రాశి ఫలాలు - వార ఫలాలు - weekly horoscope in telugu 29-03-2020 to 04-04-2020


మేష రాశి: ఈ వారం గ్రహస్థితులను పరిశీలిస్తే ఈ రాశివారికి గతం కంటే మెరుగ్గా ఉండబోతుంది. వీరికి అనేక అవకాశాలు ఒకేసారి వచ్చే అవకాశం ఉంది. తద్వారా ఏ అవకాశాన్ని అందిపుచుకోవలో తెలియని పరిస్థితి నెలకొంటుంది. నిర్ణయాలు వాయిదా పడే అవకాశం ఉంటుంది. ఆర్ధికంగా వీరికి ఈ వారం బాగుండబోతుంది. గతంలో ఎవరితో అయినా విబేధాలు ఉంటె అవి సమసిపోయే అవకాశం ఉంది. ఒక ప్రణాళిక ప్రకారం పనులు పూర్తి చేయాలి అని సంకల్పించిన ఏదోక ఆటంకం చేత అది కాస్త ఆలస్యం అవ్వటమో లేక ప్రణాళికా ప్రకారం అవ్వకపోవడమో జరిగే అవకాశం ఉంది. ఇది మీ మానసిక ప్రశాంతతను దేబ్బతీసున్తుంది. ఒత్తిడి పెరుగుతుంది. ఆరోగ్యం మందగిస్తుంది. ఈ రాశి వారు ప్రతీ నిత్యం నవగ్రహ స్తోత్రాలు పటించటం మంచిది. 

వృషభ రాశి: ఈ రాశి వారికి అద్బుతంగా ఉండబోతుంది. ఉద్యోగస్తులకు ప్రమోషన్లు, ఇంక్రేమెంట్లు దక్కే అవకాశం ఉంది. అలానే వీరికి ఆదాయ మార్గాలు పెరిగే అవకాశం కూడా ఉంది. గతంలో తీసుకున్న అప్పులను తీర్చే అవకాశం వస్తుంది. అలానే వీరికి ఎప్పటినుండో చీకాకుగా ఉంటున్నటువంటి కోర్ట్ సమస్యలు ఈ వారం ఒక కొలిక్కి వస్తాయి. ఆత్మ స్థైర్యంతో చేపట్టిన ప్రతీ పని పూర్తి చేస్తారు. లేనిపోని కర్చులు అధికంగా ఉండే అవకశం ఉంది. ఆత్మీయుల నుండి వచ్చే సమాచారం మీకు మానసిక ఉల్లాసాన్ని ఇచ్చేదిగా ఉంటుంది. పూర్వపు బందువులు/మిత్రులు లతో ఈ వారం మీరు సంభాసించే అవకాశం ఉంది. వారి యొక్క పూర్తి సహాయ సహకారాలు మీరు చేసే ప్రతీ పనికి మీకు లభించబోతుంది. 

మిథున రాశి: ప్రస్తుతం వీరికి గ్రహస్థితి బాగుండలేని కారణంగా ఆరోగ్యం అంతగా బాగుండదు. శుభ గ్రహం, ధన కారకుడు అయిన గురుడు వీరికి అంతగా యోగించట్లేని కారణంగా ఆర్ధిక ఇబ్బందులు ఎక్కువగా ఉండే అవకాశం ఉంది. లేని పోనీ కర్చులు ఉంటాయి. ఆదాయాన్ని మించి కర్చు ఉండబోతుంది. రాబడికి గండు పడే అవకాశం కుడా ఉంది. కాని అది త్వరలోనే మీ చేతికి అందుతుంది. అనుభవం లేని వాటిలో పెట్టుబడులు పెట్టడం లాంటివి చేయకూడదు. స్పెక్యులేషన్ కలసి వచ్చే అవకాశాలు చాలా తక్కువగా ఉన్నాయి. కావున వీలైనంత వరకు ఆర్ధిక ఆరోగ్య విషయాల్లో శ్రద్ద వహించాలి. లేనిపోని గొడవలకు వెళ్లి అనవసరపు ఇబ్బందులను కొని తెచ్చుకోవద్దు. ఈ వారం విబేదాలు వచ్చే అవకాశం ఉన్నందున జాగ్రత్త గా ఉండవలెను. వీరు దాశరధ కృత శని స్తోత్రం ప్రతీ నిత్యం పటించుట మంచిది. 

కర్కాటక రాశి: వీరికి ఈ వారం మిశ్రమ ఫలితాలను గ్రహస్థితులు సూచిస్తున్నాయి. ఎంతో కాలం నుండి పెండింగ్ లో ఉన్న పనులు ఈ వారం పూర్తి అయ్యే అవకాశం ఉంది. అన్ని విధాలా ఈ వారం వీరికి బాగుందబోతుంది. పెళ్లి కాని వారికి మంచి సంబంధం వచ్చే అవకాశం ఉంది. రాబడి పెరుగుతుంది. గతంలో ఎవరితో అయినా విబేదాలు ఉంటె అవి ఈ వారం సమసిపోతాయి. ఉద్యోగస్తులకు కాస్త ఒత్తిడి తగ్గి మానశిక ప్రశాంతత లభిస్తుంది. కొన్ని సార్లు మీ సూటిగా మాట్లాడే తత్వం ఎదుటి వారి మనసున్ను గాయపరిచే అవకాశం ఉంది. కావున మాట్లాడేటపుడు ఇతరులు బాధ పడకుండా సామరస్యంగా మీ అభిప్రాయాన్ని వెల్లడించటం ఉత్తమం. 

సింహ రాశి: కీలకమైన నిర్ణయాలు వాయిదా వేయటం చెప్పదగిన సూచన. వీరు ఆరోగ్య విషయంలో శ్రద్ద వహించాలి. ఆర్ధికంగా అంతగా అనుకూలంగా లేదు. నిందారోపణలు ఎదుర్కోవలసిన గడ్డు పరిస్థితి వచ్చే అవకాశం ఉంది. మంచి చేద్దామనుకుంటే చెడు అయ్యి నలుగురిలో అవమానిన్చాబడే అవకాశం ఉంది. లేనిపోని కర్చులు తగ్గించుకొనుట మంచిది. వీరికి గ్రహస్థితి అంతగా బాగుండలేని కారణంగా ప్రతీ నిత్యం ఏదోక దేవాలయాన్ని ముఖ్యంగా శివాలయాన్ని దర్శించటం, ప్రతీ నిత్యం సూర్యాష్టకం పటించటం. ఆదివారం మాంసాహారం భూజించకపోవటం చెప్పదగిన సూచన. 

కన్యా రాశి: వీరికి గ్రహస్థితి గతంకంటే మెరుగ్గా ఉండబోతుంది. ఆర్ధికంగా ఇబ్బందులు తొలగుతాయి. ఎంతోకొంత సహాయం మీరు ఆశించిన వారి నుండి పొందగలగటం మీ మనషిక సంతోషానికి కరణమవుతుంది. ఆదాయ మార్గాలు పెరుగుతాయి. పూర్వపు మిత్రులను, బంధువులను కలుసుకుంటారు. ఎంతోకాలంగా మీరు ఎదురు చూస్తున్న అవకాశం ఈ వారం మీకు దక్కే అవకాశం ఉంది. గతంలో మీరు ఇచ్చిన అప్పు ఈ వారం వచ్చే అవకశం ఉంది. అంటే మొండిబకయిలు ఏమైనా ఉంటె ఈ వారం ప్రయత్నించండి. సానుకూల స్పందన వచ్చే అవకాశం ఉంది. వీరికి గతం కంటే ప్రతుత గ్రహస్థితి చాలా బాగుందనే చెప్పాలి. 

తులా రాశి: వీరికి ప్రస్తుత గ్రహ స్థితి అంతగా అనుకూలించట్లేదు. ఆర్ధిక సమస్యలతో సతమతమయ్యే అవకాశం ఉంది. లేనిపోని వివాదాలలో ఇరుకున్నే అవకాశం ఉంది. బంధువర్గాలతో మాట్లాడేటపుడు ఆచితూచి మాట్లాడాలి. ప్రతీ పని నెమ్మదిగా సాగుతుంది. ఒత్తిడి కొంచెం అధికంగా ఉంటుంది. మానసిక ధైర్యాన్ని కలిగి ఉంటారు. ప్రతీ పనిని పట్టుదలతో పూర్తి చేస్తారు. స్థిరాస్తి పలపరచుకోవాలి అనుకునే వారికి అనుకూల సమయంగా చెప్పవచ్చు. అలానే పూర్వీకుల నుండి రావలసిన ఆస్తిపాస్తులు ఏమైనా ఉంటె ఈ వారం వచ్చే అవకాశం ఉంది. వీరు ప్రతీ నిత్యం శివాష్టకం పటించటం మంచింది. 

వృశ్చిక రాశి: ఎంతోకాలంగా శని పీడతో ఇబ్బంది పడుతున్న వీరికి మంచిరోజులు ఆరంభం అయ్యావని చెప్పవచ్చు. వీరికి గతంకంటే ఎంతో మెరుగ్గా ఉండబోతుంది. ఆర్ధిక ఇబ్బందులు తొలగి ఒక నూతన ఆదయ మార్గం ఏర్పదబోతుంది. గతంలో చేసిన అప్పులు తీర్చేందుకు కావలసిన ధనం ఈ వారం మీ చేతికి అందుతుంది. స్తంభించుకుపోయిన పనులు ఏమైనా ఉంటె అవి ముందుకు కదలుతాయి. భగవంతునిపై గతం కంటే చాలా ఎక్కువగా భక్తి విశ్వాసాలు పెరుగుతాయి. కొద్దిపాటి ఇబ్బందులను మినహా ఇస్తే మిగిలినది అంతా అద్బుతంగా ఉంది. వీరికి నూతన అవకాశాలు వ్రుత్తి, ఉద్యోగ పరంగా వచ్చే అవకాశం ఉంది. ఏదేమైనా వీరికి గతంతో పోలిస్తే చాలా బాగుంది. హమ్మయ్య అనుకునే వారం ఇది. ఉపిరి పీల్చుకుని హాయిగా మనస్శంతిగా ఉంటారు. ఎందుకంటే ఎంతోకాలంగా ఉన్న ఇబ్బందులు అన్నీ తొలగిపోతాయి. ఇప్పటికే చాలా ఇబ్బందులనుండి బయటపడ్డారు. ఆ మిగిలిన ఇబ్బందులు కూడా త్వరలోనే తొలగిపోతాయి. 

ధనుర్రాశి: వీరికి ఏలినాటి శని చివరి భాగంలో ఉంది. అయితే జన్మం నుండి శని సంచారం మారటం వళ్ళ వీరికి గతం కంటే చాల హాయిగా ఉంటుంది. ముఖ్యంగా మానసికంగా గతం కంటే బాగుంటుంది. గతంలో ఎవరితో అయిన విబేదాలు ఉంటె అవి పెద్దల ద్వారా లేదా స్నేహితుల ద్వారా పరిష్కరిన్చబడతాయి. ధనాన్ని పొడుపు చేయాలి అనే ఆలోచన చేస్తారు, ఆ విధంగా అడుగులు వేస్తారు. అయితే వీరికి కర్చులు కుడా కాస్త ఎక్కువగానే ఉండబోతున్నాయి. కావున జాగ్రత్తగా ఉండవలెను. గతంలో చేసిన తప్పులను సరిదిద్దుకోవాలని నిర్ణయాలు తీసుకుంటారు. అవి ఫలిస్తాయి. ఆరోగ్యం పట్ల జాగ్రత్త అవసరం. 

మకర రాశి: వీరికి గ్రహస్థితి మిశ్రమ ఫలితాలను సూచిస్తుంది. బద్ధకం పెరిగే అవకాశం ఉంది. ప్రతీ పనీ వాయిదా వేసే అవకాశం ఉంది. గతంలో కంటే ఇప్పుడు కొద్దిగా జాప్యం ఎక్కువ అవుతుంది. ప్రణాళిక ప్రకారం చేయాలనుకున్న పనులు చేయలేక ఒకింత మానసిక ఒత్తిడికి గురి అవుతారు. లేనిపోని తగాదాలకు దూరంగా ఉండండి. ముఖ్యంగా మీ జీవిత భాగస్వామితో. ప్రతీ పనిలో ఇతరులు మీ తప్పు లేకుండానే నిందించే పరిస్థితి వచ్చే అవకాశం ఉంది. దానికి గ్రహస్తితే కారణమని మీరు గ్రహించాలి. అలానే ఓర్పుతో ప్రతీ సమస్యను అధికమించాలి. ఆరోగ్యం పట్ల జాగ్రత్త అవసరం. 

కుంబ రాశి: ఈ రాశి వారికి ఈ వారం గతం కంటే మెరుగ్గా ఉండబోతుంది. ఎంతో కాలంగా పరిష్కారం కాని సమస్యలు త్వరలో పరిష్కారం అవుతాయి. ధీర్గకాలిక గొడవలకు ఈ వారం ఒక చక్కటి పరిష్కారం లభిస్తుంది. సంబంద బాంధవ్యాలను మెరుగు పరచుకునేందుకు చక్కటి అవకాశాలు వస్తాయి. గతంలో ఎవరితో నైనా విబేధాలు ఉంటె వాటి పరిష్కారం దిశగా మీరు వేసే ప్రణాళిక,/పనులు మీకు కలసి వస్తుంది. నూతన వస్తు వాహనాలు కొనడానికి అనుకూల సమయంగా చెప్పవచ్చు. గతంలో పెట్టుబడి పెట్టి నష్టపోయిన వ్యాపారాల నుండి మీరు ఈ వారం తప్పుకునే అవకాశం ఉంది. అలానే నూతన అవకాశాల కోసం మీరు చేసే ప్రయత్నాలు కూడా ఫలిస్తాయి. మీరు చేసే ప్రతీ పనిలోనూ అనూహ్యంగా విజయం పొందుతారు. మీ శత్రువులు కూడా మిత్రులుగా మరేంత అద్బుతంగా మీ గ్రహస్థితి ఉండబోతుంది. 

మీన రాశి: గతంకంటే వీరికి ఈ వారం మెరుగ్గా ఉండబోతుంది. వీరు కీలక నిర్ణయాలు ఈ వారం తీసుకుంటారు. గ్రహస్థితి బాగుండుతచేత చేసే వ్రుత్తి వ్యాపారాల యందు అనుకూలత, నూతన ఉద్యోగ అవకాశాలు, వ్యాపర అవకాశాలు అందివస్థాయి. గతం కంటే ఆర్ధిక పరిస్థితి మెరుగ్గా ఉండబోతుంది. రావలసిన ధనం సకాలంలో చేతికి అందుతుంది. బండుమిత్రులను కలసుకునే అవకాశం ఉంది. మానసిక ప్రశాంతత లభిస్తుంది. నూతన ఉద్యోగాలకోసం లేదా వ్యాపారాల కోసం చేసే ప్రయత్నాలు ఫలిస్తాయి. అద్బుతమైన అవకాశాలు ఈ వారం మీకు రాబోతున్నాయి. ఆర్ధిక ఇబ్బందులు తొలగుతాయి. ఆదయ మార్గాలు పెరుగుతాయి. మొత్తం మీద ఈ రాశి వారికి గతం కంటే ఈ వారం చాలా మెరుగ్గా ఉండబోతుంది. 

శుభం భూయాత్ 

Comments