రాశి ఫలాలు - ఆదివారం - 26-04-2020. గ్రహగతులను అనుసరించి మీకు ఈ రోజు ఎలా ఉండబోతుంది ? Daily Horoscope in Telugu - Astrology


మేష రాశి: ముఖ్యమైన నిర్ణయాలు తీసుకోవడానికి ఈ రోజు మీకు అనుకూలంగా ఉంది. అయితే మీకు కొద్ది పాటి ఒత్తిడి తప్పని సరి. స్థిరాస్తి కొనుగోలు కోసం ప్రయత్నించే వారికి ఈ రోజు స్థిరాస్తి కొనే అవకాశం ఉంది. మనసుకి నచ్చిన వారితో సమయాన్ని గడుపుతారు. తద్వారా ఒత్తిడి తగ్గి మానసిక ప్రశాంతత ఏర్పడుతుంది. ఈ రోజు మీలోని భక్తి భావాలు అధికం అవుతాయి. ఆధ్యాత్మిక చింతన ఉంటుంది. భార్య భర్తల మధ్య అన్యోన్యత ఏర్పడుతుంది. ఈ రోజు మీకు చాలా అనుకూలంగా ఉండబోతుంది. ప్రతీ రోజు రాశిఫలాలు పొందటానికి టెలిగ్రామ్ లో మన ఛానల్ ను ఈ లింక్ ద్వారా ఫాలో అవ్వండి. లింక్: https://t.me/HinduDharmamVardhillaliChannel

వృషభ రాశి: ఆర్ధికంగా మీకు ఈ రోజు అనుకూలంగా ఉండబోతుంది. వ్యాపారస్తులకు లాభాలు ఉన్నాయి. భార్య భర్తల మధ్య అన్యోన్యత పెరుగుతుంది. భాగస్వామ్య వ్యాపారస్తులకు కలసి వచ్చే కాలం. దూరపు బంధువులను కలసుకోవడం వంటివి జరిగే అవకాశం ఉంది. ఈ రోజు మీరు మానసికంగా చాలా సంతోషంగా ఉండబోతున్నారు. అయితే గతంలో చేసిన తప్పులు మిమ్మల్ని ఇబ్బంది పెట్టె అవకాశం ఉంది. ఏదేమైనా ఈ రోజు మీకు మిశ్రమంగా ఉండబోతుంది. ప్రతీ రోజు రాశిఫలాలు పొందటానికి టెలిగ్రామ్ లో మన ఛానల్ ను ఈ లింక్ ద్వారా ఫాలో అవ్వండి. లింక్: https://t.me/HinduDharmamVardhillaliChannel

మిథున రాశి: ఈ రోజు మీకు చాలా బాగుండబోతుంది. మనసుకి నచ్చిన పని చేయటం ద్వారా మానసిక సంతోషాన్ని పొందుతారు. వ్యాపారస్తులకు ఆర్ధికంగా బాగుండబోతుంది. బంధుమిత్రుల సహాయ సహకారాలు అందుతాయి. మీ ఆత్మీయులు అయిన ఒకరి ద్వారా మీకు ఆర్ధిక లభ్ది ఉండబోతుంది. అయితే ప్రతీ ఒక్కరిని నేమ్మేయడం వల్ల ఇబ్బందులు ఎదుర్కోవలసి వస్తుంది. సమస్యలు సర్దుమనుగుతాయి. మానసిక ప్రశాంతత ఏర్పడుతుంది. ప్రతీ రోజు రాశిఫలాలు పొందటానికి టెలిగ్రామ్ లో మన ఛానల్ ను ఈ లింక్ ద్వారా ఫాలో అవ్వండి. లింక్: https://t.me/HinduDharmamVardhillaliChannel

కర్కాటక రాశి: ఆర్ధికంగా బాగుండలేదు. మీరు ఇవ్వవలసిన వారు మీపై ఒత్తిడి తీసుకొస్తారు, మీకు ఇవ్వవలసిన వారు ఏదొక కారణం చెప్పి తప్పించుకుంటారు. ఆరోగ్యం ఆందోళన కలిగిస్తుంది. తగిన జాగ్రత్త అవసరం. ఇతరులతో మాట్లాడేటపుడు మీ కోపాన్ని, ఒత్తిడిని అదుపులో ఉంచుకుని జాగ్రత్తగా మాట్లాడాలి. లేకపోతే లేనిపోని గొడవలకు కారణం అవుతాయి. చేతులు కాలాకా ఆకులు పట్టుకుని ఏం లాభం లేదు. ఈ రోజు మీరు చేసే చిన్ని చిన్ని తప్పులు పెద్ద నష్టాన్ని కలిగిస్తాయి. కావున తగు జాగ్రత్త అవసరం. మరీ ముఖ్యంగా మీకు బాగా కావలసిన వారు, మీ కుటుంబ సభ్యలు అయిన వారితో విబేదాలు ఏర్పడే అవకాశం ఉంది. మీ గురించి చెడుగా ప్రచారం చేసేవారు అధికం అవుతారు. అయితే దాన్ని వారి పాపానికే వదిలేయండి. ఈ రోజు ప్రతీది మీకు నచ్చనట్టు, మీకు వ్యతిరేఖంగా జరుగుతుంది. ఈ రోజు మీకు అంతగా బాగుండలేదు. ప్రతీ రోజు రాశిఫలాలు పొందటానికి టెలిగ్రామ్ లో మన ఛానల్ ను ఈ లింక్ ద్వారా ఫాలో అవ్వండి. లింక్: https://t.me/HinduDharmamVardhillaliChannel

సింహ రాశి: ఒత్తిడి అధికంగా ఉంటుంది. అతి కష్టం మీద కానీ పనులు పూర్తి కావు. మీరు నమ్ముకున్న వారు మీకు సమయానికి తగు సహాయం చేయటం ద్వారా ఆర్ధికంగా ఎలాంటి ఇబ్బంది ఉండదు. అయితే పని ఒత్తిడి, ప్రస్తుత పరిస్థితి వంటివి ఆలోచించటం ద్వారా మానసిక ప్రశాంతతను కోల్పోతారు. భవిష్యత్తు గురించి ప్రణాళికలు చేస్తారు. అవివాహితులకు శుభ సమయం. వివాహ సంబంద విషయాల్లో శుభ ఫలితాలు అందుకుంటారు. అంటే మంచి సంబంధం రావటం/సెట్ అవ్వడం వంటివి జరుగుతాయి. గత కొంతకాలంగా ఉన్న ఇబ్బందులు, ఒత్తిడిల నుండి కాస్త బ్రేక్ వచ్చినట్టుగా ఈ రోజు ఉండబోతుంది. ఈ రోజు మీరు చాలా సంతోషంగా ఉండగలుగుతారు. అంత శుభమే జరుగుతుంది. ప్రతీ రోజు రాశిఫలాలు పొందటానికి టెలిగ్రామ్ లో మన ఛానల్ ను ఈ లింక్ ద్వారా ఫాలో అవ్వండి. లింక్: https://t.me/HinduDharmamVardhillaliChannel

కన్యా రాశి: ఆదాయం పెరుగుతుంది. వ్రుత్తి, ఉద్యోగ పరంగా అనుకూల ఫలితాలు ఉన్నాయి. అయితే సహాయం చేస్తాను అన్నవారు సమయానికి అందుబాటులో లేకపోవడం వల్ల కాస్త ఇబ్బంది పడతారు. సమయాన్ని వినోదానికి కర్చు చేస్తారు. భార్య భర్తల మద్య కొద్దిపాటి మనస్పర్ధలు వచ్చే అవకాశం ఉంది. కావున జాగ్రత్తగా ఉండాలి. నచ్చిన ఆహారాన్ని స్వీకరిస్తారు. కాస్త ప్రశాంతత లభిస్తుంది. ఈ రోజు మీకు మిశ్రమంగా ఉండబోతుంది. ప్రతీ రోజు రాశిఫలాలు పొందటానికి టెలిగ్రామ్ లో మన ఛానల్ ను ఈ లింక్ ద్వారా ఫాలో అవ్వండి. లింక్: https://t.me/HinduDharmamVardhillaliChannel

తులా రాశి: మానసిక ప్రశాంతత లభిస్తుంది. కర్చులు అధికం. గతంలో చేసిన తప్పులు ఇప్పుడు ఇబ్బంది పెట్టె అవకాశం ఉంది. పనులు అతి కష్టం మీద పూర్తి కాగలవు. మీ నైపుణ్యాన్ని పెంచుకునే దిశగా అడుగులు వేస్తారు. తదనుగుణంగా పుస్తక పటణం వంటివి చేస్తారు. భార్యా భర్తల మధ్య గతంలో ఏమైనా మనస్పర్ధలు ఏర్పడి ఉంటె అవి సమసిపోతాయి. దంపతుల మధ్య అన్యోన్యత పెరుగుతుంది. మిమ్మల్ని నిరాశ పరచే వారికీ, ప్రతీ పనిలో మీకు అడ్డు తగిలే వారికి దూరంగా ఉండండి. ఆర్ధికంగా మీకు అంతగా బాగుండలేదు. ఈ రోజు మిశ్రమ ఫలితాలను గ్రహస్థితి సూచిస్తుంది. ప్రతీ రోజు రాశిఫలాలు పొందటానికి టెలిగ్రామ్ లో మన ఛానల్ ను ఈ లింక్ ద్వారా ఫాలో అవ్వండి. లింక్: https://t.me/HinduDharmamVardhillaliChannel

వృశ్చిక రాశి: అనారోగ్య సమస్యలు ఇబ్బందిపెట్టే అవకాశం ఉంది. ఏవైనా కొద్దిపాటి అనారోగ్య సమస్యలు ఎదురైనా అశ్రద్ద చేయవద్దు. వెంటనే తగిన వైద్యం చేయించండి. కుటుంబ సభ్యల మధ్య కొద్ది పాటి విబేదాలు వచ్చే అవకాశం ఉంది. ఈ రోజు కర్చులు అధికంగా ఉండబోతున్నాయి. ఇతరులు పెట్టె ప్రలోభాలకు లొంగకండి, మీరు మీ వ్యక్తిత్వాన్ని దిగదార్చి ఇతరులకోసం పని చేయాల్సిన అవసరం లేదు. మీ సమస్యను పరిష్కరించే విధానం, నైపుణ్యం ఈ రోజు వచ్చే ప్రతీ సమస్యను సునాయాసంగా పరిష్కరిస్తుంది. ముఖ్యంగా మీ జీవిత భాగస్వామితో ఏర్పడిన సమస్యలు మీరే మీ తెలివితేటలతో పరిష్కరిస్తారు. ఎంతో కాలంగా మిమ్మల్ని ఇబ్బంది పెడుతున్న సమస్యలు త్వరలో తొలగిపోతాయి. ప్రతీ రోజు రాశిఫలాలు పొందటానికి టెలిగ్రామ్ లో మన ఛానల్ ను ఈ లింక్ ద్వారా ఫాలో అవ్వండి. లింక్: https://t.me/HinduDharmamVardhillaliChannel

ధనుస్సు రాశి: కర్చులు అధికంగా ఉండబోతున్నాయి. బంధు మిత్రులను కలుసుకొని ఆనందగా ఉండగలుగుతారు. నూతన పరిచయాలు పెరుగుతాయి. దంపతుల మధ్య అన్యోన్యత లోపిస్తుంది. లేనిపోని విబేదాలు వచ్చే అవకాశం ఉంది. ఎంతో కాలంగా మీరు పడుతున్న కష్టాలకి స్వస్తి చెప్పి, ఆనందకరమైన జీవితాన్ని పొందే రోజులు అతి తొందరలోనే ఉన్నాయని గ్రహించండి. భవిష్యత్తుకి సంబందించిన ప్రణాళికలు చేస్తారు. శారీరక దృడత్వం కోసం వ్యాయామం వంటివి చేయాలి అని నిర్ణయించుకుని, ఆ దిశగా అడుగులు వేస్తారు. ప్రతీ రోజు రాశిఫలాలు పొందటానికి టెలిగ్రామ్ లో మన ఛానల్ ను ఈ లింక్ ద్వారా ఫాలో అవ్వండి. లింక్: https://t.me/HinduDharmamVardhillaliChannel

మకర రాశి: ఆర్ధికంగా ఇంతకాలంగా మీరు పడుతున్న ఇబ్బందులు తొలగే సమయం ఇది. ఆర్ధికంగా చాలా బాగుండబోతుంది. ధనం సమృద్దిగా ఉండబోతుంది. ధనానికి ఎక్కడా మీకు లోటు ఉండే అవకాశం లేదు. అయితే మీ మాట తీరు, మీ ఆలోచనల్ని వ్యక్త పరచే విధానం ఇతరులను, ముఖ్యంగా కుటుంబ సబ్యులని ఇబ్బంది పెట్టె విధంగా ఉండబోతుంది. కావున మాట్లాడేటపుడు తగు జాగ్రత్త అవసరం. మనసుకి నచ్చిన పని చేయటం, నచ్చిన ఆహారాన్ని తినడం ద్వారా మానసికంగా సంతోషంగా ఉండగలుగుతారు. ఈ రోజు మీకు బాగానే ఉంది. ప్రతీ రోజు రాశిఫలాలు పొందటానికి టెలిగ్రామ్ లో మన ఛానల్ ను ఈ లింక్ ద్వారా ఫాలో అవ్వండి. లింక్: https://t.me/HinduDharmamVardhillaliChannel

కుంభ రాశి: ఈ రోజు మీరు మానసికంగా చాలా సంతోషంగా ఉండగలుగుతారు. సమయాన్ని వినోదానికి కర్చు చేస్తారు. సమయానికి ధనం చేతికి అందటం, సమయానికి మిత్రులు సహాయం చేయటం ద్వారా, ఎలాంటి ఇబ్బందులు లేకుండా ఆనందంగా ఉండగలుగుతారు. ఆర్ధికంగా బాగుండబోతుంది. మీకు రావలసిన బాకీలు ఏమైనా ఉంటె అవి ఈ రోజు వసూలయ్యే అవకాశం ఉంది. బంధు మిత్రులతో ఆనందంగా సమయాన్ని గడుపుతారు. శుభవార్తలు వింటారు. సమాజంలో గౌరవ మర్యాదలు పెరుగుతాయి. ఇంటాబయటా పూర్తి అనుకూలం. మీ ప్రతిభ వెలుగులోకి వస్తుంది. ప్రసంసలు అందుకుంటారు. ఈ రోజు మీకు బాగానే ఉంది. ప్రతీ రోజు రాశిఫలాలు పొందటానికి టెలిగ్రామ్ లో మన ఛానల్ ను ఈ లింక్ ద్వారా ఫాలో అవ్వండి. లింక్: https://t.me/HinduDharmamVardhillaliChannel

మీన రాశి: ఆరోగ్యం మందగిస్తుంది. అనారోగ్య సూచనలు ఉన్నాయి. ఏ కొద్ది పాటి నిర్లక్ష్యం ఆరోగ్య విషయంలో పనికి రాదు. తగు జాగ్రత్తలు అవసరం. అలానే మీ కోపాన్ని, ఒత్తిడిని అదుపులో ఉంచుకోవాలి. లేనిపోని విబేదాలకి అవి కారణం అవబోతున్నాయి. కావున మాట్లాడేటపుడు జాగ్రత్తగా ఉండాలి. అయితే గతం కంటే కొంచెం మెరుగ్గా ప్రస్తుత రోజులు ఉండబోతున్నాయి. మనసుకి నచ్చిన పని, నచ్చిన ఆహారం తినడం ద్వారా కొద్ది పాటి మానసిక సంతోషాన్ని పొందగలుగుతారు. పని భారం కొంచెం తగ్గుతుంది. ఆర్ధికంగా సామాన్యంగా ఉండబోతుంది. ఈ రోజు ఒక్క ఆరోగ్య విషయంలో తప్పితే, మిగిలినది అంతా బాగానే ఉంది. ప్రతీ రోజు రాశిఫలాలు పొందటానికి టెలిగ్రామ్ లో మన ఛానల్ ను ఈ లింక్ ద్వారా ఫాలో అవ్వండి. లింక్: https://t.me/HinduDharmamVardhillaliChannel

శుభం భూయాత్ 

Comments