రాశి ఫలాలు - శనివారం - 25-04-2020. గ్రహగతులను అనుసరించి మీకు ఈ రోజు ఎలా ఉండబోతుంది ? Daily Horoscope in Telugu - Astrology


మేష రాశి: ఆర్ధికంగా బాగుంది. గతంలో పెట్టిన పట్టుబడులు ఇప్పుడు రాబడిని ఇస్తాయి. కొంతమంది విషయంలో గతంలో ఒక దానిలో పెట్టుబడి పెట్టి, ఇక దాని నుండి డబ్బులు రావు అని పట్టించుకోకుండా వదిలేసిన ఒక పెట్టుబడి నుండి ఉహించని విధంగా ధనం వస్తుంది. ఇది మీకే ఆశ్చర్యాన్ని ఇస్తుంది. బంధు మిత్రులతో ఆనందంగా గడపటానికి ఇది ఒక మంచి సమయం. శారీరక దృడత్వాన్ని పెంచుకునే దిశగా అడుగులు వేస్తారు. అంటే వ్యాయామం వంటివి చేయాలనీ అనుకుంటారు. ఈ రోజు మీరు చేద్దాం అనుకున్న కొన్ని పనులు వాయిదా పడతాయి. ఈ రోజు మిశ్రమ ఫలితాలను గ్రహ స్థితి సూచిస్తుంది. ప్రతీ రోజు రాశిఫలాలు పొందటానికి టెలిగ్రామ్ లో మన ఛానల్ ను ఈ లింక్ ద్వారా ఫాలో అవ్వండి. లింక్: https://t.me/HinduDharmamVardhillaliChannel

వృషభ రాశి: అవసరానికి సరిపడ ధనం మీకు అందుతుంది. మీరు సహాయం చేస్తారు అని నమ్మిన ఒక ఆత్మీయుల నుండి సహాయాన్ని పొందుతారు. సంతానం విషయంలో మీ ఆందోళన అధికం అవుతుంది. మానసిక ప్రశాంతత లోపిస్తుంది. చాలా నిరాస, నిస్పృహగా ఉంటారు. జీవితంలో ఆనందం అనేది లేదు అనేట్టు చాలా మానసిక ఆందోళనతో ఉంటారు. అయితే ఈ రోజు మీ బంధువు లేదా మిత్రులు మిమ్మల్ని కలసుకోవటం చేత, వారితో సమయాన్ని వెచ్చించి, కొంత మానసిక ప్రశాంతత పొందుతారు. నిజానికి మిమ్మల్ని మీరే తక్కువగా అంచనా వేసుకుంటారు. మీరు చాలా ప్రతిభావంతులు, సమర్ధవంతులు అని త్వరలో మీకు అర్ధం అవుతుంది. ఈ రోజు మీకు అంతగా బాగుండలేదు. కాని భవిష్యత్తు చాలా బాగుందబోతుంది. ప్రతీ రోజు రాశిఫలాలు పొందటానికి టెలిగ్రామ్ లో మన ఛానల్ ను ఈ లింక్ ద్వారా ఫాలో అవ్వండి. లింక్: https://t.me/HinduDharmamVardhillaliChannel

మిథున రాశి: ఈ రోజు మీరు పనులలో చాలా బిసీ గా ఉంటారు. భార్యాభర్తల మద్య గతంలో ఏమైనా విబేదాలు ఉంటె అవి సద్దుమనుగుతాయి. భార్యాభర్తలు ఇద్దరూ ఆనందంగా సమయాన్ని గడుపుతారు. ఎక్కడికైనా వెళ్ళాలి అని దూర ప్రయాణాలకు ప్రణాళికలు వేస్తారు. కర్చులు అధికంగా ఉండబోతున్నాయి. అయితే ఎవరైన మిమ్మల్ని తక్కువ చేసి మాట్లాడిన, మిమ్మల్ని తప్పుపట్టిన సహించలేరు. వారితో వాదించి మరీ మీ వాదనను నగ్గించుకుంటారు. ప్రేమికులకు కాలం అనుకూలంగా ఉంది. ఇష్టమైన వారితో ఆనందంగా సమయాన్ని గడుపుతారు. శుభ వార్తలు వింటారు. భవిష్యత్తుకు సంబందించిన ప్రణాళికలు చేస్తారు. ఈ రోజు మీకు బాగానే ఉంది. ప్రతీ రోజు రాశిఫలాలు పొందటానికి టెలిగ్రామ్ లో మన ఛానల్ ను ఈ లింక్ ద్వారా ఫాలో అవ్వండి. లింక్: https://t.me/HinduDharmamVardhillaliChannel

కర్కాటక రాశి: మీ ప్రతిభ వెలుగులోకి వస్తుంది. ఇంటాబయటా పూర్తి అనుకూలం. అన్నిటా మీదే పై చేయి అవుతుంది. ఆర్ధికంగా సామాన్యంగా ఉండబోతుంది. దంపతుల మధ్య కొద్దిపాటి విబేదాలు ఏర్పడే అవకాశం ఉంది. అది కూడా చాలా చాలా చిన్న కారణానికే గొడవ మొదలవుతుంది. అయితే మీ కోపాన్ని అదుపులో పెట్టుకోవడం ద్వారా ఈ రోజు చాలా వరకు సమస్యల నుండి బయటపడొచ్చు. బయటి వారి సలహావిని చిక్కుల్లో పడతారు. కావున సొంత నిర్ణయాలే ఈరోజు పాటించాలి. ఇతరుల సలహాలను ఒకటికి రెండు సార్లు అలోచించి, అప్పుడు నిర్ణయం తీసుకోవాలి. చాలా బద్దకంగా ఉంటారు. చాలా వరకూ పనులను వాయిదా వేయాలి అని చూస్తారు. ప్రతీ రోజు రాశిఫలాలు పొందటానికి టెలిగ్రామ్ లో మన ఛానల్ ను ఈ లింక్ ద్వారా ఫాలో అవ్వండి. లింక్: https://t.me/HinduDharmamVardhillaliChannel

సింహ రాశి: ఆరోగ్యం మందగిస్తుంది. అనవసరపు ప్రయాణాలు వాయిదా వేసుకోవడం మంచిది. ఆత్మీయుల సహాయం ద్వారా ఆర్ధిక లభ్ధిని పొందగలుగుతారు. నూతన ఆదాయ మార్గాలను సృష్టించుకోవడంలో ఇతరుల సహాయంతో విజయాన్ని పొందగలుగుతారు. ఈ రోజు ఒక ఆనందకరమైన వాతవరణంలో మీరు ఉండబోతున్నారు. మానసిక ప్రశాంతతను కలిగి ఉంటారు. అవివాహితులకు శుభవార్తలు వినే అవకాశం ఉంది. జీవిత భాగస్వామితో సరదాగా గడుపుతారు. చాలా అనంగంగా ఉంటారు. ఈ రోజు మీకు బాగానే ఉంది. ప్రతీ రోజు రాశిఫలాలు పొందటానికి టెలిగ్రామ్ లో మన ఛానల్ ను ఈ లింక్ ద్వారా ఫాలో అవ్వండి. లింక్: https://t.me/HinduDharmamVardhillaliChannel

కన్యా రాశి: అనుభవజ్ఞుల సలహా ద్వారా వ్యాపారం అభివృద్ధి బాటలో నడుస్తుంది. అనుకోకుండా ప్రయాణాలు వాయిదా పడతాయి. మీ శత్రువులకు కూడా మంచి చేసే మీ స్వభావం ఈ రోజు అందరికీ తెలిసివస్తుంది. మనసుకి నచ్చిన వారితో సమయాన్ని ఆనందంగా గడుపుతారు. భార్యాభర్తల మధ్య కొద్దిపాటి వాగ్వాదాలు చోటుచేసుకునే అవకాశం ఉంది. పని భారం అధికంగా ఉండబోతుంది. ఈ రోజు మీకు సాధారణంగా ఉండబోతుంది. ప్రతీ రోజు రాశిఫలాలు పొందటానికి టెలిగ్రామ్ లో మన ఛానల్ ను ఈ లింక్ ద్వారా ఫాలో అవ్వండి. లింక్: https://t.me/HinduDharmamVardhillaliChannel

తులా రాశి: ఆర్ధికంగా బాగుంది. గతంలో పెట్టిన పెట్టుబడులు మీకు రాబడిని ఇస్తాయి. మీకు రావలసిన ధనం ఏదైనా ఉంటె దానిని మీరు రాబట్టుకోగాలుగుతారు. ఈ రోజు మీకు బాగా నచ్చిన పనులు మాత్రమే చేస్తారు. మీరు ఏది చేయాలి అనుకుంటే అదే చేస్తారు. ఇతరుల మాట వినరు. ఎందుకంటే మీరు మీ జీవితాన్ని మీకు నచినట్టుగా బ్రతకాలి అనే నిర్ణయానికి వచ్చారు కాబట్టి. కుటుంబ సభ్యలతో ఆనందంగా సమయాన్ని గడుపుతారు. ఇష్టమైన ఆహారాన్ని భుజిస్తారు. ఈ రోజు మీకు బాగానే ఉంది. ప్రతీ రోజు రాశిఫలాలు పొందటానికి టెలిగ్రామ్ లో మన ఛానల్ ను ఈ లింక్ ద్వారా ఫాలో అవ్వండి. లింక్: https://t.me/HinduDharmamVardhillaliChannel

వృశ్చిక రాశి: భాగస్వామ్య వ్యాపారస్తులు అప్రమత్తంగా ఉండాలి. ముఖ్యంగా ఆర్ధిక పరమైన విషయాల యందు. మీ కుటుంబ సభ్యుల యొక్క బాగోగులు చూసుకుంటారు. వారిని ఆనందంగా ఉంచాలి అని అనుకుని తదనుగుణంగా తగిన పనులు చేస్తారు. ఆహ్వానాలు అందుతాయి. భార్యాభర్తల మధ్య విబేదాలు ఏర్పడే అవకాశం ఉంది. తద్వారా మానసిక ప్రశాంతతను కోల్పోతారు. గతంలో నేర్చుకున్న పాటాలు మీకు ఎంతగానో ఉపయోగపడతాయి. భవిష్యత్తును ఉహించి మీరు చేసే ప్రణాళికలు ముఖ్యంగా వ్యాపార సంబందిత వాటిలో ఈ గత అనుభవాలు నేర్పిన పాటాలు ఎంతగానో ఉపయోగ పడతాయి. తద్వారా మతింత జాగ్రత్త గా ఉంటారు. ప్రతీ రోజు రాశిఫలాలు పొందటానికి టెలిగ్రామ్ లో మన ఛానల్ ను ఈ లింక్ ద్వారా ఫాలో అవ్వండి. లింక్: https://t.me/HinduDharmamVardhillaliChannel

ధనుస్సు రాశి: మీ మొండి పట్టుదలతో ఎంతటి పనినైనా కష్టించి పూర్తి చేస్తారు. ఆశించిన ఫలితాలు అందుకుంటారు. మీ కష్టపడే తత్వం, ఓర్పు మీ విజయానికి కారణం అవుతాయి. కర్చులు పెరుగుతాయి. సమయానికి ధనం చేతికి అందదు. ఆర్ధికంగా చాలా ఇబ్బందిని ఎదుర్కోవలసిన పరిస్థితి గోచరిస్తుంది. ఇతరులను ఆనంద పరచటానికి మీ ఆనందాన్ని కోల్పోతారు. అది మీ మంచితనం. మీ కుటుంబ సభ్యులలో ఒకటికి అనారోగ్యం చేసే అవకాశం ఉంది. మీ చిన్ననాటి వస్తువులు ఇంట్లో దొరుకుతాయి. వాటితో కాలక్షేపం చేస్తారు. చిన్ననాటి మిత్రులను కలసుకోవటం, సంభాసించటం వంటివి చేస్తారు. మీ చిన్ననాటి మధుర జ్ఞాపకాలు గుర్తుచేసుకుని ఆనందంగా ఉంటారు. ఈ రోజు మీకు ఆర్ధికంగా తప్పితే, అంతా బాగానే ఉంది. శుభం. ప్రతీ రోజు రాశిఫలాలు పొందటానికి టెలిగ్రామ్ లో మన ఛానల్ ను ఈ లింక్ ద్వారా ఫాలో అవ్వండి. లింక్: https://t.me/HinduDharmamVardhillaliChannel

మకర రాశి: ఆధ్యాత్మిక చింతన ఉంటుంది. పూజ, జపం వంటివి చేస్తారు. భవిష్యత్తు కోసం పెట్టుబడులు పెడతారు. ముఖ్యంగా స్టాక్ మార్కెట్ వంటి వాటిలో పెట్టుబడి పెట్టె అవకాశం ఉంది. ఇతరుల స్వార్ధ బుద్ధి మీకు బాధను కలిగిస్తుంది. మీరు ఎంత బాధ, కష్టాల్లో ఉన్నారో కూడా పట్టించుకోకుండా వారి స్వలాభాలకోసం మిమ్మల్ని వాడుకోవాలి అని అనుకునేవారిని చూసి మీకు బాధ వేస్తుంది. అయితే కనీసం ఈ విధంగా అయినా ఎవరు ఎలాంటి వారు అనేది మీకు తెలిసివస్తుంది. ఈ రోజు అంతా మీరు కాలిగా కాలక్షేపం చేసేస్తారు. సమయాన్ని వినోదానికి కర్చు చేస్తారు. నూతన పరిచయాలు పెరుగుతాయి. భార్య భర్తల మధ్య అన్యోన్యత పెరుగుతుంది. ప్రతీ రోజు రాశిఫలాలు పొందటానికి టెలిగ్రామ్ లో మన ఛానల్ ను ఈ లింక్ ద్వారా ఫాలో అవ్వండి. లింక్: https://t.me/HinduDharmamVardhillaliChannel

కుంభ రాశి: ఆత్మస్థైర్యం పెరుగుతుంది. జీవితం లో మీరు అనుకున్నది సాదించే దిశగా అడుగులు వేస్తారు. అధికారులతో కొద్దిపాటి ఇబ్బందులు ఎదురయ్యే అవకాశం ఉంది. మీ కుటుంబ సబ్యులలో ఒకరి ఆరోగ్యం మెరుగుపడుతుంది. దానికి కారణం మీరు దగ్గరుండి చూసుకోవటమే అని వారు మిమ్మల్ని మెచ్చుకుంటారు. గతంలో ఎవరితో అయినా విబేదాలు ఉంటె అవి ఈ రోజు సమసిపోతాయి. ప్రయాణాలు చేసే అవకాశం ఉంది. నూతన వస్తువులు కొనే అవకాశం ఉంది. ఈ రోజు మీ మాట తీరు ప్రసంసనీయంగా ఉండబోతుంది. ఇతరుల మన్ననలు అందుకుంటారు. ఈ రోజు మీకు బాగానే ఉంది. శుభం. ప్రతీ రోజు రాశిఫలాలు పొందటానికి టెలిగ్రామ్ లో మన ఛానల్ ను ఈ లింక్ ద్వారా ఫాలో అవ్వండి. లింక్: https://t.me/HinduDharmamVardhillaliChannel

మీన రాశి: మీ ఆత్మీయులతో సమయాన్ని ఆనందంగా గడుపుతారు. ప్రయాణాలు చేయాలి అనుకున్నప్పటికీ అవి వాయిదా పడతాయి. మీరు కలుసుకుంటాను అని చెప్పిన వారిని అనుకోకుండా సమయానికి మీరు కలుసుకోలేకపోతారు. విలువైన వస్తువులు పోయే ప్రమాదం ఉంది. కావున జాగ్రత్తగా ఉండాలి. కొంత కాలంగా మిమ్మల్ని వేదిస్తున్న సమస్య ఒకటి ఈ రోజు సానుకూల పడుతుంది. మీకు నచ్చిన పనులలో సమయాన్ని గడుపుతారు. నూతన కోర్స్ లలో చేరడానికి, మీ నైపుణ్యాన్ని పెoచుకోవడానికి ప్రయత్నిస్తారు. ఈ రోజు మీకు చోరభయం తప్పితే అంతా బాగానే ఉంది. ప్రతీ రోజు రాశిఫలాలు పొందటానికి టెలిగ్రామ్ లో మన ఛానల్ ను ఈ లింక్ ద్వారా ఫాలో అవ్వండి. లింక్: https://t.me/HinduDharmamVardhillaliChannel

శుభం భూయాత్ 

Comments