
మేష రాశి: పనులు అతికష్టం మీద పూర్తి అవుతాయి. ఒత్తిడి అధికంగా ఉండబోతుంది. ఈ రోజు జరగబోవు కొన్ని సంఘటనలు మీ సహనాన్ని పరిక్షించేవిగా ఉండబోతాయి. అయినా కాని కోపాన్ని అదుపులో ఉంచుకోండి. తద్వారా ఎంతటి సమస్యనైన ఇట్టే దాటేయోచ్చు. ఈ రోజు ఎవరికైనా ధనం అప్పుగా ఇవ్వాలి అంటే అది ప్రస్తుతానికి వాయిదా వేయటం మంచిది. కొంచెం గాబరాగా ఉంటుంది. పరిస్థితులు అర్ధం కాకుండా బయంగా, గందరగోళంగా ఉంటుంది. కాని భగవంతుని దయవల్ల మీ భవిష్యత్తు బాగానే ఉంటుంది. అయితే పరిస్థితులు గ్రహస్తితులకు ఆధారంగా ఉంటాయని మాత్రం గ్రహించండి. అలానే గ్రహాలు శుభాలు కూడా చేస్తాయని తెలుసుకోండి. భవిషత్తు గురించి కాస్త ఆందోళన తప్పితే ఈ రోజు పెద్దగా సమస్యలు ఏమి లేవి. అంత భాగానే ఉంది. ప్రతీ రోజు రాశిఫలాలు పొందటానికి టెలిగ్రామ్ లో మన ఛానల్ ను ఈ లింక్ ద్వారా ఫాలో అవ్వండి. లింక్: https://t.me/HinduDharmamVardhillaliChannel
వృషభ రాశి: ఆరోగ్యం మందగించే అవకాశం ఉంది. ఆరోగ్యం పట్ల తగు జాగ్రత్త వహించాలి. జీవిత భాగస్వామితో కాని వారి బంధువులతో కాని గతంలో ఏమైనా కొద్దిపాటి ఇబ్బందులు ఉంటె వాటిని సరిదిద్దుకునే దిశగా చేసే ప్రయత్నాలు సత్ఫలితాలను ఇస్తాయి. బాధ్యతలు పెరుగుతాయి. మానసికంగా ఉల్లాసంగా ఉండగలుగుతారు. సమయం యొక్క విలువ మీకు అర్ధం అవుతుంది. కుటుంబ సబ్యులతో తగిన సమయాన్ని కేటాయించి, వారి బాగోగులు చేసే ప్రయత్నం చేస్తారు. పరిచయాలు పెరుగుతాయి. ఈ రోజు అంతా బాగానే ఉంది. ప్రతీ రోజు రాశిఫలాలు పొందటానికి టెలిగ్రామ్ లో మన ఛానల్ ను ఈ లింక్ ద్వారా ఫాలో అవ్వండి. లింక్: https://t.me/HinduDharmamVardhillaliChannel
మిథున రాశి: ఒత్తిడిని తగ్గించుకోవటానికి గాను మీరు చేసే ప్రయత్నాలు ఫలిస్తాయి. తండ్రి తరపు నుండి రావలసిన ఆస్తి పాస్తులు ఏమైనా ఉంటె అవి మీకు వచ్చే అవకాశం ఉంది. మీ బంధువులను కలుసుకునే అవకాశం ఉంది. మీ మనసుకి నచ్చిన వారి పట్ల కాస్త అనుమానం పెరిగే అవకాశం ఉంది. అయితే ఇలాంటి చిన్న చిన్న సమస్యలు వాటంతట అవే సమసిపోతాయి. నమ్మకం అనేది ఒక బంధానికి పునాది అని గ్రహించండి. అనుమానాన్ని దూరం చేసి, వాస్తవాన్ని గ్రహించి బంధాన్ని బలపరచుకోండి. మీ చక్కటి మతసైలి, మంచి మనస్తత్వం మీకు అంతా శుభాన్నే ఇస్తుందని గ్రహించండి. లేనిపోని విభేదాలకు తావివ్వకుండా సమస్యలను సామరస్యంగా పరిష్కరించండి. తద్వారా మీ మీద ప్రేమాభిమానాలు మరింత పెరుగుతాయి. ఏదేమైనా సమస్యలు అన్నీ తొలగే సమయంగా ప్రస్తుత కాలాన్ని చెప్పుకోవచ్చు. అంతా శుభమే జరుగుతుంది. ప్రతీ రోజు రాశిఫలాలు పొందటానికి టెలిగ్రామ్ లో మన ఛానల్ ను ఈ లింక్ ద్వారా ఫాలో అవ్వండి. లింక్: https://t.me/HinduDharmamVardhillaliChannel
కర్కాటక రాశి: ఎంతో కాలంగా ఏదైనా అనారోగ్య సమస్యలతో బాధ పడుతుంటే ఈ రోజు ఒక చక్కటి పరిష్కారం లేదా వైద్య విధానం లభించి మీ సమస్య తగ్గుముఖం పడుతుంది. ఆరోగ్యం మెరుగుపడే అవకాశాలు మెండుగా ఉన్నాయి. అలానే ఏదైనా సమస్య మిమ్మల్ని ఎంతోకాలంగా వెంటాడుతుంటే, ఆ సమస్య నుండి బయట పడటానికిగాను మీకు ఒక దారి ఏర్పడుతుంది. అయితే ఆర్ధిక పరంగా తగు జాగ్రత్తలు తీసుకోవాలి. నూతన పెట్టుబడులకు ఇది సరైన సమయం కాదు అని గ్రహించాలి. ఎవరిని బడితే వారిని నమ్మి, మోసపోకుండా ముందుగానే తగిన జాగ్రత్తలు తీసుకోవాలి. ఇతరుల మాటల యొక్క అంతరార్ధం గ్రహించడానికి ప్రయత్నించండి. ఈ రోజు మీరు మీ పాత కాలం స్నేహితులను కలుసుకునే అవకాశం ఉంది. సమస్యలను చక్కదిద్దటానికి మీరు చేసే ప్రయత్నాలు సర్దుమనుగుతాయి. ఈ రోజు మీకు బాగానే ఉంది. ప్రతీ రోజు రాశిఫలాలు పొందటానికి టెలిగ్రామ్ లో మన ఛానల్ ను ఈ లింక్ ద్వారా ఫాలో అవ్వండి. లింక్: https://t.me/HinduDharmamVardhillaliChannel
సింహ రాశి: శారీరక ధృడత్వాన్ని పెంచుకొనే దిశగా ప్రయత్నాలు జరుగుతాయి. అంటే వ్యాయామం వంటివి చేయాలి అని ఆలోచన చేస్తారు, ఆ దిశగా అడుగులు వేస్తారు. ఆర్ధికంగా చాలా బాగుందబోతుంది. రాబడి పెరుగుతుంది. మీకు రావలసిన ధనం చేతికి అందుతుంది. నిజానికి ఈ రోజు మీరు ఉహించిన దానికంటే అధిక రాబడి పొందే అవకాశం ఉంది. అలానే అనుకోకుండా ఏదోకటి కోనేయదమో లేదా ఎవరికైనా ఇవ్వడం ద్వారానో ధనం కూడా అలానే వెళ్ళిపోయే అవకాశం ఉంది. సంబంధ బాంధవ్యాలు మేరుగుపరచుకునేన్డుకుగాను మీరు చేసే ప్రయత్నాలు సత్ఫలితాలను ఇస్తాయి. పరిచయాలు పెరుగుతాయి. సీత బాధ సీతది, పీత బాధ పీతది అనేట్టుగా మీ సమస్య పక్కన పెట్టి, ప్రతీ ఒక్కరు వారి సమస్య గురించి మీకు చెప్పటం, మిమ్మల్ని సహాయం అడగటం మీకు ఆశ్చర్యాన్ని కలిగిస్తుంది. మీ సమస్యకే పరిష్కారం దొరక్క మీరుంటే, మిమ్మల్ని వారి సమస్య పరిష్కరించమనడం మరొక ఇబ్బందిగా మారుతుంది. కాదు అనలేని, అవును అనలేని పరిస్థితి నెలకొంటుంది. అనుకోకుండా చేసే కొన్ని ప్రయాణాల వల్ల ఈ రోజు శారీరక శ్రమ అధికంగా ఉండబోతుంది. ఈ రోజు మీకు మిశ్రమ ఫలితాలను గ్రహస్థితి సూచిస్తుంది. ప్రతీ రోజు రాశిఫలాలు పొందటానికి టెలిగ్రామ్ లో మన ఛానల్ ను ఈ లింక్ ద్వారా ఫాలో అవ్వండి. లింక్: https://t.me/HinduDharmamVardhillaliChannel
కన్యా రాశి: మనస్సు నిలకడ ఉండదు. కోపం అధికంగా ఉంటుంది. జరిగే ప్రతీ సంఘటన మీరు అనుకున్న దానికి వ్యతిరకంగా జరగటం, ఎంత చెప్పిన మీ పని వారు కాని, పిల్లలు కాని మీ మాట వినకపోవడం మీ కోపానికి కారణం అవుతుంది. నూతన ఆదాయ మార్గాలు ఏర్పడతాయి. ఆశించిన ఫలితాలు అందుకోగలుగుతారు. గతంలో ఎవరికైనా మీరు అప్పు ఇచ్చి ఉంటె, ఈ రోజు మీకు ఆ ధనం తిరిగి వచ్చే అవకాశం ఉంది. బంధుమిత్రులతో లేనిపోని తగాదాలు ఏర్పడే అవకాశం ఉంది. మీ పక్కనే ఉండి, మిమ్మల్ని ఇబ్బంది పెట్టి, ప్రతీ పనికి అడ్డుతగిలే వారిని వదిలించుకునే ప్రయత్నం చేస్తారు. ఏకాంతంగా ఉండటానికి ఇష్టపడతారు. కానీ ఒక్కటి గమనించండి కష్టాలు శాశ్వతం కాదు. ముందుంది అంతా మంచికాలమే. మీకు అంతా శుభమే జరుగుతుంది. ప్రతీ రోజు రాశిఫలాలు పొందటానికి టెలిగ్రామ్ లో మన ఛానల్ ను ఈ లింక్ ద్వారా ఫాలో అవ్వండి. లింక్: https://t.me/HinduDharmamVardhillaliChannel
తులా రాశి: ఆరోగ్యం మెరుగుపడుతుంది. ప్రస్తుత గ్రహస్తితులను అనుసరించి, ఆరోగ్య పరమైన పురోగతి ఉండబోతుంది. అనారోగ్య సమస్యలన్నీ తగ్గుముఖం పడతాయి. ఎంతో కాలంగా మిమ్మల్ని వేధిస్తున్న సమస్యలు పరిష్కారం అవుతాయి. అది మీ మానసిక ఆనందానికి కారణం అవుతుంది. వ్యాపారస్తులకు శుభ సమయం నడుస్తుంది. పట్టిందల్లా బంగారంలా ఉండబోతుంది. గతంలో ఏమైనా కొద్దిపాటి విభేదాలు మీ జీవిత భాగస్వామితో ఉంటె అవి ఈ రోజు మీ వల్లనే తొలగుతాయి. సంతానం విషయంలో ఆశించిన ఫలితాలను అందుకునే అవకాశం ఉంది. మీకు నచ్చిన పని చేయడానికే అధిక సమయాన్ని కేటాయిస్తారు. దంపతుల మధ్య అన్యోన్యత పెరుగుతుంది. ఏదేమైనా ఈ రోజు మీకు మానసిక ఆనందం, ఆకస్మిక ధన ప్రాప్తి వంటి శుభాయోగాలు ఉన్నాయి. ప్రతీ రోజు రాశిఫలాలు పొందటానికి టెలిగ్రామ్ లో మన ఛానల్ ను ఈ లింక్ ద్వారా ఫాలో అవ్వండి. లింక్: https://t.me/HinduDharmamVardhillaliChannel
వృశ్చిక రాశి: ఈ రోజు సమయాన్ని మీ మనసుకి నచ్చిన పని చేయటానికే కేటాయిస్తారు. నూతన వ్యాపారాల నిమ్మిత్తం కొంత మందిని కలుసుకుని వాటి గురించి చర్చిస్తారు. అయితే ఏవి గోప్యంగా ఉంచాలో వాటిని పొరబాటున కూడా ఇతరులకు తెలియ పరచరాదు. మౌనం తో దీనిని అమలు చేయవచ్చు. అంటే అనవసరంగా మాట్లాడితే మీ సీక్రెట్స్ బయట పడటం తప్పితే వచ్చేది ఏమి ఉండదు. ఆర్ధికంగా బాగుంది. మీ వ్యాపారానికి తగిన ధనం లభిస్తుంది. లేనిపోని విభేదాలకు దూరంగా ఉండండి. మీ పని వారు కాని మీకు కావలసిన వారు కాని చెప్పిన పని చేయక పోయినా శాంతంగా డీల్ చేయండి. తద్వారా ఎలాంటి గొడవలు చెలరేగే అవకాశం ఉండదు. మీ కుటుంబ సబ్యులతో గడిపేంత సమయం మీకు ఉండక పోవడం కాస్త మానసిక ఆందోళన కలిగిస్తుంది. కొన్ని పరిస్థితులు టెన్షన్ పెట్టేవిగా ఉంటాయి. కొంతమంది విషయంలో జీవితంలో ఎప్పుడు స్థిరత్వం ఏర్పడుతుందో అనే ఆందోళన ఏర్పడుతుంది. అయితే మొన్ననే(రీసెంట్ గా) శని పీడ నుండి బయట పడ్డ్డారు అని గుర్తుంచుకోండి. మీకు రానున్న జూన్, జులై నుండి సుమారు సెప్టెంబర్, అక్టోబర్ వరకు అద్బుతంగా ఉండబోతుంది. ప్రతీ రోజు రాశిఫలాలు పొందటానికి టెలిగ్రామ్ లో మన ఛానల్ ను ఈ లింక్ ద్వారా ఫాలో అవ్వండి. లింక్: https://t.me/HinduDharmamVardhillaliChannel
ధనుస్సు రాశి: కొద్ది పాటి అనారోగ్య సూచనలు ఉన్నాయి. సరైన ఆహారాన్ని భుజించాలి. ఆర్ధిక పరమైన ఇబ్బందులు అధికంగా ఉండబోతున్నాయి. దంపతుల మధ్య కొద్దిపాటి మనస్పర్ధలు ఏర్పడే అవకాశం ఉంది. లేనిపోని కర్చులు అధికంగా ఉండబోతున్నాయి. ఎంతగా ప్రయత్నించినా ధనం నిలువక పోవడం చిరాకుని, బాధని కలిగిస్తుంది. కుటుంబ సబ్యులతో మీరు గడిపే సమయం ఇలాంటి ఒత్తిడుల నుండి కాస్త ఊరట కలిగిస్తుంది. ప్రేమికులకు అద్బుతంగా ఉండబోతుంది. మీ ప్రేమను వ్యక్త పరచడానికి చేసే ప్రయతంలో విజయం పొందే అవకాశం ఉంది. అలానే మీ మనసుకి నచ్చిన వారితో సమయాన్ని గడపడం కాస్త మానసిక ప్రశాంతతను కలిగిస్తుంది. ప్రతీ రోజు రాశిఫలాలు పొందటానికి టెలిగ్రామ్ లో మన ఛానల్ ను ఈ లింక్ ద్వారా ఫాలో అవ్వండి. లింక్: https://t.me/HinduDharmamVardhillaliChannel
మకర రాశి: లేనిపోని విభేదాలు ఏర్పడే అవకాశం ఉంది. కావున మాట్లాడేటపుడు జాగ్రత్త వహించాలి. కోపాన్ని అదుపులో ఉంచుకోవాలి. ఆర్ధికంగా బాగుంది. ఆశించిన లాభాలను అందుకోగలుగుతారు. కుటుంబ సబ్యుల గురించి అలోచించి, వారికి ఏదైనా చేయాలి అని ప్రయత్నం చేస్తారు. కుటుంబ సబ్యుల మీద మీకు ఉండే శ్రద్ద ప్రసంసనీయమైనది. మీరు ఎంతటి ఇబ్బందుల్లో ఉన్న, ముందు మీ వారిని కష్టాలనుండి గట్టేక్కించాలి అని మీరు చేసే ప్రయత్నాలు సఫలం అవుతాయి. అవివాహితులకు వివాహ యోగం ఉంది. మంచి సంబంధం సెట్ అయ్యే అవకాశం ఉంది. మనసుకి నచ్చిన పని చేయడం ద్వారా ఈ రోజు కాలాన్ని చాలా సంతోషంగా గడిపేస్తారు. ప్రతీ రోజు రాశిఫలాలు పొందటానికి టెలిగ్రామ్ లో మన ఛానల్ ను ఈ లింక్ ద్వారా ఫాలో అవ్వండి. లింక్: https://t.me/HinduDharmamVardhillaliChannel
కుంభ రాశి: నూతన వ్యాపారాలు ప్రారంభించే దిశగా మీరు చేసే ప్రయత్నాలు ఫలిస్తాయి. మీరు ఆశించిన వారు సమయానికి ధనాన్ని మీకు అందిస్తారు. ఈ రోజు మీకు ఆర్ధికంగా చాలా బాగుంది. నూతన పెట్టుబడులకు తగిన ధనం లభిస్తుంది. శుభ వార్తలు వినే అవకాశం ఉంది. అయితే పనులు వాయిదా వేయటం వల్ల మీ పై అధికారి నుండి ఒత్తిడి ఉండవచ్చు. అలానే కాస్త బద్దకంగా అనిపిస్తుంది. ఇతరులు చేయాల్సిన పని భారం కూడా మీ మీదే పడటం ద్వారా, ఈ రోజు కొంచెం శ్రమ అధికంగా ఉండబోతుంది. గత జ్ఞాపకాలను గుర్తుచేసుకుని మానసిక ఆనందాన్ని పొందుతారు. మీ మనస్సుకి మచ్చిన వారు మీ నుండి దూరం అయిపోతున్నట్టుగా భావిస్తారు. కొంచెం ఎడబాటుగా ఫీల్ అవుతారు. ప్రతీ రోజు రాశిఫలాలు పొందటానికి టెలిగ్రామ్ లో మన ఛానల్ ను ఈ లింక్ ద్వారా ఫాలో అవ్వండి. లింక్: https://t.me/HinduDharmamVardhillaliChannel
మీన రాశి: దేన్నైనా ఒక ప్రణాళిక ప్రకారం చేసే మీ శైలి అద్బుతంగా మీకు యోగిస్తుంది. ఇది మీకు ఎన్నోవిధాలుగా మంచి చేయబోతుంది. శ్రమ అధికంగా ఉండబోతుంది. ఎంతోకాలంగా వాయిదా పడుతున్న పనులు, ప్రయాణాలు తిరిగి ప్రారంభించే దిశగా అడుగులు వేస్తారు. శుభ ఫలితాలు అందుకుంటారు. మిత్రులు ఎవరో, శత్రువులు ఎవరో గ్రహించే పరిస్థితులు ఏర్పడతాయి. కొన్ని సందర్బాలలో మీరు ఇంతాకాలం ఎవరైతే మంచివారు, మీ మిత్రులు అనుకుంటున్నారో, వారే మిమ్మల్ని మోసం చేసారని లేదా మోసం చేయటానికి ప్రయత్నిస్తున్నారని మీకు అర్ధం అవుతుంది. ఏదేమైనా అంతా మీ మంచికే. ఈ రోజు సమయాన్ని విందు, వినోదాలకే వెచ్చిస్తారు. ఈ రోజు సమయం అంతా కాలక్షేపం చేయడానికే ఎక్కువగా ఇష్టపడతారు. దంపతుల మధ్య అన్యోన్యత పెరుగుతుంది. జీవిత భాగస్వామితో సమయాన్ని ఆనందంగా గడుపుతారు. ఈ రోజు మీకు భాగానే ఉంది. ప్రతీ రోజు రాశిఫలాలు పొందటానికి టెలిగ్రామ్ లో మన ఛానల్ ను ఈ లింక్ ద్వారా ఫాలో అవ్వండి. లింక్: https://t.me/HinduDharmamVardhillaliChannel
శుభం భూయాత్
Comments
Post a Comment
ఇక్కడ మీ కామెంట్ రాయండి