ఈ రోజు ఏం జరగబోతుంది - జీవితం నేర్పించే పాఠాలు ఏమిటి ? నేటి రాశిఫలలు 10-05-2020


మేష రాశి: ఈ రోజు మీరు చాల సంతోషంగా ఉండబోతున్నారు. ఈ రోజు మీరు చేసే చిన్న చిన్న పొరపాట్ల వళ్ళ ధనం అధికంగా కర్చుకాబోతుంది. మీ సరదాకి, సంతోషానికి ధనాన్ని వెచ్చిస్తారు. గతంలో మీ కుటుంబ సబ్యులతో ఏమైనా తగాదాలు ఉంటె అవి పరిష్కరించుకునే దిశగా మీరు చేసే ప్రయత్నాలు సత్ఫలితాలను ఇస్తాయి. సంబంధ బాంధవ్యాలు మెరుగుపరచుకునేందుకు ఇది ఒక చక్కటి సమయంగా చెప్పవచ్చు. నూతన పరిచయాలు ఏర్పడతాయి. సమాజంలో గౌరవ మర్యాదలు పెరుగుతాయి. ఈ రోజు మీకు ఎన్ని పనులు ఉన్నా కాని మీ కుటుంబ సబ్యులు లేదా ఇష్టమైన వారితో సమయాన్ని గడపడానికే ఇష్టపడతారు. దాంపత్య జీవితం సంతోషంగా ఉండబోతుంది. ప్రతీ రోజు రాశిఫలాలు పొందటానికి టెలిగ్రామ్ లో మన ఛానల్ ను ఈ లింక్ ద్వారా ఫాలో అవ్వండి. లింక్: https://t.me/HinduDharmamVardhillaliChannel

వృషభ రాశి: నూతన అవకాశాలు ఉత్సాహాన్ని నిపుతాయి. మరింత పట్టుదలతో వచ్చిన ప్రతీ అవకాశాన్ని సద్వినియోగం చేసుకునే ప్రయత్నం చేస్తారు. ఆకస్మిక ధన లబ్ది ఉంది. ఆర్ధికంగా బాగుండబోతుంది. గతంలో మీరు తీసుకున్న అప్పులను తీర్చేసే దిశగా ప్రయత్నాలు జరుగుతాయి. నూతన ఉద్యోగ వ్యాపారల ప్రయత్నాలు సానుకూల పడతాయి. నూతన ఆదయ మార్గాలు ఏర్పడే అవకాశం ఉంది. ప్రతీ విషయాన్నీ మీ తల్లి తండ్రులతో చర్చించటం ద్వారా వారికి విలువను ఇవ్వటం తో పాటు మీకు వారు మంచి సలహా కూడా ఇవ్వడం ద్వారా మీరు వేసే ప్రతీ అడుగు విజయం వైపే ఉండేలా ఉంటుంది. ప్రేమికులకు అద్బుత కాలం గా చెప్పవచ్చు. ప్రేమించిన వారితో సమయాన్ని ఆనందంగా గడపగలుగుతారు. ఎవరు ఏది చెప్పినా మీ మనస్సంత ఎక్కడో ఉంటుంది. మీరు ఎవరిని పట్టించుకోకుండా మీ పని మీరు చేసుకుంటారు. ఈ రోజు సమయాన్ని వినోదానికే కర్చు చేస్తారు. దాంపత్య జీవితం సాఫీగా ఉండబోతుంది. ప్రతీ రోజు రాశిఫలాలు పొందటానికి టెలిగ్రామ్ లో మన ఛానల్ ను ఈ లింక్ ద్వారా ఫాలో అవ్వండి. లింక్: https://t.me/HinduDharmamVardhillaliChannel

మిథున రాశి: మానసిక అశాంతి ఏర్పడుతుంది. ఆరోగ్యం మందగించటం దానికి ప్రధాన కారణం అయ్యే అవకాశం ఉంది. అయితే మీ అత్మీయులతో సమయాన్ని గడపడం ద్వారా మానసిక ఒత్తిడి నుండి బయటపడొచ్చు. ప్రతీ నిర్ణయం ఒకటికి రెండు సార్లు అలోచించి చేయాలి. లేకపోతే ఇబ్బందులు ఎదుర్కోవలసి వస్తుంది. పెట్టుబడులు పెట్టె విషయంలో అనుభవజ్ఞుల సలహా ఎంతైనా అవసరం. గతంలో ఎవరితోనైనా కొద్దిపాటి విబేధాలు ఉంటె అవి వాటంతట అవే సమసిపోతాయి. మంచి మిత్రులను ఏర్పరచుకోనగలుగుతారు. సంబంధ బాంధవ్యాలు మెరుగుపడతాయి. ప్రేమ వ్యవహారాలలో నిరాశ ఎదురయ్యే అవకాశం ఉంది. కావున ఆ విషయంలో ఈ రోజు ముఖ్యమైన పనులు వాయిదా వెయ్యటం మంచిది. అంటే మీ ప్రేమ గురించి మీ తల్లితండ్రులకు గాని ఇతర ముఖ్యమైన వ్యక్తులకు గాని తెలియచేయాలి అనుకుంటే అవి ఈ రోజు వాయిదా వేయటం మంచిది. ఈ రోజు మీ స్నేహితులను కలసుకొని మీ సుఖదుఃఖాలు వారితో పంచుకుని, మానసికంగా కాస్త ఊరట చెందుతారు. ప్రతీ రోజు రాశిఫలాలు పొందటానికి టెలిగ్రామ్ లో మన ఛానల్ ను ఈ లింక్ ద్వారా ఫాలో అవ్వండి. లింక్: https://t.me/HinduDharmamVardhillaliChannel

కర్కాటక రాశి: ఈ రోజు అకారణ కలహా సూచన ప్రధానంగా సూచిస్తుంది. గతంలో ఎవరితోనైనా గొడవపడితే అవి ఈ రోజు మరింత పెద్దవిగా మారే అవకాశం ఉంది. కావున, ఈ విషయంలో జాగ్రత్త వహించి, మీ మిత్రుల సహాయం తీసుకోవడం మంచిది. ప్రతీ సమస్యను సామరస్యంగా పరిష్కరించటానికే ప్రయత్నించండి. గతంలో పెట్టిన పెట్టుబడుల యొక్క లాభాలను పొందే సమయంగా ప్రస్తుత కాలాన్ని చెప్పుకోవచ్చు. రాబడి పెరుగుతుంది. వ్యాపారాలు లాభాల బాటలో నడుస్తాయి. ఆద్యాత్మిక చింతన, సమాజ సేవ పట్ల మీ మనస్సు మళ్ళుతుంది. అవివాహితులకు వివాహ యోగం ఉంది. మీరు కోరుకున్నట్లుగానే ఒక మంచి జీవిత భాగస్వామి మీకు లభించే అవకాశం ఉంది. ప్రతీ రోజు రాశిఫలాలు పొందటానికి టెలిగ్రామ్ లో మన ఛానల్ ను ఈ లింక్ ద్వారా ఫాలో అవ్వండి. లింక్: https://t.me/HinduDharmamVardhillaliChannel

సింహ రాశి: మీ జీవిత భాగస్వామి విషయంలో మీరు మరింత పట్టుదలగా ఉండే ప్రయత్నం చేస్తారు. ప్రతీ దానికి సర్దుకు పోయే మీ స్వభావం వల్లనే మిమ్మల్ని కాస్త తక్కువగా / చులకనగా చూస్తున్నారు అనే భావన ఏర్పడటం దానికి కారణం కావచ్చు. ఈ రోజు మీకు ఉండే పనుల వల్ల కాలీ లేకుండా సమయం గడచిపోతుంది. అప్పు కోసం మీ వద్దకు వచ్చినవారి గురించి అలోచించి నిర్ణయం తీసుకోండి. ఎవరికీ హామీలు ఉండటం, చేబదులుగా ఎలాంటి ఆధారం లేకుండా ధనం ఇవ్వటం వంటివి మీకు భవిష్యత్తులో సమస్య గా మారొచ్చు. జీవిత భాగస్వామితో కొద్దిపాటి గొడవలు ఏర్పడే అవకాశం ఉంది. దానికి వారి తరపు వారే కారణం అవ్వొచ్చు. ఏదేమైనా ఈ రోజు మీకు మిశ్రమంగా ఉండబోతుంది. ప్రతీ రోజు రాశిఫలాలు పొందటానికి టెలిగ్రామ్ లో మన ఛానల్ ను ఈ లింక్ ద్వారా ఫాలో అవ్వండి. లింక్: https://t.me/HinduDharmamVardhillaliChannel

కన్యా రాశి: మంచి సమయంగా చెప్పవచ్చు. ఆశించిన ఫలితాలను పొందగలుగుతారు. మీ కోర్కెలు నెరవేరే సమయంగా చెప్పవచ్చు. మీ పట్టుదలే మీకు విజయాన్ని తెచ్చిపెడుతుంది. ఆర్ధికంగా అద్బుతంగా ఉండబోతుంది. సమయానికి ధనం చేతికి అందుతుంది. కుటుంబ ఒత్తిడులు తప్పనిసరి. మీలో ఎవరికైనా పనులు వాయిదా వేసే అలవాటు ఉంటె, దాని వల్ల ఇబ్బందుల పాలు అయ్యే అవకాశం ఉంది. ప్రేమికుల మధ్య కొద్దిపాటి మనస్పర్ధలు ఏర్పడే అవకాశం ఉంది. ఏదైనా ఒక విషయాన్నీ గురించి మీరు తెలుసుకునే ప్రయత్నం చేస్తారు. దానికోసం మీరు పుస్తకాలు చదవటం, ఇతరులను అడగటం వంటివి చేసే అవకాశం ఉంది. ఆ విషయం పట్ల మీకు శ్రద్ద ఎన్నడూ, ఏవిషయంలోనూ లేనంతగా ఉండే అవకాశం ఉంది. ప్రతీ రోజు రాశిఫలాలు పొందటానికి టెలిగ్రామ్ లో మన ఛానల్ ను ఈ లింక్ ద్వారా ఫాలో అవ్వండి. లింక్: https://t.me/HinduDharmamVardhillaliChannel

తులా రాశి: మానసికంగా చాలా సంతోషంగా ఉండగలుగుతారు. భవిష్యత్తుకు సంబంధించి నూతన ప్రణాళికలు వేస్తారు. నూతన పద్దతులు అలవరచుకునే ప్రయత్నం చేస్తారు. కర్చులు తగ్గించుకుని, ధనాన్ని భవిష్యత్తు కోసం కూడబెట్టే విధంగా ఆలోచనలు చేస్తారు. ప్రతీ పనిలోనూ చాలా చురుగ్గా పాల్గొని ఉత్సాహంగా ఉంటారు. చేపట్టిన పనులు సకాలంలో పూర్తి అవుతాయి. మీరు ఆశించిన ఫలితాలు అందుకోగలుగుతారు. ప్రేమికులకు వ్యవహార జయం ఉంది. బంధుమిత్రులతో కలసి సమయాన్ని సరదాగా కాలక్షేపం చేస్తారు. అయితే ఆరోగ్య విషయంలో కాస్త జాగ్రత్త అవసరం. ప్రతీ రోజు రాశిఫలాలు పొందటానికి టెలిగ్రామ్ లో మన ఛానల్ ను ఈ లింక్ ద్వారా ఫాలో అవ్వండి. లింక్: https://t.me/HinduDharmamVardhillaliChannel

వృశ్చిక రాశి: మానసిక ఒత్తిడి అధికంగా ఉంది. దానికి ప్రధాన కారణం మీరు ఉండే ప్రదేశం కాని, మీరు ఉండే వ్యక్తులు కాని అయ్యే అవకాశం ఉంది. ఆకస్మిక ధనప్రాప్తి ఉంది. అదృష్టం వరిస్తుంది. వ్యాపారాలు విస్తరించే దిశగా ప్రయత్నాలు చేస్తారు. నూతన వ్రుత్తి, ఉద్యోగ, వ్యాపారాలు కలసి వస్తాయి. లేనిపోని విబేధాలు ఏర్పడే అవకాశం ఉంది. కావున ఇతరులతో మాట్లాడేటపుడు ఓపికగా మాట్లాడాలి. చిన్న చిన్న గొడవలే పెద్ద గొడవలుగా మరే అవకాశం ఉన్నందున, తప్పు ఇతరులదైనా మీరే సాధ్యమైనంత వరకు సర్దుకుపోవడం మంచిది. మీ మనస్సుకి నచ్చిన వారి గురించి అలోచించి కాస్త ఆందోళన చెందే అవకాశం ఉంది. గతంలో ఏదైనా విలువైనది పోగొట్టుకుంటే అది ఈ రోజు జ్ఞప్తికి వచ్చి మానసికంగా బాధిస్తుంది. జీవిత భాగస్వామి కొన్ని విషయాల్లో మీకు విసుగు కలిగించవచ్చు. ప్రతీ రోజు రాశిఫలాలు పొందటానికి టెలిగ్రామ్ లో మన ఛానల్ ను ఈ లింక్ ద్వారా ఫాలో అవ్వండి. లింక్: https://t.me/HinduDharmamVardhillaliChannel

ధనుస్సు రాశి: ఆర్ధికంగా బాగుండబోతుంది. స్థిరాస్తిలో పెట్టుబడి పెట్టినవారికి లాబాల పంటగా ఉండబోతుంది. సంతానం విషయంలో కాస్త ఇబ్బందులు ఎదుర్కొనే అవకాశం ఉంది. ప్రేమికులకు అంత అనుకూల సమయం కాదు. కొన్ని వ్యవహారాలు మానసికంగా బాధను కలిగించే అవకాశం ఉంది. ఈ రోజు ఇటువంటి మానసిక బాధలను దూరం చేయడానికి మీ కుటుంబ సబ్యులతో లేదా స్నేహితులతో సమయాన్ని వెచ్చించే అవకాశం ఉంది. ఈ రోజు సాధ్యమైనంత వరకూ ఒంటరిగా ఉండటానికే ప్రయత్నిస్తారు. కొన్ని విషయాల గురించి అలోచించి, నూతన మార్పులు తీసుకువస్తారు. అవి మిమ్మల్ని అభివృద్ధి బాటలో నడిపించే అవకాశం ఉంది. ఈ రోజు ఆర్ధికంగా తిరుగులేకుండా ఉండబోతుంది. ఈ ఒక్క విషయం మిగిలిన అన్ని సమస్యలకు సాధ్యమైనంత వరకు పరిష్కారం చూపుతుంది. ప్రతీ రోజు రాశిఫలాలు పొందటానికి టెలిగ్రామ్ లో మన ఛానల్ ను ఈ లింక్ ద్వారా ఫాలో అవ్వండి. లింక్: https://t.me/HinduDharmamVardhillaliChannel

మకర రాశి: ఆరోగ్యం మెరుగుపడుతుంది. ఆర్ధికంగా బాగుండబోతుంది. ఆధ్యాత్మికత వైపు మనస్సులాగుతుంది. దైవ దర్శనాలు చేసుకోవడం, పేదలకు దానా,ధర్మాలు చేయటం వంటివి చేసే అవకాశం ఉంది. ఈ రోజు మీరు నమ్మిన వ్యక్తి మిమ్మలి మోసం చేసే అవకాశం ఉంది. ప్రేమికులకు అనుకూల సమయం నడుస్తుంది. మీ మనస్సుకి నచ్చిన వారితో సంభాషించి మానసిక సంతోషాన్ని పొందగలుగుతారు. అయితే ఈ రోజు జరుగు ఒక సంఘటన మిమ్మల్ని ఇబ్బంది పెట్టేదిగా ఉండే అవకాశం ఉంది. చాలా వరకు మీ సమయాన్ని దానికోసమే వెచ్చించాల్సి వస్తుంది. దాంపత్య జీవితం సుఖమయంగా ఉండబోతుంది. ఈ రోజు మిశ్రంగా ఉండబోతుంది. ప్రతీ రోజు రాశిఫలాలు పొందటానికి టెలిగ్రామ్ లో మన ఛానల్ ను ఈ లింక్ ద్వారా ఫాలో అవ్వండి. లింక్: https://t.me/HinduDharmamVardhillaliChannel

కుంభ రాశి: మానసిక ఒత్తిడి, చిరాకు అధికంగా ఉంటుంది. కోపం విపరీతంగా పెరిపోయే అవకాశం ఉంది. నిజానికి కొన్ని సంఘటనలు మీ కోపాన్ని ఆవిధంగా పెంచేవిగా ఉండబోతున్నాయి. అయితే కోపాన్నీ, ఒత్తిడిని అదుపులో ఉంచుకోవడానికి ప్రయత్నించటం మంచిది. కొద్దిపాటి అనారోగ్య సూచనలు ఉన్నాయి. ఆర్ధికంగా బాగుంది. రాబడి పెరుగుతుంది. ఆర్ధిక విషయాల్లో మీరు చేసే ప్రయత్నాలు ఫలిస్తాయి. అద్బుతమైన లాభాలను అందుకునే అవకాశం ఉంది. శుభవార్తలు వింటారు. సమయాన్ని వినోదానికే కర్చు చేసే అవకాశం ఉంది. ప్రేమికులకు అనుకూల కాలం. వ్యవహార జయం ఉంది. మీ జీవిత భాగస్వామితో ఉన్న విభేదాలు పరిష్కరించే దిశగా ప్రయత్నాలు చేస్తారు. ప్రతీ రోజు రాశిఫలాలు పొందటానికి టెలిగ్రామ్ లో మన ఛానల్ ను ఈ లింక్ ద్వారా ఫాలో అవ్వండి. లింక్: https://t.me/HinduDharmamVardhillaliChannel

మీన రాశి: మీ పూర్వపు మిత్రులను కలసుకునే అవకాశం ఉంది. మానసికంగా చాలా సంతోషంగా ఉండగలుగుతారు. నూతన పెట్టుబడులకు అంత అనుకూల సమయం కాదు. తెలియని వాటిలో పెట్టుబడులు పెట్టడం అంత మంచిది కాదు. అనుభవజ్ఞుల సలహా తీసుకోవడం మంచిది. అయితే ప్రతీ చోటా మోసం చేసేవారు తప్పనిసరిగా ఉంటారు అనే విషయాన్ని గ్రహించాలి. మనసుకి నచ్చిన వారితో సమయాన్ని గడుపుతారు. ప్రతీ సమస్యను మీ నైపుణ్యంతో చాలా సులభంగా పరిష్కరించటం, ప్రశంశల వర్షం కురిపించేదిగా ఉండబోతుంది. ఈ రోజు మీకు చాలా అనుకూలంగా ఉండబోతుంది. జీవిత భాగస్వామితో కొద్దిపాటి విభేదాలు ఏర్పడే అవకాశం ఉంది. ప్రతీ రోజు రాశిఫలాలు పొందటానికి టెలిగ్రామ్ లో మన ఛానల్ ను ఈ లింక్ ద్వారా ఫాలో అవ్వండి. లింక్: https://t.me/HinduDharmamVardhillaliChannel

శుభం భూయాత్ 

Comments