ ను ఈ లింక్ ద్వారా ఫాలో అవ్వండి. లింక్: https://t.me/HinduDharmamVardhillaliChannel

కన్యా రాశి: ఆరోగ్యం మందగిస్తుంది. మానసిక సమస్యలు అధికంగా ఉంటాయి. మీరు అనుకున్న పనులు అవ్వకపోవడం వళ్ళ ఒత్తిడి అధికం అవుతుంది. బాకీలు వసూలు అవుతాయి. స్నేహితులతో సమయాన్ని సరదాగా గడుపుతారు. భవిష్యత్తుకి సంబందించిన ప్రణాళికలు చేయడానికి అనుకూల సమయం నడుస్తుంది. అలానే నూతన వ్రుత్తి, వ్యాపారాలను చేపట్టే అవకాశం ఉంది. అయితే వీరికి గతంలో ఎన్నడూ లేనంత కాలి సమయం ఉండబోతుంది. ఈ సమయాన్ని మీ మనసుకు నచ్చిన పనిని చేయడానికి మీరు వెచ్చిస్తారు. ప్రతీ రోజు రాశిఫలాలు పొందటానికి టెలిగ్రామ్ లో మన ఛానల్ ను ఈ లింక్ ద్వారా ఫాలో అవ్వండి. లింక్: https://t.me/HinduDharmamVardhillaliChannel

తులా రాశి: ఎన్ని సమస్యలు ఉన్నా కూడా వాటన్నిటిని మీలోనే ఉంచుకుని, బయటకు చాలా సంతోషంగా కనబడతారు. అందరితోను సంతోషంగా మెలుగుతారు. ముఖ్యంగా మీ కుటుంబ సబ్యులతో. ఆర్ధికంగా సాధారణంగా ఉండబోతుంది. సమయాన్ని సద్వినియోగం చేసుకోవడానికి ప్రస్తుతం ఒక చక్కటి అవకాశం గా చెప్పవచ్చు. ఈ సమయంలో మీరు అనుకున్నది సాదించే దిశగా ప్రయత్నాలు చేయండి. ప్రణాళికను సిద్దం చేసి తద్వారా పనులు మొదలుపెట్టి విజయాన్ని సిధించుకునేందుకు అనుకూల సమయం. ప్రేమ వ్యవహారాలు అనుకూలంగా ఉండబోతున్నాయి. విజయం వరిస్తుంది. కొన్ని కీలక విషయాల గురించి ఈ రోజు మీరు మీ అత్మియులతో చర్చిస్తారు. సమస్యల పరిష్కార దిశగా మీరు చేసే ప్రయత్నాలు సత్ఫలితాలను ఇస్తాయి. ప్రతీ రోజు రాశిఫలాలు పొందటానికి టెలిగ్రామ్ లో మన ఛానల్ ను ఈ లింక్ ద్వారా ఫాలో అవ్వండి. లింక్: https://t.me/HinduDharmamVardhillaliChannel

వృశ్చిక రాశి: గతంలో ఆగిపోయిన పనులు తిరిగి ప్రారంభం అవుతాయి. ఇది మీకు కాస్త శ్రమ పెంచినా కాని, చాలా సంతోషంగా మీరు ఉంటారు. మీరు ఎంత కాలంగానో ఎదురుచూస్తున్న పనులు ఒక్కొక్కటిగా ఇప్పుడు ముందుకు వెళ్ళటం చూసి మీకు చాలా సంతోషం కలుగుతుంది. ఉహించని విధంగా ధనం చేతికి అందుతుంది. ఇది మీ మానసిక సంతోషానికి కారణం అవుతుంది. ఆధ్యాత్మిక చింతన ఉంటుంది. దైవ దర్శనాలు చేసుకోవడం, పూజలు వంటివి చేయడం చేసే అవకాశం ఉంది. మీ సమస్యల పరిష్కార దిశగా మీరు ప్రయత్నాలు చేస్తారు. అందులో భాగంగా మీరు మీ ఆత్మీయులను కలుసుకుంటారు. నూతన పనులు చెప్పట్టే అవకాశం ఉంది. ప్రతీ రోజు రాశిఫలాలు పొందటానికి టెలిగ్రామ్ లో మన ఛానల్ ను ఈ లింక్ ద్వారా ఫాలో అవ్వండి. లింక్: https://t.me/HinduDharmamVardhillaliChannel

ధనుస్సు రాశి: పనులు అతికష్టం మీద కాని పూర్తి కావు. శ్రమ అధికం. ఒత్తిడి పెరుగుతుంది. ఆర్ధిక పరమైన విషయాలలో కొన్ని తగాదాలు ఏర్పడే అవకాశం ఉంది. మీ కుటుంబ సబ్యులతో కొంత వాగ్వాదం జరుగవచ్చు. అయితే ప్రస్తుతం మీరు చేసే కొన్ని పనులు వల్ల సమీప భవిష్యత్తులో మీరు కొన్ని కష్టాలను అనుభవించాల్సిన పరిస్థితి ఏర్పడవచ్చు. కావున చేసే ప్రతీ పనిని జాగ్రత్తగా ఒకటికి రెండు సార్లు అలోచించి చేయండి. అనుభవం లేని వ్యాపారంలో పెట్టుబడులు పెట్టకండి. మీ పూర్వపు స్నేహితులను కలుసుకునే అవకాశం ఉంది. ప్రయాణాలు చేసే అవకాశం ఉంది. ప్రతీ రోజు రాశిఫలాలు పొందటానికి టెలిగ్రామ్ లో మన ఛానల్ ను ఈ లింక్ ద్వారా ఫాలో అవ్వండి. లింక్: https://t.me/HinduDharmamVardhillaliChannel

మకర రాశి: మానసిక ఒత్తిడి అధికంగా ఉండబోతుంది. దేని గురించో మీరు చాలా వర్రీ అవుతున్నారు. ఆర్ధిక పరమైన విషయాలు మీ మానసిక ఒత్తిడిని పెంచే విధంగా ఉండబోతున్నాయి. శుభవార్తలు వింటారు. ఆహ్వానాలు, బహుమతులు అందుతాయి. వ్రుత్తి, ఉద్యోగ పరంగా మీకు ఇతరుల సహాయంతో బాగా కలసి వస్తుంది. మీరు ఈ రోజు ప్రయాణాలు చేసే అవకాశం ఉంది. దూరపు బంధువులను కలసుకునే అవకాశం కూడా ఉంది. ఈ రోజు మీకు మిశ్రమ ఫలితాలనే గ్రహస్థితి సూచిస్తుంది. ప్రతీ రోజు రాశిఫలాలు పొందటానికి టెలిగ్రామ్ లో మన ఛానల్ ను ఈ లింక్ ద్వారా ఫాలో అవ్వండి. లింక్: https://t.me/HinduDharmamVardhillaliChannel

కుంభ రాశి: ఆరోగ్యం మెరుగుపడుతుంది. సహజ సిద్దమైన విధానాల ద్వారా మీ ఆరోగ్యాన్ని మెరుగుపరచుకునే దిశగా దీర్ఘకాలిక అనారోగ్య సమస్యలతో బాధ పడేవారు ప్రయత్నించే అవకాశం ఉంది. మానసిక ప్రశాంతతను కలిగి ఉంటారు. ఆర్ధిక పరిస్థితి అంతంత మాత్రంగా ఉండబోతుంది. ఇది మీకు కాస్త ఇబ్బంది కరంగా మారే అవకాశం ఉంది. ఇతరులతో మాట్లాడేటపుడు మీ కోపాన్ని, ఒత్తిడిని తగ్గించుకోవడం మంచిది. లేనిపోని గొడవలకు దూరంగా ఉండండి. ప్రేమ వ్యవహారాలకు కాలం అంత అనుకూలంగా లేదు. అనవసరపు తొందర పరాజయాన్ని తెస్తుంది. సమస్యలు అన్నీ త్వరలోనే సర్దుమనుగుతాయి. ప్రతీ రోజు రాశిఫలాలు పొందటానికి టెలిగ్రామ్ లో మన ఛానల్ ను ఈ లింక్ ద్వారా ఫాలో అవ్వండి. లింక్: https://t.me/HinduDharmamVardhillaliChannel

మీన రాశి: ఇతరుల మీద పూర్తిగా ఆధారపడటం, మొహమాటానికి వెళ్ళటం వంటివి మీకు పెద్ద నష్టాన్ని తెస్తాయి. కావున ఏదైనా సూటిగా సున్నితంగా చెప్పేయండి. తద్వారా చాలా సమస్యల నుండి ముఖ్యంగా పని ఒత్తిడి నుండి బయటపడే అవకాశం ఉంది. లేనిపోని కర్చులు తగ్గించుకోండి. ధనాన్ని పొడుపు చేసే విధంగా ప్రయత్నాలు చేస్తారు. మీ బంధు మిత్రుల యొక్క పూర్తి సహాయ సహకారాలు మీకు ఉంటాయి. ఇది మీకు కొండంత బలం అని చెప్పవచ్చు. వ్రుత్తి, ఉద్యోగ పరంగా అనుకూలంగా ఉండబోతుంది. సమయాన్ని ఎక్కువగా వినోదానికి, అనవసరపు పనులకే వృధా చేసే అవకాశం ఉంది. ప్రతీ రోజు రాశిఫలాలు పొందటానికి టెలిగ్రామ్ లో మన ఛానల్ ను ఈ లింక్ ద్వారా ఫాలో అవ్వండి. లింక్: https://t.me/HinduDharmamVardhillaliChannel

శుభం భూయాత్ 

Comments