నేటి రాశి ఫలాలు 09-04-2020 - గ్రహగతులను అనుసరించి మీకు ఈ రోజు ఎలా ఉండబోతుంది ? Daily Horoscope in Telugu - Astrology

మేష రాశి: ఈ రోజు వీరికి బాగుంది. ఆకస్మిక ధన లబ్ది ఉంది. బందుమిత్రులతో ఆనందగా గడుపుతారు. మానసిక సంతోషం లభిస్తుంది. ఆశించిన ఫలితాలను అందుకోగలుగుతారు.
వృషభ రాశి: శుభ సమయం నడుస్తుంది. బందు మిత్రుల సహాయ సహకారాలు అందుతాయి. పనులు సకాలంలో పూర్తి అవుతాయి. ఆశించిన ఫలితాలను పొందగలుగుతారు. ధన లభ్ది ఉంది.
మిథున రాశి: వైరి వర్గం వారితో ఇబ్బందులు ఎదురయ్యే అవకాశం ఉంది. అయితే ప్రతీ పనిలో నమ్మిన వారు మీ వెన్నంటి ఉండి, వారి పూర్తి సహాయ సహకారాలు మీకు అందివ్వటం ద్వారా మీకు వచ్చే ఇబ్బందులు పెద్దగా ఏమి ఉండవు. దిని వళ్ళ మీకు ఆత్మస్థైర్యం మరింత పెరుగుతుంది.
కర్కాటక రాశి: కొద్ది పాటి అనుమానం మొదలవుతుంది. మనం ఈ పని చేయగలమా, అవుతుందా, లాంటి సందేహాలు ఉండే మనస్తత్వం ఈ రోజు మీకు ఉండే అవకాశం ఉంది. అయితే మీకు తప్పకుండా ఆశించిన ఫలితాలు వస్తాయి. మీకు బందువులు స్నేహితులు సహాయ సహకారాలు అందివ్వటం ద్వారా చేపట్టిన పనులు దిగ్విజయంగా పూర్తి చేయగలుగుతారు. అయితే శ్రమ అధికంగా ఉండుటచేతే, కొద్ది పాటి అనారోగ్య సమస్యలు వచ్చే అవకాశం ఉంది.
సింహ రాశి: ఇంటా బయటా పూర్తి అనుకూల వాతావరణం ఉండబోతుంది. భాగస్వామ్య వ్యాపారులకు లాభాల దిశగా వ్యాపారం ఉండబోతుంది. మీరు ఆశించిన ఫలితాలను అందుకో గలుగుతారు. అంతా శుభమే జరుగుతుంది.
కన్య రాశి: అనుకులా సమయం నడుస్తుంది. భవిష్యత్తుకు సంబందించిన ఒక ప్రధాన విషయం గురించి ఆలోచన చేస్తారు. గతంలో ఆగిపోయిన పనులు ఇప్పుడు తిరిగి ప్రారంభం అవుతాయి. సమాజంలో గౌరవ మర్యాదలు పెరుగుతాయి.
తులా రాశి: చేపట్టిన్ పనులలో కొద్దిపాటి ఆటంకాలు వచ్చే అవకాశం ఉంది. దిని వల్ల మానసిక ఒత్తిడి అధికం అవుతుంది. అయితే మీ పట్టుదలతో చేపట్టిన పనులను ముందుకు తీసుకు వెళ్తారు. ధన నష్టం సూచిస్తుంది. కావున జాగ్రత్త గా ఉండాలి.
వృశ్చిక రాశి: గతంకనే కొన్ని రెట్ల శుభ సమయం నడుస్తుంది. పూర్తి అనుకులతను త్వరలో చుడబోతారు. ఈ రోజు వీరికి ప్రతీ పనిలోనూ విజయం లభిస్తుంది. అయితే వ్యాపారస్తులు అధికారుల విషయంలో కొద్దిగా జాగ్రత్త గా ఉండాలి. మానసిక ఉల్లాసం వీరికి దక్కుతుంది.
ధనుస్సు రాశి: మీ మొండి పట్టుదలతో ఎలాంటి కష్టాన్నైనా, ఆటంకంనైనా అధికమించి ఆశించిన ఫలితాలను సాధిస్తారు. మీ బందు వర్గం నుండి మీరు ఆశించిన లబ్ధిని పొందగలుగుతారు.
మకర రాశి: ప్రతీ పని ఒక ప్రణాళికతో చేసినా, ఆటంకాలు రావడం చూసి ఆశ్చర్యం వేస్తుంది. అయితే తెలివిగా వాటిని అధికమించగలుగుతారు. శ్రమ అధికంగా ఉండబోతుంది. గత అనుభవాలను దృష్టిలో ఉంచుకుని భవిష్య ప్రణాళికలు చేసే అవకశం ఉంది. ఏదేమైనా ఈ రాశి వారికి ఈ రోజు సాధారణ ఫలితాలను గ్రహస్థితి సూచిస్తుంది.
కుంభ రాశి: ఆత్మస్థైర్యం పెరుగుతుంది. అకారణ కలహా సూచనా ఉంది. కావున మాట్లాడేటపుడు జాగ్రతగా ఉండాలి. చేపట్టిన పనులలో జాప్యం ఏర్పడే అవకాశం ఉంది. దానికి కారణం కూడా మీరే కాగలరు. కావున జాగ్రత్త వహించాలి.
మీన రాశి: ప్రతీ పనిని నేర్పుతో, తెలివిగా చేయాలి. ముందు వెనక ఆలోచించకుండా చేసే పనులు తప్పకుండా ఆటంకాలను సృష్టించి, ఆకరికి ఆ పనులు మధ్యలోనే ఆగిపోయే ప్రమాదం ఉంది. కావున ప్రతీది ఒక ప్రణాళిక ప్రకారం చేయాలి. మీరు ఉహించని వార్త ఒకటి మీకు బాధను కల్గిస్తుంది. అలానే కొద్దిపాటి ధననష్టం కూడా ఉంది.
ప్రతీ రోజు రాశిఫలాలు పొందటానికి మా whatsaap నెంబర్(9581451419) సేవ్ చేసుకుని, whatsaapలో ఓం అని మాకు మెసేజ్ చేయండి. ఆ తదుపరి, ప్రతీ నిత్యం జ్యోతిష్యం, భక్తి సమాచారం, భక్తి పుస్తకాలు వంటివి మీకు whatsaap ద్వారా పంపిస్తాము. మా whatsaap నెంబర్ 9581451419
శుభం భూయాత్
Comments
Post a Comment
ఇక్కడ మీ కామెంట్ రాయండి