రాశి ఫలాలు - శుక్రవారం- 22-05-2020. గ్రహగతులను అనుసరించి మీకు ఈ రోజు ఎలా ఉండబోతుంది ? Daily Horoscope in Telugu - Astrology


మేషరాశి:
ఈ రోజు మీరు చాలా ఆనందంగా గడుపుతారు. వ్యాపారస్తులకు లాభాలు ఉన్నాయి. ఆహ్వానాలు అందుతాయి. పరిచయాలు పెరుగుతాయి. కుటుంబ సభ్యుల సహాయ సహకారాలు మీ వెన్నంటి ఉండటం, మీకు కొండంత ధైర్యాన్ని ఇస్తుంది. ఈ రోజు మీకు చాలా అనుకూలంగా ఉండబోతుంది. 

వృషభ రాశి: 
దీర్ఘకాలిక అనారోగ్యాలు తగ్గుముఖం పట్టె సమయం. ఆరోగ్యాన్ని మెరుగు పరచుకునేందుకు మీరు చేసే ప్రయత్నాలు సత్ఫలితాన్నిస్తాయి. ఖర్చులు అధికంగా ఉండటం వల్ల ఆర్ధికంగా కొంత ఇబ్బందికర పరిస్థితి ఉండబోతుంది. కుటుంబ సభ్యులతో ఆనందంగా గడుపుతారు. మీ సహాయాన్ని ఆశిస్తున్నవారికి తగిన సహాయం చేయండి. ఇది మీకు మంచి పేరుతో పాటు, భవిష్యత్తులో ఉపయోగపడనుంది. మీరు ఎలాంటి పరిస్థితిలో ఉన్నా, ఈ రోజు మానసికంగా చాలా ప్రశాంతంగా ఉండబోతున్నారు. ఈ రోజు మీకు బాగానే ఉంది. 

మిథునరాశి:
మానసిక ప్రశాంతత లోపిస్తుంది. ఒత్తిడి అధికంగా ఉండబోతుంది. లేనిపోని ఖర్చులు అధికం. మీ సాటి ఉద్యోగులతో మంచిగా ఉండండి, అలానే మీ క్రింది ఉద్యోగులకు సహాయాన్ని అందించండి. కొంతమంది ప్రవర్తన వల్ల మీకు కోపం వచ్చినా, ఓర్పుగా ఉండండి, ఇది బంధాలను పెంచుతుంది. ఈ రోజు లేనిపోని గొడవలకు దారి తీసే విధంగా కొన్ని పరిస్థితులు ఉండబోతున్నాయి, వాటిని మీ ఓర్పు, సహనంతో మాత్రమే అధికమించగలరు అని గమనించండి. మీ మొండి పట్టుదలతో చేప్పట్టిన పనులు విజయవంతంగా పూర్తి చేయగలుగుతారు. ఈ రోజు మీకు మిశ్రమ ఫలితాలను గ్రహ స్థితి సూచిస్తుంది. 

కర్కాటక రాశి:
ఈ రోజు మీరు మీ మనసుకి నచ్చిన పని మాత్రమే చేస్తారు. మీ ఆనందాన్ని ఎవరికోసం వదులుకోకూడదు అని నిర్ణయించుకుంటారు. ఆర్ధికంగా బాగుంది. మీకు రావలసిన బాకీలు వసూలవుతాయి. పూర్వపు మిత్రులను కలుసుకుని ఆనందంగా ఉంటారు. ఇంటా బయటా పూర్తి అనుకూలం. ఉద్యోగ పరమైన చికాకులు తప్పనిసరి. ఈ రోజు ఒక వార్త లేదా సంభాషణ మిమ్మల్ని మానసికంగా బాధించేదిగా ఉండబోతుంది. ఈ రోజు మీకు మిశ్రమంగా ఉండబోతుంది. 

సింహ రాశి: 
ఆథ్యాత్మిక చింతన ఉంటుంది. దైవ దర్శనాలు చేసుకునే అవకాశం ఉంది. మీకు ఉన్న ఆర్ధిక సమస్యల వల్ల మానసిక ప్రశాంతత కోల్పోతారు. సంతానం విషయంలో ఆశించిన ఫలితాలు అందుకుని కాస్త ఊరట పొందుతారు. ప్రేమికులకు కాలం అనుకూలంగా ఉంది. వృత్తి, ఉద్యోగ పరంగా పూర్తి అనుకూల పరిస్థితులు చూడబోతున్నారు. జీవిత భాగస్వామితో కొద్దీ పాటి విభేదాలు ఏర్పడే అవకాశం ఉంది. కావున జాగ్రత్తగా ఉండాలి. ఈ రోజు మీ సమయాన్ని వినోదానికై కర్చుచేస్తారు. ఈ రోజు మీకు బాగానే ఉంది.

కన్యారాశి:
ఎంతటి కష్టాన్నైనా అధిగమించి గమ్యాన్ని చేరగలుగుతారు. మీ ఓర్పు, సహనం మీకు ఉన్న బలాలు. అవి మీకు ఈ రోజు బాగా ఉపయోగ పడనున్నాయి. లేనిపోని ఖర్చులు అధికంగా ఉండే అవకాశం ఉంది. దూరపు బంధువులను కలుసుకుంటారు. మీ జీవిత భాగస్వామి మీపై చూపించే ప్రేమాభిమానాలు ఎనలేనివని మీకు ఈ రోజు అర్ధం అవుతుంది. అలాంటి మంచి జీవితభాగస్వామి మీకు ఉన్నందుకు సంతోషిస్తారు. గతం కంటే మెరుగ్గా ఈ రోజు ఉండబోతుంది. మానసికంగా ఎంతో ఉల్లాసంగా ఉండగలుగుతారు. పనులలో మీ ప్రతిభ కనబరుస్తారు. నూతన విధి విధానాలను అనుసరించి అద్భుత ఫలితాలను అందుకుంటారు. ఈ రోజు మీకు నచ్చిన పనిని మాత్రమే చేయడానికి ఇష్టపడతారు. నలుగురిచేతా ప్రశంసలు అందుకుంటారు. ఈ రోజు మీకు చాలా అనుకూలంగా ఉండబోతుంది. 

తులా రాశి:
సమయానికి ధనం చేతికి అందుతుంది. ఆత్మీయుల సహాయ సహకరాలతో ఇబ్బందులను అధికమిస్తారు. ఆర్ధికంగా బాగుంది. డబ్బుకు లోటులేకుండా ఉంటుంది. ఆహ్వానాలు అందుతాయి. బంధువులను కలుసుకుంటారు. పరిచయాలు పెరుగుతాయి. ఒత్తిడి తగ్గుతుంది. మానసిక ప్రశాంతత ఏర్పడుతుంది. దంపతుల మధ్య అన్యోన్యత పెరుగుతుంది. నిరుద్యోగులకు ఉద్యోగ అవకాశాలు అధికంగా ఉన్నాయి. ఏ చిన్న పాటి ప్రయత్నం చేసినా ఉద్యోగం వచ్చేస్తుంది. అంత అనుకూలంగా కాలం ఉండబోతుంది. ఇంటర్వ్యూలలో విజయం సాధిస్తారు. వృత్తి, ఉద్యోగ పరంగా అనుకూలంగా ఉండబోతుంది. అంతా బాగానే ఉన్నా అనుకోకుండా ఏర్పడే చిన్న తగాదా వల్ల మీ పరిస్థితి మొత్తం గందరగోళంగా మారబోతుంది. కావున లేనిపోని తగాదాలకు దూరంగా ఉండండి. మౌనం వహించి, సమస్యల నుండి బయట పడండి. ఈ రోజు ఈ ఒక్క విషయంలో తప్ప మీకు పూర్తి అనుకూలంగా ఉండబోతుంది. మరీ ముఖ్యంగా నిరుద్యోగులకు శుభ సమయం మొదలయ్యిందనే చెప్పాలి. 

వృశ్చిక రాశి:
ఆర్ధికంగా ఒక వ్యక్తి సహాయం అందిస్తారు. భవిష్యత్తుపై ఆలోచన చేస్తారు. నూతన వ్యాపారాలు పెట్టె దిశగా అడుగులు వేస్తారు. ఇవి మీకు సత్ఫలితాలను ఇస్తాయి. దూరపు ప్రయాణాలు కొంచెం శారీరకంగా ఇబ్బంది పెట్టినా, అవి మీకు కావలసినవి, భవిష్యత్తులో ఎంతో ఉపయోగకగరంగా ఉండేవి అవటం చేత మీకు అంతగా ఇబ్బంది అనిపించదు. ఇప్పటి వరకు మీరు అనుభవిస్తున్న కష్టాలకు స్వస్తి చెప్పాల్సిన సమయం ఆసన్నమైంది. కష్టాలనుండి బయటపడే మార్గం మీకు దొరికే అవకాశాలు చాలా అధికంగా ఉన్నాయి. అది కూడా ఒక ఆత్మీయులు, మిత్రులు అయిన ఒక వ్యక్తి ద్వారా మీకు సహాయం లభించి, మీరు అతి త్వరలో కష్టాల నుండి బయట పడబోతున్నారు. దానికి నాంది ఈ రోజు పడబోతుంది. మీకు శుభ సమయం మొదలయ్యింది. ఇక నుండి అన్నీ అనుకూల రోజులే. 

ధనస్సు రాశి:
మీ మొండి పట్టుదలతో ఎంతటి పనినైనా పూర్తి చేసి, ఆశించిన ఫలితాలు అందుకుంటారు. కుటుంబ సభ్యుల పూర్తి సహాయ సహకారాలు మీకు ఉండనున్నాయి. వృత్తి, ఉద్యోగ పరంగా అనుకూలంగా ఉండబోతుంది. అయితే ఊహించని విధంగా వచ్చే కొన్ని ఇబ్బందులు, లేనిపోని ఖర్చుల వల్ల కొంత మానసిక ఒత్తిడి ఏర్పడుతుంది. అయితే మీ మనసుకి నచ్చిన వారితో సమయాన్ని గడపటం ద్వారా ఇలాంటి ఒత్తిడుల నుండి బయటపడతారు. ప్రేమ వ్యవహారాలలో పురోగతి ఉంటుంది. పెళ్లి దిశగా ప్రయత్నాలు జరుగుతాయి. అయితే కొంత మంది మీ కష్టాన్ని, వారి ప్రతిభగా చూపి మార్కులు కొట్టేయాలని చూస్తారు. ఇలాంటి విషయంలో మీరు జాగ్రత్తగా ఉండాలి. మీ కష్టాన్ని ఎవరికోసం త్యాగం చేయకండి. మరీ ముఖ్యంగా స్వార్ధపరులకోసం అసలు వదులుకోకండి. కొన్ని ముఖ్య సంఘటనలు ఈ రోజు జరుగుతాయి. అవి కూడా మీ సంతోషానికి, మంచికే. ఈ రోజు మీకు చాలా బాగుంది. శుభం. 

మకర రాశి:
ఈ రోజు మీకు విశ్రాంతి అవసరం. ఎంతో కాలంగా మీరు కష్టపడుతున్నారు. ఈ సారి వాటి ఫలితాలను అందుకునే సమయం వచ్చింది. మీరు ఊహించిన ఫలితాలను అందుకోవడంతో, మీ కష్టానికి తగిన ఫలితం వచ్చిందని మీరు భావిస్తారు. నిజానికి మీరు ఆశించిన ఫలితాల కంటే మెరుగైన ఫలితాలు మీరు అందుకోబోతున్నారు. ఇది మీ శక్తినీ, ఆత్మస్థైర్యాన్ని మరింతగా పెంచుతుంది. గతంలో నేర్చుకున్న పాఠాలను గుర్తు ఉంచుకొని ధనాన్ని వృధాగా కర్చుచేయటం నేటి నుంచే ఆపేస్తారు. మీరు చేసే ఈ పని మీకు భవిష్యత్తులో ఉపయోగపడనుంది. గతంలో మీరు కష్టాల్లో ఉన్నప్పుడు బాధపడిన సంఘటనలు గుర్తుచేసుకుని, నిజానికి అవి మన మంచికే జరిగాయని. వాటిలో మంచిని గుర్తించి ఏది జరిగినా మనమంచికే అన్న విషయాన్ని గ్రహిస్తారు. ఎందుకంటే ఆ సమయంలో మీరు నేర్చుకున్న పాఠాలు భవిష్యత్తులో ఇంకెప్పుడు మీరు తప్పు చేయకుండా, అలానే ఎప్పుడు ఎవరితో ఏ విషయంలో ఎలా మెలగాలో నేర్పించేవిగా అవి ఉన్నాయి కాబట్టి. మీ కష్టానికి తగిన ఫలితం ఈ రోజు మీరు అందుకోబోతున్నారు. మీ మనసుకి నచ్చిన వారితో సమయాన్ని గడిపి ఆనందంగా ఉండబోతున్నారు. ఈ రోజు మీకు బాగానే ఉంది. 

కుంభ రాశి:
ఆరోగ్యం మెరుగుపడుతుంది. దీర్ఘకాలిక సమస్యలు తగ్గుముఖం పడతాయి. మీదగ్గర ధనం ఉండకపోవటానికి గల కారణం ఈ రోజు మీరు గుర్తించి తగిన చర్యలు తీసుకుంటారు. లేని పోనీ ఖర్చులను అదుపులో ఉంచే దిశగా మీ ప్రయత్నాలు ఉండబోతున్నాయి. కుటుంబ సభ్యుల మధ్య సంబంధ బాంధవ్యాలు మెరుగుపడతాయి. గతంలో ఏమైనా కొద్దిపాటి విభేదాలు ఉంటే అవి ఇప్పుడు సమసిపోతాయి. వ్యాపారపరంగా మీరు చేసే ప్రయత్నాలు సత్ఫలితాలు ఇస్తాయి. దంపతుల మధ్య అన్యోన్యత పెరుగుతుంది. ఈ రోజు మీ సమయాన్ని మీకు నచ్చిన పనిని చేయడానికే ఉపయోగించాలి అని చూస్తారు. ఈ రోజు మీకు బాగానే ఉంది. 

మీన రాశి:
ఎంతో కాలంగా మీరు పడుతున్న కష్టానికిగాను ప్రతిఫలం అందుకునే సమయం ఇది. మీ కష్టాన్ని మీ పై అధికారులు గుర్తుంచి తగిన మూల్యం మీకు చెల్లిస్తారు. ఆరోగ్యం మెరుగుపడుతుంది. కుటుంబ సభ్యులతో ఆనందంగా గడుపుతారు. భవిష్యత్తుకు సంబందించిన ప్రణాళికలు వేస్తారు. సోదరీ, సోదరుల మధ్య అన్యోన్యత పెరుగుతుంది. ఈ రోజు సమయాన్ని కాలక్షేపం చేయడానికి వెచ్చిస్తారు. ఈ రోజు మీకు మిశ్రమముగా ఉండబోతుంది. త్వరలో అంతా మంచే జరుగబోతుంది. 


ప్రతీ రోజు రాశిఫలాలు పొందటానికి టెలిగ్రామ్ లో మన ఛానల్ ను ఈ లింక్ ద్వారా ఫాలో అవ్వండి. లింక్: https://t.me/HinduDharmamVardhillaliChannel

శుభం భూయాత్

Comments