
మేష రాశి: ఈ రోజు మీకు మనస్సు నిలకడ ఉండదు. లేనిపోని ఆలోచనలు వస్తాయి. కోపం, ఆవేశం కలిగే అవకాశం ఉంది. అధ్యాత్మిక కార్యక్రమాలతో ఈ రోజు మానసికంగా ఏర్పడే సమస్యల నుండి బయటపడోచ్చు. ఆకస్మిక ధన ప్రాప్తి ఉంది. ఉహించని విధంగా ఈ రోజు మీకు ధనం లభిస్తుంది. ఆర్ధికంగా చాలా బాగుండబోతుంది. ఇంటాబయటా పూర్తి అనుకూల వాతావరణం ఏర్పడబోతుంది. మీ కుటుంబ సబ్యులలో ఒకరికి అనారోగ్యం చేసే అవకాశం ఉంది. వ్యాపారస్తులు మోసపోకుండా తగు జాగ్రత్తలు తీసుకోవాలి. ఈ రోజు మీకు మిశ్రమ ఫలితాలను గ్రహస్థితి సూచిస్తుంది. ప్రతీ రోజు రాశిఫలాలు పొందటానికి టెలిగ్రామ్ లో మన ఛానల్ ను ఈ లింక్ ద్వారా ఫాలో అవ్వండి. లింక్: https://t.me/HinduDharmamVardhillaliChannel
వృషభ రాశి: మానసిక ప్రశాంతత ఏర్పడుతుంది. ఆర్ధిక ఇబ్బందులు తొలగుతాయి. ఆర్ధిక పరిస్థితి మెరుగుపడుతుంది. మీ స్నేహితుల సహాయంతో కొన్ని ఇబ్బందుల నుండి బయటపడతారు. వ్రుత్తి, ఉద్యోగ పరంగా అనుకూలంగా ఉండబోతుంది. నిరుద్యోగులకు ఉద్యోగ యోగం ఉంది. ఎవరితోనైనా చక్కగా మాట్లాడే మీ మాట తీరు మీకు నలుగురిలో మంచి పేరు తెచ్చిపెడుతుంది. నూతన పరిచయాలు ఏర్పడతాయి. ఏమైనా ముఖ్యమైన పనులు చేయాలి అనుకుంటే, ఈ రోజు చాల మంచిది. శుభఫలితాలను అందుకోవడానికి ఆస్కారం ఉంది. ఈ రోజు మీకు బాగానే ఉంది. ప్రతీ రోజు రాశిఫలాలు పొందటానికి టెలిగ్రామ్ లో మన ఛానల్ ను ఈ లింక్ ద్వారా ఫాలో అవ్వండి. లింక్: https://t.me/HinduDharmamVardhillaliChannel
మిథున రాశి: వ్యాపారస్తులకు లాభాలు ఉన్నాయి. మానసిక ప్రశాంతత ఏర్పడుతుంది. ప్రస్తుతం మీకు ఆర్ధికంగా ఇబ్బందులు ఏమి ఉండవు. ఏమైనా కొద్దిపాటి అప్పులు ఉంటె అవి తీర్చే దిశగా మీరు చేసే ప్రయత్నాలు సత్ఫలితాలను ఇస్తాయి. సమాజంలో గౌరవ మర్యాదలు పెరుగుతాయి. బయటి వారి సహాయంతో కొన్ని ఇబ్బందులనుండి బయటపడే అవకాశం ఉంది. గతంలో కనపడకుండా పోయిన ఒక వస్తువు ఈ రోజు మీకు కనిపించే అవకాశం ఉంది. దంపతుల మధ్య కొద్దిపాటి మనస్పర్ధలు ఏర్పడే అవకాశం ఉంది. ప్రతీ రోజు రాశిఫలాలు పొందటానికి టెలిగ్రామ్ లో మన ఛానల్ ను ఈ లింక్ ద్వారా ఫాలో అవ్వండి. లింక్: https://t.me/HinduDharmamVardhillaliChannel
కర్కాటక రాశి: మీ తెలివి, నైపుణ్యం తో ఎంతటి సమస్యనైన పరిష్కరించగలుగుతారు. యోగా, మెడిటేషన్ వంటివి చేయడం ద్వారా మానసిక ప్రశాంతతను పొందే ప్రయత్నం చేస్తారు. ఆర్ధికంగా బాగుంది. ఆకస్మిక ధనలబ్ది ఉంది. ఆర్ధిక సమస్యల నుండి గట్టెక్కడానికి ప్రస్తుతం కాలం అనుకూలంగా ఉండబోతుంది. ఆ దిశగా మీరు చేసే ప్రయత్నాలు సత్ఫలితాలు ఇస్తాయి. కుటుంబ సబ్యుల యొక్క పూర్తి సహాయ సహకారాలు మీకు ఉండటం మీకు కొండంత అండగా ఉండబోతుంది. జీవిత భాగస్వామితో ఆనందంగా సమయాన్ని గడుపుతారు. ప్రతీ రోజు రాశిఫలాలు పొందటానికి టెలిగ్రామ్ లో మన ఛానల్ ను ఈ లింక్ ద్వారా ఫాలో అవ్వండి. లింక్: https://t.me/HinduDharmamVardhillaliChannel
సింహ రాశి: అనవసరపు ప్రయాణాలు మానుకోవడం మంచిది. అలానే తప్పనిసరి పరిస్థుతులలో సాధ్యమైనంత వరకు మీరు డ్రైవింగ్ చేయకపోవడం మంచిది. ప్రయాణ విషయాలలో తగు జాగ్రత్త అవసరం. ఆథ్యాత్మిక చింతన ఉంటుంది. మానసిక ప్రశాంతత ఏర్పడుతుంది. సంతానం విషయంలో ఆశించిన ఫలితాలను పొందగలుగుతారు. నూతన వ్యాపారాలు మొదలు పెట్టాలి అనుకునే వారికి ప్రస్తుత కాలం అంత అనుకూలంగా లేదు అనే చెప్పాలి. శ్రమ అధికంగా ఉండబోతుంది. ఈ రోజు ఎక్కువ సమయాన్ని మీకు నచ్చిన పనిని చేయటానికి మాత్రమే కేటాయించే అవకాశం ఉంది. ప్రతీ రోజు రాశిఫలాలు పొందటానికి టెలిగ్రామ్ లో మన ఛానల్ ను ఈ లింక్ ద్వారా ఫాలో అవ్వండి. లింక్: https://t.me/HinduDharmamVardhillaliChannel
కన్యా రాశి: ఆరోగ్యం పట్ల జాగ్రత్త అవసరం. ఆర్దికంగా బాగుందబోతుంది. గతంలో మీరు తీసుకున్న అప్పులు తీర్చే అవకాశం ఉంది. అలానే, గతంలో చేసిన తప్పులకు గాను ప్రతిఫలం అందుకునే అవకాశం కూడా ఉంది. అనవసరపు తగాదాలు ఏర్పడే అవకాశం ఉంది. ఈ రోజు జరిగే సంఘటనలు మీ మానసిక ప్రశాంతతను దెబ్బతీసేవిధంగా ఉండబోతున్నాయి. అయితే మీ మనసుకి నచ్చిన వారి దగ్గరనుండి ఆశించిన ఫలితాన్ని, స్పందనను పొందటం కాస్త ఊరటను ఇస్తుంది. ఈ రోజు మీకు మిశ్రమ ఫలితాలనే గ్రహస్థితి సూచిస్తుంది. ప్రతీ రోజు రాశిఫలాలు పొందటానికి టెలిగ్రామ్ లో మన ఛానల్ ను ఈ లింక్ ద్వారా ఫాలో అవ్వండి. లింక్: https://t.me/HinduDharmamVardhillaliChannel
తులా రాశి: సమాజంలో ఉన్నత స్థాయిలో ఉండే కొంత మంది వ్యక్తుల సహాయంతో మీరు ఈ రోజు కొన్ని ఇబ్బందులనుండి గట్టెక్కే అవకాశం ఉంది. ఇతర వ్యక్తులతో మాట్లాడేటపుడు మీ కోపాన్ని, ఆవేశాన్ని అదుపులో ఉంచుకోవాలి. తప్పు ఇతరులదైనా దానిని శాంతంగా చెప్పే ప్రయత్నం చేయండి. ఈ రోజు అకారణ కలహా సూచనా ఉంది. ఉద్యోగస్తులు జాగ్రత్తగా ఉండవలెను. కొంతమందికి ఉద్యోగం పోయే అవకాశం ఉంది. ఈ రోజు మీరు శుభ వార్తలు వినే అవకాశం ఉంది. ప్రేమ వ్యవహారాలకు అనుకూలా సమయం నడుస్తుంది. కార్య జయం ఉంది. ప్రతీ రోజు రాశిఫలాలు పొందటానికి టెలిగ్రామ్ లో మన ఛానల్ ను ఈ లింక్ ద్వారా ఫాలో అవ్వండి. లింక్: https://t.me/HinduDharmamVardhillaliChannel
వృశ్చిక రాశి: ఆహారపు అలవాట్లు, జీవనశైలి విధానం మార్చుకునే ప్రయత్నం చేస్తారు. మంచి అలవాట్లను అలవరచుకోవాలి, ప్రతీ పనిని అనుకున్న సమయానికి పూర్తి చేయాలి వంటి ఆలోచనలు చేస్తారు. తదనుగుణంగా కార్యాచరణ మొదలుపెడతారు. నూతన పెట్టుబడులు పెట్టాలి అని చూసే వారికి స్థిరాస్తి లో పెడితే అద్బుత లాభాలు వచ్చే అవకాశం ఉంది. కుటుంబ సబ్యుల యొక్క పూర్తి సహాయ సహకారాలు మీకు వెన్నంటి ఉంటాయి. అనుకున్న లక్ష్యాన్ని చేరుకోవడానికి మీరు చేసే ప్రయత్నాలు సత్ఫలితాలను ఇస్తాయి. ప్రేమ వ్యవహారాలలో ఏదైనా కొద్దిపాటి తప్పులు జరిగితే మిమ్మల్నే నిందించే అవకాశం ఉంది. దానికి మీ అతి మంచే కారణం అయ్యే అవకాశం ఉంది. ప్రతీ పనిని ఒక ప్రణాళికా బద్దంగా చేయడం ఎంతైనా మంచిది. మీ వైరి వర్గం వారు మిమ్మల్ని ఎప్పుడు తప్పుదోవ పట్టించాలా, మీకు ఏ విధంగా చెడు చేయాలా అనే ఆలోచనలు, ప్రయత్నాలు చేసే అవకాశం ఉంది. కావున, ఎవరు మంచి వారు, ఎవరు మీ పక్కనే ఉండి మిమ్మల్ని నాశనం చేయాలి అనుకుంటున్నారో మీకు ఈపాటికే అర్ధం అయ్యి ఉంటుంది. కావున అటువంటి విషయాల్లో తగిన జాగ్రత్త తీసుకుని ముందుగానే సేఫ్ సైడ్ లో ఉండటం మంచిది. ప్రతీ రోజు రాశిఫలాలు పొందటానికి టెలిగ్రామ్ లో మన ఛానల్ ను ఈ లింక్ ద్వారా ఫాలో అవ్వండి. లింక్: https://t.me/HinduDharmamVardhillaliChannel
ధనుస్సు రాశి: ప్రతీ పనిలోనూ మీదే పై చేయి అవుతుంది. ఇంటాబయటా పూర్తి అనుకూలం. ఆర్ధికంగా ఆశించిన ఫలితాలు అందుకుంటారు. సంతానం విషయంలో సంతృప్తి ఏర్పడుతుంది. బంధుమిత్రుల యొక్క సహాయ సహకారాలు మీరు చేయు ప్రతీ పనిలోనూ ఉంది, విజయాన్ని సిద్ధించేవిగా ఉండబోతున్నాయి. వ్యాపారస్తులకు లాభాలు ఉన్నాయి. ప్రయాణాలు కలసి వచ్చే అవకాశం ఉంది. పూర్వపు మిత్రులను కలుసుకుని సమయాన్ని ఆనందంగా గడపగలుగుతారు. ఈ రోజు మీకు బాగానే ఉంది. ప్రతీ రోజు రాశిఫలాలు పొందటానికి టెలిగ్రామ్ లో మన ఛానల్ ను ఈ లింక్ ద్వారా ఫాలో అవ్వండి. లింక్: https://t.me/HinduDharmamVardhillaliChannel
మకర రాశి: ఆరోగ్యం మెరుగుపడుతుంది. మానసికంగా ఉల్లాసంగా ఉండగలుగుతారు. గతంలో ఆగిపోయిన పనులు ఇప్పుడు పునః ప్రారంభం అయ్యే అవకాశం ఉంది. విలువైన వస్తువుల విషయంలో తగు జాగ్రత్తలు అవసరం. ఒక చక్కటి, అనుకూల వాతావరణంలో మీరు ఉండబోతునారు. నీటిలో మొసలికి వెయ్యి ఏనుగుల బలం ఉంటుంది అనే చందనా మీరు మీ వర్గం వారితో ఉండటం మీకు కొండంత బలాన్ని, ధైర్యాన్ని ఇస్తుంది. మీ వైరి వర్గం వారు మీ పై చేసే కుట్రలను గమనించాలి. మీరు గతంలో చేసిన తప్పులు యొక్క ప్రతిఫలాన్ని ఈ రోజు మీరు పొందే అవకాశం ఉంది. వ్యాపారస్తులకు వర్కర్లతో ఇబ్బందులు తప్పనిసరి. ప్రతీ రోజు రాశిఫలాలు పొందటానికి టెలిగ్రామ్ లో మన ఛానల్ ను ఈ లింక్ ద్వారా ఫాలో అవ్వండి. లింక్: https://t.me/HinduDharmamVardhillaliChannel
కుంభ రాశి: అనారోగ్య సూచనలు ఉన్నాయి. ఏ కొద్దిపాటి అనారోగ్యం చేసినా, వైద్యున్ని సంప్రదించటం చాలా ఉత్తమం. లేనిపోని కర్చులు తగ్గించుకుని, డబ్బులు భవిష్యత్తు కోసం పొదుపు చేసే దిశగా ప్రయత్నాలు చేస్తారు. మీ తోబుట్టువు ఒకరు ఈ రోజు మీకు సహాయం అందించటం ద్వారా ఒక పెద్ద సమస్య నుండి బయట పడతారు. సంబంధ బాంధవ్యాలు మెరుగుపరచుకునే దిశగా మీరు చేసే ప్రయత్నాలు సత్ఫలితాలను ఇస్తాయి. నిర్ణయాలు తీసుకునేటపుడు ఒకటికి రెండు సార్లు అలోచించి నిర్ణయం తీసుకోవాలి. లేకపోతే ఇబ్బందులు ఎదురయ్యే అవకాశం ఉంది. ప్రతీ రోజు రాశిఫలాలు పొందటానికి టెలిగ్రామ్ లో మన ఛానల్ ను ఈ లింక్ ద్వారా ఫాలో అవ్వండి. లింక్: https://t.me/HinduDharmamVardhillaliChannel
మీన రాశి: ఈ రోజు జరిగే కొన్ని సంఘటనలు మిమ్మల్ని మానసికంగా గాయపరచేవిగా ఉంటాయి. చర్మ సంబంధ సమస్యలు అధికం అవుతాయి. ఏదైనా ముఖ్యమైన పనులు మొదలు పెట్టేటపుడు దైవ దర్శనం, ప్రార్ధన చేసుకుని మొదలుపెడితే విజయం వరిస్తుంది. ఉద్యోగాల్లో మార్పులు జరిగే అవకాశం ఉంది. ఎవరికైనా దురాశ గనుక ఉంటె మరికొద్ది రోజులలోనే ఇబ్బందులు ఎదుర్కోవలసి వస్తుంది. మనసుకి నచ్చిన వారితో ఆనందంగా సమయాన్ని గడుపుతారు. నూతన ఉద్యోగం కోసం మీరు చేసే ప్రయత్నాలు సత్ఫలితాలను ఇస్తాయి. ఈ రోజు సమయాన్ని ఏకాంతంగా గడపడానికే ఎక్కువగా ఇష్టపడే అవకాశం ఉంది. ప్రతీ రోజు రాశిఫలాలు పొందటానికి టెలిగ్రామ్ లో మన ఛానల్ ను ఈ లింక్ ద్వారా ఫాలో అవ్వండి. లింక్: https://t.me/HinduDharmamVardhillaliChannel
శుభం భూయాత్
Comments
Post a Comment
ఇక్కడ మీ కామెంట్ రాయండి