మీ దశ మార్చే జ్యోతిష్యం - మిస్ అవకండి - ఈ రోజు ఏం జరగబోతుంది - జీవితం నేర్పించే పాఠాలు ఏమిటి ? 28-04-2020 - రాశిఫలలు

మేషరాశి:
భవిష్యత్తుకి సంబందించిన ప్రణాళికలు చేస్తారు. ఒక్కసారిగా అనేక అవకాశాలు వస్తాయి. వాటిలో మంచి అవకాశాన్ని ఎన్నుకోవడంలో మీ విజయం దాగి ఉంది. ఈ రోజు మీరు తీసుకునే నిర్ణయాలు భవిష్యత్తు పై ప్రభావం చూపెవిగా ఉండబోతున్నాయి. మోసం చేసే వారికి దూరంగా ఉండండి. గతం లో చేసిన తప్పులు మళ్ళీ చేయకుండా జాగ్రత్త పాటించాలి. సంతానం విషయంలో సంతృప్తి పొందుతారు. మీరు ఆశించిన విధంగా సంతానం యొక్క పురోగతి ఉండటం మీ మానసిక ఆనందానికి కారణం అవుతుంది. వృత్తి, ఉద్యోగ పరంగా చాలా బాగుండబోతుంది.గతంలో ఎన్నడూ లేని విధంగా మీరు అద్భుత ఫలితాలను అందుకోబోతున్నారు. ప్రతీ పనిలో మీదే పై చేయి అవుతుంది. ఈరోజు మీకు పూర్తి అనుకూలంగా ఉండబోతుంది.
వృషభ రాశి:
ఈ రోజు ఆర్ధికంగా తిరుగులేని రోజుగా ఉండబోతుంది. ఆకస్మిక ధన ప్రాప్తి ఉంది. వ్యాపారంలో చురుకుగా వ్యవహరించి అధిక లాభాలు ఆర్జిస్తారు. వృత్తి, ఉద్యోగ పరంగా అనుకూలంగా ఉంది. ప్రేమవ్యవహారాలలో విజయాన్ని పొందుతారు. మిలో ఎవరికైనా మద్యం, ధూమపానం వంటి చేడు అలవాట్లు ఉంటే, అవి ఈ రోజు మీకు చెడ్డపేరు తెచ్చే అవకాశం ఉంది. దంపతుల మధ్య అన్యోన్యత పెరుగుతుంది. ఈ రోజు బాగానే ఉంది.
మిధున రాశి:
శ్రమ అధికంగా ఉండబోతుంది. అతి కష్టం మీద పనులు పూర్తి అవుతాయి. ఆరోగ్యం మెరుగుపడుతుంది. ఈ రోజు జరిగే ఆర్ధిక పరమైన లావదేవిలలో జాగ్రత్తగా ఉండాలి, మీరు చేసే చిన్న పొరబాటు వల్ల భవిష్యత్తు లో నష్టాన్ని చవిచూడాల్సి వస్తుంది. కావున ఆర్ధిక పరమైన విషయాలలో జాగ్రత్త అవసరం. వృత్తి, ఉద్యోగ పరంగా ఎంతో కాలంగా ఉన్న చిక్కులు తొలగి ఒక మంచి వాతావరణం ఏర్పడుతుంది. కుటుంబ సభ్యులతో సమయాన్ని గడుపుతారు. దంపతుల మధ్య అన్యోన్యత పెరుగుతుంది. సంతానం విషయంలో మీరు తీసుకునే శ్రద్ధ మీ జీవిత భాగస్వామి మరియు కుటుంబ సభ్యులచే ప్రశంసలు పొందే విధంగా ఉంటుంది. ఏదేమైనా ఈ రోజు మీరు ఆర్ధిక పరమైన విషయంలో జాగ్రత్త గా ఉంటే మిగిలినది అంతా అనుకూలంగానే ఉండబోతున్నది.
కర్కాటక రాశి:
మీ మొండి పట్టుదలతో పనులు పూర్తి చేసి, ఆశించిన ఫలితాలు అందుకుంటారు. ఆర్ధికంగా మీరు నమ్మిన ఒక వ్యక్తి మిమ్మల్ని సమయానికి ఆదుకోవడం ఆపదలనుండి బయట పడినట్టు ఉంటుంది. వ్యాపార సంబంధ కీలక నిర్ణయాలు తీసుకుంటారు. ఆర్ధిక పరిస్థితి గతం కంటే మెరుగ్గా ఉండబోతుంది. అప్పులు ఏమైనా ఉంటే అవి మీరు తీర్చేసే అవకాశం ఉంది. ప్రేమికులకు కాలం అనుకూలంగా ఉంది. మనసుకి నచ్చిన వారితో సమయాన్ని ఆనందంగా గడుపుతారు. గతంలో ఏమైనా కొద్దీ పాటి విభేదాలు, మనస్పర్థలు మీ జీవిత భాగస్వామి తో ఉంటే అవి తొలగి పోయి, ఎన్నడూ లేని విధంగా భార్య భర్తల మధ్య ప్రేమానురాగాలు చిగురిస్తాయి. ఇది మీ మానసిక సంతోషానికి కారణం అవుతుంది.
సింహ రాశి:
గతంలో మీరు పెట్టిన పెట్టుబడులు ఇప్పుడు రాబడిని ఇస్తాయి. పనులలో విజయాన్ని సాధిస్తారు. మీరు ఎంతోకాలంగా ఎదురుచూస్తున్న పని ఒకటి ఇప్పుడు పూర్తి అవుతుంది. దానితో మీ ఆనందానికి అవధులు లేకుండా ఈ రోజు ఉండబోతుంది. లేని పోనీ ఖర్చులు అధికంగా ఉన్నాయి. మీకు బాగా కావలిసిన వారి ఆరోగ్యం బాగుండక పోవడం మీ మానసిక ఆందోళనకు కారణం అవుతుంది. మోసం చేసే వారికి, స్వార్ధ పరులకి దూరంగా ఉండాలి లేకపోతే మీ విలువైన సమయాన్ని, ధనాన్ని కోల్పోవలసి వస్తుంది.
కన్యా రాశి:
ఈ రోజు మీరు కీలక నిర్ణయాలు తీసుకుంటారు. నిజానికి ఈ రోజు మీరు తీసుకునే నిర్ణయాల మీద మీ భవిష్యత్తు ఆధారపడి ఉండబోతుంది. కావున నిర్ణయాలు తీసుకునేటప్పుడు జాగ్రత్త వహించాలి. గతంలో ఎవరితోనైనా కొద్దిపాటి విభేదాలు ఉంటే అవి ఇప్పుడు సమసి పోయి ఒక మంచి స్నేహం/బంధుత్వం ఏర్పడుతుంది. ఈ రోజు ఇతరులు, అనుభవజ్ఞులైన వ్యక్తులు మీకు ఇచ్చే సలహా మీకు కలసి వచ్చేదిగా ఉండబోతుంది. వ్యాపారంలో కీలక మార్పులు, సంఘటనలు జరుగబోతున్నాయి. ఈ రోజు మీ కోపాన్ని అదుపులో పెట్టుకోవటం ద్వారా శుభ ఫలితాలు అందుకోగలుగుతారు.
తులా రాశి:
నిద్రలేమి అనేది ప్రధాన సమస్యగా మారబోతుంది. ఎంతో కాలంగా అమ్ముడు కాకుండా ఉన్న ఒక స్థిరాస్తి ఈ రోజు అమ్ముడుపోయి, ఆశించిన లాభాలను తెచ్చి పెట్టె అవకాశం ఉంది. అవివహితులకి శుభ కాలం నడుస్తుంది. వివాహ ప్రయత్నాలు ఫలిస్తాయి. గతంలో ఆగిపోయిన పనులు ఇప్పుడు పునః ప్రారంభం అవుతాయి. భాగస్వామ్య వ్యాపారులకు అనుకూల కాలం. లేనిపోని ప్రయాణాలు శారీరక శ్రమ పెంచుతాయి. ఈ రోజు మీకు బాగానే ఉంది.
వృశ్చిక రాశి:
గతంలో మీరు ఎదుర్కొన్న కష్టాలు నేర్పిన పాఠాలను మర్చిపోయి, అవే తప్పులు మళ్లీ చేయకండి. మనస్సు నిలకడగా ఉండదు. మీ ఆలోచనా విధానం ఈ రోజు మిమ్మల్ని ఇబ్బంది పెట్టేదిగా ఉంటుంది. ఆర్ధికంగా అనుకూల కాలం నడుస్తుంది. ఉద్యోగం కోసం ఎదురుచూసే వారికి శుభ వార్తలు వైన్ అవకాశం ఉంది. ఒక ఆదాయ మార్గం ఏర్పడుతుంది (అతి త్వరలో) దానికి గాని ప్రయత్నాలు మొదలవుతాయి. పెట్టుబడుల విషయంలో జాగ్రత్త వహించాలి. సమాజంలో మీరంటే కిట్టనివారు మీ పై చెడు ప్రచారం చేస్తారు. కానీ అన్నిటికి సమయమే సమాధానం చెప్తుంది అని మీరు మౌనం వహిస్తారు. నిజానికి ఇది మీ మంచికే. ఆధ్యాత్మిక చింతన ఉంటుంది. దైవ దర్శనాలు, పూజలు వంటివి చేసే అవకాశం ఉంది.
ధనుస్సు రాశి:
మిమ్మల్ని నమ్ముకున్న తోబుట్టువులకి తగిన సహాయం అందించి వారి మనస్సులో సుస్థిర స్థానాన్ని సంపాదించుకుంటారు. ఆపదలో ఉన్న వారిని మీరు ఆదుకోవడం మీకు మంచి పేరు తో పాటు ఇతరులకు సహాయం చేయటం ఎంత ఆత్మ సంతృప్తిని, మానసిక ఆనందాన్ని కలిగిస్తుందో ఈ రోజు మీకు అర్ధం అవుతుంది. అయితే సంతానం విషయంలో కొద్దిపాటి నిరాశ తప్పనిసరి. మీరు చేసే చిన్న చిన్న పొరపాట్లు పెద్ద కుదిబండ గా మరబోతున్నాయి. కావున ప్రతీ పనీ ఆశ్రద్దగా చేయడం ఆపేయాలి. బద్దకం, నీరసం, తర్వాత చూద్దాం లే అని వాయిదా వేసే తత్వం మనేయాలి. గ్రహస్తితి వల్ల బద్దకంగా అనిపించినా సాధ్యమైనంత వరకూ అలాంటివి వదిలేయాలి. పనులు అతి కష్టం మీద పూర్తి అవుతాయి. మీరు మంచి చేసినా చెడు అయ్యే అవకాశం ఉంది. కావున జాగ్రత్తగా ఉండాలి.
మకర రాశి:
ఆర్ధికంగా బాగుండబోతుంది. మీకు రావలసిన బాకీలు వాసులవుతాయి. బంధుమిత్రులను కలుసుకొని ఆనందంగా ఉండగలుగుతారు. లేని పోనీ ఖర్చులు అధికంగా ఉండబోతున్నాయి. ఒక ఆప్తుడి సహాయంతో మీ కష్టాలనుండి బయట పడే మార్గం దొరుకుతుంది. దంపతులు ఆనందంగా సమయాన్ని గడపగలుగుతారు.
కుంభ రాశి:
ఒత్తిడి అధికంగా ఉండబోతుంది. పనులు అతి కష్టం మీద పూర్తి అవుతాయి. శ్రమ అధికం. డబ్బులు బదులిచ్చి కష్టాల్ని కొని తెచ్చుకుంటారు. భార్య భర్తల మధ్య విభేదాలు ఏర్పడే అవకాశం ఉంది. అయితే మీ బంధుమిత్రులు వాటిని నివారించి, ఇద్దరి మధ్య మంచి అవగాహన ఏర్పడేలా చేస్తారు. అక్కడితో ఆ కొద్దిపాటి విభేదాలు సమసిపోతాయి. సమాజంలో మిమ్మల్ని, మీ ప్రతిష్టను దెబ్బతీసే విధంగా మీ వైరి వర్గం వారి ప్రయత్నాలు ఉంటాయి. తగు చర్యలతో వాటిని అడుపుచేస్తారు. మానసిక ఒత్తిడి అధికంగా ఉండటం చేత, యోగా మెడిటేషన్ వంటివి చేయటానికి మొగ్గు చూపుతారు.
మీనా రాశి:
విలువైన వస్తువులను పోగొట్టుకునే అవకాశం ఉంది. పనులు అతికష్టం మీద పూర్తి అవుతాయి. ప్రయాణాలు వాయిదా పడతాయి. ఆర్ధికంగా బాగుంది. రాబడి పెరుగుతుంది. బంధుమిత్రులు కలుసుకుని ఆనందంగా గడుపుతారు. వ్యాపార పరంగా మీరు కలుసుకునే కొంత మంది ద్వారా మీకు ఆర్ధిక లబ్ది చేకూరుతుంది. అనుకోని ప్రయాణాలు చేయవలసి వస్తుంది. ఈ రోజు అకారణ కలహాలు ఏర్పడే అవకాశం ఉంది. కావున జాగ్రత్తగా ఉండాలి.
శుభం భూయాత్
Comments
Post a Comment
ఇక్కడ మీ కామెంట్ రాయండి