రాశి ఫలాలు - శుక్రవారం - 15-05-2020. గ్రహగతులను అనుసరించి మీకు ఈ రోజు ఎలా ఉండబోతుంది ? Daily Horoscope in Telugu - Astrology


మేషరాశి:
ఆరోగ్యం మెరుగుపడుతుంది. నూతన అవకాశాలు అందిపుచ్చుకుంటారు. ఆర్ధికంగా బాగుంది. రాబడి పెరుగుతుంది. భవిష్యత్తు కు సంబంధించిన ప్రణాళికలు చేస్తారు. ప్రయాణాలు చేసే అవకాశాలు ఉన్నాయి. మీ బంధుమిత్రులను కలుసుకునే అవకాశం ఉంది. చేపట్టిన పనులు ఇతరుల సహాయ సహకరాలతో పూర్తి కాగలవు. ఇంటబయటా పూర్తి అనుకూలం. మానసికంగా సంతోషంగా ఉండగలుగుతారు. గతంలో ఆగిపోయిన పనులు ఈ రోజు పూర్తికాగలవు లేదా పునఃప్రారంభం అవుతాయి. ఈ రోజు మీకు అనుకులంగా ఉండబోతుంది. 

వృషభ రాశి :
ఆలోచనలు స్థిరంగా ఉండవు. ఈ రోజు ఎక్కువ సమయాన్ని వినోదానికై కార్చుచేసే అవకాశం ఉంది. కుటుంబ సభ్యులతో కలిసి బయటకి వెళ్లే అవకాశం ఉంది. సంతానం విషయంలో సంతోషంగా ఉండగలుగుతారు. ప్రేమ వ్యవహారాలకు అనుకూల కాలం గా చెప్పవచ్చు. అవివహితులకి మంచి సంబంధం వచ్చే అవకాశం ఉంది. పనులు సకాలంలో పూర్తి అయ్యి, ఆశించిన ఫలితాలు అందుకోగలుగుతారు. 

మిధున రాశి: 
ఈ రోజు ఒత్తిడి అధికంగా ఉంటుంది. కావున ఇతరులతో మాట్లాడేటప్పుడు జాగ్రత్తగా ఉండాలి. ఈ రోజు జరిగే కొన్ని సంఘటనలు, సంభాషణలు మీ కోపాన్ని తీవ్ర స్థాయిలో పెంచే ఆవకాశం ఉంది. కావున జాగ్రత్త వహించాలి. కోపంలో ఉన్నప్పుడు మాట్లాడే మాటలు కొన్నిసార్లు అయినవారిని కూడా దూరం చేసేవిగా ఉంటాయి అనేది గుర్తెరిగి, ఇతరులతో మాట్లాడేటప్పుడు సహనం వహించండి. ఈ రోజు విలువైన వస్తువులు పోగొట్టుకునే అవకాశం కూడా ఉంది. మీ బంధుమిత్రులు, కుటుంబ సభ్యులు మీరు చేయు ప్రతీ పనిలోనూ వెన్నంటి ఉండటం వల్ల మీ ఆత్మస్థైర్యం పెరుగుతుంది. అలానే మీ మిత్రుల సహాయం ద్వారా కొన్ని పనులు దిగ్విజయంగా పూర్తి చేయగలుగుతారు. 

కర్కాటక రాశి:
గతంలో ఎన్నడూ లేనంత సంతోషంగా మీరు ఉండబోతున్నారు. ఎక్కువ సమయాన్ని మీకు నచ్చిన పనిని చేయడానికి , వినోదానికి ఖర్చు చేస్తారు. పరిచయాలు పెరుగుతాయి. మీ మనసుకి ఇష్టమైన వారిని మీరు చేసే చిన్న చిన్న పనులు మానసికంగా గాయపరచే అవకాశం ఉంది. చేపట్టిన పనులు దిగ్విజయంగా పూర్తి కాగలవు. దంపతుల మధ్య కొద్దిపాటి విభేదాలు ఏర్పడే అవకాశం ఉంది. 

సింహ రాశి:
ఆత్మస్థైర్యం పెరుగుతుంది. ఈ రోజు మీకు పూర్తి అనుకూలంగా వుండే అవకాశం ఉంది. తెలుపురంగు వస్తువులకు సంబందించిన వ్యాపారం చేసే వారికి ఈ రోజు అద్భుత లాభాలు ఉండబోతున్నాయి. ఈ రోజు మీకు ఆర్ధికంగా బాగుంది. వ్యాపారాలు విస్తరించే దిశగా ఆలోచనలు, ప్రయత్నాలు చేస్తారు. ఎవరిని గుడ్డిగా నమ్మొద్దు. ఈ రోజు అన్ని విధాలా పూర్తిస్థాయిలో మీకు అనుకూలత ఉండబోతుంది. ప్రేమ వ్యవహారాలు కొద్దిగా ఇబ్బందికరంగా మరే అవకాశం ఉంది. 

కన్యారాశి:
మానసికంగా సంతోషంగా ఉండగలుగుతారు. గతంలో పెట్టిన పెట్టుబడులు లాభాలను ఇస్తాయి. ముఖ్యంగా స్థిరాస్తిలో పెట్టిన పెట్టుబడులు బాగా లాభిస్తాయి. సంతానం విషయంలో సంతృప్తి కలుగుతుంది. సమయాన్ని కుటుంబ సభ్యులతో కలసి సంతోషంగా గడుపుతారు. ప్రేమ వ్యవహారాలు సానుకులపడతాయి. వివాహం దిశగా మీరు చేసే ప్రయత్నాలు ఫలిస్తాయి. వ్యాపారస్తులకు అనుకూలంగా ఉండబోతుంది. విద్యార్థులకు మంచి ఫలితాలు ఉన్నాయి. 

తులారాశి:
ఆథ్యాత్మిక చింతన ఉంటుంది. దైవ దర్శనాలు, పూజలు చేయటం, శ్లోక పఠనం వంటివి సూచిస్తున్నాయి. మానసికంగా అంత ప్రశాంతంగా ఉండలేరు. నూతన ఆదాయ మార్గాలు పెరిగే అవకాశం ఉంది. అయితే వచ్చిన ప్రతీ అవకాశాన్ని పూర్తిగా పరిశీలించి, అప్పుడు మాత్రమే మంచిది ఎన్నుకోవాలి. లేకపోతే నష్టపోయే అవకాశం ఉంది. ఆహ్వానాలు అందుతాయి. శుభవార్తలు వింటారు. ఎంతోకాలంగా మీరు ఎదురు చూస్తున్న పనులు ఇప్పుడు ముందుకు కాదులుతాయి. ఇది మీకు సంతోషాన్ని కలిగిస్తుంది. ఈ రోజు మీకు బాగానే ఉంది.

వృశ్చిక రాశి:
మానసికంగా చాలా చురుగ్గా, సంతోషంగా ఉండగలుగుతారు. మీ సంతానంతో సమయాన్ని సంతోషంగా గడుపుతారు. లేనిపోని ఖర్చులు అధికంగా ఉండబోతున్నాయి. గత జ్ఞాపకాలు స్మరణకు వస్తాయి. అవివహితులకి వివాహ యోగం ఉంది. ప్రేమికులు భవిష్యత్తు గురించి చర్చిస్తారు. ఈ రోజు మీరు దూర ప్రయాణాలు చేసే విషయంలో తగు జాగ్రత్తలు వహించాలి. ముఖ్యమైన వస్తువులను పోగొట్టుకునే అవకాశం ఉంది. 

ధనుస్సు రాశి:
మానసిక ప్రశాంతత కోసం యోగ, మెడిటేషన్ వంటివి చేయడం ఉత్తమం. ఆరోగ్యాన్ని మెరుగుపరచుకునే దిశగా మీరు ప్రయత్నాలు చేస్తారు. ఈ రోజు నూతన పెట్టుబడులు పెట్టడానికి సమయం అనుకూలంగా ఉంది. సాధ్యమైనంత వరకూ స్థిరాస్తి లో పెట్టడానికి ప్రయత్నించండి. అవి మీకు అద్భుత లాభాలను ఇస్తాయి. అవివహితులకి వివాహ యోగం ఉంది. ప్రేమికులకు వ్యవహార జయం ఉంది. కుటుంబ సభ్యులతో సమయం సంతోషంగా గడుపుతారు. భాగస్వామ్య వ్యాపారులకు బాగా కలసి వస్తుంది. లాభాల బాటలో వ్యాపారాలు సాగుతాయి. గతంలో ఆగిపోయిన పనులు ఇప్పుడు పూర్తి అవడం కానీ పునః ప్రారంభం అవడం కానీ జరుగుతుంది. ఈ రోజు సమయాన్ని ఏకాంతంగా, ప్రశాంతంగా గడపగలుగుతారు. ఈ రోజు మీకు చాలా బాగుంది. 

మకర రాశి:
ఆరోగ్యం మందగిస్తుంది. ఇది మీ మానసిక ఆందోళనకు కారణం అవుతుంది. ఈ రోజు మీరు చేసే కొన్ని పనులు, ఆలోచించే కొన్ని విషయాలు, చేసే సంభాషణలు మీ మానసిక ఒత్తిడిని పెంచేవిగా ఉండే అవకాశం ఉంది. ప్రేమికులకు సమయం అనుకూలంగా ఉంది. ఇష్టమైన వారితో సంతోషంగా ఉండగలుగుతారు. మీ వ్యాపారానికి సంబందించిన కీలక సమాచారాన్ని ఇతరులతో పంచుకోవడం అంత మంచిది కాదు. వ్యాపారస్తులు దూర ప్రయాణాలు చేసే అవకాశం ఉంది. 

కుంభ రాశి:
కష్టపడకుండా సులభ మార్గాల్లో డబ్బులు సంపాదించాలి, తక్కువ డబ్బుతో దొడ్డిదారి గుండా అధిక ధనాన్ని సంపాదించాలి వంటి ఆలోచనలు ఉంటే వాటిని మనుకోవడం ఉత్తమం. ప్రస్తుత గ్రహస్తితిని అనుసరించి అటువంటి వ్యవహారాలు అనుకూలించవు. కష్టించి ధర్మబద్ధంగా ధనార్జన చేసే విధానాలు మాత్రమే ఫలిస్తాయి. ఆహ్వానాలు అందుతాయి. ప్రేమికులకు అనుకూలంగా ఉంది. ఇష్టమైన వారి దగ్గరనుండి విలువైన బహుమతులు అందుకునే అవకాశం ఉంది. ఈ రోజు ఆరోగ్యాన్ని మెరుగుపరచుకునే దిశగా మీ ప్రయత్నాలు జరుగుతాయి. మీ జీవితభాగస్వామి యొక్క చిన్న చిన్న కోర్కెలు తీర్చలేకపోవడం ఈ రోజు కొద్దిపాటి విబేధాలకు, మనస్పర్థలకు దారితీసే అవకాశం ఉంది. నూతన పరిచయాలు పెరుగుతాయి. నూతన వృత్తి, వ్యాపార ప్రయత్నాలు సానుకూల పడతాయి. 

మీన రాశి:
వృత్తి, ఉద్యోగ పరంగా మెరుగైన ఫలితాలు అందుకుంటారు. వృత్తి, ఉద్యోగ పరంగా పూర్తి అనుకూల వాతావరణం ఏర్పడుతుంది. అయితే ఆర్ధికంగా కాస్త ఇబ్బందులు ఎదురయ్యే అవకాశం ఉంది. గతంలో మీరు ఎవరిదగ్గర నుండైనా అప్పు తీసుకుంటే వారు మిమ్మల్ని ఇబ్బంది పెట్టే అవకాశం ఉంది. అయితే మీకు ధనం ఇవ్వవలసినవారు మాత్రం ఏదొక సాకు చూపి తప్పించుకోవడం మీ పరిస్థితిని మరింత ఇబ్బందిగా తయారుచేస్తుంది. ఉద్యోగ పరంగా పని, శ్రమ అధికంగా ఉండబోతున్నాయి. ఈ రోజు మీరు చేద్దాం అని అనుకున్న కొన్ని ముఖ్యమైన పనులు వాయిదా పడతాయి. నూతన పరిచయాలు పెరుగుతాయి. మీ జీవితభాగస్వామి తో కొద్దిపాటి విభేదాలు ఏర్పడే అవకాశం ఉంది. ఈ రోజు మిశ్రమ ఫలితలనే గ్రహస్తితి సూచిస్తుంది.

శుభం భూయాత్

Comments