ఈ రోజు ఏం జరగబోతుంది - జీవితం నేర్పించే పాఠాలు ఏమిటి ? మీ దశ మార్చే జ్యోతిష్యం - 30-04-2020 - రాశిఫలలు

మేష రాశి: ఆలోచనలు స్థిరంగా ఉండవు. అనేక ఆలోచనలు చేస్తారు. భవిష్యత్తుకి సంబందించిన ప్రణాళికలు చేస్తారు. అయితే సరైన నిర్ణయాలు తీసుకోవటం పైనే మీ భవిష్యత్తు ఆధారపడి ఉండబోతుంది. సంతానం విషయంలో కొంత ఆందోళన ఏర్పడుతుంది. కర్చులు అధికంగా ఉండబోతున్నాయి. కుటుంబ సబ్యులతో కలసి సమయాన్ని గడుపుతారు. వ్రుత్తి, ఉద్యోగ పరంగా పూర్తి అనుకూల వాతావరణం ఉండబోతుంది. చేపట్టిన పనులు విజయవంతంగా పూర్తి అయ్యి, ఆశించిన ఫలితాలను అందుకుంటారు. ఈ రోజు సమయాన్ని కాలక్షేపం చేయడానికి కర్చు చేస్తారు. ప్రతీ రోజు రాశిఫలాలు పొందటానికి టెలిగ్రామ్ లో మన ఛానల్ ను ఈ లింక్ ద్వారా ఫాలో అవ్వండి. లింక్: https://t.me/HinduDharmamVardhillaliChannel
వృషభ రాశి: ప్రస్తుత పరిస్థుతులు కొన్ని ఆందోళన కారణంగా ఉంటాయి. అయితే వాటి గురించి అలోచించి సమయాన్ని వృద్ధ చేయకండి. త్వరలో అన్నీ సర్దుమనుగుతాయి. వ్యాపార పరంగా ఈ రోజు బాగుందబోతుంది. ఆర్ధిక లభ్ధిని చూడబోతున్నారు. మీరు నమ్మిన వ్యక్తి మీకు సరైన సమయంలో సహాయం చేస్తారు. తద్వారా మీకు ఎంతో మేలు జరుగుతుంది. కుటుంబ సబ్యులతో కొద్దిపాటి విబేదాలు ఏర్పడే అవకశం ఉంది. కావున జాగ్రత్తగా ఉండాలి. ప్రేమికులకు అనుకూల సమయం నడుస్తుంది. మనసుకి నచ్చిన వారితో సమయాన్ని వెచ్చించి ఆనందగా ఉండగలుగుతారు. ఈ రోజు విద్యార్దులకు అంతగా అనుకూలం కాదు. సమయాన్ని కేవలం విందు, వినోదాలకే కర్చు చేస్తారు. ప్రతీ రోజు రాశిఫలాలు పొందటానికి టెలిగ్రామ్ లో మన ఛానల్ ను ఈ లింక్ ద్వారా ఫాలో అవ్వండి. లింక్: https://t.me/HinduDharmamVardhillaliChannel
మిథున రాశి: పరిచయాలు పెరుగుతాయి. ఇంటా బయటా పూర్తి అనుకూలంగా ఉండబోతుంది. ఈ రోజు జరిగే సమాజంలో ఉన్నత స్థాయిలో ఉన్న వ్యక్తుల యొక్క పరిచయం మీకు భవిష్యత్తులో ఉపయోగకరంగా ఉండబోతుంది. ఆర్ధిక పరంగా చాలా బాగుండబోతుంది. ఆకస్మిక ధన ప్రాప్తి ఉంది. గతంలో తీసుకున్న రుణాలు ఏమైనా ఉంటె అవి తీర్చేసే ప్రయత్నాలు జరుగుతాయి. బందుమిత్రుల రాకతో ఇల్లంతా సందడిగా మారబోతుంది. ఈ రోజు మీకు బాగానే ఉంది. ప్రతీ రోజు రాశిఫలాలు పొందటానికి టెలిగ్రామ్ లో మన ఛానల్ ను ఈ లింక్ ద్వారా ఫాలో అవ్వండి. లింక్: https://t.me/HinduDharmamVardhillaliChannel
కర్కాటక రాశి: ఎంతో కాలంగా అనారోగ్యంతో బాధపడే వారికీ ఉపసమనం లభించబోతుంది. ఆరోగ్యం మెరుగుపడే అవకాశాలు మెండుగా ఉన్నాయి. మానసికంగా ఉల్లాసంగా ఉండగలుగుతారు. కర్చులు అధికంగా ఉండబోతున్నాయి. అయినప్పటికీ ఆర్ధికంగా ఎలాంటి ఇబ్బంది ఉండదు. వ్రుత్తి, ఉద్యోగ పరంగా ఉన్న ఒత్తిడిలు తగ్గుతాయి. కుటుంబ సంబ్యులతో కలసి సమయాన్ని ఆనందంగా గడుపుతారు. గతంలో ఎవరితోనైనా విబేదాలు ఉంటె అవి ఈ రోజు సమసిపోతాయి. నూతన ఉద్యోగ, వ్యాపార ప్రయత్నాలు చేస్తారు. అవి మీకు కలసి వచ్చేవిగా ఉండబోతున్నాయి. ఈ రోజు మీకు బాగానే ఉంది. ప్రతీ రోజు రాశిఫలాలు పొందటానికి టెలిగ్రామ్ లో మన ఛానల్ ను ఈ లింక్ ద్వారా ఫాలో అవ్వండి. లింక్: https://t.me/HinduDharmamVardhillaliChannel
సింహ రాశి: ఆరోగ్యం మెరుగుపడుతుంది. మిమ్మల్ని నమ్ముకున్నవారికి మీరు తగిన సహాయం చేస్తారు. నూతన పరిచయాలు పెరుగుతాయి. సమాజంలో గౌరవ మర్యాదలు పెరుగుతాయి. ఆత్మస్థైర్యంతో పనులు పూర్తి చేస్తారు. సత్ఫలితాలను అందుకుంటారు. ఇతరులకి సహాయం చేయటం మీ మంచితనానికి నిదర్శనంగా నిలుస్తుంది. ఈ రోజు మీరు మానసికంగా ఎంతో ప్రశాంతంగా ఉండబోతున్నారు. మీరు చేసే పనులు మీకు సంతృప్తిని ఇస్తాయి. ఈ రోజు కొద్దిపాటి శ్రమ అధికంగా ఉండబోతుంది. ఇతరులు చేయాల్సిన పని కూడా మీమీదే పడుతుంది. ప్రతీ రోజు రాశిఫలాలు పొందటానికి టెలిగ్రామ్ లో మన ఛానల్ ను ఈ లింక్ ద్వారా ఫాలో అవ్వండి. లింక్: https://t.me/HinduDharmamVardhillaliChannel
కన్యా రాశి: ఆరోగ్య పరంగా బాగుంది. ఆరోగ్యం మెరుగుపడుతుంది. సమాజంలో గౌరవ మర్యాదలు పెరుగుతాయి. దూరపు ప్రయాణాలు చేయడం ద్వారా శారీరకంగా అలసట ఏర్పడుతుంది. శ్రమ అధికంగా ఉండబోతుంది. ఆర్ధికంగా బాగుంది. అప్పు కోసం ప్రయత్నించేవారికి అనుకూలంగా ఉండబోతుంది. కుటుంబ పరిస్థితులు ఆందోళన కలిగిస్తాయి. ఇతర దేశాలలో వ్యాపారాలు పెట్టాలి అనుకునే వారికి కాలం అనుకూలంగా ఉంది. కోర్టు వ్యవహారాలు మీకు అనుకూలంగా మరబోతున్నాయి. ప్రతీ రోజు రాశిఫలాలు పొందటానికి టెలిగ్రామ్ లో మన ఛానల్ ను ఈ లింక్ ద్వారా ఫాలో అవ్వండి. లింక్: https://t.me/HinduDharmamVardhillaliChannel
తులా రాశి: ఆర్ధికపరమైన విషయాల్లో జాగ్రత్తగా ఉండాలి. మీరు పెట్టె పెట్టుబడులు నష్టాన్ని తేవడానికి ఎక్కువ అవకాశాలు ఉన్నాయి. కావున ఒకటికి రెండు సార్లు అలోచించి పెట్టుబడి పెట్టాలి. వ్యాయామం యోగ వంటి వాటిపై శ్రద్ద పెరుగుతుంది. పాత మిత్రులను కలసుకుని ఆనందంగా సమయాన్ని గడుపుతారు. ప్రయాణాల విషయంలో తగు జాగ్రత్త అవసరం. ఒక మూడవ వ్యక్తి దంపతుల మధ్య గొడవలు రావడానికి కారణం అవుతారు. కావున మీరు మీ జీవిత భాగస్వామిని నమ్మాలి కాని ఇతరుల మాటలను కాదు. పరిచయాలు పెరుగుతాయి. ఆర్ధిక, వ్యాపార పరంగా బాగుండబోతుంది. ప్రతీ రోజు రాశిఫలాలు పొందటానికి టెలిగ్రామ్ లో మన ఛానల్ ను ఈ లింక్ ద్వారా ఫాలో అవ్వండి. లింక్: https://t.me/HinduDharmamVardhillaliChannel
వృశ్చిక రాశి: విజయానికి దగ్గరలో ఉన్నారు. అతి త్వరలో మీకు శుభం జరుగబోతుంది. నిరుద్యోగులకు ఉద్యోగ యోగం ఉంది. నూతన వ్యాపార దిశగా మీరు చేసే ప్రయత్నాలు సత్ఫలితాలను ఇస్తాయి. ప్రతీ విషయంలో జాగ్రత్తగా నిర్ణయాలు తీసుకోవాలి. మీ ఓపికా, సహనం మీకు కొండంత బలం కాబోతున్నాయి. వ్యాపారస్తులకు లాభాలు ఉన్నాయి. ఆర్ధికంగా చాల శుభ సమయం నడుస్తుంది. అవివాహితులకు వివాహయోగం ఉంది. నూతన పరిచయాలు మీకు కలసి వచ్చేవిగా ఉండబోతున్నాయి. మానసికంగా చాలా సంతోషంగా ఉండబోతున్నారు. ఈ రోజు మీకు చాలా అనుకూలంగా ఉండబోతుంది. ప్రతీ రోజు రాశిఫలాలు పొందటానికి టెలిగ్రామ్ లో మన ఛానల్ ను ఈ లింక్ ద్వారా ఫాలో అవ్వండి. లింక్: https://t.me/HinduDharmamVardhillaliChannel
ధనుస్సు రాశి: ఎంతోకాలంగా మిమ్మల్ని వేదిస్తున్న సమస్యలు పరిష్కారం అవుతాయి. ప్రతీ పనీ వాయిదా వేయటం పని భారాన్ని పెంచుతుంది. తద్వారా ఒత్తిడి అధికం అవుతుంది. సమయాన్ని మీ కుటుంబ సబ్యులతో గడుపుతారు. మీ సంతానం విషయంలో మీరు తీసుకునే జాగ్రత్త శుభ ఫలితాలను ఇస్తుంది. మీరు చేయు పని యందు అనుభవజ్ఞుల సహాయ సహకారాలు మీకు ఎంతగానో ఉపయోగ పడనున్నాయి. ఈ రోజు మీకు శారీరక శ్రమ అధికంగా ఉండబోతుంది. దంపతుల మధ్య కొద్ది పాటి విబేదాలు ఏర్పడే అవకాశం ఉంది. కావున జాగ్రత్త వహించాలి. ప్రతీ రోజు రాశిఫలాలు పొందటానికి టెలిగ్రామ్ లో మన ఛానల్ ను ఈ లింక్ ద్వారా ఫాలో అవ్వండి. లింక్: https://t.me/HinduDharmamVardhillaliChannel
మకర రాశి: మానసిక ఒత్తిడి అధికంగా ఉండబోతుంది. యోగ, ధ్యానం వంటి వాటి ద్వారా ఒత్తిడిని తగ్గించుకునే ప్రయత్నం చేయండి. లేనిపోని ఆలోచనలు చేయకుండా మీరు చేయు పని యందు శ్రద్ద కనబరచండి. నూతన ప్రణాళికలు అమలు పరచే దిశగా మీరు చేసే ప్రయత్నాలు సత్ఫలితాలు ఇస్తాయి. స్వార్ధ పరులకు దూరంగా ఉండాలి. గతంలో మీరు చేసిన పొరబాట్లు మళ్ళీ చేయకుండా జాగ్రత్త తీసుకోవాలి. లేనిపోని గొడవలకు దూరంగా ఉండండి. మిమ్మల్ని గొడవలలో ఇరికించే విధంగా కొన్ని సంఘటనలు జరుగుతాయి. వాటిని మీ తెలివితో ఎదుర్కొని మౌనంగా బయటపడండి. ప్రేమ వ్యవహారాలకు అనుకూల సమయం నడుస్తుంది. ఈ రోజు మీరు మానసికంగా ఎంతో సంతోషంగా ఉండబోతునారు. మనసుకు నచ్చిన పని చేయటం ద్వారా మీకు కలిగే ఒత్తిడి నుండి బయట పడతారు. ప్రతీ రోజు రాశిఫలాలు పొందటానికి టెలిగ్రామ్ లో మన ఛానల్ ను ఈ లింక్ ద్వారా ఫాలో అవ్వండి. లింక్: https://t.me/HinduDharmamVardhillaliChannel
కుంభ రాశి: అనుభవజ్ఞుల సలహాచే ఆర్ధిక లభ్దిని పొందబోతున్నారు. సమస్యలలో ఉన్నప్పుడు మీ జీవిత భాగస్వామి మీ వెన్నంటి ఉండటం మీకు కొండంత బలాన్ని ఇస్తుంది. దంపతుల మధ్య ప్రేమానురాగాలు చిగురిస్తాయి. సంబంధబంధవ్యాలు మెరుగుపడతాయి. ఉద్యోగంలో ప్రమోషన్లు, ఇంక్రిమెంట్లు ఉన్నాయి. వ్రుత్తి, ఉద్యోగ పరంగా అనుకూల కాలం నడుస్తుంది. ఎంతో కాలం తరువాత కాస్త సమయం, మానసిక ప్రశాంతత ఏర్పడుతుంది. పనులు దిగ్విజయంగా పూర్తిచేసి, ఆశించిన ఫలితాలను అందుకుంటారు. ప్రతీ రోజు రాశిఫలాలు పొందటానికి టెలిగ్రామ్ లో మన ఛానల్ ను ఈ లింక్ ద్వారా ఫాలో అవ్వండి. లింక్: https://t.me/HinduDharmamVardhillaliChannel
మీన రాశి: మనస్సు నిలకడగా ఉండదు. ప్రస్తుత పరిస్థితులు గందరగోలంగా అనిపిస్తాయి. మీ ప్రయత్నాలు ఫలిస్తాయ లేదా అనే సందేహంలో పడతారు. అయితే నూతన ఆదాయ మార్గాలను సృష్టించు కోవడంలో సఫలం అవుతారు. ఆర్ధికంగా అద్బుతంగా ఉండబోతుంది. అవివాహితులకు వివాహ యోగం ఉంది. ప్రేమికులకు అనుకూల కాలం నడుస్తుంది. కుటుంబ సభ్యులతో ఆనందంగా సమయాన్ని గడుపుతారు. అయితే మీకు ఉండే పని భారం మీకు కాస్త శారీరక శ్రమ కలిగించక మానదు. దంపతుల మధ్య కొద్దిపాటి అనుమానాలు, మనస్పర్ధలు చోటుచేసుకునే అవకాశం ఉంది. ఈ రోజు మీకు మిశ్రమంగా ఉండబోతుంది. ప్రతీ రోజు రాశిఫలాలు పొందటానికి టెలిగ్రామ్ లో మన ఛానల్ ను ఈ లింక్ ద్వారా ఫాలో అవ్వండి. లింక్: https://t.me/HinduDharmamVardhillaliChannel
శుభం భూయాత్
Comments
Post a Comment
ఇక్కడ మీ కామెంట్ రాయండి