రాశి ఫలాలు - శనివారం - 16-05-2020. గ్రహగతులను అనుసరించి మీకు ఈ రోజు ఎలా ఉండబోతుంది ? Daily Horoscope in Telugu - Astrology

మేష రాశి:
ఆర్ధికంగా ఈ రోజు మీకు చాలా బాగుండబోతుంది. వ్యాపారస్తులకు లాభలబాటలో వ్యాపారాలు సాగుతాయి. సమయానికి ధనం అందటం వల్ల క్లా వరకూ ఈ రోజు మీకు ఎలాంటి ఇబ్బందులూ ఉండవు. ఈ రోజు మీరు మనశికంగా ప్రశాంతంగా ఉండగలుగుతారు. దాంపత్య జీవితం సుఖమయంగా ఉంటుంది. గతంలో ఏమైనా కొద్దిపాటి విభేదాలు ఉంటే అవి ఈ రోజు సమసిపోయే అవకాశం ఉంది. నూతన పరిచయాలు పెరుగుతాయి. పుస్తక పఠనం, ట్రైనింగ్ వంటి వాటి ద్వారా మీ నాలెడ్జి పెంచుకునే ప్రయత్నం చేస్తారు. ఈ రాశికి చెందిన కొంతమంది విషయంలో తీసుకునే ఆహారం సరైనది కాకపోవడం వల్ల కొద్ధి పాటి అనారోగ్య సమస్యలు తలెత్తే అవకాశం ఉంది.
వృషభ రాశి:
శారీరక దారుఢ్యాన్ని పెంచుకునే దిశగా ప్రయత్నాలు చేస్తారు. దానిలో భాగంగా వాకింగ్, జిమ్, ఏక్సస్సైజ్ వంటివి చేసే ఆలోచన చేస్తారు. ఈ రోజు మీ సమస్యల పరిష్కారానికి ఒక చక్కటి మార్గం దొరుకుతుంది. వ్యాపారస్తులకు లాభాల బాటలో వ్యాపారాలు సాగుతాయి. స్థిరాస్తిలో పెట్టుబడి పెట్టిన వారికి అద్భుత లాభాలు ఉండబోతున్నాయి. ప్రేమవ్యవహారాలు సానుకులపడతాయి. వ్యవహార జయం ఉంది. సంబంధ బాంధవ్యాలు మెరుగుపరచుకునే దిశగా మీరు చేసే ప్రయత్నాలు సత్ఫలితాలు ఇస్తాయి. మిలో ఎవరికైనా పనులు వాయిదా వేసే అలవాటు ఉంటే, దాని వల్ల తీవ్ర నష్టాన్ని చవిచూసే అవకాశం ఉంది. కావున జాగ్రత్త వహించాలి. దాంపత్య జీవితం అద్భుతంగా ఉండబోతుంది.
మిధున రాశి:
ప్రస్తుత కాలం మీకు ఒత్తిడిని పెంచేదిగా ఉంది. కావున మీరు భగవణ్ణామస్మరణ చేయడం ద్వారా, ఆధ్యాత్మిక చింతన ద్వారా మీ ఒత్తిడిని తగ్గించుకుని, మనస్సాoతిగా ఉండగలుగుతారు. లేనిపోని ఖర్చులు అధికంగా ఉండే అవకాశం ఉంది. సంతానం విషయంలో కాస్త ఆందోళన ఏర్పడే అవకాశం ఉంది. సంబంధ బాంధవ్యాలకు అధిక ప్రాధాన్యతను ఇస్తారు. పరిచయాలు పెరుగుతాయి. మీ మనసుకి నచ్చిన వారితో సమయం వెచ్చించడానికి ప్రయత్నిస్తారు. దాంపత్య జీవితం సాధారణంగా ఉండబోతుంది. ఆరోగ్యాన్ని మెరుగుపరచుకునేందుకు, సహజ సిద్ధమైన పద్ధతులు అనుసరించాలి అనే ఆలోచన చేస్తారు.
కర్కాటక రాశి:
ఆర్ధికంగా అంతగా బాగుండలేదు. నమ్మిన వారు మోసం చేసే అవకాశం ఉంది. తెలియని వ్యాపారాలలో పెట్టుబడులు పెట్టడడం నష్టాలను తెచ్చే అవకాశం ఉంది. ఎవరినీ గుడ్డిగా నమ్మరాదు. మీ కుటుంబ సభ్యులతో సమయాన్ని గడుపుతారు. ఈ రోజు మీరు భవిష్యత్తు కు సంబందించిన ప్రణాళికలు చేసే అవకాశం ఉంది. అనేక రకాల ఆలోచనలు మనస్సులో వస్తాయి. చేపట్టిన పనులు సకాలంలో పూర్తి అయ్యి, ఆశించిన ఫలితాలు అందుకోగలుగుతారు. ఉద్యోగ , వ్యాపార పరంగా అనుకూలంగా ఉంటుంది. సాటి ఉద్యోగులతో కలసి సమయాన్ని సరదాగా గడుపుతారు. దాంపత్య జీవితం అద్భుతంగా ఉండబోతుంది.
సింహ రాశి:
కోపం తీవ్ర స్థాయిలో ఉంటుంది. ప్రతీ పనిలో వ్యతిరేకత రావడం దానికి ప్రధాన కారణం కావొచ్చు. ఆర్ధిక పరమైన ఇబ్బందులు ఎదురయ్యే అవకాశం ఉంది. అయితే మీ ఆత్మీయులు సమయానికి ఆదుకోవడం ద్వారా ఈ ఇబ్బందుల నుండి బయటపడే అవకాశం ఉంది. ఎప్పుడు లేనంత కాళీ సమయం ఈ రోజు మీకు లభిస్తుంది. సమయాన్ని మీ జీవిత భాగస్వామితో కలసి బయటకు వెళ్ళడానికి ప్రయత్నిస్తారు. కోపం, ఆవేశం అనర్ధాలకు కారణం అనే విషయాన్ని గుర్తెరిగి ప్రవర్తించుట మంచిది.
కన్యా రాశి:
ఆరోగ్యం మెరుగుపడుతుంది. చాలా సంతోషంగా ఉండగలుగుతారు. వాకింగ్, యోగ, వంటివి చేయడానికి ప్రయత్నిస్తారు. ఆదాయ మార్గాలు పెరుగుతాయి. ఆర్ధికంగా చాలా బాగుండబోతుంది. ఆకస్మిక ధనప్రాప్తి ఉంది. మీ జీవిత భాగస్వామి తో కలసి చాలా సంతోషంగా ఉండగలుగుతారు. మానసిక ఆనందాన్ని కలిగించే సంఘటనలు చోటుచేసుకుంటాయి. ఈ రోజు మీకు చాలా అద్భుతంగా ఉండబోతుంది.
తులా రాశి:
ఏ పని చేయాలన్న కొద్ది నిరాశ, నిస్పృహ వంటివి ఏర్పడతాయి. ఆత్మస్థైర్యం కోల్పోతారు. అయితే నిజానికి మీరు చాలా శక్తివంతులు అనే నిజాన్ని గ్రహించలేకపోతారు. నూతన పెట్టుబడులకు కాలం అంత అనుకూలంగా లేదు. మానసిక చింతన ఏర్పడుతుంది. నూతన వస్తు, వాహనాలను కొనే ప్రయత్నం చేస్తారు. ప్రేమ వ్యవహారాలలో విజయం లభిస్తుంది. అవివహితులకి మంచి సంబంధం సెట్ అయ్యే అవకాశం ఉంది. అందాన్ని, ఆరోగ్యాన్ని మెరుగుపరచుకునే దిశగా ప్రయత్నాలు చేసి, సత్ఫలితాలను అందుకుంటారు. దాంపత్య జీవితం సుఖమయంగా ఉండబోతుంది.
వృశ్చిక రాశి:
ఆరోగ్యాన్ని మెరుగుపరచుకునే దిశగా ప్రయత్నాలు చేస్తారు. ముఖ్యంగా శాస్త్రీయ పద్ధతులను అనుసరించటానికే ప్రాముఖ్యతను ఇస్తారు. యోగ, ఎక్సయిజ్ వంటివి చేసే అవకాశం ఉంది. ధన సంబంధ సమస్యలు తలెత్తే అవకాశం ఉంది. మీ తప్పు లేకుండానే మీరు నిందించబడే అవకాశం ఉంది. నూతన పరిచయాలు పెరుగుతాయి. జీవిత భాగస్వామితో కొద్దిపాటి విభేదాలు ఏర్పడే అవకాశం ఉంది. సమయాన్ని ఎక్కువగా ఒంటరిగా ప్రశాంతంగా గడపటానికే ఇష్టపడతారు. వ్యాపార పరంగా అద్భుత లాభాలను అందుకుంటారు. ఈ రోజు మీకు బాగానే ఉంది.
ధనుస్సు రాశి:
ఆరోగ్యం మందగిస్తుంది. కళ్ళు తిరగటం, తలనొప్పి వంటి అనారోగ్య సమస్యలు ఇబ్బంది పెట్టే అవకాశం ఉంది. గతంలో పెట్టిన పెట్టుబడులు ఇప్పుడు లాభాలను ఇస్తాయి. ఆకస్మిక ధన ప్రాప్తి ఉంది. సమయాన్ని ఎక్కువగా వినోదానికి, క్రీడలకు వెచ్చించే అవకాశం ఉంది. గతంలో ఎవరితోనైనా కొద్దిపాటి విభేదాలు ఉంటే అవి ఈ రోజు సమసిపోతాయి. ఈ రోజు మీకు బాగానే ఉంది.
మకర రాశి:
ఈ రోజు ఆకారణ కలహాలు ప్రధానంగా సూచిస్తున్నాయి. కోపాన్ని అదుపులో ఉంచుకోవడం ద్వారా ఇలాంటి సమస్యల నుండి సులభంగా తప్పించుకోవచ్చు. ఎవరిని గుడ్డిగా నమ్మకండి. నూతన అవకాశాలు అందిపుచ్చుకుంటారు. ఈ రోజు సమయాన్ని వినోదానికి, క్రీడలకు వెచ్చిస్తారు. ఈ రోజు ప్రేమికులకు అంత అనుకూలం కాదు. చేపట్టిన పనులు పూర్తి అవకుండా ఇబ్బంది పెట్టే అవకాశం ఉంది. ఈ రోజు మీకు మిశ్రమ ఫలితాలను గ్రహస్తితి సూచిస్తుంది.
కుంభ రాశి:
మానసిక ప్రశాంతత లోపిస్తుంది. లేనిపోని వివాదాలకు దూరంగా ఉండండి. అనవసరపు తగాదాలకు వెలకండి. మీ పాత స్నేహితులను కలుసుకునే అవకాశం ఉంది. మీ మనసుకి నచ్చిన వారితో సమయం వెచ్చించి, మీ భవిష్య ప్రణాళికలు వారితో చర్చిస్తారు. ఎక్కువ సమయాన్ని వినోదానికే కర్చుచేస్తారు. కొన్ని కొన్ని సంఘటనలు దంపతుల మధ్య విబేధాలు, మనస్పర్థలు ఏర్పడటానికి కారణం అవుతాయి. కావున ఈ రోజు ప్రతీ విషయంలో, ముఖ్యంగా వివాదాలు, గొడవల విషయంలో జాగ్రత్తగా ఉండాలి. ప్రతీ సమస్యను సామరస్యంగా పరిష్కరించడానికి ప్రయత్నించండి.
మీన రాశి:
దూర ప్రయాణాలు చేసే అవకాశం ఉంది. శ్రమ అధికంగా ఉండబోతుంది. పనులు అతి కష్టం మీద పూర్తి అవుతాయి. నూతన పెట్టుబడుల విషయంలో తగు జాగ్రత్తలు అవసరం. గతంలో చేసిన తప్పులు మళ్ళీ చేయకండి. తెలిసి కూడా కావాలనే తప్పులు చేస్తే, తీవ్ర ఇబ్బందులకు గురి అయ్యే అవకాశం ఉంది. గతంలో ఆగిపోయిన పనులను పునః ప్రారంభించే ప్రయత్నం చేస్తారు. గతంలో మీరు చేసిన తప్పులకు గాను ఈరోజు మీ జీవిత భాగస్వామి తో గొడవలు ఏర్పడే అవకాశం ఉంది. ఈ రోజు మీ ఆత్మస్థైర్యం పెంచుకునే దిశగా ప్రయత్నాలు చేస్తారు. ఈ రోజు మీకు మిశ్రమ ఫలితాలను గ్రహస్థితి సూచిస్తుంది.
శుభం భూయాత్
Comments
Post a Comment
ఇక్కడ మీ కామెంట్ రాయండి