
మేషరాశి:
ఆరోగ్యాన్ని మెరుగుపరచుకునే దిశగా మీరు చేసే ప్రయత్నాలు స్ఫత్ఫలితలను ఇస్తాయి. ఆరోగ్యం మెరుగుపడుతుంది. సంతానం విషయంలో ఆశించిన ఫలితాలు అందుకుంటారు. నూతన పరిచయాలు పెరుగుతాయి. సమాజంలో గౌరవ మర్యాదలు పెరుగుతాయి. ప్రేమవ్యవహారాలలో జయం లభిస్తుంది. ఒక స్త్రీ యొక్క సహాయంతో మీరు విజయాన్ని అందుకోగలుగుతారు(ముఖ్యంగా ఇంటర్వ్యూల వంటి వాటిలో). సమయాన్ని నచ్చిన పని చేయడానికి కేటాయిస్తారు.
వృషభ రాశి:
గతంలో మీరు పెట్టిన పెట్టుబడులు ఇప్పుడు లాభాలను ఇచ్చే అవకాశం ఉంది. గతంలో ఆగిపోయిన పనులు పునఃప్రారంభం అవుతాయి. మీ చక్కటి వాక్చాతుర్యంతో ఎంతటి వారినైనా మీ వశం చేసుకోగలుగుతారు. మీ నైపుణ్యం తో పనులలో ఏర్పడే సమస్యలను తొలగించి, విజయాన్ని సాధించగలుగుతారు. సమాజంలో మీకు ఉన్న మంచిపేరు చెడగొట్టే విధంగా మీ వైరి వర్గం వారు ప్రయత్నిస్తారు. అయితే మీ కుటుంబ సభ్యుల ల యొక్క పూర్తి అండ మీకు ఉండటం కొండంత బలంగా ఉండబోతుంది. అనుకున్న లక్ష్యాలను చేరుకోవడానికి మీరు చేసే ప్రయత్నాలు సత్ఫలితాలను ఇస్తాయి.
మిధున రాశి:
ఊహించని ప్రయాణాలు చేసే అవకాశం ఉంది. శ్రమ అధికంగా ఉన్నా, మీకు నచ్చిన పని చేయడం వల్ల అంతగా శ్రమ అనిపించదు. మీరు ఆశించినట్టుగానే ధనం రావడం , మీకు డబ్బులు ఇవ్వవలసినవారు ఇవ్వటం వంటి వాటి ద్వారా మీకు ధనం సమృద్ధిగా ఉంటుంది. తద్వారా గతం కంటే మెరుగైన ఆర్ధిక పరిస్థితులు నెలకొంటాయి. ఈ రోజు మీ కోపాన్ని, ఆవేశాన్ని అదుపులో ఉంచుకోవాలి. లేకపోతే లేనిపోని గొడవలకు అవి కారణం అవుతాయి. చేతులు కాల్చుకున్నకా, ఆకులుపట్టుకుని పట్టుకుని ప్రయోజనం లేదు. అలానే బంధం తెగిపోక ముందే జాగ్రత్త పడాలి. తెగిపోయాకా చేసేదేంలేదు. ఈ విషయాన్ని మీరు అర్ధం చేసుకుని గతంలో జరిగిన చిన్నపాటి తప్పులను వదిలేసి మానసికంగా ప్రశాంతంగా ఉండగలుగుతారు. ఈ రోజు మీకు అంత మంచే జరుగుతుంది.
కర్కాటక రాశి:
పాత మిత్రులను కలుసుకుని ఆనందంగా ఉంటారు. మీ వారు మంచి స్థాయిలో ఉండటం మీకు ఎంతో ఆనందాన్ని కలిగిస్తుంది. అయితే ఈ రోజు ఆర్ధిక పరిస్థితి అంతంత మాత్రంగానే ఉండనుంది. లేనిపోని ఖర్చులు అధికంగా ఉండబోతున్నాయి. ఆశించిన ఆస్థాయిలో రాబడి ఉండదు. అవివహితులకి శుభ కాలం నడుస్తోంది. వివాహ యోగం ఉంది. అలానే కొద్దిగా కష్టపడిగే నిరుద్యోగులకు ఉద్యోగం వచ్చే అవకాశం ఉంది. పనులు అతి కష్టం మీద పూర్తి అవుతాయి. అయితే చేపట్టిన పనులు సులభంగా పూర్తి చేయడానికి, ఆశించిన ఫలితాలను అందుకోవడానికి అనుభవజ్ఞులైన వారి సలహా స్వీకరించండి. దంపతుల మధ్య గతంలో ఏమైనా కొద్దిపాటి మనస్పర్థలు ఉంటే అవిసమసిపోయి, అన్యోన్యంగా ఉండగలుగుతారు.
సింహ రాశి:
దేహదారుఢ్యాన్ని పెంచుకునే దిశగా, అందాన్ని పెంచుకునే దిశగా మీరు ప్రయత్నాలు చేస్తారు. ఈ రోజు పెట్టుబడులకు అంత అనుకూలం కాదు. మొండి పట్టుదలతో చేప్పట్టిన పనులు పూర్తి చేస్తారు. కొన్ని సందర్భాలలో ఇగ్గరులు మాట్లాడే మాటలు మిమ్మల్ని మానసికంగా గాయపరచవచ్చు. కానీ వాటిని పట్టించుకోకుండా జాగ్రత్తగా ఉండండి. కళారంగంలో ఉన్నవారికి అనుకూల సమయం నడుస్తుంది. సన్మానాలు, ప్రశంసలు పొందే అవకాశం ఉంది. ఈ రోజు మిశ్రమ ఫలితాలను గ్రహస్తితి సూచిస్తుంది.
కన్యారాశి:
గతంలో ఎన్నడూ లేనంత ఉత్సాహంగా ఈ రోజు మీరు ఉంటారు. ఆరోగ్యం మెరుగుపడటం మరింత బలాన్ని ఇస్తుంది. ఆర్ధిక పరమైన సమస్యలు తగ్గుతాయి. ఆర్ధిక పరిస్థితి మెరుగుపడుతుంది. కోర్టు సంబంధిత కేసులో ఉన్నవారికి ఊరట లభిస్తుంది. వ్యవహార జయం ఉంది. ఆత్మస్థైర్యం పెరుగుతుంది. పనులలో పురోగతి ఉంటుంది. ఈ రోజు అన్నివిధాల గతం కంటే మెరుగ్గా ఉండబోతుంది.
తులా రాశి:
ఆర్ధికంగా అద్భుతంగా ఉండబోతుంది. మీరు ఆశించిన వ్యక్తి సమయానికి ధనాన్ని ఇవ్వటం ద్వారా సమస్యల నుండి బయటపడగలుగుతారు. నూతన ఆదాయ మార్గాలు పెరుగుతాయి. ఆరోగ్యం మెరుగుపడుతుంది. అవకాశాలను అందిపుచ్చుకుంటారు. నిజానికి గతంలో ఎంత కష్టపడినా రాణి అవకాశాలు ఒక్కసారిగా అనేకం వస్తాయి. అధిమీకు ఆశ్చర్యాన్ని కలిగిస్తోంది. అయితే ఈరోజు అంతా బాగున్నా, గుడ్డిగా ప్రతీ ఒక్కరినీ నమ్మేయటం మీరు మోసపోవడానికి కారణం అయ్యే అవకాశం ఉంది. కావున ఈ ఒక్క విషయంలో తగు జాగ్రత్త వహించాలి. మిగిలినది అంతా బాగుంది. శుభం.
వృశ్చిక రాశి:
గతంలో మీరు చేసిన పెట్టుబడులు లాభాలను ఇస్తాయి. ఎంతో కాలంగా మీరు పడుతున్న కష్టానికి ఫలితం అందుకునే సమయంగా ప్రస్తుత రోజులు ఉండబోతున్నాయి. మీరు ఎంతో కాలంగా ఎదురుచూస్తున్న పని ఒకటి ఇప్పుడు పూర్తి అవుతుంది. నిరుద్యోగులకు ఉద్యోగ యోగo ఉంది. వ్యాపారస్తులకు లాభాల బాటలో వ్యాపారాలు నడుస్తాయి. అయితే ఈ రోజు భార్యాభర్తల మధ్య కొద్దిపాటి తగాదాలు ఏర్పడే అవకాశం ఉంది. సమయాన్ని కుటుంబ సభ్యులతో ఆనందంగా గడుపుతారు. నిరుద్యోగులకు ఉద్యోగ యోగం ఉంది. ఈ రోజు అంతా బాగానే ఉంది.
ధనుస్సు రాశి:
ఆరోగ్యం మెరుగుపడుతుంది. ఆర్ధిక పరమైన ఇబ్బందులు తప్పనిసరి. ఆశించినస్థాయిలో రాబడి ఉండదు. మీరు ఎవరికైనా ధనం ఇవ్వవలసి ఉంటే వారు మిమ్మల్ని ఇబ్బందిపెడతారు అలానే మీకు ధనం ఇవ్వవలసినవారు ఏదొక కారణం చెప్పి తప్పించుకుంటారు. ఈ విధమైన సంఘటనలు మానసిక ప్రశాంతతను కోల్పోయేలా చేస్తాయి. అయితే ఇవన్నీ తాత్కాలికమే అని గ్రహించాలి. సంతానం విషయంలో కొంత సంతృప్తి పొందగలుగుతారు. మీ శ్రమను దోచుకునే విధంగా కొంత మంది ప్రయత్నిస్తారు. కావున ఇలాంటి విషయాల్లో జాగ్రత్త వహించాలి. ఎవరు మీవారో, ఎవరు పగవారో గ్రహించి అప్రమత్తంగా ఉండాలి. సమయం ఊరికే వృధా అయిపోతుంది తప్ప ఉపయోగపడే పనులు ఏవి చేయలేకపోతారు. ఏదేమైనా ఈ రోజు మీకు మిశ్రమ ఫలితాలను గ్రహస్థితి సూచిస్తుంది.
మకర రాశి:
ఈ రోజు మీకు చాలా బాగుండబోతుంది. మానసికంగా చాలా సంతోషం గా ఉండగలుగుతారు. లేనిపోని ఖర్చులు అధికంగా ఉండబోతున్నాయి. ఇతరుల విషయంలో జోక్యం చేసుకోవడం లేనిపోని విభేదాలకు కారణం అవబోతుంది. ఈ రోజు మీ మనసుకి నచ్చిన పని మాత్రమే చేస్తారు. మీ ఆనందాన్ని ఎవరికోసం వదులుకోకూడదు అని నిర్ణయించుకుంటారు. స్వార్ధపరులకి దూరంగా ఉండండి. ఈ రోజు మీకు అంతా బాగానే ఉంది.
కుంభ రాశి:
మానసిక ప్రశాంతత ను కోల్పోతారు. నిద్రలేమి అనేది ప్రధాన సమస్యగా ఉండబోతుంది. సమయానికి ఆహారాన్ని తినకపోవడం వల్ల ఆరోగ్య సమస్యలు తలెత్తే అవకాశం ఉంది. ఆర్ధిక పరిస్థితులు మెరుగుపడతాయి. గతంకంటే మెరుగ్గా ప్రస్తుత పరిస్థితులు ఉండబోతున్నాయి. భార్య భర్తల మధ్య కొద్దిపాటి విబేధాలు వచ్చే అవకాశం ఉంది. పనులు అతి కష్టం మీద పూర్తి అవుతాయి. ఈ రోజు మీకు మిశ్రమ ఫలితాలను గ్రహస్థితి సూచిస్తుంది.
మీన రాశి:
వ్యాపారాలు లాభసాటిగా ఉంటాయి. ఒక వ్యక్తి సహాయం వల్ల సమస్యల నుండి బయట పడే అవకాశం ఉంది. భార్య భర్తల మధ్య అన్యోన్యత పెరుగుతుంది. పూర్వపు మిత్రులను, బంధువులను కలుసుకుని ఆనందంగా ఉండగలుగుతారు. మీకు అదృష్టం కలసి వచ్చే సమయం. ఇతరుల సహాయ సహకరాలతో ప్రతీ పనిలో విజయాన్ని సాధిస్తారు. ఊహించని విధంగా పనులు, ప్రయాణాలు చేయవలసి రావడం మీకు కాస్త ఇబ్బందిని కలిగిస్తుంది. ఈ రోజు మీకు బాగానే ఉంది.
శుభం భూయాత్
Comments
Post a Comment
ఇక్కడ మీ కామెంట్ రాయండి