రాశిఫలలు 01-05-2020 - ఈ రోజు ఏం జరగబోతుంది - జీవితం నేర్పించే పాఠాలు ఏమిటి ? - మీ దశ మార్చే జ్యోతిష్యం

మేష రాశి: ఈ రోజు మీకు మిశ్రమ ఫలితాలను గ్రహస్థితి సూచిస్తుంది. నూతన పెట్టుబడులు పెట్టడానికి ఇది అంత అనుకూల సమయం కాదు అని చెప్పవచ్చు. పూర్వపు మిత్రులను కలుసుకుంటారు. ప్రేమికులకు అనుకూలంగా ఉంది. మనసుకి నచ్చిన వారితో సమయాన్ని ఆనందంగా గడుపుతారు. మీ ప్రతిభకు గుర్తింపు లభిస్తుంది. ప్రశంసలు అందుకుంటారు. ప్రణాళికా బద్దంగా మీరు చేసే ప్రతీ పని విజయాన్ని ప్రసాదిస్తుంది. ఇతరులతో మాట్లాడేటపుడు మీ కోపాన్ని అదుపులో ఉంచుకోవాలి. లేనిపోని విబేదలు ఏర్పడే అవకాశం ఉంది. కావున మాట్లాడేటపుడు జాగ్రత్తగా ఉండవలెను. ప్రతీ రోజు రాశిఫలాలు పొందటానికి టెలిగ్రామ్ లో మన ఛానల్ ను ఈ లింక్ ద్వారా ఫాలో అవ్వండి. లింక్: https://t.me/HinduDharmamVardhillaliChannel
వృషభ రాశి: ఆరోగ్యం మెరుగు పడుతుంది. వ్యాయామం, యోగా వంటి వాటి పై మొగ్గు చూపుతారు. ఆరోగ్యం మెరుగుపరచుకునే దిశగా మీరు చేసే ప్రయత్నాలు సత్ఫలితాలను ఇస్తాయి. నూతన జీవన శైలి అవలంభించే ప్రయత్నం చేస్తారు. ఆర్ధికంగా అద్బుతంగా ఉండబోతుంది. ధనానికి లోటు ఉండదు. ఆదాయ మార్గాలు పెరుగుతాయి. గతంలో పెట్టిన పెట్టుబడులు లాభాలను ఇస్తాయి. ఈ రోజు మీరు కలుసుకునే కొంత మంది ద్వారా భవిష్యత్తులో లాభం చేకురనుంది. వ్రుత్తి, ఉద్యోగ పరంగా అభివృద్ధి ఉండబోతుంది. ఈ రోజు మీకు చాలా బాగుంది. ప్రతీ రోజు రాశిఫలాలు పొందటానికి టెలిగ్రామ్ లో మన ఛానల్ ను ఈ లింక్ ద్వారా ఫాలో అవ్వండి. లింక్: https://t.me/HinduDharmamVardhillaliChannel
మిథున రాశి: ఈ రోజు మిశ్రమ ఫలితాలను గ్రహస్థితి సూచిస్తుంది. దంపతుల మధ్య కొద్ది పాటి మనస్పర్ధలు ఏర్పడే అవకాశం ఉంది. లేనిపోని కర్చులు అధికంగా ఉండబోతున్నాయి. ఆర్ధికంగా కాస్త ఇబ్బందికర పరిస్థితి నెలకొంటుంది. ఓపిక తో చేసే ప్రతీ పని శుభ ఫలితాలను ఇస్తుంది. ఒకటికి రెండు సార్లు అలోచించి నిర్ణయాలు తీసుకోవాలి. వ్రుత్తి, ఉద్యోగ పరంగా ఈ రోజు మీకు నూతన వ్యక్తుల పరిచయాలు ఏర్పడతాయి. ఇవి మీకు ఎంతగానో ఉపయోగ పడతాయి. ఈ రోజు సమయాన్ని కాలక్షేపం చేయడానికి, మనసుకి నచ్చిన పని చేయడానికి వెచ్చిస్తారు. ప్రతీ రోజు రాశిఫలాలు పొందటానికి టెలిగ్రామ్ లో మన ఛానల్ ను ఈ లింక్ ద్వారా ఫాలో అవ్వండి. లింక్: https://t.me/HinduDharmamVardhillaliChannel
కర్కాటక రాశి: ఈ రోజు సంతోషంగా కాలాన్ని గడుపుతారు. మానసికంగా ఉల్లాసంగా ఉంటారు. ఆర్ధికంగా చాలా అనుకులా సమయం నడుస్తుంది. నూతన ఆదాయ మార్గాలు పెంపొందించుకునే దిశగా మీరు చేసే ప్రయత్నాలు సత్ఫలితాలను ఇస్తాయి. బంధు మిత్రులను కలసుకొని ఆనందంగా సమయాన్ని గడుపుతారు. దంపతుల మధ్య అన్యోనత పెరుగుతుంది. గతంలో ఏమైనా కొద్దిపాటి విబేదాలు ఉంటె అవి సర్దు మనుగుతాయి. అవివాహితులకు శుభ సమయం నడుస్తుంది. మంచి సంబంధం సెట్ అయ్యే అవకాశం ఉంది. నిరుద్యోగులకు ఉద్యోగ యోగం ఉంది. ఈ రోజు మీకు బాగుంది. శుభం. ప్రతీ రోజు రాశిఫలాలు పొందటానికి టెలిగ్రామ్ లో మన ఛానల్ ను ఈ లింక్ ద్వారా ఫాలో అవ్వండి. లింక్: https://t.me/HinduDharmamVardhillaliChannel
సింహ రాశి: ఎన్నడు లేనంత కాలీ సమయం ఈ రోజు మీకు దొరుకుతుంది. ఈ సమయాన్ని మీరు ఇతరులతో సంభాషించడానికి వెచ్చిస్తారు. కుటుంబ సబ్యులతో కొద్దిపాటి విబేదాలు ఏర్పడే అవకాశం ఉంది. కోపాన్ని అదుపులో ఉంచుకోవడం ద్వారా ఇలాంటి సమస్యల నుండి బయటపడొచ్చు. నూతన వ్యాపారాలు ప్రారంభించే దిశగా ప్రయత్నాలు జరుగుతాయి. నూతన వస్తు, వాహనాలు కొనే అవకాశం ఉంది. భార్యా భర్తల మధ్య తగాదాలు ఏర్పడే అవకాశం ఉంది. ప్రతీ రోజు రాశిఫలాలు పొందటానికి టెలిగ్రామ్ లో మన ఛానల్ ను ఈ లింక్ ద్వారా ఫాలో అవ్వండి. లింక్: https://t.me/HinduDharmamVardhillaliChannel
కన్యా రాశి: జరుగుతున్న కొన్ని సంఘటనలు మానసిక ఆందోళనకు కారణం అవుతాయి. అయితే యోగా, ధ్యానం వంటి వాటి ద్వారా మానసిక ఒత్తిడిని తగ్గించుకునే ప్రయత్నం చేయటం మంచిది. ఆర్ధికంగా బాగుంది. వ్యాపారస్తులకు వ్యాపారాలు లాభాల బాటలో నడుస్తాయి. వ్యాపారాన్ని విస్తరించే దిశగా ఆలోచనలు చేస్తారు. సంతానం విషయంలో మీరు ఆశించిన ఫలితాన్ని పొందలేరు. ఇది మిమ్మల్ని కొద్దిగా ఇబ్బంది పెట్టె విషయంగా ఉండబోతుంది. పరిచయాలు పెరుగుతాయి. ఆత్మస్థైర్యం పెంచుకుని, ప్రతీ పనినీ కష్టించి పూర్తి చేస్తారు. ప్రతీ రోజు రాశిఫలాలు పొందటానికి టెలిగ్రామ్ లో మన ఛానల్ ను ఈ లింక్ ద్వారా ఫాలో అవ్వండి. లింక్: https://t.me/HinduDharmamVardhillaliChannel
తులా రాశి: ఎంతోకాలంగా మిమ్మల్ని ఇబ్బంది పెడుతున్న సమస్యలకు పరిష్కార మార్గం కనుగొనే దిశగా ప్రయత్నాలు జరుగుతాయి. ఆ నిమ్మిత్తం మీరు బాగా నమ్మిన వ్యక్తుల యొక్క సహాయ సహకారాలు స్వీకరిస్తారు. ఇకనుండైన కర్చులు అదుపు చేసి, భవిష్యత్తు కోసం ధనాన్ని కుడబెట్టాలి అని ఆలోచిస్తారు. నూతన వస్తు, వాహనాలు కొనే అవకాశం ఉంది. ప్రేమికులకు అనుకూలా సమయం నడుస్తుంది. మనసుకి నచ్చిన వారితో సమయాన్ని గడిపి మానసికంగా సంతోషంగా ఉండగలుగుతారు. అయితే ఉద్యోగ పరమైన ఒత్తిడులు తప్పనిసరి. ప్రతీ రోజు రాశిఫలాలు పొందటానికి టెలిగ్రామ్ లో మన ఛానల్ ను ఈ లింక్ ద్వారా ఫాలో అవ్వండి. లింక్: https://t.me/HinduDharmamVardhillaliChannel
వృశ్చిక రాశి: గతం కంటే మెరుగ్గా ప్రస్తుత కాలం ఉండబోతుంది. మానసిక సంతోషం మీ సొంతం. నూతన ఆదాయ మార్గాలను సృష్టించుకునే దిశగా మీరు చేసే ప్రయత్నాలు అద్బుత ఫలితాలను ఇస్తాయి. ఆర్ధికంగా తిరుగు ఉండదు. రాబడి పెరుగుతుంది. ఆశించిన స్థాయిలో మీ సంతానం ఉండటం మీ మానసిక సంతోషానికి కారణం అవుతుంది. అయితే మీ కుటుంబ సబ్యులలో ఒకరి ఆరోగ్య పరిస్థితి పై మీకు ఉండే ఆందోళన మరింత పెరిగే అవకాశం ఉంది. అవివాహితులకు వివాహ యోగం, నిరుద్యోగులకు ఉద్యోగ యోగం ఉంది. వ్రుత్తి, ఉద్యోగ పరంగా ఉన్న సమస్యలు తొలగుతాయి. ఈ రోజు మీకు అంతా బాగానే ఉంది. ప్రతీ రోజు రాశిఫలాలు పొందటానికి టెలిగ్రామ్ లో మన ఛానల్ ను ఈ లింక్ ద్వారా ఫాలో అవ్వండి. లింక్: https://t.me/HinduDharmamVardhillaliChannel
ధనుస్సు రాశి: పనులలో జాప్యం ఏర్పడే అవకాశం ఉంది. కుటుంబ సబ్యులతో సమయాన్ని ఆనందంగా గడుపుతారు. జీవిత భాగస్వామితో కొద్దిపాటి విబేదాలు, మనస్పర్ధలు ఏర్పడే అవకాశం ఉంది. దానికి కారణం ప్రస్తుత మీ కుటుంబ కలహాలు కావచ్చు. నూతన పరిచయాలు మీకు నూతన వ్రుత్తి, ఉద్యోగాలను ఏర్పరచేవిగా ఉండబోతున్నాయి. గత జ్ఞాపకాలను గుర్తు చేసుకుని ఆనందంగా ఉంటారు. ఈ రోజు మీకు మిశ్రమంగా ఉండబోతుంది. ప్రతీ రోజు రాశిఫలాలు పొందటానికి టెలిగ్రామ్ లో మన ఛానల్ ను ఈ లింక్ ద్వారా ఫాలో అవ్వండి. లింక్: https://t.me/HinduDharmamVardhillaliChannel
మకర రాశి: ఒత్తిడిని తగ్గించుకునే ప్రయత్నంలో భాగంగా వ్యాయామం, యోగ వంటివి చేస్తారు. ఆరోగ్యమే మహాభాగ్యం అనే దానిని ఈ రోజు మీరు గుర్తిస్తారు. ఆ దిశగా ఆరోగ్యాన్ని మెరుగుపరచుకునే ప్రయత్నాలు చేస్తారు. నూతన వ్యాపారాలు ప్రారంభించటానికి తగిన ఋణాన్ని మీ స్నేహితుల ద్వారా పొందగలుగుతారు. జీవిత భాగస్వామి తో కలసి ఆనందంగా ఉండగలుగుతారు. అయితే ప్రేమికులకు అంత అనుకూలంగా లేదు. ఉద్యోగ పరంగా మీరు చేసే ప్రతీ పని యందు మీ తోటి ఉద్యోగుల సహాయ సహకారాలు అంది, అనుకున్న దానికంటే ముందుగానే పనులు పూర్తి అవుతాయి. ఈ రోజు మీరు తీసుకునే నిర్ణయాలు మీ ఆర్ధిక స్థితిగతుల మీద ప్రభావం చుపబోతున్నాయి. కావున ప్రతీ నిర్ణయాన్ని ఒకటికి రెండు సార్లు అలోచించి తీసుకోవాలి. ప్రతీ రోజు రాశిఫలాలు పొందటానికి టెలిగ్రామ్ లో మన ఛానల్ ను ఈ లింక్ ద్వారా ఫాలో అవ్వండి. లింక్: https://t.me/HinduDharmamVardhillaliChannel
కుంభ రాశి: మానసికంగా కాస్త ప్రశాంతంగా ఉంటారు. ఈ రోజు సమయాన్ని కాలక్షేపం చేయడానికి, విందు వినోదాలకే కర్చు చేస్తారు. మీ తోబుట్టువుల సహాయ సహకారాలు వెన్నంటి ఉండటం మీకు కొండంత బలాన్ని ఇస్తాయి. ఆపదలనుండి బయట పడేస్తాయి. ప్రేమ వ్యవహారాలకు అంత మంచి కాలం కాదు. మనస్సు నిలకడ ఉండదు. అనేక రకాల ఆలోచనలు చేస్తారు. శారీరక శ్రమ అధికంగా ఉండబోతుంది. పనులు అతి కష్టం మీద పూర్తి అవుతాయి. అయితే తోదరపాటు నిర్ణయాలు ఇబ్బందికరంగా మారే అవకాశం ఉంది. కావున జాగ్రత్త వహించాలి. ప్రతీ రోజు రాశిఫలాలు పొందటానికి టెలిగ్రామ్ లో మన ఛానల్ ను ఈ లింక్ ద్వారా ఫాలో అవ్వండి. లింక్: https://t.me/HinduDharmamVardhillaliChannel
మీన రాశి: ఆర్ధికంగా బాగుంది. ధనానికి లోటు ఉండదు. ఏదోక రూపంలో మీకు ధనం అందుతుంది. తద్వారా చాలా సమస్యల నుండి బయట పడొచ్చు. అవివాహితులకు వివాహ యోగం ఉంది. పనిలో మీ తోటి వారితో గొడవలు ఏర్పడే అవకాశం ఉంది. కావున జాగ్రత్త వహించాలి. మిమ్మల్ని ఇబ్బంది పెట్టె దిశగా మీ వైరి వర్గం వారు చేసే ప్రయత్నాలను ఒక కంట కనిపెడుతూ ఉండాలి. జీవిత భాగస్వామితో కలసి ఆనందంగా సమయాన్ని గడుపుతారు. మానసికంగా సంతోషంగా ఉండగలుగుతారు. ప్రతీ రోజు రాశిఫలాలు పొందటానికి టెలిగ్రామ్ లో మన ఛానల్ ను ఈ లింక్ ద్వారా ఫాలో అవ్వండి. లింక్: https://t.me/HinduDharmamVardhillaliChannel
శుభం భూయాత్
Comments
Post a Comment
ఇక్కడ మీ కామెంట్ రాయండి