టెలిగ్రామ్ లో మీ ఎకౌంటు ను ఎలా క్రియేట్ చేసుకోవాలి ? మన హైందవ గ్రూప్ లో ఎలా జాయిన్ అవ్వాలి ?అనే వివరాలు గ్రూప్ లింక్ తో సహా ఇక్కడ ఇవ్వటం జరిగింది. ఎలాంటి భక్తి సమాచారం మీకు అందుతుంది అనేది కుడా క్లుప్తంగా వివరించాము.

హైందవ మిత్రుల అతి పెద్ద టెలిగ్రామ్ గ్రూప్
చాల మంది టెలిగ్రామ్ అంటే ఏమిటి ? ఎలా క్రియేట్ చేయాలి ? గ్రూప్ లో ఎలా జాయిన్ అవ్వాలి అనే అంశం గురించి మెస్సేజ్ చేస్తున్నారు కాబట్టి ముందుగా టెలిగ్రామ్ గురించి వివరించి తదుపరి గ్రూప్ లో ఇవ్వబడే భక్తి సమాచారం గురించి వివరిస్తాను.
మిత్రులారా,
టెలిగ్రామ్ అంటే వాట్సాప్ లాంటి మరొక ఆప్(App). అందరికీ భక్తి సమాచారాన్ని, భక్తి పుస్తకాలను వాట్సాప్ ద్వారా అందించాలి, ఈ లాక్ డౌన్ సమయంలో హైందవ మిత్రులందరికీ మన ధర్మం గురించి తెలుసుకునేలా భక్తి సమాచారాన్ని, భక్తి పుస్తకాలను, జ్యోతిష్యం వంటి వాటిని అందించాలి అని సంకల్పించినప్పటికీ, వాట్సాప్ వాళ్ళు మేము పంపే మెస్సేజ్ లు అందరికి వేల్లనివ్వటం లేదు. దీనికి గాను సుమారు మూడు సార్లు ఆ సంస్థకు మెయిల్ చేసినా, వారు సరిగ్గా స్పందించలేదు. అయితే మేము తీసుకున్న సంకల్పం ఆగిపోకూడదు, భక్తి సమాచారం అందరికీ వెళ్ళాలి, కావున వేరే మార్గం చూడాలి అనుకున్నప్పుడు మాకు గుర్తొచ్చింది, టెలిగ్రామ్ అనే మరొక వాట్సాప్ లాంటి ఆప్(App). దీనిలో ఒకే గ్రూప్ లో సుమారు 2 లక్షల మందిని ఒకేసారి చేర్చి, భక్తి సమాచారన్ని అందరికి ఒకేసారి చేరవేయవచ్చు. కావున ప్రతీ ఒక్కరికి టెలిగ్రామ్ లో ఎకౌంటు క్రియేట్ చేసుకుని, మన గ్రూప్ లో జాయిన్ అవ్వమని గ్రూప్ లింక్ పంపినప్పటికీ, చాలా మందికి టెలిగ్రామ్ గురించి అంత అవగాహన లేకపోవడం వల్ల ఇప్పుడు టెలిగ్రామ్ లో ఎకౌంటు ఎలా క్రియేట్ చేయాలి వంటి వాటిని క్లుప్తంగా చూద్దాం.
టెలిగ్రామ్ ని డౌన్లోడ్ చేసుకోవటం:
ఇంతకు ముందు చెప్పినట్టే టెలిగ్రామ్ అనేది వాట్సాప్ లాంటి మరొక ఆప్(App), కాని వాట్సాప్ అంటే కొన్ని కోట్ల రెట్ల మెరుగైనది. అయితే దీనిని డౌన్లోడ్ చేసుకోవాలంటే ముందుగా మీరు గూగుల్ playstore లోకి వెళ్లి telegram అని సెర్చ్ చేయండి/వెతకండి. అప్పుడు మీకు Telegram (నీలి రంగు), Telegram X (నలుపు రంగు) అని రెండు ఆప్ లు కనిపిస్తాయి. దానిలో నీలి రంగులో ఉన్న టెలిగ్రామ్ ను ఇన్స్టాల్ చేసుకోండి.
రెండిటికీ తేడా ఏమిటి ? ఎందుకు నీలి రంగులో ఉన్న టెలిగ్రామ్ నే ఇన్స్టాల్ చేసుకోవడం సుచించడమైనది ?
రెండు ఆప్ లూ కూడా ఒకే సంస్థ వారు తయారు చేసినవి. అయితే నీలి రంగులో ఉన్న టెలిగ్రామ్ ద్వారా మీరు ఒకేసారి ఎక్కువ మెస్సేజ్ లను డిలిట్ చేయవచ్చు. అలానే గ్రూప్ లో ఒకేసారి సుమారు 200 మందిని యాడ్ చేయవచ్చు. ఈ విధమైన ఫీచర్లు నలుపు రంగులో ఉన్న టెలిగ్రామ్ లో ఉండవు(కొంచెం కష్టం). కావున ఇది(నీలి రంగుది) మీకు సౌకర్యా వంతంగా ఉంటుంది అని మా సలహా.
డౌన్లోడ్ చేశాక అందులో మా ఎకౌంటు ఎలా క్రియేట్ చేయాలి ?
చాలా సులభం. వాట్సాప్ మాదిరిగానే ఇందులో కూడా మీరు ఆప్ డౌన్లోడ్ అయ్యిన తరువాత ఆ ఆప్ మీద క్లిక్ చేయండి. అప్పుడు మీ ఎకౌంటు ను క్రియేట్ చేయటానికి ఆప్షన్ కనపడుతుంది. అక్కడ మీ సెల్ నెంబర్ ఇవ్వండి. అప్పుడు మీ సెల్ నెంబర్ కి ఒక OTP వస్తుంది. దానిని అక్కడ ఎంటర్ చేయండి. తరువాత మీ పేరు, ఇతర వివరాలతో సేం వాట్సాప్ లో లాగే ఇక్కడ కూడా మీ ఎకౌంటు ను క్రియేట్ చేయండి.
ఎకౌంటు క్రియేట్ చేసాకా మన గ్రూప్ లో జాయిన్ అవ్వటం ఎలా ?
చాల సులభం. ఎకౌంటు క్రియేట్ చేసాకా, మీరు తిరిగి మీ వాట్సాప్ కి వచ్చి, ఈ ఆర్టికల్ కు సంబందించిన లింక్ పై క్లిక్ చేసి మళ్ళా తిరిగి ఇక్కడకు రండి. ఇప్పుడు ఈ క్రింద ఉన్న లింక్ పై క్లిక్ చేయండి. వెంటనే మీరు గ్రూప్ లో జాయిన్ అవ్వడానికి అవకాశం వస్తుంది.
అలా జాయిన్ అయ్యాకా, మీరు మీ మిత్రులను కుడా మన గ్రూప్ లో యాడ్ చేయండి. దీనికి గాను మన గ్రూప్ పేరు మీద క్లిక్ చేస్తే మీరు పైన కాని లేదా ఎకౌంటు ఇన్ఫర్మేషన్ దగ్గర కాని యాడ్ ఫ్రెండ్ అని ఆప్షన్ చూస్తారు. అప్పుడు దానిమీద క్లిక్ చేసి మీ స్నేహితులను సెలెక్ట్ చేసి యాడ్ చేయండి. ఇంకా మీకు ఏమైనా సందేహాలు ఉంటె క్రింద కంమెంట్లు రూపంలో కాని నాకు వాట్సాప్ లో మెస్సేజ్ రూపంలో గాని తెలియ చేసినా నేను స్పందిన్చగలను.
ఇప్పుడు మన గ్రూప్ గురించి చిన్న వివరణ
సనాతన ధర్మం హైందవం. అటువంటి హైందవ ధర్మం పుట్టిన దేశం మన భారత దేశం. మన దేశం లో జరుపుకునే ప్రతీ పండుగ, పర్వదినాల వెనుక మనకు తెలియని ఎన్నో విషయాలు దాగి ఉన్నాయి. వాటి అంతరార్ధం ఒక్క ముక్కలో చెప్పాలి అంటే సమాజ శ్రేయ్యస్సు. పూర్వ కాలంలో ఏ ఒక్కరూ ధరిద్రాలతో, కష్టాలతో ఉండేవారు కాదు అంటే నమ్మసఖ్యం కాదు. కాని ఒక్కసారి మన గ్రంధాలను పరిశిలించి చూస్తే మీకు ఈ విషయం అవగతమవుతుంది. అయితే పూర్వపు రోజులలో ప్రజలు అష్టైశ్వర్యాలతో తులతుగటానికి గల ప్రధాన కారణం భగవంతుని యందు భక్తి విశ్వాసాలు. నిజానికి అప్పట్లో భగవంతుడిని నమ్మనివాడు అంటూ ఎవరు ఉండేవారు కాదేమో. కాని నేటి సమాజంలో భగవంతుడు ఉన్నాడా అని ప్రశ్నించే వాళ్ళు ఎక్కువ అవుతున్నారు. దానికి గల ప్రధాన కారణం మన హైందవ గ్రంధాల పట్ల, మన సంస్కృతి సంప్రదాయాల పట్లా కనీస అవగాన లేకపోవడం అని నా అభిప్రాయం. అయితే నేటి సమాజంలో అసలు మన పండుగలను, పర్వదినాలను ఎందుకు జరుపుకుంటామో కూడా తెలియని వాళ్ళు అధికం అవుతున్నారు. పోను పోను అసలు భగవంతునికి నమస్కారం ఎలా చేయాలి, గుడిలో ప్రదక్షిణ ఎలా చేయాలి అనేవి కుడా తెలియకుండా పొంతుందేమో అని భయం వేస్తుంది. అందుకనే హైందవులందరికీ మన హైందవ ధర్మం గురించి తెలియ చేయాలనీ సంకల్పించి. ఒక టెలిగ్రామ్ గ్రూప్ ను సృష్టించటం జరిగింది. ఇది పూర్తి ఉచితం. దీనిలో ప్రతీ నిత్యం మన హైందవులకు క్రింది సమాచారం పంపించబడుతుంది.
1) ప్రతీ నిత్యం పంచాంగ వివరాలు అంటే ఆ రోజు తిది, నక్షత్రం, శుభ సమయాలు, అశుభ సమయాలు, ఆ రోజు ఏ పనులు చేయడం వళ్ళ ఉత్తమ ఫలితాలను పొందవచ్చు లాంటివి.
2) ప్రతీ నిత్యం రాశి ఫలాలు, అలానే ప్రతీ వారం వార ఫలాలు, ప్రతీ నెలా మాస ఫలాలు పంపించడం జరుగుతుంది. వీటితో పాటు ఏ రాశి వారికి ఎలాంటి పరిహారాలు పాటించాలి అనేది కుడా వివరించటం జరుగుతుంది. (ఆశక్తి ఉన్నవారికి మీ వ్యక్తి గత జతాకలను మాకు సమయం ఉన్నప్పుడు చూసి, పరిహారాలు చెప్పగలము).
3) రాబోయే పర్వదినాల విశిష్టత ఒక రోజు ముందుగానే వివరించటం జరుగుతుంది. అంటే ఆ రోజు యొక్క విశిష్టత ఏమిటి, ఆ రోజు పాటించాల్సిన విధి విధానాలు ఏమిటి, ఆ రోజు ఏమి చేస్తే ఎలాంటి ఫలితం వస్తుంది వంటి అనేక విషయాలు మీకు ముందుగానే పంపించటం జరుగుతుంది.
4) హైందవ గ్రంధాలు అయిన వేదాలు, పురాణాలు, మహాకావ్యాలు(రామాయణం, మహా భారతం వంటివి) పిడిఎఫ్ రూపంలో భక్తి పుస్తకాలు అందరికీ అర్ధమయ్యే భాషలో అందించటం జరుగుతుంది. వీటిని మీకు వీలైనపుడు చదువుకోవచ్చు.
5) మన దేవాలయాల విశిష్టత, వాటి పురాణ చరిత్ర, ఆ దేవాలయాలను ఏ విధంగా దర్శించాలి, అక్కడి ఆచార సంప్రదయలేమిటి, అక్కడ పాటించాల్సిన విధి విధానాలు, ఏ దోషం ఉన్న వారు ఏ దేవాలయాన్ని దర్శించాలి మరియు ఎలాంటి పరిహారాలు ఏ సమయంలో పాటించాలి. అలా చేస్తే వచ్చే ఫలితం ఏమిటి లాంటి ఎన్నో విషయాలు మీకు తెలియ చేయటం జరుగుతుంది.
6) జ్యోతిష్య, వాస్తు పరంగా మానవులు అనేక సమస్యలు ఎదుర్కొంటున్నారు. అంటే కాలసర్ప, కుజ, పితృ దోషం లాంటి వాటి వల్ల ఏర్పడే సమస్యలు. వీటి ద్వారా వివాహం ఆలస్యం అవడం, సంతానం కలుగక పోవడం, ఇంటిలో సుఖ సంతోషాలు ఉండక పొవటం, ఆర్ధిక సమస్యలు, ఉద్యోగ, వ్యాపార సమస్యలు వాటివి ఎన్నో నిత్య జివీతంలో మానవులు ఎదుర్కొంటున్నారు. అయితే ప్రతీ సమస్యకు మన హైందవ ధర్మంలో అనేక పరిహారాలు చెప్పబడ్డాయి. అయితే ఎవరు ఎలాంటి పరిహారాన్ని పాటించాలి. ఏ సమస్యకు ఏ పరిహారం త్వరిత గతిన ఉత్తమ ఫలితాలను ఇస్తుంది లాంటి ఎన్నో మీకు వివరించటం జరుగుతుంది.
7) మన హైందవ గ్రంధాలూ మనకు చెప్పిన ఎన్నో విషయాలు మీకు ఎప్పటికప్పుడు అందించటం జరుగుతుంది. ప్రతీ మనిషిని సన్మార్గం లో నడిపించే అనేక పురాణ కథలను మీకు క్షుణ్ణంగా వివరించటం జరుగుతుంది.
ఇవి మాత్రమే కాదు మన హైందవ ధర్మానికి సంబందించిన ఎన్నో విషయాలు మీకు ఎప్పటికప్పుడు పూర్తి ఉచితంగా అందించబడుతుంది. అయితే దీనికి గాను మీరు చేయవలసింది కేవలం క్రింది లింక్ పై క్లిక్ చేసి ఆ టెలిగ్రామ్గ్రూప్ లో జాయిన్ అవ్వడమే. దీనిలో ఉన్న మరొక ప్రయోజనం ఏమిటంటే, ఒకవేళ మీరు ఏదైనా మిస్ అయితే తిరిగి వెనక్కు వెళ్లి చూసేందుకు గాను వీలు ఉంటుంది. అంటే ఈ గ్రూప్ లో మీరు చేరే కంటే ముందు పోస్ట్ చేసిన పుస్తకాలు, భక్తి సమాచారం మీరు వెనక్కు వెళ్ళటం ద్వారా (పైకి స్క్రోల్ చేయటం ద్వారా) చూడవచ్చు. అయితే ఇక ఏ ఒక్క హైందవ మిత్రులు ఆలస్యం చేయకుండా క్రింది లింక్ పై క్లిక్ చేసి వెంటనే జాయిన్ అవ్వండి. అలనీ మీ మిత్రులను కుడా మన గ్రూప్ లో జాయిన్ చేయండి.
గమనిక: ఒకవేళ పై లింక్ ఓపెన్ అవ్వక పోతే, మీరు టెలిగ్రామ్ ఓపెన్ చేసి క్రింద ఇచిన పేరు (టెక్స్ట్) ను టెలిగ్రామ్ లో సెర్చ్ చేయండి. అంటే క్రింద ఇచిన టెక్స్ట్(text) కాపీ చేసి, టెలిగ్రామ్ లోకి వెళ్లి సెర్చ్ అని నొక్కి, అక్కడ పేస్టు చేయండి. మన ఛానల్ మీకు కనబడుతుంది. వెంటనే ఫాలో అని ఉన్న చోట నొక్కి ఫాలో అవండి.
HinduDharmamVardhillali
ప్రతీ ఒక్కరు తమవంతు బాధ్యతగా దీనిని మీ మిత్రులకు ఫార్వర్డ్ చేయమని మా మనవి. అలానే గ్రూప్ లో మీరు జాయిన్ అయ్యిన వెంటనే మీ స్నేహితులను కుడా జాయిన్ చేసి టెలిగ్రామ్ లో అతిపెద్ద హైందవ గ్రూప్ క్రియేట్ చేయడానికి మీ వంతు సహాయాన్ని అందించండి. మీకు ఏమైనా సందేహాలు ఉంటె క్రింది కంమెంట్లలో తెలియచేయగలరు.
జై హింద్.
Comments
Post a Comment
ఇక్కడ మీ కామెంట్ రాయండి