ఈ రోజు ఏం జరగబోతుంది - జీవితం నేర్పించే పాఠాలు ఏమిటి ? నేటి రాశిఫలలు 05-05-2020


మేష రాశి: ఈ రోజు మీకు ఆర్ధిక పరమైన ఇబ్బందులు అధికంగా ఉండే అవకాశం ఉంది. పనులు అతి కష్టం మీద పూర్తి అవుతాయి. బంధు మిత్రులకు సహాయాన్ని అందించాల్సిన పరిస్థితి ఏర్పడుతుంది. పని భారం అధికంగా ఉండబోతుంది. కాళా రంగం వారికి శుభ సమయం నడుస్తుంది. సన్మానాలు, సత్కారాలు అందుకునే అవకాశం ఉంది. సమాజంలో గౌరవ మర్యాదలు పెరుగుతాయి. చిన్ననాటి స్నేహితులు ఈ రోజు మిమ్మల్ని కలుసుకునే అవకాశం ఉంది. ఎంతోకాలం తర్వాత వారిని చోడటం మీకు ఎంతో ఆనందాన్ని ఇస్తుంది. జీవిత భాగస్వామితో సమయాన్ని ఆనందంగా గడపగలుగుతారు. ప్రతీ రోజు రాశిఫలాలు పొందటానికి టెలిగ్రామ్ లో మన ఛానల్ ను ఈ లింక్ ద్వారా ఫాలో అవ్వండి. లింక్: https://t.me/HinduDharmamVardhillaliChannel

వృషభ రాశి: లేనిపోని గొడవలకు దూరంగా ఉండాలి. చిన్న చిన్న విషయాలను భూతద్దంలో చూసే తత్వం మానుకోవాలి. ప్రతీ దానికి గొడవ పడటం వళ్ళ, మీ మానసిక పరిస్థితి దెబ్బతింటుంది. ప్రశాంతతను కోల్పోతారు. ఆర్ధిక పరమైన లావాదేవీలతో చాలా జాగ్రత్త గా ఉండాలి. ముఖ్యంగా తెలియని వారికి, మోసం చేసే వారికీ అప్పు ఇవ్వటం కాని, హామీ గా ఉండటం కాని చేయడం వల్ల ఇబ్బందులు ఎదుర్కోవలసిన పరిస్థితి వస్తుంది. సంతానం విషయంలో మీకు సంతృప్తి ఏర్పడుతుంది. సంతోషంగా ఉండగలుగుతారు. ప్రతీ రోజు రాశిఫలాలు పొందటానికి టెలిగ్రామ్ లో మన ఛానల్ ను ఈ లింక్ ద్వారా ఫాలో అవ్వండి. లింక్: https://t.me/HinduDharmamVardhillaliChannel

మిథున రాశి: ఆర్ధికంగా బాగుంది. రాబడి పెరుగుతుంది. ఆశించిన ఫలితాలను అందుకోగలుగుతారు. అయితే కొన్ని విషయాలు గోప్యం గా ఉంచాలి. ముఖ్యంగా మీ డబ్బుకి సంబందించినవి మరియు వ్యాపార సంబందించిన విషయాలు గోప్యంగా ఉంచాలి. గతంలో ఎవరితోనైన కొద్దిపాటి ఇబ్బందులు ఉంటె అవి వాటంతట అవే సమసిపోతాయి. జీవిత భాగస్వామితో సమయాన్ని ఆనందంగా గడుపుతారు. భార్యాభర్తల మధ్య అన్యోన్యత పెరుగుతుంది. ఇంటాబయటా పూర్తి అనుకూలం. పోటి పరీక్షలకు సిద్ధం అవుతున్నవారికి అనుకూల సమయం నడుస్తుంది. ఆశించిన ఫలితాలను అందుకోగలుగుతారు. మీలో ఎవరికైనా పనులు వాయిదా వేసే అలవాటు ఉంటె దానిని వెంటనే మానుకోవాలి. లేకపోతే ముఖ్యమైన పనులు తెలీకుండానే వాయిదా వేసే అవకాశం ఉంది. తద్వారా చాలా ఇబ్బందులు ఎదుర్కోవలసి వస్తుంది. ఈ రోజు మీకు బాగానే ఉంది. ప్రతీ రోజు రాశిఫలాలు పొందటానికి టెలిగ్రామ్ లో మన ఛానల్ ను ఈ లింక్ ద్వారా ఫాలో అవ్వండి. లింక్: https://t.me/HinduDharmamVardhillaliChannel

కర్కాటక రాశి: ప్రస్తుత సమయం ఆరోగ్యానికి మంచి చేసేదిగా ఉంది. ఆరోగ్యం మెరుగుపడటం. మెరుగైన వైద్యం అందటం వంటివి సూచిస్తున్నాయి. ఆత్మస్థైర్యం పెరుగుతుంది. మానసికంగా ఎంతో సంతోషంగా ఉండగలుగుతారు. ఆర్ధిక పరమైన విషయాలలో జాగ్రత్త గా ఉండాలి. తెలియని వాటిలో పెట్టుబడులు పెట్టడం మంచిది కాదు. స్టాక్ మార్కెట్ లో పెట్టుబడి పెట్టె వారికి కాలం అంత అనుకూలంగా లేదు అని చెప్పాలి. సంతానం మీ మాట వినకపోవడం మీకు కొంచెం చిరాకును కలిగిస్తుంది. నిజానికి దానికి కారణం వారికి మీరు ఇచ్చిన అలుసు, వారిపై మీకు ఉండే అధిక ప్రేమాప్యాయతలే. ప్రేమికులకు అనుకూల కాలం నడుస్తుంది. వ్రుత్తి, ఉద్యోగ పరంగా అనుకూల పరిస్థితి నెలకొంటుంది. పనులలో జయం ఉంది. ఈ రోజు మీకు అంతా బాగానే ఉంది. ప్రతీ రోజు రాశిఫలాలు పొందటానికి టెలిగ్రామ్ లో మన ఛానల్ ను ఈ లింక్ ద్వారా ఫాలో అవ్వండి. లింక్: https://t.me/HinduDharmamVardhillaliChannel

సింహ రాశి: దీర్ఘకాలిక అనారోగ్య సమస్యలు తగ్గుముఖం పడతాయి. సరైన వైద్యం అందుతుంది. ఆరోగ్య పరంగా శుభ ఫలితాలు అందుకుంటారు. గతంలో ఆగిపోయిన పనులు ఇప్పుడు పునః ప్రారంభం అవుతాయి. బంధుమిత్రుల యొక్క పూర్తి సహాయ సహకారాలు మీకు ఉంటాయి. ప్రేతీ పనిని ఒక నిర్దిష్ట ప్రణాళికతో పూర్తి చేసి విజయాన్ని అందుకొంటారు. బయటి వారి సహాయం ద్వారా ఒక ముఖ్యమైన పని ఈ రోజు పూర్తి అయ్యే అవకాశం ఉంది. సమాజంలో గౌరవ మర్యాదలు పెరుగుతాయి. మీ ప్రతిభకు గుర్తింపు లభిస్తుంది. ప్రతీ రోజు రాశిఫలాలు పొందటానికి టెలిగ్రామ్ లో మన ఛానల్ ను ఈ లింక్ ద్వారా ఫాలో అవ్వండి. లింక్: https://t.me/HinduDharmamVardhillaliChannel

కన్యా రాశి: సమాజంలో గౌరవ మర్యాదలు పెరుగుతాయి. నూతన వ్యాపారాలు పెట్టె దిశగా మీరు చేసే ప్రయత్నాలు సానుకూల పడతాయి. మీ ప్రాజెక్ట్లకు కావలసిన ధనం ఈ రోజు మీకు సమకూరే అవకాశం కాని, ఇస్తాను అని మీరు ఆశించిన వ్యక్తులు అనడం కాని జరిగే అవకాశం ఉంది. ఈ రోజు మీ కుటుంబంలో జరిగే కొన్ని సంఘటనలు మీకు ఆగ్రహావేశాలను కలిగిస్తాయి. అలానే ఈ రోజు మీరు ఎన్నాడులేన్నట్టుగా దిగజారి కొన్ని పనులు చేసే అవకాశం ఉంది. తద్వారా మీ పేరు మీరే చెడగోట్టుకున్నవారు అవుతారు. పని భారం అధికంగా ఉండబోతుంది. గతంలో మీరు ఏమైనా పనులు వాయిదా వేస్తే, వాటి తాలుకా పరిణామాలు ఈ రోజు ఎదుర్కోవలసి వస్తుంది. ఈ రోజు మిశ్రమ ఫలితాలను గ్రహస్థితి సూచిస్తుంది. ప్రతీ రోజు రాశిఫలాలు పొందటానికి టెలిగ్రామ్ లో మన ఛానల్ ను ఈ లింక్ ద్వారా ఫాలో అవ్వండి. లింక్: https://t.me/HinduDharmamVardhillaliChannel

తులా రాశి: ఆరోగ్యాన్ని మెరుగుపరచుకోనేందుకుగాను మీరు చేసే ప్రయత్నాలు ఫలిస్తాయి. ఆర్ధికంగా బాగుందబోతుంది. ఆశించిన వ్యక్తులు సమయానికి ధనం ఇవ్వటం ద్వారా సమస్యలనుండి బయటపడగలుగుతారు. చిన్న చిన్న అప్పులు పది ఉండటం కంటే, ఒకచోటే ఒక పెద్ద అప్పు ఉండటం నయ్యమనే ఆలోచన చేసి, ఆ చిన్న చిన్న అప్పులు తీర్చేసే దిశగా ప్రయత్నాలు చేస్తారు. బ్యాంకు లేదా ఇతర సంస్థల నుండి తీసుకున్న అప్పును తీర్చేయగలుగుతారు. నూతన అవకాశాలు అందివస్థాయి. నిరుద్యోగులకు ఉద్యోగ యోగం ఉంది. సరైన నిర్ణయాన్ని సరైన సమయానికి తీసుకోవడం ద్వారా అద్బుత ఫలితాలను అందుకోగలుగుతారు. ప్రతీ రోజు రాశిఫలాలు పొందటానికి టెలిగ్రామ్ లో మన ఛానల్ ను ఈ లింక్ ద్వారా ఫాలో అవ్వండి. లింక్: https://t.me/HinduDharmamVardhillaliChannel

వృశ్చిక రాశి: ఒత్తిడి తగ్గించే దిశగా ప్రయత్నాలు చేస్తారు. ఆర్ధికంగా ప్రస్తుతం మీకు బాగుంది. రాబడి పెరుగుతుంది. నూతన ఆదయ మార్గాలు ఏర్పడతాయి. నిరుద్యోగులకు ఉద్యోగ యోగం ఉంది. సంతానం విషయంలో మీరు ఆశించిన ఫలితాలను అందుకోవడం మీ మానసిక ప్రశాంతతకు కారణం అవుతుంది. ప్రేమ వ్యవహారాలకు అనుకూల కాలం. వ్యవహార జయం ఉంది. సమాజంలో ఉన్నత స్థానం లో ఉన్న వ్యక్తులు పరిచయం అవుతారు. అది మీకు భవిష్యత్తులో ఎంతగానో ఉపయోగ పడనుంది. సమయం యొక్క విలువను గ్రహిస్తారు. ఇకనుండి సమయాన్ని వృధా చేయకుండా మీరు అనుకున్నది సాధించటానికి అహోరాత్రులు శ్రమించాలి అనే ఆలోచనలు చేస్తారు, ఆ దిశగా అడుగులు వేస్తారు. ఈ రోజు మీకు అంతా బాగానే ఉంది. ప్రతీ రోజు రాశిఫలాలు పొందటానికి టెలిగ్రామ్ లో మన ఛానల్ ను ఈ లింక్ ద్వారా ఫాలో అవ్వండి. లింక్: https://t.me/HinduDharmamVardhillaliChannel

ధనుస్సు రాశి: ఆరోగ్య పరంగా బాగుందబోతుంది. ఆరోగ్యాన్ని మెరుగుపరచుకునే దిశగా మీరు చేసే ప్రయత్నాలు సత్ఫలితాలను ఇస్తాయి. అదృష్టం వరిస్తుంది. ఆశించిన ఫలితాలను అందుకోగలుగుతారు. పనులు సకాలంలో పూర్తి చేసి, ఆశించిన ఫలితాలు పొందుతారు. గతంలో పెట్టిన పెట్టుబడులు కలసి వస్తాయి. రాబడి పెరుగుతుంది. భార్యాభర్తల మధ్య కొద్దిపాటి మనస్పర్ధలు వచ్చే అవకాశం ఉంది. మీ పాత స్నేహితులనుండి ఆహ్వానాలు అందటం మీకు సంతోషాన్ని ఇస్తుంది. వ్యాపార పరంగా బాగుందబోతుంది. మోసం చేసే వ్యక్తులకు దూరంగా ఉండటం చెప్పదగిన సూచన. సమాజంలో మీకు మంచి పేరు ప్రఖ్యాతలు లభించే అవకాశం ఉంది. మీకు అంతా బాగానే ఉంది. ప్రతీ రోజు రాశిఫలాలు పొందటానికి టెలిగ్రామ్ లో మన ఛానల్ ను ఈ లింక్ ద్వారా ఫాలో అవ్వండి. లింక్: https://t.me/HinduDharmamVardhillaliChannel

మకర రాశి: ఇచ్చిన మాట నిలబెట్టుకోవడానికి మీరు చేసే ప్రయత్నాలు మీకు అధిక శ్రమను, ఒత్తిడిని కలిగిస్తాయి. ఆర్ధిక పరంగా కాస్త జాగ్రత్త వహించాలి. అందరిని మంచివారు అని నమ్మేయటం మీ మంచి తనం అయినా, మిమ్మల్ని మోసం చేయాలి అనుకునేవారు మీ పక్కనే ఉండే అవకాశం ఉంది మరియు మీ మంచితనాన్ని ఉపయోగించుకుని మిమ్మల్ని మోసం చేయాలనీ వారు ప్రయత్నించే అవకాశం ఉంది. కావున ముఖ్యంగా ఆర్ధిక పరమైన అంశాలలో చాలా జాగ్రత్తగా ఉండాలి. ప్రేమికులకు ఆనందకర సంఘటనలు జరుగుతాయి. ఈ రోజు మీరు చేసే ప్రయాణాలు నూతన పరిచయాలను, అవకాశాలను ఇచ్చేవిగా ఉండబోతున్నాయి. సహాయం కోరి మీ వద్దకు వచ్చిన వారికి లేదనకుండా సహాయం చేసి, మీ మంచితనాన్ని నిరూపించుకుంటారు. ఈ రోజు మీకు అంత బాగానే ఉంది. ప్రతీ రోజు రాశిఫలాలు పొందటానికి టెలిగ్రామ్ లో మన ఛానల్ ను ఈ లింక్ ద్వారా ఫాలో అవ్వండి. లింక్: https://t.me/HinduDharmamVardhillaliChannel

కుంభ రాశి: మీ తెలివితో ఎలాంటి సమస్యనైన యిట్టె పరిష్కరిస్తారు. విలువైన వస్తువులను పోగొట్టుకునే అవకాశం ఉంది. ధన నష్టం సూచిస్తుంది. కుటుంబ సబ్యులతో మాట్లాడేటపుడు వారి తరపునుండి కూడా అలోచించి అప్పుడు నిర్ణయాలు తీసుకోవడం లేదా మీ అభిప్రాయాన్ని వ్యక్త పరచడం చేయడం మంచిది. అందరి అనుభవాలు, సమస్యలు ఒకేలా ఉండవని మీరు గమనించాలి. ఈ రోజు మీ కుటుంబానికి మీరే కొండంత అండగా ఉండబోతున్నారు. మీ మనసుకి నచ్చిన వారితో సమయాన్ని ఆనందంగా గడపగలుగుతారు. పని భారం వలన మీ వ్యక్తిగత విషయాల్లో కాస్త ఇబ్బంది కలుగవచ్చు. ఈ రోజు మీకు బాగానే ఉంది. ప్రతీ రోజు రాశిఫలాలు పొందటానికి టెలిగ్రామ్ లో మన ఛానల్ ను ఈ లింక్ ద్వారా ఫాలో అవ్వండి. లింక్: https://t.me/HinduDharmamVardhillaliChannel

మీన రాశి: మీరు తీసుకునే ఆహారం సరైనది అయి ఉండేలా చూసుకోవాలి. లేకపోతే అది మీ ఆరోగ్యం మీద ప్రభావం చూపే అవకాశం ఉంది. ఆరోగ్యం విషయంలో అశ్రద్ద పనికిరాదు. కొద్దిపాటి అనారోగ్య సమస్యకైన వైద్యున్ని సంప్రదించటం మంచిది. ఆర్ధికంగా బాగుందబోతుంది. ధనానికి లోతులేకుండా ఉండబోతుంది. ఏదోక రూపంలో మీకు సమయానికి ధనం చేతికి అందుతుంది. తద్వారా మీకు వచ్చే ఇబ్బందులు ఏమి ఉండవు. అయితే ఇతరులతో మాట్లాడేటపుడు మీ కోపాన్ని, ఆవేశాన్ని అదుపులో ఉంచుకోవాలి. లేకపోతే లేనిపోని గొడవలు ఏర్పడే అవకాశం ఉంది. వ్రుత్తి, ఉద్యోగ పరంగా అనుకూల సమయం నడుస్తుంది. అక్కర్లేని పనులకు ఎక్కువ సమయం కేటాయించి, చేయాల్సిన పనులు వాయిదా వేసే అవకాశం ఉంది. ఈ రోజు మీకు అంతా బాగానే ఉంది. శుభం. ప్రతీ రోజు రాశిఫలాలు పొందటానికి టెలిగ్రామ్ లో మన ఛానల్ ను ఈ లింక్ ద్వారా ఫాలో అవ్వండి. లింక్: https://t.me/HinduDharmamVardhillaliChannel

శుభం భూయాత్ 

Comments