రాశి ఫలాలు - ఆదివారం- 31-05-2020. గ్రహగతులను అనుసరించి మీకు ఈ రోజు ఎలా ఉండబోతుంది ? Daily Horoscope in Telugu - Astrology


మేష రాశి: లేనిపోని కర్చులు అదుపులో ఉంచుకోవాలి. లేనిపోని యడల ఆర్ధిక పరమైన ఇబ్బందులు ఎదుర్కోవాల్సి వస్తుంది. ఈ రోజు మీరు చేసే కొన్ని పనులు మీకు మానసిక ఆనందాన్ని కలిగిస్తాయి. మీ శ్రమకు తగ్గ ప్రతిఫలం అందుకుంటారు. ప్రశంశలు లభిస్తాయి. ప్రేమికులకు కాలం అనుకూలంగా ఉంది. ఎంతో ప్రశాంతంగా, సంతోషంగా ఉండగలుగుతారు. ఎంతో కాలం తరువాత కాస్త ప్రశాంతత లభించినట్లుగా ఉంటుంది. ఇతరుల సహాయ సహకారాలతో కొన్ని ముఖ్యమైన పనులు పూర్తి చేయగలుగుతారు. ప్రస్తుతం మీకు బాగానే ఉంది. ప్రతీ రోజు రాశిఫలాలు పొందటానికి టెలిగ్రామ్ లో మన ఛానల్ ను ఈ లింక్ ద్వారా ఫాలో అవ్వండి. లింక్: https://t.me/HinduDharmamVardhillaliChannel

వృషభ రాశి: ఈ రోజు జరిగే కొన్ని సంఘటనలు చాలా నష్టాన్ని తెచ్చేవిగా ఉండే అవకాశం ఉంది. నూతన పెట్టుబడులు పెట్టాలి అనుకునే వారికి కాలం అనుకూలంగా ఉంది. అయితే వీరు స్థిరాస్తిలో పెట్టుబడి పెట్టడం ఉత్తమం. అనుకోని సంఘటనలు కుటుంబంలో జరగటం మీకు కొంత ఆందోళన కలిగిస్తుంది. ఇది కొంత వివాదానికి దారితీస్తుంది. అయితే మీరు ఓపికతో ఉంటె దిన్ని అధికమించవచ్చు. ప్రేమికులకు అనుకూల సమయంగా చెప్పవచ్చు. వ్యవహార జయం ఉంది. సంతానంతో సమయాన్ని సరదాగా గడుపుతారు. ఈ రోజు మీకు బాగానే ఉంది. ప్రతీ రోజు రాశిఫలాలు పొందటానికి టెలిగ్రామ్ లో మన ఛానల్ ను ఈ లింక్ ద్వారా ఫాలో అవ్వండి. లింక్: https://t.me/HinduDharmamVardhillaliChannel

మిథున రాశి: ఆథ్యాత్మిక చింతన ఉంటుంది. పూజలు చేయటం, దానధర్మాలు చేయడం వంటివి చేసే అవకాశం ఉంది. సేవా దృక్పథంతో ఉంటారు. ఆర్ధికంగా జాగ్రత్త వహించాలి. పెట్టుబడులు ఒకటికి రెండు సార్లు అలోచించి మీకు బాగా అనుభవం తెలివి ఉన్న వాటిలో మాత్రమే పెట్టాలి. లేకపోతే ఆర్ధిక పరమైన నష్టాలను చవిచూడాల్సి వస్తుంది. మీరు చేసే కొన్ని పనుల వలన ఆర్ధిక పరమైన ఇబ్బందులు ఎదురయ్యే అవకాశం ఉంది. శుభ వార్తలు వింటారు, ఆహ్వానాలు అందుతాయి. ఈ రోజు జరిగే ఒక సంఘటన మీకు మానసిక ఆనందాన్ని కలిగిస్తుంది. ప్రేమ వ్యవహారాలకు అంత అనుకూల కాలం కాదు. అది మీ మానసిక ప్రశాంతతను దెబ్బతీసేదిగా ఉండబోతుంది. ఈ రోజు ఎక్కువగా ఏకాంతంగా ఉండటానికే ఇష్టపడతారు. ప్రతీ రోజు రాశిఫలాలు పొందటానికి టెలిగ్రామ్ లో మన ఛానల్ ను ఈ లింక్ ద్వారా ఫాలో అవ్వండి. లింక్: https://t.me/HinduDharmamVardhillaliChannel

కర్కాటక రాశి: మానసికంగా చాలా సంతోషంగా ఉండగలుగుతారు. ఆరోగ్యం మెరుగుపడుతుంది. వ్యాపార పరంగా అద్బుత లాభాలను అందుకునే అవకాశం ఉంది. గతంలో ఆగిపోయిన పనులు తిరిగి ప్రారంభం అవుతాయి. ఈ రోజు కాస్త శ్రమ అధికంగా ఉండే అవకాశం ఉంది. మీ ప్రియమైన వారిని అనుమానించటం ద్వారా లేనిపోని ఇబ్బందులు ఎదుర్కొనే అవకాశం ఉంది. ఈ రోజు కొన్ని కీలక విషయాల గురించి చర్చించి ఒక నిర్ణయానికి వస్తారు. అయితే ఇతరులతో మాట్లాడేటపుడు మీ కోపాన్ని, ఆవేశాన్ని అదుపులో ఉంచుకోవడం మంచిది. లేనిపోని గొడవలు ఏర్పడే అవకాశం ఉన్నందున ఈ విధమైన సూచన చేయడం జరిగింది. ఈ రోజు మీకు మిశ్రమ ఫలితాలనే గ్రహస్థితి సూచిస్తుంది. ప్రతీ రోజు రాశిఫలాలు పొందటానికి టెలిగ్రామ్ లో మన ఛానల్ ను ఈ లింక్ ద్వారా ఫాలో అవ్వండి. లింక్: https://t.me/HinduDharmamVardhillaliChannel

సింహ రాశి: ఆరోగ్యాన్ని మెరుగుపరచుకునే దిశగా మీరు ప్రయత్నాలు చేస్తారు. ముఖ్యంగా సహజ సిద్ధమైన కొన్ని అలవాట్ల ద్వారా, అలానే మీ జీవన శైలిని మార్చుకోవడం ద్వారా ఆరోగ్యాన్ని మరింత మెరుగుపరచుకోవాలి అనే ఆలోచన చేస్తారు. మీలో ఎవరైన వ్యాపారం ప్రారంభించటానికి బ్యాంకు లోను గురించి కాని, ఇతరుల నుండి సహాయం కాని ఎదురు చూస్తుంటే ఈ రోజు అది మీకు సానుకూల పడే అవకాశం ఉంది. చేపట్టిన పనులు దిగ్విజయంగా పూర్తి అవుతాయి. ఆశించిన ఫలితాలను అందుకోగలుగుతారు. చాలా సంతోషంగా ఉండగలుగుతారు. ప్రేమ వ్యవహారాలు అనుకూలంగా ఉండబోతున్నాయి. ఈ రోజు మీరు గతంలో జరిగిన కొన్ని మధుర జ్ఞాపకాలను జ్ఞప్తికి తెచ్చుకునే అవకాశం ఉంది. ఈ రోజు దాంపత్య జీవితం సుఖమయంగా ఉండబోతుంది. ప్రతీ రోజు రాశిఫలాలు పొందటానికి టెలిగ్రామ్ లో మన ఛానల్ ను ఈ లింక్ ద్వారా ఫాలో అవ్వండి. లింక్: https://t.me/HinduDharmamVardhillaliChannel

కన్యా రాశి: గతం కంటే ఎంతో ఆత్మస్థైర్యాన్ని కలిగి ఉంటారు. ప్రతీ సమస్యను పరిష్కరించే దిశగా మీరు ప్రయత్నాలు చేస్తారు. ఇతరుల మీద ఆధారపడకుండా, సమయాన్ని వృధా చేయకుండా మీరు అనుకున్న లక్ష్యాన్ని సాధించడానికి తగిన ప్రణాళిక రూపొందించి, ఆ దిశగా అడుగులు వేస్తారు. అయితే కొన్ని సార్లు మీరు అనుకున్న దానికి పూర్తి వ్యతిరేఖంగా ఫలితం వచ్చే అవకాశం ఉంది. ఈ విషయం లో జాగ్రత్త వహించాలి. అనుభవజ్ఞుల సలహా ఇలాంటి ఇబ్బందులనుండి మిమ్మల్ని బయట పడేసే విధంగా ఉంటుంది. కావున ప్రతీ పని మొదలు పెట్టె ముందు అనుభవజ్ఞుల సలహా తీసుకోవడం ఉత్తమం. మీకు బాగా కావలసిన మరియు విలువైన ఒక వస్తువుని ఈ రోజు మీరు పోగొట్టుకునే అవకాశం ఉంది. శరీరం ఒకచోట, మీ ఆలోచనలు మరొక చోట ఉండటం వలన ఇలాంటి సంఘటనలు జరుగుతాయి. అయితే మీరు ఉన్న కష్టాలనుండి అతి త్వరలోనే బయట పడే అవకాశం ఉంది కాబట్టి అతిగా అలోచించి బుర్ర పాడుచేసుకోకపోవడం మంచిది. అవివాహితులకు వివాహ యోగం ఉంది. ప్రేమ వ్యవహారాలకు కాలం అనుకూలంగా ఉంది. ప్రతీ రోజు రాశిఫలాలు పొందటానికి టెలిగ్రామ్ లో మన ఛానల్ ను ఈ లింక్ ద్వారా ఫాలో అవ్వండి. లింక్: https://t.me/HinduDharmamVardhillaliChannel

తులా రాశి: మనశిక ప్రశాంతత లోపిస్తుంది. ఒత్తిడి అధికంగా ఉండబోతుంది. చేప్పట్టిన పనులు పూర్తి కాకపోవడం, అనవసరంగా నిందలు పడటం వంటివి మీ కోపాన్ని మరింతగా పెంచేవిగా ఉండే అవకాశం ఉంది. అయితే అన్నీ కూడా మీకు అనుకూలంగానే త్వరలో మరబోతున్నాయి. మీలో ఎవరైనా కోర్టు సమస్యల్లో ఉంటె, ఆ విషయాలు సానుకూల పడతాయి. ఆర్ధికంగా బాగుంది. మీ రాబడి పెరుగుతుంది. రావాల్సిన ఆస్తిపాస్తులు ఏమైనా ఉంటె అవి ఈ రోజు మీకు వచ్చే అవకాశం ఉంది. స్నేహితులతో కలసి సమయాన్ని సరదాగా గడుపుతారు. ఈ రోజు మీరు దూర ప్రయాణాలు చేసే అవకాశం ఉంది. భార్య భర్తల మధ్య అన్యోన్యత పెరుగుతుంది. ప్రతీ రోజు రాశిఫలాలు పొందటానికి టెలిగ్రామ్ లో మన ఛానల్ ను ఈ లింక్ ద్వారా ఫాలో అవ్వండి. లింక్: https://t.me/HinduDharmamVardhillaliChannel

వృశ్చిక రాశి: ఎంతగా ప్రయత్నించిన మీరు అనుకున్న లక్ష్యాన్ని చేరలేకపోవడం కాస్త మానసిక ఒత్తిడిని కలిగిస్తుంది. అయితే ప్రస్తుత రోజులు మరియు భవిష్యత్తూ కూడా గతం కంటే కొన్ని వేల రెట్ల మెరుగ్గా ఉండబోతున్నాయి అనే విషయాన్నీ మీరు గ్రహిచాలి. అతి త్వరలో మీరు అనుకున్న గమ్యాన్ని చేరే దిశగా పనులలో కదలికలు మొదలవుతాయి. అయితే ఆర్ధిక పరమైన ఇబ్బందులు ఎదురయ్యే అవకాశం ఉంది. ఎవరికీ హామీ ఉండటం కాని, మంచితనం చేతే అనవసరంగా మీ దగ్గర ఉన్నా లేకపోయినా ఇతరులకు ఆర్ధికంగా సహాయం చేయడం లేదా డబ్బులు ఇవ్వడం వంటివి చేయడం ద్వారా లేనిపోని ఇబ్బందులు ఎదుర్కునే అవకాశం ఉంది. ఈ రోజు మీరు మీ స్నేహితులను కలసుకుని సమయాన్ని సరదాగా కాలక్షేపం చేసే అవకాశం ఉంది. మీరు చేసే ప్రతీ పనిలో మీకు ఒక అనుభవజ్ఞులు లేదా మీరు బాగా నమ్ముకున్న వారు సహాయం చేస్తారు. ఇది మీకు కొంత బలంగా చెప్పుకోవచ్చు. దాంపత్య జీవితం సుఖమయంగా ఉండబోతుంది. ప్రతీ రోజు రాశిఫలాలు పొందటానికి టెలిగ్రామ్ లో మన ఛానల్ ను ఈ లింక్ ద్వారా ఫాలో అవ్వండి. లింక్: https://t.me/HinduDharmamVardhillaliChannel

ధనుస్సు రాశి: మానసిక ప్రశాంతత లభిస్తుంది. అయితే ఆర్ధిక పరమైన ఇబ్బందులు అయితే మరి కొంతకాలం తప్పని సరి. ఈ విధమైన ఒత్తిడులు వల్ల ఇతరులతో మాట్లాడే విషయంలో కాస్త మొరటుగా మీరు ప్రవర్తించే అవకాశం ఉంది. తద్వారా బంధువులతో మనస్పర్ధలు ఏర్పడే అవకాశం ఉంది. కావున ఇతరులతో మాట్లాడేటపుడు మీ కోపాన్ని, ఆవేశాన్ని అదుపు చేసుకోవటం ఎంతైనా మంచిది. పనులు అతి కష్టం మీద పూర్తి చేసి, అనుకున్న లక్ష్యాన్ని చేరుకోగాలుగుతారు. అయితే వ్రుత్తి, ఉద్యోగ పరంగా అనుభవజ్ఞుల సలహా మీకు చాలా బాగా ఉపయోగ పడనుంది. ఈ రోజు మీరు భవిష్యత్తుకు సంబందించిన కొన్ని ప్రణాళికలు చేస్తారు. నిజానికి మీరు ఆశించిన దానికంటే మెరుగైన ఫలితాలను మీరు పొందగలుగుతారు. దాంపత్య జీవితం బాగుందబోతుంది. గతంలో ఏమైనా కొద్దిపాటి విబేదాలు ఉంటె అవి ఇప్పుడు సమసిపోతాయి. ప్రతీ రోజు రాశిఫలాలు పొందటానికి టెలిగ్రామ్ లో మన ఛానల్ ను ఈ లింక్ ద్వారా ఫాలో అవ్వండి. లింక్: https://t.me/HinduDharmamVardhillaliChannel

మకర రాశి: ఆరోగ్యం పట్ల జాగ్రత్త అవసరం. అనారోగ్య సూచనలు ఉన్నాయి. కావున సమయానికి మంచి ఆహారాన్ని తీసుకోవడం, మంచి నిద్ర లాంటివి చాలా అవసరం. ఆర్ధికంగా బాగుందబోతుంది. మీకు ఎవరైన ధనం ఇవ్వవలసి ఉంటె అది ఈ రోజు మీకు వచ్చే అవకాశం ఉంది. మీరు మీ తోబుట్టువుల అభివృద్ధి గురించి ఆలోచిస్తారు. వారికి మంచి చేయాలి అనే మీ సంకల్పం నెరవేరుతుంది. దంపతుల మధ్య గతంలో ఏమైనా కొద్దిపాటి విబేధాలు ఏర్పడితే అవి ఈ రోజు సమసిపోయి జీవిత భాగస్వామితో ఆనందంగా ఉండగలుగుతారు. సమస్యలను పరిష్కరించే దిశగా మీరు చేసే ప్రయత్నాలు ప్రశంశలు అందుకునే విధంగా ఉండబోతుంది. ఈ రోజు మీకు బాగానే ఉంది. ప్రతీ రోజు రాశిఫలాలు పొందటానికి టెలిగ్రామ్ లో మన ఛానల్ ను ఈ లింక్ ద్వారా ఫాలో అవ్వండి. లింక్: https://t.me/HinduDharmamVardhillaliChannel

కుంభ రాశి: కొన్ని పరిస్థితులు మీ మనసిక ఒత్తిడిని పెంచేవిగా ఉంటాయి. నిజానికి నేరుగా మీకు వాటితో సంబంధం లేకపోయినా అవి మీ మానసిక ఆందోళనకు కారణం అవుతాయి. వ్యాపార పరమైన విషయాలలో చాలా చురుగ్గా ఉంటారు. స్థిరాస్తి సంబంధ విషయాల గురించి చర్చించే అవకాశం ఉంది. అయితే పనిలో మీరు చేసే అశ్రద్ధ వల్ల పై అధికారులచే తిట్లు తినే అవకాశం ఉంది. కావున అశ్రద్ద పనికిరాదు. అనుభవజ్ఞుల సలహా మీకు ఎంతగానో ఉపయోగపడనుంది. ఈ రోజు దాంపత్య జీవితం అంత అనుకూలంగా ఉండే అవకాశం లేదు. ఈ రోజు మీకు మిశ్రమ ఫలితాలను గ్రహస్థితి సూచిస్తుంది. ప్రతీ రోజు రాశిఫలాలు పొందటానికి టెలిగ్రామ్ లో మన ఛానల్ ను ఈ లింక్ ద్వారా ఫాలో అవ్వండి. లింక్: https://t.me/HinduDharmamVardhillaliChannel

మీన రాశి: ఆర్ధిక పరమైన ఇబ్బందులు ఎదురయ్యే అవకాశం ఉంది. లేనిపోని కర్చులు అధికంగా ఉండే అవకాశం ఉంది. ఇది మీ మానసిక ప్రశాంతతను దెబ్బతీస్తాయి. గతంలో ఎవరితో నైన కొద్దిపాటి విబేదాలు ఉంటె అవి సమసి పోతాయి. సంబంధ బాంధవ్యాలు మెరుగుపడతాయి. ప్రేమ వ్యవహారాలకు కాలం అంత అనుకూలంగా లేదు. ఇద్దరి మద్య మనస్పర్ధలు ఏర్పడే అవకాశం ఉంది. అయితే మీకు ఉండే కొన్ని ఇబ్బందుల వల్ల మీరు మీ కోపాన్ని ఇతరుల పై ముఖ్యంగా మీ జీవిత భాగస్వామితో మాట్లాడేటపుడు వారిపై చూపించే అవకాశం ఉన్నందున జాగ్రత్తగా ఉండాలి. లేకపోతే వారిని అనవసరంగా బాధ పెట్టాను అని తర్వాత మీరు బాధపడే అవకాశం ఉంది. మీ మనసుకి నచ్చిన వారితో సమయాన్ని వెచ్చించి సరదాగా ఉండగలుగుతారు. ప్రతీ రోజు రాశిఫలాలు పొందటానికి టెలిగ్రామ్ లో మన ఛానల్ ను ఈ లింక్ ద్వారా ఫాలో అవ్వండి. లింక్: https://t.me/HinduDharmamVardhillaliChannel

శుభం భూయాత్ 

Comments