రాశి ఫలాలు - ఆదివారం - 17-05-2020. గ్రహగతులను అనుసరించి మీకు ఈ రోజు ఎలా ఉండబోతుంది ? Daily Horoscope in Telugu - Astrology

మేష రాశి:
ఈ రోజు మిశ్రమ ఫలితలనే గ్రహస్థితి సూచిస్తుంది. లేనిపోని నిందలు పడే అవకాశం ఉంది.ఈ రోజు మీ కోపాన్ని, ఒత్తిడిని ఇతరుల మీద చూపించకుండా సహనం వహించాలి. ఆర్ధిక పరిస్థితి సాధారణంగా ఉండబోతుంది. ఉద్యోగ పరమైన ఇబ్బందులు అధికంగా ఉండబోతున్నాయి. కొంత మంది విషయంలో ఉద్యోగం కోల్పోయే అవకాశం ఉంది. కావున జాగ్రత్త వహించండి. అవివాహితులకు వివాహయోగం ఉంది. మంచి సంబంధం సెట్ అయ్యే అవకాశం ఉంది. ఈ రోజు ఎక్కువ సమయాన్ని ఏకాంతంగా గడపటానికే ఇష్టపడతారు.
వృషభ రాశి:
లేనిపోని ఖర్చులు అధికంగా ఉండబోతున్నాయి. మీరు చేసే కొన్ని పనులు వల్ల అధిక మొత్తంలో ధన నష్టం కలిగే అవకాశం ఉంది. అనారోగ్యం తో బాధపడే వారికి ఒక మంచి వైద్యం లభించి ఆ అనారోగ్య సమస్యలనుండి బయటపడే అవకాశం ఉంది. సంతానం కోసం ఎదురుచూసే వారికి ఆ దిశగా శుభవార్తలు వినే అవకాశం ఉంది. అవివాహితులకు వివాహయోగం ఉంది. ఈ రోజు మీరు మీ మనసుకి నచ్చిన వారితో సమయాన్ని సంతోషంగా గడపగలుగుతారు. ప్రయాణాలు చేసే అవకాశం ఉంది.
మిధున రాశి:
పనులు అతి కష్టం మీద పూర్తి అవుతాయి. శ్రమ, ఒత్తిడి అధికంగా ఉండే అవకాశం ఉంది. మానసిక ప్రశాంతత కోసం యోగ మెడిటేషన్ వంటివి చేయడం ఉత్తమం. పెట్టుబడులు పెట్టె ముందు ఒకటికి రెండుసార్లు ఆలోచించాలి. తెలియని విషయాల్లో జోక్యం తగదు. లేనిపోని వివాదాలకు, విభేదాలకు దూరంగా ఉండండి. లేనిపోని ఖర్చులు అధికంగా ఉండే అవకాశం ఉంది. దూర ప్రయాణాలు చేసే అవకాశం ఉంది. నూతన పరిచయాలు లభిస్తాయి. ఇవి భవిష్యత్తు లో మీకు ఉపయోగపడనున్నాయి. జీవిత భాగస్వామితో కొద్దిపాటి విబేధాలు ఏర్పడే అవకాశం ఉంది.
కర్కాటక రాశి:
ఆరోగ్యం మెరుగుపడుతుంది. ఆర్ధికంగా బాగుంది. ప్రేమ వ్యవహారాలకు అంత అనుకూలం కాదు. మీ పూర్వపు స్నేహితులని కలుసుకుని ఆనందంగా ఉండగలుగుతారు. మీలో ఎవరికైనా చెడు అలవాట్లు ఉంటే, వాటి పరిణామాలు ఎదుర్కోవాల్సి వస్తుంది. పనులు వాయిదా పడతాయి. ఈ రోజు మీకు మిశ్రమంగా ఉండబోతుంది.
సింహ రాశి:
ఆధ్యాత్మిక చింతన ఉంటుంది. దైవ దర్శనాలు, పూజలు చేసుకునే అవకాశం ఉంది. మానసిక ప్రశాంతత లభిస్తుంది. ఆర్ధికంగా బాగుంది. భవిష్యత్తు కోసం ధనాన్ని పొదుపు చేయాలి అని ఆలోచన చేస్తారు. మీ స్నేహితులతో సమయాన్ని సంతోషంగా గడుపుతారు. నూతన పరిచయాలు పెరుగుతాయి. దూర ప్రయాణాలు చేసే అవకాశం ఉంది. కొద్దిపాటి అనారోగ్య సమస్యలు ఇబ్బందిపెట్టే అవకాశం ఉంది. ఈ రోజు మీకు బాగానే ఉంది.
కన్యా రాశి:
మానసికంగా చాలా సంతోషంగా ఉండగలుగుతారు. పనులు సకాలంలో పూర్తి అయ్యి, ఆశించిన ఫలితాలు ఇస్తాయి. ఆరోగ్యం మెరుగుపడుతుంది. ప్రేమ వ్యవహారాలు ఆనందకరంగా ఉండనున్నాయి. మీ స్నేహితులతో సమయాన్ని సంతోషంగా గడపగలుగుతారు. దాంపత్య జీవితం సాధారణంగా ఉండబోతుంది. ఈ రోజు మీకు చాలా బాగుంది.
తులా రాశి:
దేనిగురించో మీ ఆలోచనలు ఎక్కువ అవుతాయి. మీ మనసులో ఉన్న ఒక కోరిక గురించి మీరు ఎక్కువగా ఆలోచిస్తారు. మీ దృష్టి అంతా దానిమీదే ఉండబోతుంది. ఆర్ధికంగా అద్భుతమైన రోజు. ఆకస్మిక ధన ప్రాప్తి ఉంది. కుటుంబ సభ్యులతో సమయాన్ని సంతోషంగా గడపగలుగుతారు. శుభవార్తలు వింటారు. ప్రేమికులకు అనుకూల కాలం నడుస్తుంది. ప్రేమవ్యవహారాలలో విజయం లభించే అవకాశాలు మెండుగా ఉన్నాయి. సమయాన్ని మీ ఇష్టమైన వారితో కలిసి వినోదానికి వెచ్చించే అవకాశం ఉంది. దాంపత్య జీవితం సుఖమయం గా ఉండబోతుంది. ఈ రోజు మీకు చాలా బాగుంది.
వృశ్చిక రాశి:
కొన్ని సంఘటనల వల్ల ఆత్మస్థైర్యాన్ని కోల్పోయే అవకాశం ఉంది. గతంలో జరిగిన కొన్ని పనులు గుర్తుకు వచ్చి కాస్త భయాన్ని కలిగిస్తాయి. ఆర్ధిక లావాదేవీల విషయంలో తగు జాగ్రత్త అవసరం. వ్యాపారులకు నష్టపోయే అవకాశం ఉంది. నూతన పెట్టుబడులకు కాలం అంత అనుకూలంగా లేదు. మీ ఆత్మీయులకి మీరు సహాయం చేసే అవకాశం ఉంది. బంధుమిత్రులతో సమయాన్ని సరదాగా గడుపుతారు. ప్రయాణాలు అత్యవసరం అయితే గాని చేయవద్దు. కొన్ని ప్రమాద సంఘటనలు జరిగే అవకాశం ఉంది. దాంపత్య జీవితం సుఖమయంగా ఉండబోతుంది. ఈ రోజు ప్రయాణాలు చేయకపోవడం, రిస్క్ ఉండే పనులు చేయకపోవడం చెప్పదగిన సూచన.
ధనస్సు రాశి:
ఆర్ధికంగా బాగుంది. రాబడి పెరుగుతుంది. ఒత్తిడి తగ్గించుకునే దిశగా మీరు చేసే ప్రయత్నాలు ఫలిస్తాయి. సమయాన్ని సరదాగా సంతోషంగా ఉండటానికి వెచ్చిస్తారు. వినోదనికే ఎక్కువ సమయాన్ని కేటాయిస్తారు. మీరు ఆశించిన దానికంటే ఉత్తమ ఫలితాలు పొందటానికి అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. స్నేహితులతో కలిసి సంభాషణలు చేస్తారు. కొన్ని కీలక విషయాల గురించి ఆలోచిస్తారు. భవిష్య ప్రణాళికలు వేస్తారు. దాంపత్య జీవితం బాగుండబోతుంది. బాంధవ్యము యొక్క విలువను గ్రహించే విధంగా కొన్ని సంఘటనలు చోటుచేసుకుంటాయి.
మకర రాశి:
ఆరోగ్యం మందగించే అవకాశం ఉంది. ఏ కొద్దిపాటి అనారోగ్యాన్ని నిర్లక్ష్యం చేయకండి. వెంటనే వైద్యున్ని సంప్రదించండి. ఖర్చులు అధికంగా ఉండబోతున్నాయి. అయితే సమయానికి ధనం చేతికి అందటం వల్ల వచ్చిన ఇబ్బంది పెద్దగా ఏమి ఉండబోదు. అనవసరపు ప్రయాణాలు వాయిదా వేయడం మంచిది. శుభ వార్తలు వుంటారు. దూరపు బంధువులను కలుసుకునే అవకాశం ఉంది. అవివాహితులకు వివాహ యోగం ఉంది. ప్రేమికులకు సాధారణం గా ఉండబోతుంది. ఈ రోజు మీకు బాగానే ఉంది.
కుంభ రాశి:
శారీరక శ్రమ అధికంగా ఉంటుంది. అలసత్వం ఏర్పడుతుంది. ఆశించిన స్థాయిలో ఆదాయం ఉంటుంది. ఇది మీకు ఎంతగానో ఉపయోగపడుతుంది. ఆధ్యాత్మిక చింతన ఉంటుంది. దాన ధర్మాలు చేయటం. పూజలు, దైవ దర్శనాలు చేయడం వంటివి జరిగే అవకాశం ఉంది. అవివాహితులకు వివాహ యోగం ఉంది. మీ నాలెడ్జ్ పెంచుకునే దిశగా మీ ప్రయత్నాలు ఉండే అవకాశం ఉంది. దాంపత్య జీవితం సుఖమయం గా ఉండబోతుంది. ఈ రోజు మీకు బాగానే ఉంది.
మీన రాశి:
మనస్సు నిలకడ ఉండదు. టెన్షన్ వాతావరణం ఏర్పడుతుంది. ఒక విషయం గురించి మీరు ఎంతో ఆందోళన చెందుతారు. ఆరోగ్యం మందగిస్తుంది. అయితే మీ కుటుంబ సభ్యులు ప్రతీ విషయంలో మీ వెన్నంటి ఉండటం, మీ మనసుకి నచ్చిన వారితో సమయాన్ని గడపడం ద్వారా ఈ విధమైన టెన్షన్ ల నుండి బయట పడతారు. ఈ రోజు మీజు ఎన్నడూ లేనంత కాళీ సమయం దొరుకుతుంది. సమయాన్ని వినోదనికే ఖర్చు చేసే అవకాశం ఉంది. ప్రతీ పని సహనంతో పూర్తి చేయడానికి ప్రయత్నించండి. ఎందుకంటే పనులలో కొద్దిపాటి జాప్యం ఏర్పడే అవకాశం ఉంది. అతి కష్టం మీద కానీ పనులు పూర్తి కావు. ఎపుడూ చేసే పనులు అయినా కానీ కాస్త ఇబ్బందిగా కష్టంగా మారతాయి. కావున సహనం వహించండి. దాంపత్య జీవితం సంతోషంగా ఉండబోతుంది. ఈ రోజు మీకు మిశ్రమ ఫలితాలను గ్రహస్థితి సూచిస్తుంది.
శుభం భూయాత్
Comments
Post a Comment
ఇక్కడ మీ కామెంట్ రాయండి