
మేషరాశి:
స్త్రీమూలక ధన లభ్ది ఉంది. ఒక స్త్రీ కారణం ద్వారా కానీ, ఒక స్త్రీ చే కానీ మీకు ఆర్ధిక లబ్ది చేకూరబోతుంది. మీ కోరికలు నెరవేర్చుకునే దిశగా ప్రయత్నాలు చేస్తారు. ఈ రోజు పట్టుదలతో మీరు చేసే పనులు పూర్తి అయ్యి, ఆశించిన ఫలితాలు ఇస్తాయి. ప్రేవ్యవహారాలు కానీ, ఏదైనా ముఖ్యమైన పని సంబంధిత విషయాన్నీ సంబంధిత వ్యక్తులతో చర్చించాలి అనుకుంటే, ఈ రోజు అనుకూలంగా ఉంది. శుభ ఫలితాలు అందుకుంటారు. ఈ రోజు మీకు బాగానే ఉంది.
వృషభ రాశి: ఒత్తిడి అధికంగా ఉండబోతుంది. ఆర్ధిక పరమైన విషయాల్లో జాగ్రత్త వహించాలి. తెలియని వారికి అప్పు ఇవ్వకూడదు. ఎవరికీ హామీ ఉండటం లాంటివి చేయకూడదు. దీని వల్ల ఇబ్బందులు ఎదురయ్యే అవకాశం ఉంది. మనసులోకి వివిధ కోరికలు వస్తాయి. వాటిని అడుపుచేసుకునే ప్రయత్నం చేయండి. సమయానికి అనుగుణంగా ప్రవర్తించడం, మార్పులు చేయడం ద్వారా పనులలో విజయం సిద్ధిస్తుంది. ఎప్పటి నుండో పూర్తి కాకుండా మిమ్మల్ని వేధిస్తున్న పని విషయంలో మీరు మీ విధానాన్ని మార్చుకుని ప్రయత్నించి చూడండి. నూతన విధానాలను అనుసరించటం ద్వారా విజయ ప్రాప్తి ఉంది. ఏ పనిలో శ్రద్ధ పెట్టలేకపోతారు. ఏదైనా చేద్దాం అని మొదలుపెడితే, ఎవరొకరు పిలవడం ఏదొక పని చెప్పడం వంటి వాటి ద్వారా మొదలుపెట్టిన పని కొద్దిపాటి ఆటంకాలు ఏర్పడే అవకాశం ఉంది.
మిధున రాశి:
ఈ రోజు జరిగే కొన్ని సంఘటనలు మిమ్మల్ని మానసికంగా బాధించే విధంగా ఉంటాయి. డబ్బు చేబదులు ఇచ్చేముందు ఒకసారి ఆలోచించండి. పత్రం రాయడానికి అంత పెద్ద మొత్తం కాకపోవచ్చు లేదా వారితో మీకు ఉండే అనుబంధం అడ్డు రావచ్చు. కావున ధనం ఎలాంటి ఆధారం లేకుండా అప్పు ఇవ్వాల్సిన పరిస్థితి రావచ్చు. అటువంటప్పుడు ఒకటికి రెండు సార్లు ఆలోచించి నిర్ణయం తీసుకోండి. నూతన పెట్టుబడులు పెట్టడానికి సమయం అంత అనుకూలంగా లేదు. అవకాశాలు అంది వస్తాయి. వాటిలో మంచిది ఎన్నుకోవడంలో అనుభవజ్ఞులు సహాయం తీసుకోండి. ఈ రోజు సమయం ఏదొక పని నిమ్మిత్తం కాలీ లేకుండా ఉండబోతుంది. అయితే మీకు అవసరమైన పనులకంటే అనవసర పనులకే సమయాన్ని అధికంగా కేటాయించే అవకాశం ఉంది.
కర్కాటక రాశి:
శ్రమ అధికంగా ఉండబోతుంది. ఒత్తిడి పెరుగుతుంది. ఊహించని విధంగా ఇతరులు చేయాల్సిన పనులు కూడా మీరు చేయాల్సి రావడం మీకు మరిత కోపాన్ని, ఆవేశాన్ని కలిగిస్తుంది. వ్యాపారస్తులకు లాభాలు ఉన్నాయి. ఆర్ధికంగా ఆశించిన ఫలితాలు అందుకోగలుగుతారు. మీ చాకచక్యం తెలివితేటలతో సమస్యలనుండి బయట పడతారు. రియల్ ఎస్టేట్ రంగం లో ఉన్న వారికి అనుకూల సమయం నడుస్తుంది. కళారంగం వారికి అద్భుతంగా ఉండబోతుంది. ప్రేమికులకు అనుకూల సమయం నడుస్తుంది. విజయం వరిస్తుంది. దాంపత్య జీవితం సుఖమయం కాబోతుంది. అంతా శుభమే జరుగుతుంది.
సింహ రాశి:
కండరాల సంబంధిత నొప్పులు ఇబ్బంది పెట్టే అవకాశం ఉంది. దూరపు ప్రయాణాలు వాయిదా వేయడం మంచిది. వాటి వల్ల శ్రమ అధికం గా ఉంది. మీ ఆరోగ్యం పై ప్రభావం చూపే విధంగా ఉంటుంది. కావున అనవసరపు ప్రయాణాలు మనుకోవడం మంచిది. ఈ రోజు మీరు చేసే పనుల వల్ల మీ ఆర్ధిక పరిస్థితి దెబ్బతింటుంది. మీ చుట్టూ జరుగుతున్న పరిణామాలు గ్రహించాలి, తదనుగుణంగా ప్రవర్తించాలి. ఈ రోజు మీ మనసుకి నచ్చిన వారితో విభేదాలు రావడం మరొక ఇబ్బందిగా ఉండబోతుంది. కావున మీకు ఎంత ఒత్తిడి కోపం ఉన్నా వారితో మాట్లాడేటప్పుడు శాంతం వహించండి. అంత మంచే జరుగుతుంది.
కన్యారాశి:
మానసిక ప్రశాంతత కలుగుతుంది. ఒత్తిడి తగ్గి కాస్త మనస్సంతిగా ఉండగలుగుతారు. రావలసిన ధనం సమయానికి రాకపోవడం వల్ల అప్పు చేసి పరిస్థితి గోచరిస్తుంది. మనస్సులోకి వచ్చే కోరికలను అదుపు చేయాలి. లేకపోతే తప్పు దారిలో నడచే అవకాశం ఉంది. మీ ఆత్మీయులతో విబేధాలు ఏర్పడటం మిమ్మల్ని కాస్త కలవరపెడుతోంది. వృత్తి, ఉద్యోగ పరంగా బాగుండ బోతుంది. మీకు మిశ్రమ ఫలితాలను గ్రహ స్థితి సూచిస్తుంది.
తులారాశి:
మీ కుటుంబ సభ్యులకు లేదా మీ వర్గం వారికి మీరు ఎంత చేసినా మరింత చేయాలి అనుకునే వారి స్వభావం చూసి మీకు విసుగేస్తుంది. ఇంత చేసిన కనీసం మెచ్చుకోకుండా, సంతృప్తి పడకుండా ఇంకా ఆశించే వారి స్వార్ధ పద్ధతికి మీకు చిరాకు వేస్తుంది. ఆర్ధిక పరమైన విషయాల్లో జాగ్రత్త అవసరం. వృత్తి ఉద్యోగ పరంగా మీరు చేసే మార్పులు కలసి వచ్చేవిగా ఉండబోతున్నాయి. జీవిత భాగస్వామితో ఆనందంగా సమయం గడపగలుగుతారు. అవివహితు ప్రయత్నం చేస్తే తప్పక శుభ ఫలితాలు అందుకుంటారు.
వృశ్చిక రాశి:
ఆర్ధిక పరంగా బాగుంది. మీకు రావలసిన ఆస్తిపాస్తులు ఏమైనా ఉంటే అవి వచ్చే అవకాశం ఉంది. ఈ రోజు మీరు కాలీ లేకుండా చాలా బీసీ గా ఉండబోతున్నారు. ఆర్ధిక పరంగా మీ మాతృ సంబంధ బంధు వర్గం వారు మీకు తగిన సహాయం అందిస్తారు. ఆర్ధిక విషయాల్లో ఇతరుల జోక్యం ఎంత తప్పిస్తే అంత మంచిది. మీ బాధలను, సుఖాలను మీ జీవిత భాగస్వామితో మనస్ఫూర్తిగా పంచుకుని కాస్త ఊరట చెందుతారు. మీ జీవిత భాగస్వామి యొక్క పూర్తి సహాయ సహకారాలు మీకు ఉండటం కొండంత అండ వలే ఉండబోతుంది. పనులు వాయిదా వేసే పద్దతి వల్ల ఇబ్బంది పడతారు.
ధనుస్సు రాశి:
ఆరోగ్యం విషయంలో జాగ్రత్త అవసరం. ఈ రోజు వచ్చే అనారోగ్య సమస్యల వల్ల మీ పని మీద శ్రద్ధ చూపలేకపోతారు. స్థిరాస్తి సంబంధ విషయాలు ఈ రోజు చర్చకు వచ్చే అవకాశం ఉంది. కోరికలు నెరవేరే సమయంగా దీనిని చెప్పవచ్చు. ప్రస్తుత కాలం మీకు చాలా అనుకూలంగా ఉండబోతుంది. మీరు చేసే ప్రతీ పనిలో విజయం లభిస్తుంది.
మకర రాశి:
బంధు మిత్రులతో సమయాన్ని ఆనందంగా గడుపుతారు. ఆర్ధికంగా బాగుండీమ్ ఆకస్మిక ధనలబ్ది ఉంది. అవివహితులకి వివాహ యోగం ఉంది. ప్రేమికులకు ప్రేమ వ్యవహారాల్లో విజయం లభిస్తుంది. ఈ రోజు లేనిపోని విబేధాలు ఏర్పడే అవకాశం ఉంది. దాంపత్య జీవితం ఆనందంగా ఉండబోతుంది. ఈ రోజు మీకు బాగానే ఉంది.
కుంభ రాశి:
లేనిపోని నిందలకు మీరు బాద్యులు కావలసి వస్తుంది. లేనిపోని ఖర్చులు తగ్గించుకునే దిశగా ప్రయత్నాలు చేస్తారు. భవిష్యత్తును ఊహించి మీరు ధనం పొదుపు చేయాలి అని చూస్తారు. నూతన వ్యాపారాలు మొదలు పెట్టే దిశగా ప్రయత్నాలు జరుగుతాయి. మీ తల్లితండ్రుల యొక్క పూర్తి సహాయ సహకారాలు మీకు ఉంటాయి. నూతన విధానాలను అనుసరించటం ద్వారా పనులు సకాలంలో పూర్తి అవుతాయి. కుటుంబ సభ్యులతో సమయాన్ని వెచ్చిస్తారు. ఈ రోజు మీకు బాగానే ఉంది.
మానసిక ఒత్తిడి తగ్గించుకునే ప్రయత్నం చేస్తారు. నూతన పెట్టుబడులకు సమయం అనుకూలంగా ఉంది. భావిష్యత్తుకి సంబందించిన కీలక విషయాలపై నిర్ణయాలు తీసుకుంటారు. సంతానం విషయాలం కొంచెం అసంతృప్తి ఏర్పడుతుంది. బంధుమిత్రుల సహాయ సహకరాలతో పనులు పూర్తి చేసి, ఆశించిన ఫలితాలు అందుకుంటారు.
Comments
Post a Comment
ఇక్కడ మీ కామెంట్ రాయండి