మీ దశ మార్చే జ్యోతిష్యం - ఈ రోజు ఏం జరగబోతుంది - జీవితం నేర్పించే పాఠాలు ఏమిటి ? 29-04-2020 - రాశిఫలలు

మేష రాశి:
మీ ప్రతిభ వెలుగుకోకి వస్తుంది. నిర్ణయాలు తీసుకునేటప్పుడు ఒకటికి రెండు సార్లు ఆలోచించి నిర్ణయాలు తీసుకోవాలి. మీ కోపాన్ని అదుపులో ఉంచుకోవాలి. ముఖ్యంగా మీకు ఎవరివల్ల అయితే మంచి జరుగుతుందో వారితో సంభాషించేటపుడు (ముఖ్యంగా వ్యాపార భాగస్వాములు). గతంలో మీరు పెట్టిన పెట్టుబడి కి సంబందించిన లాభాలను ఇప్పుడు అందుకునే అవకాశం ఉంది. గతంలో ఎవరితో అయినా కొద్దిపాటి విభేదాలు ఉంటే అవి మీ ద్వారానే పరిష్కారం అవుతాయి. ఒకవేళ తప్పు ఇతరులదైనా మీరే తగ్గి సంబంధాలను మెరుగు మెరుగుపరిచే దిశగా అడుగులు వేస్తారు. సమాజంలో ఉన్నత స్థాయిలో ఉన్న వ్యక్తులు పరిచయం అవుతారు. ఇవి మీకు భవిష్యత్తు లో ఎంతగానో ఉపయోగపడతాయి. గతంలో ఆగిపోయిన పనులు ఇప్పుడు ముందుకి కాదులుతాయి. ఈ రోజు మీకు బాగానే ఉంది. శుభం. ప్రతీ రోజు రాశిఫలాలు పొందటానికి టెలిగ్రామ్ లో మన ఛానల్ ను ఈ లింక్ ద్వారా ఫాలో అవ్వండి. లింక్: https://t.me/HinduDharmamVardhillaliChannel
వృషభ రాశి:
పనులు అతికష్టం మీద పూర్తి అవుతాయి. ఒత్తిడి అధికంగా ఉండబోతుంది. ఆర్ధికంగా ఈ రోజు బాగానే ఉంది. నూతన ఉద్యోగ, వ్యాపార దిశగా ప్రయత్నాలు జరుగుతాయి. భార్య భర్తల మధ్య అన్యోన్యత పెరుగుతుంది. దూరపు బంధువులను కలసుకొంటారు. వృత్తి, ఉద్యోగ పరంగా ఈ రోజు మీకు పూర్తి అనుకూలంగా ఉండబోతుంది. గత మధుర జ్ఞాపకాలను గుర్తు చేసుకొంటారు. ప్రయాణాలు ఇబ్బందికరంగా మారె అవకాశం ఉంది. ప్రతీ రోజు రాశిఫలాలు పొందటానికి టెలిగ్రామ్ లో మన ఛానల్ ను ఈ లింక్ ద్వారా ఫాలో అవ్వండి. లింక్: https://t.me/HinduDharmamVardhillaliChannel
మిధున రాశి:
ఈ రోజు మీకు నచ్చిన పని మాత్రమే చేయాలి అని నిర్ణయించుకుంటారు. మీ జీవితాన్ని, సమయాన్ని ఇతరుల కోసం వృధా చేయకూడదు అనుకుంటారు. సంబంధాలను బలపరచాలన్నా, చెడగొట్టాలన్నా డబ్బే కారణం అవుతుంది అని ఈ రోజు మీకు తెలిసి వస్తుంది. ప్రేమ వ్యవహారాలకు అనుకూల కాలం నడుస్తుంది. ఈ రోజు మీ జీవిత భాగస్వామి తో ఆనందంగా గడుపుతారు. ఉద్యోగ పరంగా ఏమైనా చికాకులు ఉన్నా, సాటి ఉద్యోగులతో ఏమైనా విభేదాలు ఉన్నా ఈ రోజు అవి సమసి పోయే అవకాశం ఉంది. మీకంటూ తగిన సమయాన్ని కేటాయిస్తారు. మీ ఆనందాన్ని వదులుకోరు. ఎప్పుడు ఇతరులకు, పని, ఉద్యోగం అంటూ మీ సమయం వాటికే అయిపోవడం మీకు నచ్చదు. ఈ రోజు మీకు బాగానే ఉండబోతుంది. దాంపత్య జీవితం అయితే అద్భుతంగా ఉండబోతుంది. ప్రతీ రోజు రాశిఫలాలు పొందటానికి టెలిగ్రామ్ లో మన ఛానల్ ను ఈ లింక్ ద్వారా ఫాలో అవ్వండి. లింక్: https://t.me/HinduDharmamVardhillaliChannel
కర్కాటక రాశి:
ఒత్తిడి అధికంగా ఉండబోతుంది. కోపాన్ని అదుపులో ఉంచుకోవాలి. లేకపోతే లేనిపోని గొడవలకు కారణం అవుతుంది. భాగస్వామ్య వ్యాపారస్తులు అప్రమత్తంగా ఉండాలి. కుటుంబ సభ్యులతో సమయాన్ని గడుపుతారు. దంపతుల మధ్య అన్యోన్యత పెరుగుతుంది. పని యందు మీరు కనబరచే శ్రద్ధ మీ పై అధికారుల మన్ననలు పొందేదిగా ఉంటుంది. మీ ప్రతిభ గుర్తించి తగిన సత్కారం చేస్తారు. గతంలో విడిపోయిన ఒక ఆత్మీయుని యొక్క కలయిక ఈ రోజు మీకు మానసిక సంతోషాన్ని కలిగిస్తుంది. ఈ రోజు మీకు బాగానే ఉంది. ప్రతీ రోజు రాశిఫలాలు పొందటానికి టెలిగ్రామ్ లో మన ఛానల్ ను ఈ లింక్ ద్వారా ఫాలో అవ్వండి. లింక్: https://t.me/HinduDharmamVardhillaliChannel
సింహ రాశి:
పని ఒత్తిడి అధికంగా ఉండబోతుంది. ఇతరులు చేయాల్సిన పని భారం కూడా మీమీదే పడటం మీకు చికాకు తెప్పిస్తుంది. అయితే మీ శ్రమకు తగిన ఫలితం అందుతుంది. అది మీకు సంతృప్తిని ఇస్తుంది. బంధుమిత్రులతో కలసి సమయాన్ని ఆనందంగా గడుపుతారు. మనసుకి నచ్చిన వారు ఇబ్బందులతో ఉండటం మీకు నచ్చదు, వారికి తగిన సహాయం చేస్తారు. ఇంటబయటా పూర్తి అనుకూల వాతవరం ఉండబోతుంది. మీ ప్రతిభ వెలుగులోకి వస్తుంది. సమాజంలో గౌరవ మర్యాదలు పెరుగుతాయి. ప్రశంసలు అందుకుంటారు. చాలా బిజిగా ఉంటారు. మీకు కనీసం మీ పనులు చేసుకోవడానికి కూడా కాలీలేనంత విధంగా ఈ రోజు మీరు పనులలో నిమగ్నం అయిపోతారు. ప్రతీ రోజు రాశిఫలాలు పొందటానికి టెలిగ్రామ్ లో మన ఛానల్ ను ఈ లింక్ ద్వారా ఫాలో అవ్వండి. లింక్: https://t.me/HinduDharmamVardhillaliChannel
కన్యా రాశి:
ఆరోగ్యం పట్ల జాగ్రత్త అవసరం. సంతానం కోసం ఎదురుచూసే వారు మరికొంత కాలం ఎదురుచూడాల్సి వస్తుంది. ఆర్థికపరమైన లావాదేవీల విషయంలో జాగ్రత్త గా ఉండాలి. సొమ్మూ పోయి శని పెట్టినట్టు ఉండబోతుంది. కావున ఏ విషయంలో తగు జాగ్రత్త అవసరం. నూతన వ్యాపారాలు ప్రారంభించేందుకు మీరు చేసే ప్రయత్నాలు సత్ఫలితాన్ని ఇస్తాయి. ఉద్యోగం కోసం ఎదురు చూసే వారికి కూడా శుభవార్తలు వినే అవకాశం ఉంది. లేనిపోని ప్రయాణాలు శారీరక శ్రమను పెంచటం తప్ప ఇచ్చేది ఏమి ఉండదు. పాత స్నేహితులను కలుసుకొని కాస్త మనస్సంతిగా ఉండగలుగుతారు. ప్రతీ రోజు రాశిఫలాలు పొందటానికి టెలిగ్రామ్ లో మన ఛానల్ ను ఈ లింక్ ద్వారా ఫాలో అవ్వండి. లింక్: https://t.me/HinduDharmamVardhillaliChannel
తులా రాశి:
ఆర్ధికంగా అంతగా బాగుండలేదు. గతంలో మీరు పెట్టిన పెట్టుబడులు ఆశించిన ఫలితాలు ఇచ్చే అవకాశం లేదు. ఆహ్వానాలు అందుతాయి. మీ వ్యాపార సీక్రెట్స్ కానీ, ఇతరులతో మీకు ఉన్న విబేధాలు గురించి కానీ ఇతరులకి చెప్పక పోవటం మంచిది. మీ ముక్కిసూటి తనం వల్ల ఇతరులు ఇబ్బంది పడే అవకాశం ఉంది. కావున మాట్లాడేటప్పుడు ఇతరుల మనసు నొప్పించకుండా జాగ్రత్తగా మాట్లాడాలి. ఈ రోజు మానసికంగా సంతోషంగా ఉండగలుగుతారు. ప్రతీ రోజు రాశిఫలాలు పొందటానికి టెలిగ్రామ్ లో మన ఛానల్ ను ఈ లింక్ ద్వారా ఫాలో అవ్వండి. లింక్: https://t.me/HinduDharmamVardhillaliChannel
వృశ్చిక రాశి:
నూతన పరిచయాలు ఆర్ధిక లభ్ధిని చేకూర్చేవిగా ఉండబోతున్నాయి. పెట్టుబడులు పెట్టడానికి ఈ రోజు అంత అనుకూలం కాదు. కుటుంబ సభ్యులతో ఆనందంగా గడుపుతారు. వ్యాపారంలో నూతన మార్పులూ చేర్పులూ చేస్తారు. నూతన వ్యాపారాలు మొదలుపెట్టే దిశగా ప్రయత్నాలు జరుగుతాయి. ప్రేమవ్యవహారాలు అంతగా అనుకూలం కాదు. ప్రయాణాలు ఆనందం కలిగించేవిగా ఉంటాయి. మీ ఓపికా, సహనం మీకు కలసివచ్చేవిగా ఉండబోతున్నాయి. ఈ రోజు మీకు అంతా శుభమే జరుగబోతుంది. ప్రతీ రోజు రాశిఫలాలు పొందటానికి టెలిగ్రామ్ లో మన ఛానల్ ను ఈ లింక్ ద్వారా ఫాలో అవ్వండి. లింక్: https://t.me/HinduDharmamVardhillaliChannel
ధనస్సు రాశి:
గతంలో మీరు చేసిన పోరాబాట్ల యొక్క ఫలితం ఇప్పుడు అనుభవించాల్సి వస్తుంది. దీనితో మానసికంగా కుంగిపోతారు. అయితే ఆత్మీయుల సలహా మేరకు సమస్యల నుండి బయటపడి కొంత ఊరట పొందుతారు. ఎంతగా ప్రయత్నించిన మానసిక ఆందోళనను దూరం చేయలేకపోతారు. మీరు ఆపదలో ఉన్నప్పుడు మీ కుటుంబ సభ్యులు అందించే సహాయం ఎనలేనిదిగా ఉండబోతుంది. మీకు మీ కుటుంబమే పెద్ద రక్షగా ఉండి, ఎలాంటి ఆపద నుండి అయినా మిమ్మల్ని బయట పడేస్తుంది. అయితే వృత్తి, ఉద్యోగ పరంగా అనుకూలంగానే ఉండబోతుంది. అనుభవజ్ఞులు అయినా వారితో పరిచయాలు ఏర్పడతాయి. ఎట్టకేలకు జరిగే సంఘటనలు అన్నీ మీ మంచికే అని మీకు మీరే సర్ది చెప్పుకుని కాస్త ప్రశాంతంగా ఉండటానికి ప్రయత్నిస్తారు. ఈ రోజు సమయాన్ని కాలక్షేపానికి ఖర్చు చేస్తారు. బద్ధకంగా ఉంటారు. ఈ రోజు మీకు అంతగా బాగుండలేదు. కావున జాగ్రత్తగా ఉండాలి. ప్రతీ రోజు రాశిఫలాలు పొందటానికి టెలిగ్రామ్ లో మన ఛానల్ ను ఈ లింక్ ద్వారా ఫాలో అవ్వండి. లింక్: https://t.me/HinduDharmamVardhillaliChannel
మకర రాశి:
ఆథ్యాత్మిక చింతన కలుగుతుంది. దైవ దర్శనాలు చేసుకునే అవకాశం ఉంది. ఖర్చులు అధికం. మీరు తీసుకునే కొన్ని నిర్ణయాల వల్ల కుటుంబ సభ్యులతో విభేదాలు రావొచ్చు. కావున నిర్ణయాలు తీసుకునేటప్పుడు ఒకటికి రెండు సార్లు ఆలోచించి సరైన నిర్ణయం తీసుకోవాలి. మీకు బాగా కావలసిన వారి ఆరోగ్యం విషయంలో మీకు ఆందోళన ఎక్కువయ్యే అవకాశం ఉంది. మీ ప్రతిభకు తగిన గుర్తింపు లభిస్తుంది. పనులు వాయిదా పడతాయి. నిజానికి ఇలా జరగటం మీ మంచికే అవుతుంది. ఏదేమైనా ఈ రోజు మీకు మిశ్రమ ఫలితాలను గ్రహస్తితి సూచిస్తుంది. ప్రతీ రోజు రాశిఫలాలు పొందటానికి టెలిగ్రామ్ లో మన ఛానల్ ను ఈ లింక్ ద్వారా ఫాలో అవ్వండి. లింక్: https://t.me/HinduDharmamVardhillaliChannel
కుంభ రాశి:
మానసిక ప్రశాంతత ఉండదు. యోగా మెడిటేషన్ వంటి వాటి ద్వారా ఒత్తిడి నుండి బయట పడొచ్చు. వ్యాపారస్తులకు పూర్తి అనుకూలంగా ఉండబోతుంది. ఆశించిన దాని కంటే ఎక్కువ లాభం ఆర్జిస్తారు. వృత్తి ఉద్యోగ పరంగా పురోగతి లభిస్తుంది. గొడవలకు కారణం అయ్యే ఏ చిన్న విషయాన్ని దరికి చేరకుండా చూస్తారు. ఆ విధంగా ఎవరితోనూ ఏ విభేదాలు ఏర్పడకుండా జాగ్రత్త పడతారు. మనసుకి నచ్చిన వారితో సమయాన్ని ఆనందంగా గడుపుతారు. గతంలో ఆగిపోయిన పనులు పూర్తి అవుతాయి. ఈ రోజు ఏదేమైనా మీకు గతం కంటే ఎంతో మెరుగ్గా ఉండబొతుంది. ప్రతీ రోజు రాశిఫలాలు పొందటానికి టెలిగ్రామ్ లో మన ఛానల్ ను ఈ లింక్ ద్వారా ఫాలో అవ్వండి. లింక్: https://t.me/HinduDharmamVardhillaliChannel
మీనరాశి:
గతంలో ఎన్నడూ లేని విధంగా చాలా కాళీ సమయం మీకు దొరుకుతుంది. ఈ సమయంలో నచ్చిన పని చేయటం ద్వారా మానసిక సంతోషాన్ని పొందగలుగుతారు. ఆర్ధిక పరమైన నిర్ణయాలు తీసుకునేటప్పుడు తగిన జాగ్రత్త అవసరం. బంధు మిత్రులతో కలిసి సమయాన్ని ఆనందంగా గడుపుతారు. ప్రేమ వ్యవహారాలు సానుకూల పడతాయి. మీ జీవిత భాగస్వామితో విలువైన సమయాన్ని గడుపుతారు. కీలక నిర్ణయాలు తీసుకుంటారు. నూతన వృత్తి, ఉద్యోగ పరంగా ప్రయత్నాలు చేస్తారు. అవి సత్ఫలితాలను ఇస్తాయి. మిమ్మల్ని మోసం చేయాలి అని చూసే వారు అధికంగా ఉంటారు. కావున ఈ విషయంలో జాగ్రత్తగా ఉండాలి. ప్రతీ రోజు రాశిఫలాలు పొందటానికి టెలిగ్రామ్ లో మన ఛానల్ ను ఈ లింక్ ద్వారా ఫాలో అవ్వండి. లింక్: https://t.me/HinduDharmamVardhillaliChannel
శుభం భూయాత్
Comments
Post a Comment
ఇక్కడ మీ కామెంట్ రాయండి