
మేష రాశి:
దీర్ఘకాలిగా అనారోగ్య సమస్యలతో బాధపడే వారికి అనారోగ్య సమస్యలు తగ్గుముఖం పడతాయి. ఆరోగ్యం మెరుగుపడుతుంది. ఆరోగ్య పరంగా మీకు జరిగే మార్పులు మీకు చాలా ఊరటను ఇస్తుంది. ఇంటబయటా పూర్తి అనుకూల వాతావరణం ఏర్పడుతుంది. చేసే ప్రతీ పనిలో విజయం తప్పక సిద్ధిస్తుంది. మీ మాట తీరుతో శత్రువులను కూడా మిత్రులుగా చేసుకోగలుగుతారు. ఈ రోజు ఖర్చులు అధికంగా ఉండే అవకాశం ఉంది. నూతన పరిచయాలు పెరుగుతాయి. దాంపత్య జీవితం సుఖమయం అవుతుంది. ఈ రోజు మీరు ఎక్కువ సమయాన్ని ఏకాంతంగా గడపడానికి ఇష్టపడతారు. భవిష్యత్తు గురించి కొన్ని ఆలోచనలు చేస్తారు. ఈ రోజు మీకు అంతా బాగానే ఉంది. ప్రతీ రోజు రాశిఫలాలు పొందటానికి టెలిగ్రామ్ లో మన ఛానల్ ను ఈ లింక్ ద్వారా ఫాలో అవ్వండి. లింక్: https://t.me/HinduDharmamVardhillaliChannel
వృషభ రాశి:
ఆర్ధిక విషయాల పట్ల తగు జాగ్రత్త అవసరం. నమ్మిన వారు మోసం చేసే అవకాశం ఉంది. తెలియని వారికి అప్పు ఇవ్వటం, హామీ ఉండటం వంటివి చేయకండి. ఆత్మస్థైర్యం పెరుగుతుంది. చేపట్టిన పనులు పట్టుదలతో పూర్తి చేసి ఆశించిన ఫలితాలు అందుకుంటారు. ప్రయాణాలు చేసే అవకాశం ఉంది. మనస్సు నిలకడ ఉండదు. అనేక ఆలోచనలు వస్తాయి. సాటి ఉద్యోగులతో లేదా మీ వద్ద పనిచేసే వారితో శాంతంగా మాట్లాడండి. కోపాన్ని, ఒత్తిడిని అదుపులో ఉంచుకోవడానికి ధ్యానం, వ్యాయామం వంటివి చేయడం ఉత్తమం. ప్రతీ రోజు రాశిఫలాలు పొందటానికి టెలిగ్రామ్ లో మన ఛానల్ ను ఈ లింక్ ద్వారా ఫాలో అవ్వండి. లింక్: https://t.me/HinduDharmamVardhillaliChannel
మిధున రాశి:
మనశిక ప్రశాంతత లభిస్తుంది. చాలా ప్రశాంతంగా ఉండగలుగుతారు. ఆరోగ్యాన్ని మెరుగుపరచుకునే దిశగా మీ ప్రయత్నాలు ఉంటాయి. ప్రతీ పనిలో మీ కుటుంబ సభ్యుల యొక్క పూర్తి సహాయ సహకారాలు ఉంటాయి. దూరపు బంధువులను కలుసుకోవడం, వారితో కీలక విషయాల గురించి సంభాషించడం వంటివి జరిగే అవకాశం ఉంది. ప్రేమికులకు మంచి సమయం గా చెప్పవచ్చు. చాలా సంతోషంగా ఉండగలుగుతారు. వృత్తి, ఉద్యోగ పరంగా పూర్తి అనుకూలతను చూడబోతున్నారు. చేపట్టిన పనులలో విజయం పొందే అవకాశం ఉంది. ప్రతీ రోజు రాశిఫలాలు పొందటానికి టెలిగ్రామ్ లో మన ఛానల్ ను ఈ లింక్ ద్వారా ఫాలో అవ్వండి. లింక్: https://t.me/HinduDharmamVardhillaliChannel
కర్కాటక రాశి:
మానసికంగా చాలా సంతోషంగా ఉండగలుగుతారు. ఆర్ధికంగా బాగుంది. వ్యాపారాలు లాభిస్తాయి. ముఖ్యంగా స్థిరాస్తి సంబంధిత వ్యాపారస్తులకు పట్టింది బంగారంలా ఉండే అవకాశం ఉంది. సమాజంలో గౌరవ మర్యాదలు పెరుగుతాయి. కళారంగంలో ఉన్నవారికి శుభ సమయం నడుస్తుంది. ప్రేమికులకు కొద్దిపాటి విభేదాలు ఏర్పడే అవకాశం ఉంది. నూతన వ్యాపారాలు ప్రారంభించే దిశగా మీరు చేసే ప్రయత్నాలు ఫలిస్తాయి. ప్రతీ రోజు రాశిఫలాలు పొందటానికి టెలిగ్రామ్ లో మన ఛానల్ ను ఈ లింక్ ద్వారా ఫాలో అవ్వండి. లింక్: https://t.me/HinduDharmamVardhillaliChannel
సింహ రాశి:
ఆరోగ్యం మందగిస్తుంది. పనులలో జాప్యం ఏర్పడే అవకాశము ఉంది. ఆర్ధికంగా అంత అనుకూలంగా లేదు. వ్యాపారస్తులకు నష్టాలు వచ్చే అవకాశం ఉంది. నమ్మిన వ్యక్తులు మోసం చేసే అవకాశం ఉంది. లేనిపోని సమస్యలు చుట్టుముట్టుతాయి. ఇబ్బందులు అధికం అవుతాయి. ఆశించిన స్థాయిలో ఏ పనీ అవ్వకపోవడం కాస్త కలవరపెడుతోంది. అయితే భావిష్యత్తుకి సంబంధించి మీరు చేసే ప్రణాళికలు, ప్రయత్నాలు సానుకులపడతాయి. ఈ రోజు మీకు మిశ్రమంగా ఉండబోతుంది. ప్రతీ రోజు రాశిఫలాలు పొందటానికి టెలిగ్రామ్ లో మన ఛానల్ ను ఈ లింక్ ద్వారా ఫాలో అవ్వండి. లింక్: https://t.me/HinduDharmamVardhillaliChannel
కన్యారాశి:
మానసికంగా చాలా సంతోషంగా ఉండగలుగుతారు. ఈ మధ్యనే మీరు చేసిన ఒక పని లేదా మీరు సాధించిన ఒక విజయం ను తలచుకుని మరింత సంతోషాన్ని పొందుతారు. కష్టకాలం లో ఉన్నప్పుడు మీరు పొదుపు చేసుకున్న ధనమే మీకు ఉపయోగపడుతుంది. తద్వారా సమస్యలనుండి సునాయాసంగా బయటపడి, ప్రశాంతంగా ఉండగలుగుతారు. ఖర్చులు అధికంగా ఉండే అవకాశం ఉంది. మీ జీవితభాగస్వామి మీరు చేసే ప్రతీ పనిలోనూ మీ వెన్నంటి ఉండటం మీకు కొండంత అండగా ఉంటుంది. ప్రేమికులకు అంత అనుకూల సమయం కాదు. ఉద్యోగ , వ్యాపార పరంగా మధ్యస్థంగా ఉండబోతుంది. ఈ రోజు మీకు వచ్చే ఇబ్బందులు పెద్దగా ఏమి ఉండవు. ఒకవేళ ఏదైనా సమస్య వచ్చినా, దాని నుండి బయటపడే మార్గం కూడా వెంటనే దొరుకుతుంది. కావున పెద్దగా వచ్చిన ఇబ్బందులు ఈ రోజు మీకు ఏవి ఉండవనే చెప్పాలి. శుభం. ప్రతీ రోజు రాశిఫలాలు పొందటానికి టెలిగ్రామ్ లో మన ఛానల్ ను ఈ లింక్ ద్వారా ఫాలో అవ్వండి. లింక్: https://t.me/HinduDharmamVardhillaliChannel
తులా రాశి:
శ్రమ అధికం. పనులు అతి కష్టం మీద కానీ పూర్తి కావు. ఆర్ధికంగా బాగుంది. ఆకస్మిక ధన ప్రాప్తి ఉంది. నూతన ఆదయమార్గాలు పెంపొందించుకునే దిశగా ఆలోచనలు చేస్తుంటారు. లాటరీ టిక్కెట్లు, గ్యాంబ్లింగ్ వంటి వాటి ద్వారా తక్కువ సమయంలో ఎక్కువ ఆదాయాన్ని పొందొచ్చు అనే ఆలోచన చేస్తారు. మీరు చేయు ప్రతీ పని యందు మీ కుటుంబ సభ్యుల సహాయ సహకారాలు ఉంటాయి. భవిష్యత్తుకి సంబందించిన కీలక విషయాల గురించి ఆలోచనలు చేస్తారు. తదనుగుణంగా ప్రణాళికలు సిద్ధం చేస్తారు. మీ పూర్వపు స్నేహితులను, బంధువులను కలుసుకునే అవకాశం ఉంది. అవివాహితులకు వివాహ యోగం ఉంది. ప్రేమ వ్యవహారాలు సానుకూల పడతాయి. ఈ రోజంతా మీకు సంతోషముగా, సరదాగా గడిచిపోతుంది. ప్రతీ రోజు రాశిఫలాలు పొందటానికి టెలిగ్రామ్ లో మన ఛానల్ ను ఈ లింక్ ద్వారా ఫాలో అవ్వండి. లింక్: https://t.me/HinduDharmamVardhillaliChannel
వృశ్చిక రాశి:
ప్రస్తుతం మీకు శుభ సమయం నడుస్తుంది. ఆర్ధికంగా బాగుంది. నూతన ఆదాయ మార్గాలు ఏర్పరచుకొనే ప్రయత్నాలు చేస్తారు. నూతన ఉద్యోగ, వ్యాపార అవకాశాలు ఉన్నాయి. ఈ రోజు మీకు ఏర్పడే కొన్ని నూతన పరిచయాలు మీ జీవితం పై ఎంతో ప్రభావం చూపించేవిగా ఉంటాయి. ఈ రోజు దంపతుల మధ్య కొద్దిపాటి వాగ్వాదం ఏర్పడే అవకాశం ఉంది. కావున ప్రతీ సమస్యను సామరస్యంగా పరిష్కరించడానికి ప్రయత్నించండి. కొన్ని సార్లు చిన్న చిన్న గోడవలె పెద్దవయ్యి శాశ్వత శత్రుత్వానికి దారి తీస్తాయి అనేదాన్ని గుర్తు ఉంచుకొని. ఈ రోజు ఏర్పడే సమస్యలను సాధ్యమైనంత వరకు సామరస్యంగానే పరిష్కరించండి. అలానే ఇతరులతో మాట్లాడేటప్పుడు ఓపికతో మాట్లాడండి. ఒత్తిడిని అదుపులో ఉంచుకోండి. ఈ రోజు మానసిక ప్రశాంతత లభిస్తుంది. ఈ రోజు మీకు పూర్తి అనుకూలంగా ఉండబోతుంది. ప్రతీ రోజు రాశిఫలాలు పొందటానికి టెలిగ్రామ్ లో మన ఛానల్ ను ఈ లింక్ ద్వారా ఫాలో అవ్వండి. లింక్: https://t.me/HinduDharmamVardhillaliChannel
ధనుస్సు రాశి:
ఆర్ధికంగా గతంకంటే మెరుగ్గా ఉండబోతుంది. స్థిరాస్తిలో పెట్టుబడులు పెట్టినవారికి అద్బుతలాభాలు ఉన్నాయి. ఈ రోజు సమయాన్ని ఇంటి పనులు తోటపనులు చేయడానికే ఎక్కువ కేటాయించే అవకాశం ఉంది. నూతన వ్యాపారాలు పెట్టడానికి ప్రస్తుతం అంత అనుకూలంగా లేదు. సంతానం విషయంలో ఆశించిన ఫలితాలు అందుకొని సంతృప్తిగా ఉండగలుగుతారు. కీలక పరిస్థితులలో మీరు నమ్ముకున్నవారు మీతో ఉండకపోవటం చాలా బాధను కలిగిస్తుంది. ఈ రోజు మీకు మిశ్రమంగా ఉండబోతుంది. ప్రతీ రోజు రాశిఫలాలు పొందటానికి టెలిగ్రామ్ లో మన ఛానల్ ను ఈ లింక్ ద్వారా ఫాలో అవ్వండి. లింక్: https://t.me/HinduDharmamVardhillaliChannel
మకర రాశి:
పనులు అతి కష్టం మీద పోయిర్తి అవుతాయి. ఒత్తిడి అధికంగా ఉండబోతుంది. ఆర్ధికంగా బాగుంది. ఆకస్మిక ధనప్రాప్తి ఉంది. కుటుంబ సభ్యులతో కలిసి సమయాన్ని సంతోషంగా గడుపుతారు. ఈ రోజు మీకు ఏర్పడే నూతన పరిచయాలు వ్యాపార పరంగా లాభిస్తాయి. భావిష్యత్తుకి సంబందించి ప్రణాళికలు చేస్తారు. ప్రయాణాలు చేసే అవకాశం ఉంది. మనసోకచోట, శరీరం వేరే చోట అన్నట్టుగా ఉంటారు. మీరు ఉన్నది ఒకచోట అయిన ఆలోచనలు అధికంగా ఉంటాయి. సమయాన్ని ఎక్కువగా ఒంటరిగా గడపటానికే ఇష్టపడతారు. ప్రతీ రోజు రాశిఫలాలు పొందటానికి టెలిగ్రామ్ లో మన ఛానల్ ను ఈ లింక్ ద్వారా ఫాలో అవ్వండి. లింక్: https://t.me/HinduDharmamVardhillaliChannel
కుంభ రాశి:
కొంతమంది బయటి వ్యక్తుల సహాయంతో ఈ రోజు మీరు కొన్ని సమస్యల నుండి బయటపడే అవకాశం ఉంది. ఈ రోజు నిర్ణయాలు తీసుకునేటప్పుడు జాగ్రత్తగా ఉండాలి. మీకు బాగా కావలసిన వారి యొక్క ఆరోగ్యం విషయంలో మీకు కాస్త ఆందోళన ఏర్పడుతుంది. నూతన వ్యాపారాలు ప్రారంభించడానికి ఇది అంత మంచి సమయం కాదు అనే చెప్పాలి. ఒకవేళ తప్పని సరి పరిస్తుతలలో పెట్టుబడులు పెట్టాలన్న, ధనం ఎవరికైనా ఇవ్వాలి అన్నా ఒకటికి రెండు సార్లు ఆలోచించి, అనుభవజ్ఞులు సలహా తీసుకుని చేయాలి. దాంపత్య జీవితం సాఫీగా ఉంటుంది. ప్రతీ రోజు రాశిఫలాలు పొందటానికి టెలిగ్రామ్ లో మన ఛానల్ ను ఈ లింక్ ద్వారా ఫాలో అవ్వండి. లింక్: https://t.me/HinduDharmamVardhillaliChannel
మీన రాశి:
ఏ విధంగా చూసిన ప్రస్తుత రోజులు మీకు గతం కంటే మెరుగ్గా ఉండబోతున్నాయి. కొన్ని సమస్యలనుండి ఈ మధ్యనే బయట పడి ఉంటారు. ఇంకా ఏమైనా సమస్యలు ఉంటే అవి త్వరలోనే సర్దుమనుగుతాయి. మీకు నూతన ఉద్యోగ, వ్యాపార అవకాశాలు వస్తాయి. ఏదొక విధంగా మీకు ఆదాయ మార్గాలు ఏర్పడతాయి. ఆరోగ్యం మెరుగుపడుతుంది. అనవసరపు ఖర్చులు అధికంగా ఉండబోతున్నాయి. ఎదో ఒక సమస్య మీకు ఆందోళన కలిగిస్తుంది. మానసికంగా ప్రశాంతంగా ఉండనివ్వదు. అయితే త్వరలోనే దీనికి పరిష్కారం దొరికే అవకాశం ఉంది. ఈ సమస్య ముఖ్యంగా మీకు బాగా కావలసిన వారికి ఆరోగ్యం బాగుండక పోవటమో, ఆర్ధికంగా ఇబ్బందిలో ఉండటమే, శ్రమ అధికంగా ఉండటమే వంటి వాటిలో ఏదొకటి కరణమయ్యే అవకాశం ఉంది. నూతనంగా జరిగిన కొన్ని మార్పులు మీకు మేలు చేస్తాయి. ప్రేమ వ్యవహారాలకు అంత అనుకూలంగా లేదు. నిరుత్సాహ పడే అవకాశం ఉంది. ఈ రోజు మీకు మిశ్రమంగా ఉండబోతుంది.ప్రతీ రోజు రాశిఫలాలు పొందటానికి టెలిగ్రామ్ లో మన ఛానల్ ను ఈ లింక్ ద్వారా ఫాలో అవ్వండి. లింక్: https://t.me/HinduDharmamVardhillaliChannel
శుభం భూయాత్
Comments
Post a Comment
ఇక్కడ మీ కామెంట్ రాయండి