
మేష రాశి: కర్చులు అధికంగా ఉండబోతున్నాయి. ఆర్ధిక పరమైన ఇబ్బందులు కొంత అయోమయ పరిస్థితి సృష్టించడం ద్వారా మీరు ఎందుకు కర్చుపెడుతున్నారో, ఎంత కర్చుపెడుతున్నారో, అంత కర్చుపెడ్డటం సరైనదేనా అని ఆలోచించే పరిస్థితి కూడా లేకుండా ఈ రోజు ఉండబోతుంది. దిని ద్వారా ధనాన్ని అధిక మొత్తంలో నష్ట పోయే అవకాశం కనబడుతుంది. మీ నైపుణ్యం తో పనులు పూర్తి చేసి ఆశించిన ఫలితాలను అందుకోగలుగుతారు. సంబంధ బాంధవ్యాలు మెరుగుపడతాయి. ఈ రోజు మీరు ప్రయాణాలు చేసే అవకాశం ఉంది. మీ ప్రయాణాలు మనసుకు ఆనందాన్ని కలిగించటంతో పాటు మీరు వెళ్ళిన పని దిగ్విజయంగా పూర్తి అయ్యి మీరు ఆశించిన ఫలితాన్ని ఇస్తుంది. ప్రతీ రోజు రాశిఫలాలు పొందటానికి టెలిగ్రామ్ లో మన ఛానల్ ను ఈ లింక్ ద్వారా ఫాలో అవ్వండి. లింక్: https://t.me/HinduDharmamVardhillaliChannel
వృషభ రాశి: సమయాన్ని మీ కుటుంబ సబ్యులతో ఆనందంగా గడుపుతారు. మీ సంతానంతో సరదాగా ఉంటారు. వ్రుత్తి, ఉద్యోగ పరంగా ఎదురయ్యే సమస్యలను అధికమించడానికి అనుభవజ్ఞుల సలహా తప్పనిసరి. జీవితం సాఫీగా సాగిపోతుంది. మనస్సంతిగా ఉంటుంది. ప్రేమికులకు శుభ సమయం నడుస్తుంది. వివాహ యోగం ఉంది. ఆధ్యాత్మిక చింతన ఉండబోతుంది. పూజలు, దైవ దర్శనాలు వంటివి చేసే అవకాశం ఉంది. సేవా కార్యక్రమాల్లో పాల్గొనే అవకాశం ఉంది. కుటుంబ సబ్యులతో కలసి బయటకు వెళ్ళే అవకాశం ఉంది. మీ జీవిత భాగస్వామితో కొన్ని విషయాలు చర్చిస్తారు. వారి యొక్క పూర్తి అభిప్రాయాన్ని సేకరించడానికి, మీరు అనుకున్న విషయాన్ని వారితో చెప్పే ప్రయత్నం చేస్తారు. ప్రతీ రోజు రాశిఫలాలు పొందటానికి టెలిగ్రామ్ లో మన ఛానల్ ను ఈ లింక్ ద్వారా ఫాలో అవ్వండి. లింక్: https://t.me/HinduDharmamVardhillaliChannel
మిథున రాశి: మనస్సు నిలకడగా ఉండదు. వ్యాయామం వంటివి చేయడం ద్వారా కాస్త మానసిక ప్రశాంతత పొందగలుగుతారు. పెట్టుబడులు పెట్టడానికి సమయం అంత అనుకూలం కాదు. వ్యాపార పరంగా కొంత నష్టాన్ని చవిచుడాల్సిన పరిస్థితి గోచరిస్తుంది. గాల్లో మేడలు కట్టేసి, ముందు వెనుక ఆలోచించకుండా ఎదో వచ్చేస్తుంది అని ముందూ వెనుకా ఆలోచించకుండా గతంలో పెట్టిన పెట్టుబడులు ఇప్పుడు నష్టాలను తెచ్చిపెడతాయి. లేనిపోని తగాదాలకు, వివాదాలకు దూరంగా ఉండండి. మీ మనస్సుకు నచ్చిన వారు లేదా మీ జీవిత భాగస్వామి కాస్త చికాకుగా, కోపంగా మాట్లాడే సరికి కొంచెం హర్ట్ అయ్యే అవకాశం ఉంది. కాని వారి ఒత్తిడి కారణంగా అలా మాట్లాడి ఉండవచ్చు అని గ్రహించి, సమస్య పెద్దది కాకుండా పరిష్కరించాలి. ప్రతీ రోజు రాశిఫలాలు పొందటానికి టెలిగ్రామ్ లో మన ఛానల్ ను ఈ లింక్ ద్వారా ఫాలో అవ్వండి. లింక్: https://t.me/HinduDharmamVardhillaliChannel
కర్కాటక రాశి: గతం కంటే మెరుగ్గా ఉండబోతుంది. ఆహారపు అలవాట్లు మార్చి, ఆరోగ్యం పై శ్రద్ద పెడతారు. అన్ని విధాలా మెరుగ్గా ఉండాలి అని ప్రయత్నం చేస్తారు. కర్చులు అధికంగా ఉండబోతున్నాయి. అయితే వీటిలో ఎక్కువగా ఒక శుభ కార్యార్ధం అయ్యి ఉండే అవకాశం ఉంది. ప్రతీ విషయంలో మీ కుటుంబ సబ్యుల సహాయ సహకారాలు వెన్నంటి ఉండటం ఎంతటి కష్టం నుండైన మీరు బయటపాడేందుకు దోహదం చేస్తుంది. ఆత్మ స్థైర్యాన్ని పెంచుకుని నూతన విధి విధానాలను అనుసరించాలి అనే మీ తపన తప్పక నెరవేరుతుంది. ప్రేమ విషయాలలో విజయం వరిస్తుంది. వివాహ యోగం ఉంది. సంతానంతో కొన్ని కీలక విషయాలు లేదా వారికి ఉపయోగపడే విషయాల గురించి చర్చించే అవకాశం ఉంది. సంతానాన్ని ఒక మంచి మార్గంలో పెట్టాలి అనే మీ ప్రయత్నం సత్ఫలితాలను ఇస్తుంది. ప్రతీ రోజు రాశిఫలాలు పొందటానికి టెలిగ్రామ్ లో మన ఛానల్ ను ఈ లింక్ ద్వారా ఫాలో అవ్వండి. లింక్: https://t.me/HinduDharmamVardhillaliChannel
సింహ రాశి: పని భారం అధికంగా ఉండటం వల్ల శారీరక శ్రమతో పాటు మానసిక ఒత్తిడి కూడా పెరుగుతుంది. మీ మంచితనం, అమాయకత్వం వల్ల ఇప్పటికే చాలా కోల్పోయి ఉండవచ్చు. అవి ఈ రోజు మీకు గుర్తుకు వచ్చి, బాధను కలిగిస్తాయి. నూతన పెట్టుబడులు పెట్టాలి అనుకునే వారికి కాలం కొంత అనుకూలంగా ఉంది. మీరు పెట్టే పెట్టుబడులు దీర్ఘకాలిక పెట్టుబడులు అయ్యేలా చూసుకోవడం మంచిది. ఒక శుభవార్త మీ కుటుంబంలో సంతోషాన్ని నింపేదిగా ఉండబోతుంది. గతంలో ఏమైనా కొద్దిపాటి విబేధాలు ఉంటె వాటిని సరిదిద్దుకునే ప్రయత్నం చేయడం మంచిది. ప్రతీ రోజు రాశిఫలాలు పొందటానికి టెలిగ్రామ్ లో మన ఛానల్ ను ఈ లింక్ ద్వారా ఫాలో అవ్వండి. లింక్: https://t.me/HinduDharmamVardhillaliChannel
కన్యా రాశి: ఈ రోజు మీరు చాల ఉత్సాహంగా ఉండగలుగుతారు. పనులు సకాలంలో పూర్తి అయ్యి ఆశించిన ఫలితాలు ఇస్తాయి. అయితే ఆర్ధిక పరమైన విషయాల్లో జాగ్రత్త అవసరం. గతంలో మీరు చేసిన పొరబాట్లు మళ్ళీ చేయకుండా జాగ్రత్త వచించాలి. తెలియని వారికి అప్పు ఇవ్వటం, ఇతరులకి హామీ ఉండటం వంటివి అంత మంచివి కావు. మీ కుటుంబ సభ్యలతో కొద్దిపాటి తగాదాలు ఏర్పడే అవకాశం ఉంది. మీ దాంపత్య జీవితం లో కూడా మనస్పర్ధలు ఏర్పడే అవకాశం ఉంది. నిజానికి గతంలో మీరు చేసిన పొరబాటు వల్లే ఈ రోజు మీ ఇద్దరికీ గోడవయ్యే అవకాశం ఉంది. అయితే మీరు ఆధ్యాత్మికత ద్వారా పశాంతతను పొందగలుగుతారు. ప్రతీ రోజు రాశిఫలాలు పొందటానికి టెలిగ్రామ్ లో మన ఛానల్ ను ఈ లింక్ ద్వారా ఫాలో అవ్వండి. లింక్: https://t.me/HinduDharmamVardhillaliChannel
తులా రాశి: ఆరోగ్యం విషయంలో జాగ్రత్త అవసరం. సమయానికి తగిన ఆహారాన్ని తీసుకోవడం, మంచి ఆహారపు అలవాట్లు, సమయానికి నిద్రపోవడం వంటి అలవాట్లు చేసుకోవాలి. లేకపోతే మీ ఆరోగ్యం మందగిస్తుంది. ఆర్ధిక పరమైన విషయాలు మిమ్మల్ని నిరస పరుస్తాయి. ఏదైనా మంచి వస్తువు కొనాలి అనుకున్నా, మీకు ఉండే ఆర్ధిక సమస్యల వలన అది కొనలేకపోవడం కొంత బాధను కలిగిస్తుంది. అయితే మీ కుటుంబ సబ్యులతో మీరు సమయాన్ని గడపడం ద్వారా మీ బాధలు అన్నీ కొంత సేపు మర్చిపోయి ఏదోక పనిలో నిమగ్నమవడం, ఏదోక విషయం గురించి చర్చించడంతో మీ ఒత్తిడి కాస్త తగ్గుతుంది. జీవిత భాగస్వామితో మీరు చేసే సంభాషణ వివాదాలకు దారితీసే విధంగా ఉండే అవకాశం ఉంది. దయచేసి ఎవరి దగ్గరా మీ అధికారాన్ని, బలాన్ని చూపించి గొడవ పెట్టుకోవడానికి(కారణం ఏదైనా, తప్పు ఎవరిదైనా) ప్రయత్నించకండి. అది మీకు బెనిసి కొట్టే అవకాశం ఉంది. ప్రతీ రోజు రాశిఫలాలు పొందటానికి టెలిగ్రామ్ లో మన ఛానల్ ను ఈ లింక్ ద్వారా ఫాలో అవ్వండి. లింక్: https://t.me/HinduDharmamVardhillaliChannel
వృశ్చిక రాశి: ఆర్ధికంగా బాగుంది. గతంలో పెట్ట్టిన పెట్టుబడులు ఇప్పుడు లాభాలను ఇస్తాయి. రాబడి పెరుగుతుంది. పనులు సకాలంలో పూర్తి అవుతాయి. నూతన వ్యాపార ప్రారంభ దిశగా ఆలోచనలు చేస్తారు. కుటుంబ సబ్యులతో మాట్లాడేటపుడు జాగ్రత్తగా ఉండాలి. అకారణ కలహా సూచనా ఉంది. దూర పయనాలు చేసే అవకాశం ఉంది. వ్యాపార నిమ్మిత్తం ఈ రోజు మీరు చేసే ప్రతీ పని భవిష్యత్తులో మంచి ఫలితాలను ఇవ్వబోతుంది. మీరు ఆశించిన ఫలితాలను అందుకోగలుగుతారు. సంతానం విషయంలో కొంచెం అసంతృప్తి ఉండే అవకాశం ఉంది. అవివాహితులకు వివాహ యోగం ఉంది. ప్రతీ రోజు రాశిఫలాలు పొందటానికి టెలిగ్రామ్ లో మన ఛానల్ ను ఈ లింక్ ద్వారా ఫాలో అవ్వండి. లింక్: https://t.me/HinduDharmamVardhillaliChannel
ధనుస్సు రాశి: ఉదర సంబంద అనారోగ్య సమస్యలు అధికంగా ఉంటాయి. ఏ చిన్న అనారోగ్య సమస్యను నిర్లక్ష్యం చేయకూడదు. వెంటనే వైద్యుని సంప్రదించి తగిన చికిత్స చేయించాలి. దీర్ఘకాలిక పెట్టుబడులు మంచి లాభాలను ఇస్తాయి. దీర్ఘకాలిక పెట్టుబడులు పెట్టడానికి ఈ రోజు సమయం అనుకూలంగా ఉంది. లేనిపోని విబేధాలు వచ్చే అవకాశం ఉంది. కావున తప్పు ఇతరులదైనా సహించి వదిలేయడమే మేలు. ఈ రోజు సమయాన్ని వినోదానికి కర్చు చేసే అవకాశం ఉంది అంటే సినిమా చూడటం, ఆటలు ఆడటం వంటి వాటికి సమయాన్ని వెచ్చిస్తారు. దాంపత్య జీవితం సంతోషంగా ఉండబోతుంది. ప్రతీ రోజు రాశిఫలాలు పొందటానికి టెలిగ్రామ్ లో మన ఛానల్ ను ఈ లింక్ ద్వారా ఫాలో అవ్వండి. లింక్: https://t.me/HinduDharmamVardhillaliChannel
మకర రాశి: శారీరక దృఢత్వాని పెంచుకోవాలి అనే ఆలోచన చేస్తారు. అంటే జిమ్ కు వెళ్ళటం, వ్యాయామం చేయడం వంటికి చేయాలి అనే ప్రయత్నం చేస్తారు. ఆర్ధికంగా బాగుంది. ఒత్తిడి తగ్గుముఖం పడుతుంది. కుటుంబ సబ్యులతో సమయాన్ని గడపడం ద్వారా మానసిక ప్రశాంతత లభిస్తుంది. ఈ రోజు సమయాన్ని వృధాగా కర్చు చేస్తారు. మీ జీవిత భాగస్వామితో గొడవలు ఏర్పడే అవకాశం ఉంది. దానికి కారణం మీరే అయ్యే అవకాశం ఉంది. అయితే ఇవి ఎప్పుడు ఉండేవే కాబట్టి పెద్దగ చింతించాల్సిన అవసరం లేదు. అలానే ఇతరులతో మాట్లాడేటపుడు జాగ్రత్త వహించాలి. మీ మాట తీరు లేదా మీ అభిప్రాయాన్ని వ్యక్తం చెయు విధానం ఇతరులను మానసికంగా బాధించవచ్చు. ప్రతీ రోజు రాశిఫలాలు పొందటానికి టెలిగ్రామ్ లో మన ఛానల్ ను ఈ లింక్ ద్వారా ఫాలో అవ్వండి. లింక్: https://t.me/HinduDharmamVardhillaliChannel
కుంభ రాశి: పనులు అతికష్టం మీద కాని పూర్తి కావు. శ్రమ, ఒత్తిడి అధికంగా ఉండబోతున్నాయి. ఆర్ధికంగా గతంకంటే మెరుగ్గా ఉండబోతుంది. గతంలో పెట్టిన పెట్టుబడులు ఇప్పుడు రాబడిని ఇస్తాయి. నూతన పెట్టుబడులు పెట్టె ముందు అనుభవజ్ఞుల సలహా తీసుకోవడం, మీ కుటుంబ సబ్యుల యొక్క అభిప్రాయాన్ని తెలుసుకోవడం మర్చిపోకండి. ఇది మీకు ఎంతగానో ఉపయోగపడనుంది. ప్రేమికులకు అనుకూల కాలం నడుస్తుంది. ఉహల్లో విహరించే అవకాశం ఉంది. మానసికంగా చాలా సంతోషంగా ఉంటారు. ఈ రోజు మీలో కొందరు దైవ దర్శనాలు చేసుకునే అవకాశం ఉంది అలానే బంధు మిత్రులను కలుసుకునే అవకాశం కూడా ఉంది. ప్రతీ రోజు రాశిఫలాలు పొందటానికి టెలిగ్రామ్ లో మన ఛానల్ ను ఈ లింక్ ద్వారా ఫాలో అవ్వండి. లింక్: https://t.me/HinduDharmamVardhillaliChannel
మీన రాశి: సమయానికి తగిన విధంగా మీ నిర్ణయాలను మార్చటం తదనుగుణంగా పనులు చేయటం ద్వారా లభ్ధిని పొందుతారు. సమస్యల ఊబి నుండి ఇప్పుడిప్పుడే గట్టేక్కుతున్నట్టుగా మీకు అర్ధం అవుతుంది. కుటుంబ సబ్యుల యొక్క పూర్తి సహాయ సహకారాలు మీకు ఉంటాయి. పనులలో విజయం సాధిస్తారు. ఆర్ధిక సమస్యలు తగ్గుతాయి. గత కొద్దిరోజులుగా ఏదైనా ఒక సమస్యతో సతమతమవుతుంటే నిన్నా, ఈ రోజు జరిగిన కొన్ని పరిణామాలా వల్ల ఆ సమస్యల నుండి బయట బడే అవకాశం ఉంది. కాస్త ఉరట చెందుతారు. ప్రయాణాలు చేసే అవకాశం ఉంది. వ్యాపార పరంగా మీరు చేసే ప్రతీ పని ఈ రోజు మీకు కలసి వస్తుంది. మీ జీవిత భాగస్వామితో కొద్దిపాటి మనస్పర్ధలు ఏర్పడే అవకాశం ఉంది. ప్రతీ రోజు రాశిఫలాలు పొందటానికి టెలిగ్రామ్ లో మన ఛానల్ ను ఈ లింక్ ద్వారా ఫాలో అవ్వండి. లింక్: https://t.me/HinduDharmamVardhillaliChannel
శుభం భూయాత్
Comments
Post a Comment
ఇక్కడ మీ కామెంట్ రాయండి