నేటి రాశి ఫలాలు 22-04-2020 - గ్రహగతులను అనుసరించి మీకు ఈ రోజు ఎలా ఉండబోతుంది ? Daily Horoscope in Telugu - Astrology

మేష రాశి: మీ శక్తీ సామర్ద్యాల ముందు ఎలాంటి ఆటంకమూ మీరు చేయు పనులను ఆపలేదు. ఆదాయ మార్గాలను పెంచుకునే దిశగా ఆలోచనలు చేస్తారు. మనస్సుకి నచ్చిన వారితో సమయాన్ని వెచ్చించి ఆనందంగా ఉండగలుగుతారు. మీ భాగస్వామి మీరు చేయు ప్రతీ పనిలోనూ అండగా ఉండటం, మీ ఆత్మ స్థైర్యాన్ని పెంచుతుంది. భార్య భర్తల మధ్య అన్యోన్యత పెరుగుతుంది. ఉద్యోగ, వ్యాపార రిత్యా అనేక అవకాశాలు ఒక్కసారిగా వచ్చి పడతాయి. అయితే వీటిలో సరైనది ఎన్నుకోవటంలో నిపుణుల సలహా అవసరం. ఈ రోజు మీకు బాగుండబోతుంది. ప్రతీ రోజు రాశిఫలాలు పొందటానికి టెలిగ్రామ్ లో మన ఛానల్ ను ఈ లింక్ ద్వారా ఫాలో అవ్వండి. లింక్: https://t.me/HinduDharmamVardhillaliChannel
వృషభ రాశి: గతం కంటే మెరుగ్గా రాబడి ఉన్నప్పటికీ కుడా కొన్ని అనుకోని కర్చులు వల్ల మీరు అనుకున్న పనికి కర్చుచేసేందుకు తగినంత ధనం ఉండదు. సంతానం విషయంలో పిల్లలు మాట వినకపోవటం కొంత మానసిక ఆందోళన కలిగిస్తుంది. ఉద్యోగ వ్యాపార పరంగా మీకు పూర్తి అనుకూలంగా ఉండబోతుంది. చేపట్టిన పనులు విజయవంతంగా పూర్తి చేస్తారు. మీరు నమ్ముకున్న వారు సమయానికి సహాయాన్ని అందిస్తారు. అయితే కుటుంబంలో ముఖ్యంగా భార్యాభర్తల మధ్య కొద్ది పాటి వాగ్వాదాలు, మనస్పర్ధలు వచ్చే అవకాశం ఉంది. ఈ ఒక్క విషయం మినహా ఇస్తే, ఈ రోజు అంతా మీకు బాగానే ఉంది. ప్రతీ రోజు రాశిఫలాలు పొందటానికి టెలిగ్రామ్ లో మన ఛానల్ ను ఈ లింక్ ద్వారా ఫాలో అవ్వండి. లింక్: https://t.me/HinduDharmamVardhillaliChannel
మిథున రాశి: ఒత్తిడి అధికంగా ఉండే అవకాశం ఉంది. కుటుంబ సభ్యులతో సమయాన్ని గడుపుతారు. ఈ రోజు మీరు చాలా బిజీ గా ఉండబోతున్నారు. ముఖ్యంగా గతంలో పాడైపోయిన వస్తువులను రిపేర్ చేసే ప్రయత్నంలో భాగంగా మీకు ఈ రోజు కాలి ఉండదు. ప్రేమ వ్యవహారాలు అనుకూలంగా ఉండబోతున్నాయి. మీ మనస్సుకు నచ్చిన వారి నుండి అనుకూల సంఘటనలు, వార్తలు వినడం మీ మానసిక సంతోషానికి కారణం అవుతుంది. చేపట్టిన పనులు పూర్తి చేయగలుగుతారు. భవిష్యత్తుకు సంబంధించి మీరు చేసే ప్రణాలికలను గోప్యంగా ఉంచండి. తద్వారా విజయం సిద్ధిస్తుంది. జీవిత భాగస్వామి యొక్క ఆరోగ్యం మందగించటం, వారి అనారోగ్యం మీకు కొంత మానసిక ఆందోళన కలిగిస్తుంది. భార్యా భార్తలంటే, సంసారం అంటే సర్దుకు పోవటమే అని మీరు గ్రహిస్తారు. ఈ రోజు మీకు బాగానే ఉంది. ప్రతీ రోజు రాశిఫలాలు పొందటానికి టెలిగ్రామ్ లో మన ఛానల్ ను ఈ లింక్ ద్వారా ఫాలో అవ్వండి. లింక్: https://t.me/HinduDharmamVardhillaliChannel
కర్కాటక రాశి: ఆలోచనలను అదుపులో ఉంచుకోవాలి. ఆర్ధిక పరిస్థితి గతం కంటే మెరుగ్గా ఉండబోతుంది. నలుగురిలో ఉన్నప్పుడు అందరితోను కలసి, మెలసి ఉండటానికి ప్రయత్నించండి. మొహమాటం, సిగ్గు లాంటివి ఇతరులు మిమ్మల్ని తప్పుగా అనుకోవటానికి కారణం అయ్యే అవకాశం ఉంది. పెళ్లి కాని వారికి ఈ రోజు శుభవార్తలు వినే అవకాశం ఉంది. అలానే ప్రేమికులకు ప్రేయసి నుండి అనుకూల స్పందన వచ్చే అవకాశం ఉంది. నూతన వ్రుత్తి, వ్యాపారాలను ఏర్పరచుకోనేందుకు బాగా అనుకులించే సమయం ఇది. కావున ఆ దిశగా చేసే ప్రయత్నాలు శుభ ఫలితాలను ఇస్తాయి. భార్యా భర్తల మధ్య అన్యోన్యత పెరుగుతుంది. కుటుంబ సభ్యులతో చక్కగా ఆనందంగా ఉండగలుగుతారు. ఈ రోజు మీకు బాగానే ఉంది. ప్రతీ రోజు రాశిఫలాలు పొందటానికి టెలిగ్రామ్ లో మన ఛానల్ ను ఈ లింక్ ద్వారా ఫాలో అవ్వండి. లింక్: https://t.me/HinduDharmamVardhillaliChannel
సింహ రాశి: మీ ఓర్పుకి పరిక్షా కాలంగా ఒక సంఘటన ఉండబోతుంది. అదికూడా మీకు బాగా కావలసిన వారి నుండే ఉండటం మరింత విచారాన్ని కలిగిస్తుంది. నిర్ణయాలు తీసుకునేటపుడు ఒకటికి రెండు సార్లు అలోచించి నిర్ణయాలు తీసుకోవాలి. అధిక రాబదినిచ్చే వాటిలో పెట్టుబడి పెట్టె దిశగా ఆలోచనలు చేస్తారు. మీరు ఇతరుల విషయంలో చేసే సహాయ సహకరాలకి తగిన సత్కారాన్ని, ప్రశంసలను పొందుతారు. ఇది మీ మంచి మనస్సుని, ఇతరులకు సహాయం చేసే మంచి గుణాన్ని అందరికీ తెలిసేలా చేస్తుంది. శత్రువుల పై విజయాన్ని సాధించబోతున్నారు. ఈ రోజు మీరు చాలా బిజీ గా ఉండబోతున్నారు. దీనికి కారణం వ్రుత్తి ఉద్యోగాలతో పాటు మీ పాత మిత్రులను కలుసుకోవటం కుడా అవ్వొచ్చు. భార్య భర్తల మధ్య ప్రేమానురాగాలు పెరుగుతాయి. మీ జీవిత భాగస్వామితో కొన్ని మధుర క్షణాలు గడపగలుగుతారు. మానసికంగా ఆనందగా ఉండగలుగుతారు. ప్రతీ రోజు రాశిఫలాలు పొందటానికి టెలిగ్రామ్ లో మన ఛానల్ ను ఈ లింక్ ద్వారా ఫాలో అవ్వండి. లింక్: https://t.me/HinduDharmamVardhillaliChannel
కన్య రాశి: ఆరోగ్యం మందగిస్తుంది. ప్రభుత్వ సంబందిత విషయాలు కొద్దిపాటి చిక్కులు, విసుగు కలిగించే అవకాశం ఉంది. పెళ్లి కాని వారికి మంచి సంబంధం సెట్ అయ్యే అవకాశం ఉంది. ప్రేమికులు తమ ప్రేమ వ్యవహారాల గురించి పెద్దవారితో మాట్లాడాలి అని ప్రయత్నిస్తారు. కాని వారి నుండి కొద్ది పాటి ప్రతికూల స్పందన రావటం. మీ మనస్సుని నొప్పిస్తుంది. ఎప్పటినుండో మిమ్మల్ని ఇబ్బంది పెడుతున్న పనులను, ఆదాయం, సంతృప్తి లేని వ్రుత్తి, ఉద్యోగాలను విడిచి నూతన వృత్తి, ఉద్యోగాలను చేపడతారు. జీవిత భాగస్వామి యొక్క అనారోగ్య సమస్య మీకు మానసిక ఆందోళన కలిగిస్తుంది. కొన్ని పనులు వాయిదా పడే అవకాశం ఉంది. ప్రతీ రోజు రాశిఫలాలు పొందటానికి టెలిగ్రామ్ లో మన ఛానల్ ను ఈ లింక్ ద్వారా ఫాలో అవ్వండి. లింక్: https://t.me/HinduDharmamVardhillaliChannel
తులా రాశి: ఎంతటి ఒత్తిడి ఉన్నా, ఈ రోజు మీరు గడిపే ఆనంద సమయం మీ ఒత్తిడిని పారద్రోలి మానసిక ప్రశాంతతను కలిగిస్తుంది. ఆర్ధికంగా మీకు ఈ రోజు అంతగా బాగోలేదు. మరీ ముఖ్యంగా స్టాక్ మార్కెట్ లో పెట్టు బడులు పెట్టిన వారు అధిక ధన నష్టాన్ని పొందే అవకాశం ఉంది. మీరు సహాయం చేస్తారు అనుకున్న వారు సమయానికి అందుబాటులో ఉండకపోవటం కొద్దిపాటి మానసిక ఆందోళనకు కారణం అవుతుంది. పనులలో విజయాన్ని సాధించే అవకాశం ఉంది. కుటుంబ సభ్యులతో సమయాన్ని వెచ్చిస్తారు. భార్యా భర్తల మధ్య కొద్ది పాటి విబేదాలు వచ్చే అవకాశం ఉంది. ప్రతీ రోజు రాశిఫలాలు పొందటానికి టెలిగ్రామ్ లో మన ఛానల్ ను ఈ లింక్ ద్వారా ఫాలో అవ్వండి. లింక్: https://t.me/HinduDharmamVardhillaliChannel
వృశ్చిక రాశి: ఈ రోజు జరిగే కొన్ని సంఘటనలు మీ కోపాన్ని అదుపుచేయలేని స్థితికి తీసుకువెళ్తాయి. మీ సహనానికి పరీక్షలా ఈ సంఘటనలు ఉండబోతాయి. ఆర్ధికంగా మీకు తిరుగు ఉండదు. గతం కంటే చాలా మెరుగైన రాబడి మీ సొంతం. ఇతరుల నుంచి సహాయాన్ని ఆశించకుండా మిమ్మల్ని మీరు నమ్ముకుని ముందుకు సాగుతారు. ప్రతీ పనిని నైపుణ్యం తో పూర్తి చేస్తారు. భాగస్వామి యొక్క పూర్తి సహాయ సహాయకారాలు ఉంటాయి. జీవిత భాగస్వామితో ఆనందంగా గడుపుతారు. ఈ రోజు అన్నిటి కంటే ఆర్ధికంగా చాలా చాలా అద్బుతం గా ఉండబోతుంది. ఆదాయ మార్గాలు పెరుగుతాయి. ఉహించిన దానికంటే ఎక్కువ ధనం మీకు వస్తుంది. ప్రతీ రోజు రాశిఫలాలు పొందటానికి టెలిగ్రామ్ లో మన ఛానల్ ను ఈ లింక్ ద్వారా ఫాలో అవ్వండి. లింక్: https://t.me/HinduDharmamVardhillaliChannel
ధనుస్సు రాశి: మానసిక ప్రశాంతత అవసరం. మీకు నచ్చే పనులను మాత్రమే మీరు చేస్తారు. గతంలో పెట్టిన పెట్టుబడుల ద్వారా మీకు ఈ రోజు లాభాలు వచ్చే అవకాశం ఉంది. కుటుంబ సభ్యులతో మాట్లాడేటపుడు ఆచి తూచి మాట్లాడాలి. లేనిపోని విబేదాలు వచ్చి, దానికి కారణం మీరే అని నిందలు పడే అవకాశం ఉంది. కావున జాగ్రత్త గా ఉండాలి. గతంలో మొదలు పెట్టిన పనులు ఈ రోజు పూర్తి అవడం, మీ మానసిక ఆనందానికి కారణం అవుతుంది. అయితే ఈ రోజు పనికొచ్చే పనులకంటే పనికి రాని పనులకే ఎక్కువ సమయాన్ని వెచ్చిస్తారు. ఈ రోజు మీరు వినబోయే ఒక వార్త మీకు మిక్కిలి ఆనందాన్ని కలిగించేదిగా ఉండబోతుంది. ప్రతీ రోజు రాశిఫలాలు పొందటానికి టెలిగ్రామ్ లో మన ఛానల్ ను ఈ లింక్ ద్వారా ఫాలో అవ్వండి. లింక్: https://t.me/HinduDharmamVardhillaliChannel
మకర రాశి: మీ ప్రతిభ వెలుగులోకి వచ్చే సమయంగా దీనిని చెప్పవచ్చు. నలుగురితో ప్రశంసలు అందుకుంటారు. ఆర్ధికంగా బాగుంది. సంతానం ద్వారా మీ కీర్తి ప్రతిష్టలు పెరుగుతాయి. మీ పిల్లలు ఉన్నత ఉద్యోగ వ్యాపారాలలో ఉండటం సమాజంలో మీ పేరు ప్రఖ్యాతలను పెంచుతుంది. వ్రుత్తి ఉద్యోగ పరంగా పూర్తి అనుకూల సమయం నడుస్తుంది. చేపట్టిన పనులు విజయవంతంగా పూర్తి చేయగలుగుతారు. ఈ రోజు ఎక్కువ సమయం కాలిగా ఉండటానికే ఇష్టపడతారు. జీవిత భాగస్వామితో కొంత సమయాన్ని వేచ్చిస్తారు. మానసికంగా చాలా ఆనందంగా ఉండగలుగుతారు. ప్రతీ రోజు రాశిఫలాలు పొందటానికి టెలిగ్రామ్ లో మన ఛానల్ ను ఈ లింక్ ద్వారా ఫాలో అవ్వండి. లింక్: https://t.me/HinduDharmamVardhillaliChannel
కుంభ రాశి: అనవసరపు కర్చులు తగ్గించుకోవాలి. కుటుంబ సభ్యుల మద్య కొద్ది పాటి విబేదాలు ఏర్పడే అవకాశం ఉంది. బాధ్యతలు పెరుగుతాయి. వ్రుత్తి, ఉద్యోగ పరంగా ఒత్తిడి పెరుగుతుంది. శ్రమ అధికం. మీ నైపుణ్యాన్ని, జ్ఞాన్నాని పెంచుకునే దిశగా ప్రయత్నాలు చేస్తారు. పుస్తకాలు చదవటం, ట్రైనింగ్ క్లాసులు చూడటం లేదా వెళ్ళటం వంటివి చేస్తారు. నూతన అవకాశాలు అందిపుచ్చుకుంటారు. జీవిత భాగస్వామి మీకు తోడుగా ప్రతీ పనిలోనూ ఉండటం కొండంత ధైర్యాన్ని ఇస్తుంది. ఈ రోజు మీకు మిశ్రమంగా ఉండబోతుంది. ప్రతీ రోజు రాశిఫలాలు పొందటానికి టెలిగ్రామ్ లో మన ఛానల్ ను ఈ లింక్ ద్వారా ఫాలో అవ్వండి. లింక్: https://t.me/HinduDharmamVardhillaliChannel
మీన రాశి: గతం నుండి మిమ్మల్ని వేదిస్తున్న సమస్యలు తగ్గుముఖం పడతాయి. ఆర్ధికంగా మీ కుటుంబ సభ్యుల సహాయ సహకారంతో లోటు లేకుండా ఉండబోతుంది. ప్రేమ వ్యవహారాలకు అనుకూల సమయం. భార్య భర్తల మధ్య అన్యోన్యత పెరుగుతుంది. ఒకరినొకరు అర్ధం చేసుకుని ఆనందంగా ఉండగలుగుతారు. సమయాన్ని కాలక్షేపం చేయటానికే ఉపయోగిస్తారు. మీకు ఈ రోజు మానసిక ప్రశాంతత లభిస్తుంది. ఈ రోజు మీకు బాగానే ఉంది. ప్రతీ రోజు రాశిఫలాలు పొందటానికి టెలిగ్రామ్ లో మన ఛానల్ ను ఈ లింక్ ద్వారా ఫాలో అవ్వండి. లింక్: https://t.me/HinduDharmamVardhillaliChannel
శుభం భూయాత్
Comments
Post a Comment
ఇక్కడ మీ కామెంట్ రాయండి