నేటి రాశి ఫలాలు - గురువారం - 23-04-2020. గ్రహగతులను అనుసరించి మీకు ఈ రోజు ఎలా ఉండబోతుంది ? Daily Horoscope in Telugu - Astrology


మేష రాశి: ఆర్ధికపరమైన విషయాలలో తగు జాగ్రత్త అవసరం. గుడ్డిగా అందరినీ నమ్మడం ద్వారా వారు మిమ్మల్ని మోసం చేసే అవకాశం ఉంది. ముఖ్యంగా భాగస్వామ్య వ్యాపారస్తులకు ఇది సూచించటం జరుగుతుంది. అలేనే మీ ఆత్మీయులు మిమ్మల్ని కలసుకుంటారు. వారితో సమయాన్ని వెచ్చిస్తారు. మీ జీవిత భాగస్వామి మీ పట్ల చూపే ప్రేమ, మీ పట్ల ప్రవర్తించే విధానం మీకు ఎంతో ఆనందాన్ని కలిగిస్తుంది. భార్య భర్తల మధ్య అన్యోన్యత పెరుగుతుంది. మీకు నమ్మకమైన వారితో కలిసి భవిష్యత్తుకి సంబందించిన వాటి గురించి ప్రణాళికలు చేస్తారు. అవి మీకు కలసి వచ్చేవిగా ఉంటాయి. ఈ రోజు మీకు చాలా బాగుంది. ముఖ్యంగా మానసికంగా ఎంతో ఉల్లాసంగా ఉండగలుగుతారు. ప్రతీ రోజు రాశిఫలాలు పొందటానికి టెలిగ్రామ్ లో మన ఛానల్ ను ఈ లింక్ ద్వారా ఫాలో అవ్వండి. లింక్: https://t.me/HinduDharmamVardhillaliChannel

వృషభ రాశి: చిన్ననాటి తీపి జ్ఞాపకాలు గుర్తుకు వస్తాయి. చిన్నప్పుడు ఇంటిలో లేదా స్కూల్ లో చేసే కొన్ని చిన్న చిన్న పనులు ఇప్పుడు కూడా చేయడానికి ప్రయత్నిస్తారు. అంటే చాక్పీస్ మీద బొమ్మలు చెక్కటం, పెయింటింగ్ వెయ్యటం లాంటివి. తద్వారా మానసికంగా ఆనంద౦గా ఉంటారు. అయితే మీ ప్రయాణాలు మీకు శ్రమను పెంచి, ఆరోగ్యాన్ని దెబ్బతీసేవిగా ఉండే అవకాశం ఉంది. కావున సాధ్యమైనంత వరకు ప్రయాణాలు వాయిదా వేయటం మంచిది. మీ జీవిత భాగస్వామి తన పనిలో తాను పూర్తిగా నిమగ్నం అవ్వటం, మిమ్మల్ని అంతగా పట్టించుకునే తీరిక లేకపోవటం వల్ల మీరు కొంత విసుగు చెందుతారు. అయితే మీకు ఆర్ధికంగా ఈ రోజు మిశ్రమంగానే ఉంది. మీరు సహాయం చేస్తారు అనుకున్నవారు సహాయం చేయరు, అలానే మీకు రావలసిన బాకీలు కుడా వసూలు అవ్వకపోవడం కొంత ఇబ్బందికి గురిచేస్తుంది. ఏదేమైనా ఈ రోజు మీకు మానసికంగా గతం కంటే కొంత మెరుగ్గా ఉండబోతుంది. ప్రతీ రోజు రాశిఫలాలు పొందటానికి టెలిగ్రామ్ లో మన ఛానల్ ను ఈ లింక్ ద్వారా ఫాలో అవ్వండి. లింక్: https://t.me/HinduDharmamVardhillaliChannel

మిథున రాశి: మీ నైపుణ్యం, తెలివితో చేపట్టిన పనులు దిగ్విజయంగా పూర్తి చేసి ఆశించిన ఫలితాలు అందుకోగలుగుతారు. అవకాశాలు వెల్లివిరుస్తాయి. నిరుద్యోగులకు ఉద్యోగ యోగం. అవివాహితులకు చక్కటి సంబంధం కుదిరే అవకాశం ఉంది. మీ ధనాన్ని పెట్టుబడి రూపంలో పెట్టాలి అని భావిస్తారు. అయితే ఈ రోజు మీకు కర్చులు కూడా ఎక్కువగా ఉండబోతున్నాయి. వ్రుత్తి ఉద్యోగ పరంగా శ్రమ, ఒత్తిడి అధికంగా ఉండే అవకాశం ఉంది. అంటే ఇతరులు చేయాల్సిన పనికూడా మీరే చేయాల్సిన పరిస్థితి వచ్చే అవకాశం గోచరిస్తుంది. తద్వారా శ్రమ అధికంగా ఉండబోతుంది. అయితే మీ జీవిత భాగస్వామితో ఆనందంగా ఈ రోజు గడపగలుగుతారు. భార్య భర్తల మద్య గతంలో ఏమైనా కొద్దిపాటి విబేదాలు ఉంటె అవి ఇప్పుడు సమసి పోతాయి. అలానే భార్య భర్తల మద్య అన్యోన్యత ఏర్పడుతుంది. ఈ రోజు మీకు అంతా బాగానే ఉంది. ప్రతీ రోజు రాశిఫలాలు పొందటానికి టెలిగ్రామ్ లో మన ఛానల్ ను ఈ లింక్ ద్వారా ఫాలో అవ్వండి. లింక్: https://t.me/HinduDharmamVardhillaliChannel

కర్కాటక రాశి: ఈ రోజు మీకు చాలా బాగుండబోతుంది. రాబడి పెరుగుతుంది. కోపాన్ని అదుపులో ఉంచుకోవాలి. లేకపోతే లేనిపోని విబేదాలు ఏర్పడే అవకాశం ఉంది. ప్రతీ పనిలోనూ చురుకుగా ఉంటారు. అది మీకు ఉన్న చక్కటి నైపుణ్యం. ఇంటాబయటా పూర్తి అనుకూలం. అన్నిటా మీదే పై చేయి అవుతుంది. గృహ సంబందిత పనులు ఏమైనా ఉంటే ఈ రోజు అవి చేయండి. విజయవంతంగా పూర్తి అవుతాయి. అలానే నూతన వ్రుత్తి, ఉద్యోగాల కోసం ప్రయత్నించే వారికి కాలం అనుకూలంగా ఉంది అని చెప్పాలి. అలానే భవిష్యత్తులో విదేశాలు వెళ్ళాలి అనుకునే వారు దానికి తగిన ప్రణాళిక ఇప్పటినుండే ప్రారంభిస్తారు మరియు తదనుగుణంగా శుభవార్తలు కూడా వింటారు. అంతా శుభమే జరుగుతుంది. ప్రతీ రోజు రాశిఫలాలు పొందటానికి టెలిగ్రామ్ లో మన ఛానల్ ను ఈ లింక్ ద్వారా ఫాలో అవ్వండి. లింక్: https://t.me/HinduDharmamVardhillaliChannel

సింహ రాశి: ప్రయాణాలు వాయిదా పడతాయి. గతంలో మీరు పోగొట్టుకున్న వస్తువు కాని, ధనం కాని మీకు ఈరోజు జ్ఞప్తికి వచ్చి మానసిక ఆందోళన కలిగిస్తుంది. మీ నైపుణ్యాన్ని పెంచుకునే దిశగా అడుగులు వేస్తారు. తదనుగుణంగా పుస్తక పటణం వంటివి కూడా చేస్తారు. కుటుంబ సభ్యులలో ఒకరి అనారోగ్యం మీకు మిక్కిలి బాధను కలిగిస్తుంది. కాని వారు త్వరలోనే కోలుకునే అవకాశం తప్పక ఉంది. అయితే ఈ విషయంలో మీరు ఆందోళనకు గురికావటానికి గల కారణం, ఇతరుల కొద్ది పాటి బాధను కూడా చూడలేని మంచి మనస్సు మీకు ఉండటమే. ఉద్యోగంలో ప్రమోషన్లు, ఇంక్రిమెంట్లు ఉన్నాయి. అనవసరపు వాగ్వాదాలకు దూరంగా ఉండండి. ప్రతీ రోజు రాశిఫలాలు పొందటానికి టెలిగ్రామ్ లో మన ఛానల్ ను ఈ లింక్ ద్వారా ఫాలో అవ్వండి. లింక్: https://t.me/HinduDharmamVardhillaliChannel

కన్య రాశి: లేనిపోని కర్చులు అధికంగా ఉండే అవకాశం ఉంది. ఉహించని విధంగా మీ ఆదాయం కర్చయిపోతుంది. అప్పటికప్పుడు ఏదోకటి రిపేర్ రావడం లాంటివి ద్వారా ధన నష్టం కలిగే అవకాశం ఉంది. ఆధ్యాత్మిక చింతన ఉంటుంది. భగవంతుని సేవలో ఉండే అవకాశం ఉంది. పై అధికారులతో జాగ్రత్త గా ఉండాలి. అలానే, గొడవలకి దూరంగా ఉండాలి. మీకు సంబంధం లేని విషయంలో మిమ్మల్ని లాగి, మిమ్మల్ని చెడ్డవాళ్ళని చేసే ప్రయత్నాలు జరుగుతాయి. జాగ్రత్తగా ఉండాలి. భార్యాభర్తల మధ్య కొద్ది పాటి బేదాభిప్రాయాలు ఏర్పడే అవకాశం ఉంది. ఈ రోజు మీకు మిశ్రమ ఫలితాలను గ్రహస్థితి సూచిస్తుంది. ప్రతీ రోజు రాశిఫలాలు పొందటానికి టెలిగ్రామ్ లో మన ఛానల్ ను ఈ లింక్ ద్వారా ఫాలో అవ్వండి. లింక్: https://t.me/HinduDharmamVardhillaliChannel

తులా రాశి: అనవసరపు వాగ్దానాలు చేయకండి. అవి సమీప భవిష్యత్తులో మీకు ఇబ్బందిగా మారే అవకాశం ఉంది. ప్రయాణాల నిమ్మితం కర్చులు అధికంగా ఉండే అవకాశం ఉంది. ప్రేమ వ్యవహారాలు అనుకూలంగా ఉండబోతున్నాయి. ఇతరులు మీ గురించి ఏమనుకుంటున్నారు అనేదానికన్నా, మీరు సాధించాలి అనుకున్నది ఎంతవరకూ వచ్చింది అనేదనిపైనే మీ మనస్సు/ఆలోచనలు ఉంటుంది. చెడు స్నేహాలను, అలవాట్లను వదిలేయటానికి చక్కటి సమయం ఇది. ఒక ప్రణాళిక ప్రకారంగా ఉండాలి. లేకపోతే అనవసరపు కర్చులకు గాను ధనాన్ని వెచ్చించాల్సి వస్తుంది. ప్రతీ రోజు రాశిఫలాలు పొందటానికి టెలిగ్రామ్ లో మన ఛానల్ ను ఈ లింక్ ద్వారా ఫాలో అవ్వండి. లింక్: https://t.me/HinduDharmamVardhillaliChannel

వృశ్చిక రాశి: మిమ్మల్ని నమ్ముకున్న వారికి కాదనకుండా సహాయం చేస్తారు. తద్వారా వారి మనస్సులో మీకంటూ ఒక స్థానాన్ని సంపాదిస్తారు. మీ గురించి ఆలోచించకుండా ఇతరులకు మీరు చేసే సహాయం మిమ్మల్ని ఆర్ధికంగా కొద్దిగా ఇబ్బంది పెట్టినా, మీ మంచితనం ఇతరులకు తెలిసేలాచేస్తుంది. శత్రువు కూడా మిత్రువుగా మారే మంచి స్వభావం మీదని అందరికీ అర్ధం అవుతుంది. ప్రారంభంలో కొద్దిగా ఆటంకాలు ఎదురైనప్పటికీ పనులు విజయవంతంగా పూర్తి అవుతాయి. అయితే సాధారణ దినాలలో కంటే ఈ రోజు అదే పనికి కొంచెం ఎక్కువ కష్టపడాల్సి వస్తుంది. మీ మనస్సుకి నచ్చిన వారిని, మీ ఆత్మీయులను ఈ రోజు కలుసుకోవటం మీ మానసిక ఆనందానికి కారణం అవుతుంది. ఈ రోజు మీకు బాగానే ఉంది. ప్రతీ రోజు రాశిఫలాలు పొందటానికి టెలిగ్రామ్ లో మన ఛానల్ ను ఈ లింక్ ద్వారా ఫాలో అవ్వండి. లింక్: https://t.me/HinduDharmamVardhillaliChannel

ధనుస్సు రాశి: ఎంతో కాలంగా మిమ్మల్ని ఇబ్బంది పెడుతున్న అనారోగ్య సమస్యలకు ప్రస్తుత వైద్య విధానాన్ని ఆపి, ఆయుర్వేదిక్ లేదా ప్రకృతి సిద్ద వైద్యం వైపు మొగ్గు చూపే అవకాశం ఉంది. స్త్రీ మూకల ధనం మీకు లభించే అవకాశం ఉంది. మీ సమీప బంధువులలో ఒక వ్యక్తి మిమ్మల్ని ఆర్ధికంగా ఆదుకుంటారు. భవిష్యత్తులో మీకు ఉపయోగపడే వ్యక్తులను ఈ రోజు మీరు కలసుకుంటారు. సమయాన్ని ఆనందంగా గడపడానికి వెచ్చిస్తారు. మీ జీవిత భాగస్వామి తన కుటుంభ సభ్యులకు ఇచ్చినంత ప్రాముఖ్యత, మీ కుటుంబ సభ్యులకు ఇవ్వక పోవడం మీకు కొద్దిగా ఆందోళన కలిగిస్తుంది. ఈ రోజు మీకు మిశ్రమంగా ఉండబోతుంది. ప్రతీ రోజు రాశిఫలాలు పొందటానికి టెలిగ్రామ్ లో మన ఛానల్ ను ఈ లింక్ ద్వారా ఫాలో అవ్వండి. లింక్: https://t.me/HinduDharmamVardhillaliChannel

మకర రాశి: తమ స్వార్ధానికి మిమ్మల్ని ఉపయోగించుకునే వ్యక్తులను గుర్తించి వారిని దూరం పెడతారు. ఈ రోజు మీ ఆత్మీయులతో మీరు గడిపే సమయం మీ మానసిక ఆనందానికి కారణం అవుతుంది. మానసిక ప్రాశాంతత లభిస్తుంది. ప్రేమ వ్యవహారాల్లో కొద్దిపాటి ఇబ్బందులు ఎదురయ్యే అవకాశం ఉంది. మీకు నచ్చిన వ్యక్తి మీ కుటుంబ సభ్యులకు నచ్చక పోవడం వల్ల వాగ్వాదం ఏర్పడే అవకాశం ఉంది. కావున జాగ్రత్తగా ఉండాలి. సమయానికి తగు నిర్ణయాలు తీసుకోవటం ద్వారా విజయాన్ని పొందగలుగుతారు. వ్యాయామం, ఎక్సైజ్ వంటి వాటికి మొగ్గు చూపుతారు. శారీరక ద్రుడత్వాన్ని పెంచుకోవాలి అని ప్రయత్నిస్తారు. ఇతరులతో సంభాసిన్చేటపుడు జాగ్రత్తగా ఉండాలి. హాస్యంగా మొదలయిన మాటలు వివాదానికి దారితీసే అవకాశం ఉంది. కావున ఈ విషయంలో తగు జాగ్రత్త అవసరం. ప్రతీ రోజు రాశిఫలాలు పొందటానికి టెలిగ్రామ్ లో మన ఛానల్ ను ఈ లింక్ ద్వారా ఫాలో అవ్వండి. లింక్: https://t.me/HinduDharmamVardhillaliChannel

కుంభ రాశి: ఆకస్మిక ధనప్రాప్తి ఉంది. కుటుంబ సభ్యలతో సమయాన్ని గడుపుతారు. మీకు నమ్మకమైనవారితో చర్చించి సరైన నిర్ణయాలు తీసుకుంటారు. ఇతరులు మాట్లాడే మాటలు మీ మనోభావాలు దేబ్బతిసేవిగా ఉంటాయి. ఇలాంటి మాటలు మీరు ఎంతగానో ప్రేమించే, అభిమానించే వారి నుండి రావటం మీకు మరింత బాధను కలిగిస్తుంది. మీరు చేయు ప్రతీ పనిలోనూ కుటుంబ సభ్యుల సహాయ, సహకారాలు వెన్నంటి ఉంటాయి. రోజూ ఉండే పనుల నుండి మీకంటూ కొంత సమయాన్ని గడపాలని నిర్ణయిస్తారు. అయితే ఎదో ఒక అర్జెంటు పని తగలటం వలన మరల పనిలో నిమగ్నమవుతారు. తద్వారా మీకంటూ కొంత సమయాన్ని గడిపే అవకాశం కోల్పోతారు. మానసిక ప్రశాంతత కోల్పోతారు. ఆరోగ్యం గతం కంటే మెరుగ్గా ఉండబోతుంది. ప్రతీ రోజు రాశిఫలాలు పొందటానికి టెలిగ్రామ్ లో మన ఛానల్ ను ఈ లింక్ ద్వారా ఫాలో అవ్వండి. లింక్: https://t.me/HinduDharmamVardhillaliChannel

మీన రాశి: మీ చక్కటి వాక్చాతుర్యంతో మీ శత్రువులను కుడా మిత్రులను చేసుకోగలుగుతారు. తద్వారా మీరు అనుకున్న పనులు పూర్తికాగలవు. వ్యాపారస్తులకు లాభాలు ఉన్నాయి. నిరుద్యోగులకు ఉద్యోగ అవకాశం ఉంది. ఆ దిశగా ప్రయత్నాలు చేయండి. విజయం వరిస్తుంది. ఎప్పటి నుండో మీరు ఎదురు చూస్తున్న అవకాశం మీకు ఈ రోజు రాబోతుంది. అయితే మీ విషయంలో ఇతరుల అనవసరపు జోక్యం మీకు చికాకును కలిగిస్తుంది. ఆరోగ్యాన్ని మెరుగుపరచుకునే దిశగా మీ ప్రయత్నాలు ఉండబోతాయి. జీవిత భాగస్వామితో కొద్దిపాటి ఇబ్బందులు ఏర్పడే అవకాశం ఉంది. పనులలో కొంత జాప్యం ఉన్నందున జాగ్రత్త వహించాలి. ఈ రోజు మీకు అంతా బాగానే ఉంది. ప్రతీ రోజు రాశిఫలాలు పొందటానికి టెలిగ్రామ్ లో మన ఛానల్ ను ఈ లింక్ ద్వారా ఫాలో అవ్వండి. లింక్: https://t.me/HinduDharmamVardhillaliChannel

శుభం భూయాత్ 

Comments