
మేష రాశి: ఆరోగ్యం విషయంలో జాగ్రత్త అవసరం. ఆర్ధిక పరమైన విషయాలలో స్వల్ప నష్టాలూ ఉన్నాయి. వ్యాపారస్తులు వ్యాపార నిమ్మిత్తం అప్పు చేయవలసిన పరిస్థితి గోచరిస్తుంది. మానసిక ఒత్తిడిని తగ్గించుకోవాలి. లేకపోతే అది మీ ఆరోగ్యం పై ప్రభావం చూపే అవకాశం ఉంది. లేనిపోని కర్చులు తగ్గించుకోవాలి. అవసరం అయితే మాత్రమే అప్పు చేయండి. ప్రతీ చిన్న పనికి ఇతరుల దగ్గర చేయచాచటం మీ ప్రతిష్టకు బంగపాటుగా ఉంటుంది. ఈ రోజు ఇతరులతో మాట్లాడేటపుడు, ముఖ్యంగా మీకు బాగా కావలసిన వ్యక్తులతో మాట్లాడేటపుడు మీకు ఎన్ని ఇబ్బందులు ఉన్నా, కోపాన్ని, ఒత్తిడిని పక్కన పెట్టి, వారితో ప్రశాంతంగా మాట్లాడటానికి ప్రయత్నించండి. తప్పు ఇతరులది అయినా సాధ్యమైనంత వరకూ సామరస్యంగానే సమస్యను పరిష్కరించడానికి ప్రయత్నించండి. నిరుద్యోగులకు ఉద్యోగ అవకాశాలు ఉన్నాయి, ఇంటర్వ్యు వంటి వాటికీ ఈ రోజు హాజరయ్యే అవకాశం ఉంది. మీ జీవిత భాగస్వామితో కలిసి ఈ రోజు మీరు బయటకు వెళ్ళే అవకాశం ఉంది. ప్రతీ రోజు రాశిఫలాలు పొందటానికి టెలిగ్రామ్ లో మన ఛానల్ ను ఈ లింక్ ద్వారా ఫాలో అవ్వండి. లింక్: https://t.me/HinduDharmamVardhillaliChannel
వృషభ రాశి: ఈ రోజు సమయాన్ని వృధాగా కర్చు చేయడానికే ఇష్టపడతారు. బద్దకంగా అనిపించొచ్చు. అయితే ఈ రోజు మీరు ఆర్ధిక విషయాలలో అద్బుత ప్రతిభ కనబరుస్తారు. వ్యాపారాలను లాభాల బాటలో పెట్టడం కాని, నూతన ఆదాయ మార్గాలను సృష్టించటం కాని, ఉన్న ధనాన్ని స్టాక్ మార్కెట్ వంటి వాటిలో పెట్టుబడి పెట్టి మరింతగా ఆ ధనాన్ని పెంచే విధంగా గాని మీరు ప్రయత్నాలు చేస్తారు. ఈ రోజు మీ బంధు మిత్రులను కలసుకుని ఆనందంగా ఉండగలుగుతారు. అన్నిటా మీదే పై చేయి అవుతుంది. విజయం వరిస్తుంది. పనులు సకాలంలో పూర్తి అయ్యి, ఆశించిన ఫలితాలను ఇస్తాయి. ప్రతీ రోజు రాశిఫలాలు పొందటానికి టెలిగ్రామ్ లో మన ఛానల్ ను ఈ లింక్ ద్వారా ఫాలో అవ్వండి. లింక్: https://t.me/HinduDharmamVardhillaliChannel
మిథున రాశి: మానసిక ప్రశాంతత లభిస్తుంది. మీలో ఎవరైన గత కొంత కాలంగా ఏదైనా ఒక పని వల్ల కాని, ఇతర మానసిక బెంగ వంటివి వల్ల కాని సంతోషంగా లేనట్లయితే ఈ రోజు మనసు కుదుటపడుతుంది. సంతోషంగా ఉండగలుగుతారు. ఎంతో కాలంగా మిమ్మల్ని వేధిస్తున్న ఆర్ధిక సమస్యలు తీరే సమయంగా ప్రస్తుత కాలాన్ని చెప్పవచ్చు. ఏదోక రూపంలో సమయానికి ధనం చేతికి అందుతుంది. తద్వారా మీరు ఎలాంటి ఇబ్బంది లేకుండా హాయిగా ఉండగలుగుతారు. కుటుంబ సబ్యులతో గడపడానికి తగు సమయం ఈ రోజు మీకు లభిస్తుంది. నిర్ణయాలు తీసుకునేటపుడు మీకు బాగా నమ్మకమైన వారిని సంప్రదించి, వారి సలహా తీసుకోవడం మంచిది. అన్నీ నాకేతెలుసు లేదా ఈ విషయంలో వారికి నా అంత బాగా తెలీదూ వంటి ఆలోచనలు పక్కన పెట్టి, అసలు వారేమి సలహా ఇస్తారో కూడా తెలుసుకోండి. ఏ పుట్టలో ఏ పాముందో ఎవరికి తెలుసు. బహుశా వారిచ్చే సలహాయే మీకు అద్బుతంగా మేలు చేస్తుందేమో. ఈ రాశి వారికి ప్రేమ వ్యవహారాలు అనుకూలీస్థాయి. అయితే ఈ రోజు సాధ్యమైనంత వరకూ ఒంటరిగానే సమయాన్ని గడపడానికి ఇష్టపడతారు. ప్రతీ రోజు రాశిఫలాలు పొందటానికి టెలిగ్రామ్ లో మన ఛానల్ ను ఈ లింక్ ద్వారా ఫాలో అవ్వండి. లింక్: https://t.me/HinduDharmamVardhillaliChannel
కర్కాటక రాశి: చాలా ఉల్లాసంగా, ఉత్సాహంగా సమయాన్ని గడుపుతారు. మీ స్నేహితులను కలసుకుని నచ్చిన ఆహారం, పానీయం వంటివి స్వీకరిస్తారు. మీ ఆత్మీయుల సహాయంతో ఆర్ధిక ఇబ్బందుల నుండి గట్టెక్కే అవకాశం ఉంది. సంతానం కోసం ఎదురుచేసే వారికి శుభవార్తలు వినే అవకాశం ఉంది. వివాహ ప్రయత్నాలు చేసే వారికి వివాహ యోగం ఉంది. మిమ్మల్ని మానసికంగా సంతోష పరచే ఆలోచనలు, కోరికెలు ఈ రోజు మీకు కలిగే అవకాశం ఉంది. ఉద్యోగస్తులకు ప్రమోషున్లు, ఇంక్రిమెంట్లు వచ్చే అవకాశం ఉంది. ఈ రోజు మనసు ఒక చోట శరీరం మరొక చోట అనేట్టుగా మీ ప్రవర్తన ఉండే అవకాశం ఉంది. జీవిత భాగస్వామితో కలసి ఆనందంగా సమయాన్ని గడుపుతారు. ప్రతీ రోజు రాశిఫలాలు పొందటానికి టెలిగ్రామ్ లో మన ఛానల్ ను ఈ లింక్ ద్వారా ఫాలో అవ్వండి. లింక్: https://t.me/HinduDharmamVardhillaliChannel
సింహ రాశి: ఆరోగ్యం పట్ల తగు శ్రద్ద అవసరం. ఇప్పటికే అనారోగ్య సమస్యలతో బాధ పడేవారు ఏ చిన్న విషయంలోనూ అశ్రద్ద చేయకూడదు. సమయానికి మాత్రలు వేసుకోవడం, తగిన ఆహారాన్ని తినడం, మానసిక ఒత్తిడిని తగ్గించుకునే ప్రయత్నం చేయడం ద్వారా ఆరోగ్య పరమైన ఇబ్బందుల నుండి బయట పడతారు. కర్చులు అధికంగా ఉన్నప్పటికీ, ఏదోక రూపంలో సమయానికి ధనం చేతికి అందటం వల్ల ఈ రోజు ఆర్ధికంగా వచ్చే ఇబ్బందులు ఏమి ఉండవు. మీ దూరపు బందువులు ఈ రోజు మిమ్మల్ని కలసుకుని కొన్ని విషయాల గురించి చర్చించే అవకాశం ఉంది. జీవిత భాగస్వామితో కొద్దిపాటి మనస్పర్ధలు వచ్చే అవకాశం ఉంది. అంటే మీకు ఉన్న అనారోగ్య సమస్యల వలన కాని, ఇతర ఒత్తిడులను కాని వారిపై చూపించడం, కసరు కోవడం వంటివి చేయడం ద్వారా వారిని మానసికంగా బాధించిన వారు అవుతారు. అందుకనే ఈ రోజు మీరు ఒత్తిడిని తగ్గించుకునే ప్రయత్నం చేయాలి అని ముందుగానే చెప్పటం జరిగింది. కీలక నిర్ణయాలు తీసుకోవడానికి, ముఖ్యమైన పనులు చేయడానికి(కార్యాచరణ) ఈ రోజు మీకు బాగా కలసివచ్చే అవకాశం ఉంది. ఆథ్యాత్మిక చింతన ఉంటుంది. ప్రతీ రోజు రాశిఫలాలు పొందటానికి టెలిగ్రామ్ లో మన ఛానల్ ను ఈ లింక్ ద్వారా ఫాలో అవ్వండి. లింక్: https://t.me/HinduDharmamVardhillaliChannel
కన్యా రాశి: ఎంతో కాలంగా అనారోగ్య సమస్యలతో బాధ పడేవారు ఆ అనారోగ్య సమస్యల నుండి బయటపడే అవకాశం ఉంది. ఆరోగ్యం మెరుగుపడుతుంది. నూతన పెట్టుబడులు పెట్టడానికి ఇది ఒక మంచి సమయంగా చెప్పవచ్చు. ఆర్ధికంగా మీకు బాగా కలసి వస్తుంది. ఇతరులతో చర్చించేటపుడు మీరు ఎంత శాంతంగా మాట్లాడిన మీ మీద అరచే విధంగా ఇతరుల ప్రవర్తనా శైలి ఉండే అవకాశం ఉంది. ముఖ్యంగా కుటుంబ సబ్యులతో మీకు కొద్దిపాటి విబేదాలు ఏర్పడే అవకాశం ఉంది. దీనికి కారణం మీ ప్రవర్తన, మనస్తత్వమే అవుతుంది. అవతలి వారి గురించి కూడా అలోచించి మాట్లాడినపుడు సమస్యలు అనేవి వచ్చే అవకాశం లేదు. అంతా మీకు నచ్చినట్టుగానే జరగాలి అనే స్వభావం, అభిప్రాయం గనుక ఉంటె, ఈ రోజు అది బెనసికొట్టే అవకాశం ఉంది. ఈ రోజు ఉద్యోగ పరంగా చాలా అనుకూలంగా ఉండబోతుంది. ప్రేమికులకు అనుకూలంగా ఉండబోతుంది. శుభ సమయం నడుస్తుంది. మనసు స్థిరం ఉండదు. రకరకాల ఆలోచనలు వస్తాయి. ప్రతీ రోజు రాశిఫలాలు పొందటానికి టెలిగ్రామ్ లో మన ఛానల్ ను ఈ లింక్ ద్వారా ఫాలో అవ్వండి. లింక్: https://t.me/HinduDharmamVardhillaliChannel
తులా రాశి: సమయాన్ని మీకు నచ్చిన పనిని చేయడానికి మాత్రమే ఉపయోచించే ప్రయత్నం చేస్తారు. వంశపారంపర్యంగా మీకు రావలసిన ఆస్తిపాస్తులు ఏమైనా ఉంటె అవి ఈ రోజు మీకు లభించే అవకాశం ఉంది లేదా ఆ విషయాలకు సంబంధించి సానూకుల వాతావరణం ఏర్పడుతుంది(తగాదలలో ఉంటె). మీ బందువుల సహాయంతో ఆర్ధిక ఇబ్బందుల నుండి బయట పడతారు. సంబంధ బాంధవ్యాలు మెరుగుపడతాయి. గతంలో ఎవరితోనైనా మీకు విబేదాలు ఉంటె అవి సమసిపోతాయి. మంచి బంధం ఏర్పడుతుంది. ఈ రోజు మీరు చాలా ఉల్లాసంగా ఉండగలుగుతారు. ఈ రోజు మీకు చాల బాగుండబోతుంది. ప్రతీ రోజు రాశిఫలాలు పొందటానికి టెలిగ్రామ్ లో మన ఛానల్ ను ఈ లింక్ ద్వారా ఫాలో అవ్వండి. లింక్: https://t.me/HinduDharmamVardhillaliChannel
వృశ్చిక రాశి: ఆకస్మిక ధనప్రాప్తి ఉంది. ఉహించని విధంగా ఈ రోజు మీకు ధనం చేతికి అందుతుంది. ప్రస్తుతం మీకు శుభసమయం నడుస్తుంది. మీరు చేసే ప్రతీ పనిలోనూ విజయం సాధిస్తారు. ముఖ్యంగా నూతన ఆదాయ మార్గాలను సృష్టించుకోవడం, వ్యాపారాలు పునరుద్దరించటం, విస్తరించుకోవడం, ఉద్యోగ ప్రయత్నాలు వంటి వాటిలో విజయాన్ని పొందే అవకాశాలు చాలా ఎక్కువగా ఉన్నాయి. సమాజంలో ఉన్నత స్థాయిలో ఉండే వ్యక్తులతో పరిచయాలు ఏర్పడతాయి. ఇవి మీకు భవిష్యత్తులో ఎంతగానో ఉపయోగపడతాయి. భార్య భర్తల మధ్య కొద్దిపాటి విబేదాలు వచ్చిన, వాటంతట అవే సమసిపోతాయి. గత జ్ఞాపకాలు జ్ఞప్తికి వస్తాయి. మానసికంగా చాలా సంతోషంగా ఉండగలుగుతారు. ప్రతీ రోజు రాశిఫలాలు పొందటానికి టెలిగ్రామ్ లో మన ఛానల్ ను ఈ లింక్ ద్వారా ఫాలో అవ్వండి. లింక్: https://t.me/HinduDharmamVardhillaliChannel
ధనుస్సు రాశి: జీవిత భాగస్వామితో కలసి ఆనందంగా ఉండగలుగుతారు. ఆర్ధిక పరిస్థితిని మెరుగు పరచుకోనేందుకు గాను మీకు కొన్ని నూతన మార్గాలు ఏర్పడతాయి. ప్రస్తుతం మీ గ్రహస్థితిని అనుసరించి మీరు చేయు ప్రతీ పని ధర్మబద్దమైనది అయి ఉండాలి. లేకపోతే కచ్చితంగా తగిన మూల్యం చెల్లించుకోక తప్పదు. ఈ రోజు ప్రేమికులకు ఒక అద్బుతమైన రోజుగా ఉండబోతుంది. దాంపత్య పరమైన సమస్యలు తొలగుతాయి. వైవాహిక జీవితం సాఫీగా ఉండబోతుంది. మానసిక ప్రశాంతత ఏర్పడుతుంది. అనుభవజ్ఞులు, తెలివైన వారితో సంభాషించి నూతన విషయాలు తెలుసుకుంటారు. ఈ రోజు మీకు గతం కంటే బాగుండబోతుంది. ప్రతీ రోజు రాశిఫలాలు పొందటానికి టెలిగ్రామ్ లో మన ఛానల్ ను ఈ లింక్ ద్వారా ఫాలో అవ్వండి. లింక్: https://t.me/HinduDharmamVardhillaliChannel
మకర రాశి: మిమ్మల్ని మీరు మెరుగుపరచుకునే దిశగా అడుగులు వేస్తారు. అందులో భాగంగా పుస్తక పటణం, ట్రైనింగ్ కు వెళ్ళటం వంటివి చేసే అవకాశం ఉంది. ఆర్ధిక పరమైన ఇబ్బందులు ఎదురయ్యే అవకాశం ఉంది. ఇస్తాను అన్నవారు సమయానికి ధనాన్ని సర్దుబాటు చేయలేకపోవడం వల్లనో, మీరు ఆశించినట్టుగా సమయానికి ధనం చేతికి అందక పోవడం వల్లనో, మీకు ఇబ్బందులు ఎదురయ్యే అవకాశం ఉంది. నమ్మిన వ్యక్తులే మోసం చేసే పరిస్థితి ఏర్పడవచ్చు. నిజానికి మీకు శని పీరియడ్ నడవడం వలన ఇలాంటివి ఎదుర్కొనే అవకాశం ఉంది. ఇప్పుడు ఇలాంటి విషయాలు మిమ్మల్ని బాధించినా శని భగవానుడు ఎవరు మంచి వారో ఎవరు చెడ్డవారో మీకు తెలియచేస్తారు. అదే శని గ్రహ మహిమ. అనుభవించేటప్పుడు కష్టంగా ఉన్నా, ప్రతిఫలం అమోఘంగా ఉంటుంది. వ్రుత్తి, ఉద్యోగ పరంగా మార్పులు చేయాలి అనుకునేవారికి సమయం అనుకూలంగా ఉంది. సమాజంలో గౌరవ మర్యాదలు పెరుగుతాయి. ప్రతీ రోజు రాశిఫలాలు పొందటానికి టెలిగ్రామ్ లో మన ఛానల్ ను ఈ లింక్ ద్వారా ఫాలో అవ్వండి. లింక్: https://t.me/HinduDharmamVardhillaliChannel
కుంభ రాశి: అనుమానంతో చేసే ఏ పనీ ముందుకు వెళ్ళదు. ధైర్యే సాహసే లక్ష్మి అన్నట్టుగా ప్రతీ పనిని నమ్మకంతో, ధైర్యంగా మొదలు పెట్టి, విజయాన్ని అందుకోవాలి. ఆర్ధికంగా అద్బుతంగా ఉండబోతుంది. రాబడి పెరుగుతుంది. మీకు ఎవరైనా ధనం ఇవ్వవలసి ఉంటే, ఈ రోజు ఆ ధనం మీకు వచ్చే అవకాశం ఉంది. అలానే మీకు ఉన్న కొద్దిపాటి అప్పులు ఏమైనా, మీరు తెర్చేసేన్తగా మీ ఆర్ధిక పరిస్థితి ఉండబోతుంది. ప్రతీ పనిని ఉల్లాసంగా చేస్తారు. ఈ రోజు మీరు చాలా సంతోషంగా ఉండగలుగుతారు. శత్రువులపై విజయం సాధిస్తారు. సమయాన్ని కాలక్షేపం చేయడానికి వెచ్చిస్తారు. ప్రతీ రోజు రాశిఫలాలు పొందటానికి టెలిగ్రామ్ లో మన ఛానల్ ను ఈ లింక్ ద్వారా ఫాలో అవ్వండి. లింక్: https://t.me/HinduDharmamVardhillaliChannel
మీన రాశి: నిర్ణయాలు తీసుకునేటపుడు జాగ్రత్తగా ఉండాలి. మీరు చేయగలిగిన పని మాత్రమే చెప్పాలి. లేని యడల పని భారం అధికంగా ఉండబోతుంది. స్థిరాస్తి విషయాల్లో మీకు పరిస్థితులు సానుకూల పడతాయి. కుటుంబ సంబ్యులతో కొద్దిపాటి విబేదాలు ఏర్పడే అవకాశం ఉంది. నూతన ఉద్యోగ, వ్యాపార దిశగా మీరు చేసే ప్రయత్నాలు ఫలిస్తాయి. అవివాహితులకు వివాహ యోగం ఉంది. ప్రేమికులకు శుభ సమయం నడుస్తోంది. కోపాన్ని అదుపులో ఉంచుకోవాలి. దాంపత్య జీవితం అద్బుతంగా ఉండబోతుంది. మీ జీవిత భాగస్వామితో సమయాన్ని ఆనందంగా గడపగలుగుతారు. ప్రతీ రోజు రాశిఫలాలు పొందటానికి టెలిగ్రామ్ లో మన ఛానల్ ను ఈ లింక్ ద్వారా ఫాలో అవ్వండి. లింక్: https://t.me/HinduDharmamVardhillaliChannel
శుభం భూయాత్
Comments
Post a Comment
ఇక్కడ మీ కామెంట్ రాయండి