రాశి ఫలాలు - శనివారం- 23-05-2020. గ్రహగతులను అనుసరించి మీకు ఈ రోజు ఎలా ఉండబోతుంది ? Daily Horoscope in Telugu - Astrology


మేష రాశి: వీరికి ఈ రోజు బాగుంది. ఆర్ధికంగా బాగుండబోతుంది. ప్రస్తుతం ఉన్న వాటి కంటే ఇతర ఆదయ మార్గాలను అన్వేషిస్తారు. పలు విధాల ఆదయ మార్గాలను సృష్టించుకోవాలి అని ఆలోచన చేస్తారు. అలానే వీరు పుస్తకాలు చదవటం, లేదా కొత్త విద్యను అభ్యసించటం ద్వారా నూతన నైపుణ్యాన్ని లేదా ఉన్న రంగంలో మరింత అభివృద్ధిని సాధించటానికి గాను ప్రయత్నాలు చేస్తారు. 

వృషభ రాశి: అతి కష్టం మీద కాని పనులు పూర్తి కావు. లేనిపోని తగాదాలకు దూరంగా ఉండాలి. మంచి చెప్పినా చెడు అయ్యే అవకాశం ఉంది. దీని ద్వారా మీ మానసిక ప్రశాంతత దెబ్బతింటుంది. లేనిపోని నిందలకు గురి అయ్యే అవకాశం ఎక్కువగా ఉన్నందున వీరు తగు జాగ్రత్తలు వహించాలి. 

మిథున రాశి: వీరికి కొంత ధన నష్టం కనపడుతుంది. లేనిపోని కర్చులు అధికంగా ఉంటాయి. అప్పు చేసే పరిస్థితి గోచరిస్తుంది. ఒత్తిడి అధికంగా ఉండబోతుంది. శ్రమ అధికం. ఎంతో ఆశగా ఎదురు చూస్తున్న ఒక పని అయ్యే అవకాశం లేదు. తద్వారా ఒకింత బాధ పడతారు. 

కర్కాటక రాశి: ఇంటాబయటా పూర్తి అనుకూలం. సమాజంలో వీరికి పలుకుబడి పెరుగుతుంది. వీరి మాటకు తిరుగుండదు. చేపట్టిన పనులు మొండి పట్టుదలతో పూర్తి చేస్తారు. విజయం వరిస్తుంది. వీరికి ఈ రోజు చాలా బాగుంది. 

సింహ రాశి: ప్రతీ పని ఒక ప్రణాళికతో చేయాలి అని ఆ దిశగా అడుగులు వేస్తారు. చేపట్టిన పనులు అతి కష్టం మీద పూర్తి అవుతాయి. వీరు నిర్దేసిన్చుకున్న గమ్యాన్ని చేరటానికి చేసే ప్రయత్నాలు సత్ఫలితాన్ని ఇస్తాయి. 

కన్య రాశి: గతంకంటే వీరికి ప్రస్తుతం బాగుంది. గౌరవ మర్యాదలు పెరుగుతాయి. ప్రతీ పనిలోనూ విజయం వరిస్తుంది. గతంలో లాగా చేపట్టిన పనులలో ఆటంకాలు ఇక ఉండబోవు. 

తులా రాశి: వీరికి ఎంత కష్టపడినా ఫలితం రావట్లేదు అని కొంత నిరాశకు గురి అయ్యే అవకాశం ఉంది. అయితే వీరు చేసే పనిలో అనుభవం ఉన్నవారి సలహా పాటిస్తే పనులు త్వరగా పూర్తి అయ్యి, సత్ఫలితాలను ఇస్తాయి. ఎందుకంటే వీరికి సంబంధ బాంధవ్యాలు మెరుగుపడే అవకాశం గోచరిస్తుంది కాబట్టి. వీరికి ప్రతీ పనిలోనూ ఇతరులు సహాయం చేస్తారు. తద్వారా పనులు పూర్తి అవుతాయి. 

వృశ్చిక రాశి: ఎప్పటినుండో వాయిదా వేస్తూ వచ్చిన పని ఒకటి ఈరోజు పూర్తి చేయగలుగుతారు. అయితే వీరికి ఎదురయ్యే కొన్ని సంఘటనలు వీరిని కొంత నిరుత్సాహ పరిచేవిగా ఉన్నా అవి కేవలం తాత్కాలికమే అని గ్రహించాలి. మానసిక ప్రశాంతతను కోల్పోకుండా చూసుకోవాలి. 

ధనుస్సు రాశి: ఆశించిన ఫలితాన్ని అందుకుంటారు. బంధువర్గ సహకారం అందుతుంది. ఆరోగ్యం మెరుగ్గా ఉంటుంది. చేపట్టిన పనుల్లో విజయాన్ని చూస్తారు. శుభవార్తలు వింటారు. 

మకర రాశి: ప్రస్తుతం వీరికి శని పీరియడ్ నడుస్తుంది కాబట్టి ప్రతీ పనిని వాయిదా వేయాలని చూస్తారు. బద్ధకంగా ఉంటారు. ఆర్ధిక పరిస్థితి కొంత మెరుగ్గా ఉంటుంది. బంధువర్గం తో విబేదాలు వచ్చే అవకాశం ఉంది. అతికష్టం మీద కాని పనులు పూర్తి కావు. 

కుంభ రాశి: లేనిపోని విబేదాలు వచ్చే అవకాశం ఉంది. మంచి చెప్పినా చెడు అవుతుంది. కావున జాగ్రత్తగా ఉండాలి. నూతన వస్తు, వాహనాలను కొనే అవకాశం ఉంది. ఆరోగ్యం మందగిస్తుంది. 

మీన రాశి: ఎంతోకాలంగా ప్రయత్నిస్తున్న ఒకపని ఈ రోజు పూర్తి అయ్యే అవకాశం ఉంది. లేనిపోని గొడవలకు దూరంగా ఉండండి. శుభవార్తలు వింటారు. ప్రయాణాలకు గాను మీరు చేసే ప్రణాళికలు ఫలిస్తాయి. 

Comments