ఈ రోజు ఏం జరగబోతుంది - జీవితం నేర్పించే పాఠాలు ఏమిటి ? మీ దశ మార్చే జ్యోతిష్యం - 02-05-2020 - రాశిఫలలు


మేష రాశి: ఈ రోజు మీరు కోపాన్ని అదుపులో ఉంచుకోవాలి. లేనియడల లేనిపోని విభేదలకు మీ కోపం కారణం అవుతుంది. పితృవర్గం నుండి రావలసిన ఆస్తిపాస్తులు ఏమైనా ఉంటె అవి మీకు వచ్చే అవకాశం ఉంది. పితృ వర్గ సహాయ సహకారాలు మీకు ఉంటాయి. ప్రతీ పని శ్రద్దగా చేయాలి. లేని యడల పనులలో జాప్యం ఏర్పడే అవకాశం ఉంది. ప్రేమికులకు కాలం అనుకూలంగా ఉంది. గతంలో ఏమైనా కొద్దిపాటి విబేదాలు ఉంటే అవి ఈ రోజు సమసి పోతాయి. ఈ రోజు మీకు బాగానే ఉంది. ప్రతీ రోజు రాశిఫలాలు పొందటానికి టెలిగ్రామ్ లో మన ఛానల్ ను ఈ లింక్ ద్వారా ఫాలో అవ్వండి. లింక్: https://t.me/HinduDharmamVardhillaliChannel

వృషభ రాశి: అత్మ్యస్తైర్యం పెరుగుతుంది. అనుకున్నది సాధించే దిశగా ప్రణాళికలు సిద్ధం చేస్తారు మరియు వాటిని అమలు చేసే దిశగా ప్రయత్నాలు జరుగుతాయి. సంతానం నిమ్మిత్తం కర్చులు అధికంగా ఉండబోతున్నాయి. మీరు చేసే ప్రతీ పనిలోనూ కుటుంబ సభ్యుల యొక్క పూర్తి సహాయ సహకారాలు మీకు ఉంటాయి. ఉద్యోగంలో ఉన్నత్త అధికారులచే ప్రశంసలు అందుకుంటారు. నచ్చిన ఆహారాన్ని భుజించటం, నచ్చిన వారితో సమయాన్ని గడపడం, నచ్చిన పనులు చేయటం ద్వారా ఈ రోజు గడిచిపోతుంది. ఈ రోజు అంతా మీకు నచ్చినట్టుగానే ఉండేందుకు ప్రయత్నిస్తారు. ప్రతీ రోజు రాశిఫలాలు పొందటానికి టెలిగ్రామ్ లో మన ఛానల్ ను ఈ లింక్ ద్వారా ఫాలో అవ్వండి. లింక్: https://t.me/HinduDharmamVardhillaliChannel

మిథున రాశి: మానసికంగా సంతోషంగా ఉంటారు. అత్మీయులతో సమయాన్ని వెచ్చించి మీ సుఖ దు:ఖాలను వారితో పంచుకుంటారు. వ్యాపారస్తులకు లాభాల సూచన ఉంది. ఆర్ధికంగా బాగుంది. ధనానికి లోటు లేకుండా ఉంటుంది. సంతానం విషయంలో ఆశించిన పురోగతి ఉంటుంది. అది మీ మానసిక ఆనందానికి కారణం అవుతుంది. అవివాహితులకు వివాహ యోగం ఉంది. ప్రేమికులకు అనుకూల కాలం నడుస్తుంది. వివాహం దిశగా అడుగులు వేస్తారు. దంపతుల మధ్య అన్యోన్యత పెరుగుతుంది. ఈ రోజు మీకు బాగానే ఉంది. ప్రతీ రోజు రాశిఫలాలు పొందటానికి టెలిగ్రామ్ లో మన ఛానల్ ను ఈ లింక్ ద్వారా ఫాలో అవ్వండి. లింక్: https://t.me/HinduDharmamVardhillaliChannel

కర్కాటక రాశి: భవిష్యత్తుకి సంబంధించి నూతన పెట్టుబడులు పెట్టే దిశగా ప్రయత్నాలు చేస్తారు. ఈ రోజు సమయాన్ని మీ మనసుకి నచ్చిన పని చేయడానికి, ఆనందంగా గడపడానికి వెచ్చిస్తారు. నూతన వ్రుత్తి, వ్యాపార నిమిత్తం మీరు తీసుకునే నిర్ణయాల యందు తగు జాగ్రత్త వహించాలి. ప్రేమ వ్యవహారాలలో జయం లభిస్తుంది. ఇంటాబయటా పూర్తి అనుకూలం. సమాజంలో గౌరవ మర్యాదలు పెరుగుతాయి. మనసుకి నచ్చినవరితో సమయాన్ని వెచ్చించి ఈ రోజు ఆనందంగా గడపగలుగుతారు. ప్రతీ రోజు రాశిఫలాలు పొందటానికి టెలిగ్రామ్ లో మన ఛానల్ ను ఈ లింక్ ద్వారా ఫాలో అవ్వండి. లింక్: https://t.me/HinduDharmamVardhillaliChannel

సింహ రాశి: ఆరోగ్యం మెరుగుపడుతుంది. ఎంతో కాలంగా అమ్ముడుపోకుండా మిమ్మల్ని ఇబ్బంది పెడుతున్న ఒక స్థిరాస్తి అమ్ముడుపోయే దిశగా ఈ రోజు పరిస్థితులు అనుకూలిస్తాయి. పనులు వాయిదా వేయకుండా సకాలంలో పూర్తి చేయడం మంచిది. ఎవరితోనైనా గతంలో ఏమైనా కొద్దిపాటి విభేదాలు ఉంటె అవి ఈ రోజు సమసిపోతాయి. జీవిత భాగస్వామితో ఆనందంగా గడపగలుగుతారు. ఈ రోజు సమయాన్ని వినోదానికి కర్చు చేస్తారు. ఈ రోజు మీకు బాగానే ఉంది. ప్రతీ రోజు రాశిఫలాలు పొందటానికి టెలిగ్రామ్ లో మన ఛానల్ ను ఈ లింక్ ద్వారా ఫాలో అవ్వండి. లింక్: https://t.me/HinduDharmamVardhillaliChannel

కన్యా రాశి: పనులు అతి కష్టం మీద పూర్తి అవుతాయి. కర్చులు అధికంగా ఉండబోతున్నాయి. సమయానికి తగిన ధనం చేతిలో ఉండకపోవడం, మీ మానసిక ఆందోళనకు కారణం అవుతుంది. కోపాన్ని అదుపులో ఉంచుకోవాలి. ఇతరుల విషయంలో జోక్యం అనవసరం. ఇతరుల విషయంలో అనవసరపు జోక్యం చేసుకోవడం ద్వారా మీరు వారికి మంచే చేద్దాం అనుకున్నా, మీకు చెడు ఎదురయ్యే అవకాశం ఉంది. సమయాన్ని ఏకాంతంగా గడపడానికి ఇష్టపడతారు. జీవిత భాగస్వామితో కొద్దిపాటి విభేదాలు, మనస్పర్ధలు వచ్చే అవకాశం ఉంది. ప్రతీ రోజు రాశిఫలాలు పొందటానికి టెలిగ్రామ్ లో మన ఛానల్ ను ఈ లింక్ ద్వారా ఫాలో అవ్వండి. లింక్: https://t.me/HinduDharmamVardhillaliChannel

తులా రాశి: దీర్ఘ కాలిక అనారోగ్య సమస్యలకు తగిన వైద్యం లభించి, ఆరోగ్యం మెరుగుపడుతుంది. లేనిపోని కర్చులు అధికంగా ఉండబోతున్నాయి. బంధు మిత్రులను కలసుకుని కాలక్షేపం చేస్తారు. పనులు ఇతరుల సహాయంతో పూర్తికాగలవు. మానసికంగా చాలా ప్రశాంతంగా ఉండగలుగుతారు. దంపతుల మధ్య అన్యోన్యత పెరుగుతుంది. ఆధ్యాత్మిక చింతన పెరుగుతుంది. దైవ దర్శనాలు, పూజలు చేసుకునే అవకాశం ఉంది. ఈ రోజు మీకు బాగానే ఉంది. ప్రతీ రోజు రాశిఫలాలు పొందటానికి టెలిగ్రామ్ లో మన ఛానల్ ను ఈ లింక్ ద్వారా ఫాలో అవ్వండి. లింక్: https://t.me/HinduDharmamVardhillaliChannel

వృశ్చిక రాశి: మానసికంగా ఎంతో ఉల్లాసంగా ఉంటారు. ఆర్ధికంగా చాలా బాగుంది. రాబడి పెరుగుతుంది. అయితే మీ రాబడికి తగినట్టుగానే కర్చులు కూడా ఉండబోతున్నాయి. నిజానికి ప్రస్తుతం మీరు చేసే కర్చులు ఏవీ అంతగా వృధా కర్చులుగా ఉండబోవు. మీ మనసుకి నచ్చిన వారితో మీరు గడిపే సమయం ఒక మధుర జ్ఞాపకంగా ఉండబోతుంది. అయితే మీకు బాగా కావలసిన వారి ఆరోగ్యం పట్ల మీకు కొంత ఆందోళన ఏర్పడే అవకాశం ఉంది. ఉద్యోగ పరంగా శ్రమ అధికంగా ఉండబోతుంది. ఇతరులు చేయాల్సిన పనికూడా మీరే చేయవలసి రావడం వళ్ళ పనిభారం అధికంగా ఉండబోతుంది. నూతన వ్రుత్తి, ఉద్యోగ దిశగా మీరు చేసే ప్రయత్నాలు సత్ఫలితాలను ఇస్తాయి. ప్రతీ రోజు రాశిఫలాలు పొందటానికి టెలిగ్రామ్ లో మన ఛానల్ ను ఈ లింక్ ద్వారా ఫాలో అవ్వండి. లింక్: https://t.me/HinduDharmamVardhillaliChannel

ధనుస్సు రాశి: చాలా బద్దకంగా అనిపిస్తుంది. పనులు వాయిదా వేసే అవకాశం ఉంది. పని భారం అధికంగా ఉండబోతుంది. శారీరక శ్రమ అధికం. కుటుంబ సబ్యులతో కలసి ఆనందంగా ఉంటారు. అనుకోని కర్చులు మీకు చాలా ఇబ్బందిగా మారతాయి. అసలే అంతంత మాత్రంగా ఉండే ఆర్ధిక పరిస్థితికి ఇలాంటి కర్చులు మరింత భారంగా మారతాయి. తద్వారా మానసిక ప్రశాంతత కోల్పోతారు. ఇతరులతో మాట్లాడేటపుడు జాగ్రత్తగా ఉండాలి. అకారణ కలహా సూచనలు ఉన్నాయి. ప్రతీ రోజు రాశిఫలాలు పొందటానికి టెలిగ్రామ్ లో మన ఛానల్ ను ఈ లింక్ ద్వారా ఫాలో అవ్వండి. లింక్: https://t.me/HinduDharmamVardhillaliChannel

మకర రాశి: మీ సహనానికి పరీక్షా కాలంలో ఒక సంఘటన ఉండబోతుంది. కోపాన్ని అదుపులో పెట్టుకోవడం ద్వారా ఎలాంటి సమస్య నుండైన పయత పడొచ్చని గ్రహించండి. నిర్ణయాలు తీసుకునేతపుడు మరింత శ్రద్ద అవసరం. ఒకటికి రెండు సార్లు అలోచించి నిర్ణయాలు తీసుకోవాలి. వ్యాపారస్తులకు వ్యాపారాలు లాభాల బాటలో సగాబోతున్నాయి. ఆశించిన రాబడి పొందే అవకాశం మెండుగా ఉంది. ఆర్ధికంగా ఎలాంటి ఇబ్బంది ఉండదు. దూరపు బందువులు మిమ్మల్ని కలుసుకునే అవకాశం ఉంది. మీరు చేసే ప్రయాణాలు భవిష్యత్తులో ఎంతో ఉపయోగకరం కానున్నాయి. జీవిత భాగస్వామితో అనందంగా సమయాన్ని గడుపుతారు. ఈ రోజు మీకు బాగానే ఉంది. ప్రతీ రోజు రాశిఫలాలు పొందటానికి టెలిగ్రామ్ లో మన ఛానల్ ను ఈ లింక్ ద్వారా ఫాలో అవ్వండి. లింక్: https://t.me/HinduDharmamVardhillaliChannel

కుంభ రాశి: ఆధ్యాత్మిక చింతన ఉంటుంది. ఒక గురువు మీకు లభిస్తారు. వారి ద్వారా తెలియని ఎన్నో విషయాలు మీరు తెలుసుకునే అవకాశం ఉంది. కాళా రంగంలో ఉన్నవారికి చాలా బాగుందబోతుంది. మీ ప్రతిభ వెలుగులోకి వస్తుంది. ప్రశంసలు అందుకుంటారు. అవివాహితులకు వివాహ యోగం ఉంది. ప్రేమికులకు అనుకూల సమయం నడుస్తుంది. గతంలో ఎవరితోనైనా విభేదాలు ఉంటే అవి ఈ రోజు సర్దుమనుగుతాయి. ప్రయాణాలు చేసే అవకాశం ఉంది. జీవిత భాగస్వామితో మాట్లాడేటపుడు జాగ్రత్తగా ఉండాలి. లేకపోతే లేనిపోని గొడవలు, మనస్పర్ధలు ఏర్పడే అవకాశం ఉంది. ఒత్తిడిని, కోపాన్ని ఈ రోజు మీరు అదుపులో ఉంచుకోగలిగితే అంతా మంచే జరుగుతుంది. ప్రతీ రోజు రాశిఫలాలు పొందటానికి టెలిగ్రామ్ లో మన ఛానల్ ను ఈ లింక్ ద్వారా ఫాలో అవ్వండి. లింక్: https://t.me/HinduDharmamVardhillaliChannel

మీన రాశి: ఆత్మస్థైర్యం పెరుగుతుంది. ఆర్ధిక పరమైన విషయాలలో జాగ్రత్తగా ఉండాలి. మనసుకి నచ్చిన వారితో సమయాన్ని వెచ్చించి ఆనందంగా ఉండగలుగుతారు. అవివాహితులకు వివాహ యోగం ఉంది. అలానే వివాహం అయిన వారు తమ జీవిత భాగస్వామితో మాట్లాడేటపుడు జాగ్రత్త గా ఉండాలి. లేకపోతే కొద్దిపాటి విభేదాలు, మనస్పర్ధలు ఏర్పడే అవకాశం ఉంది. అయితే ఇవి అంత పెద్ద వాదనలు కాకపోవడం వళ్ళ వాటంతట అవే సర్డుమనుగుతాయి. నూతన ఉద్యోగాలకోసం ప్రయత్నించే వారికి ప్రస్తుతం బాగానే ఉంది. త్వరలో మీరు చేసే ప్రయత్నాలకు తగిన ప్రతిఫలం లభించబోతుంది. ప్రయాణాలు వాయిదా పడే అవకాశం ఉంది. ఈ రోజు మీకు బాగానే ఉంది. ప్రతీ రోజు రాశిఫలాలు పొందటానికి టెలిగ్రామ్ లో మన ఛానల్ ను ఈ లింక్ ద్వారా ఫాలో అవ్వండి. లింక్: https://t.me/HinduDharmamVardhillaliChannel

శుభం భూయాత్ 

Comments