నేటి రాశి ఫలాలు 02-10-2019 I Today Rashi Phalalu I Daily Horoscope in Telugu I hindu dharmam I telugu devotional


మేష రాశి:
అధికంగా శ్రమ పడవలసివస్తుంది. ఒత్తిడి ఎక్కువగా ఉండే అవకాశం ఉంది. స్నేహితులతో, బంధువులతో కొద్ది పాటి తగాదాలు వచ్చే అవకాశం ఉంది. అనుకోకుండా ప్రయాణం చేయవలసి వస్తుంది. తద్వారా శారీరక శ్రమ పెరుగుతుంది. ఆరోగ్యం పట్ల జాగ్రత్త అవసరం.

వృషభ రాశి:
ఆరోగ్యం అంతగా బాగుండదు. ప్రయాణాలు చేస్తారు. దేవాలయాలు దర్శిస్తారు. ఒత్తిడి ఉంటుంది. మనశికంగా ఆశాంతి. ఆర్ధికంగా సామాన్య ఫలితాలను మాత్రమే పొందగలుగుతారు.

మిథున రాశి:
ఈ రోజు వీరికి చాల బాగుంది. అరుష్టం వరించే కాలం. ఆకస్మిక ధన ప్రాప్తి, ఉద్యోగ, వాహన యోగం లాంటివి సూచిస్తున్నాయి. ఎంతోకాలంగా ఎదురుచూస్తున్న ఒక కల ఒకటి సహకారం అయ్యే రోజు గా చెప్పవచు. అన్ని విధాలా బాగుంది. కాని గుర్తుపెట్టుకోండి. ఏ పని అయినా కష్టపడితేనే, మనం చేస్తేనే పని పూర్తి అవుతుంది. కలలు కంటూ కూర్చుంటే సరిపోదు. దయుంచి తప్పుగా అనుకోకండి.

కర్కాటక రాశి:
గతంలో మీకు ఎవరితో నైనా విబేధాలు ఉంటే వాటిని సరిచేసుకోవటానికి అద్బుత సమయం గా దీనిని చెప్పవచ్చు. మీకు ఉన్న నెట్వర్క్ పెరిగి అధి మీ వ్యాపార అభివృధికి దారితీస్తుంది. ఆర్ధికంగా బాగుంది. దైవ దర్శనాలు కుడా చేసుకునే అవకాశం ఉంది.

సింహ రాశి:
ఒత్తిడి ఎక్కువగా ఉంటుంది. అనుకోని పని భారం నెత్తిన పడటం, అనుకోకుండా ప్రయాణాలు చేయవలసి రావటం లాంటివి సూచిస్తున్నాయి. తద్వారా శారీరక శ్రమ పెరుగుతుంది. ఆరోగ్యం మందగించే అవకాశం ఉంది. ఆర్ధికంగా అంతగా బాగుండలేదు. దైవ ప్రార్ధన మేలు చేస్తుంది.

కన్యా రాశి:
ఎంత సంపాదించినా వచ్చిన ఆదాయం కంటే కర్చులే అధికంగా ఉంటాయి. అది మీకు మానసిక అశాంతిని ఒత్తిడిని కలిగిస్తుంది. దూర ప్రయాణాలు చేసే అవకాశం ఉంది. అనుకోని వివాదంలో ఇరుకునే అవకాశం ఉంది. ఆరోగ్యం పట్ల జాగ్రత్త అవసరం.

తులా రాశి:
అన్నివిధాల కలసి వస్తుంది. ఆర్ధికంగా బాగుంది. నిరుద్యోగులకు ఉద్యోగ యోగం. గతంలో తీసుకున్న నిర్ణయాలు ఇప్పుడు అమలు చేసే అవకాసం ఉంది. సమాజంలో కీర్తి ప్రతిష్టలు పెరుగుతాయి. అన్నిటా మీదే పై చేయి అవుతుంది. అన్ని విధాలా బాగుంది.

వృశ్చిక రాశి:
దూర ప్రయాణాలు చేసే అవకాశం ఉంది. ఆర్ధికంగా సామాన్యం గా ఉంది. కుటుంబ సభ్యులతో మాట పట్టింపులు వచ్చే అవకాశం ఉంది. జాగ్రత్త అవసరం. వీరికి రానున్నవాన్ని మంచి రోజులే (శని మారిన తరువాత నుండి)

ధనుస్సు రాశి:
ఆర్ధికంగా గతం కంటే బాగుంది. ఇంట బయట అనుకూలం. వ్యాపారాలు విస్తరిస్తారు. ఉద్యోగులకు ప్రమోషన్ లు. నూతన వాహన గృహ యోగం. మిత్రులను కలుసుకుని ఆనందంగా ఉంటారు.

మకర రాశి:
అనుకున్న పనులు ఆకరి నిమిషంలో వాయిదా పడతాయి. మనశికంగా అశాంతి. బందు మిత్రులతో విబేదాలు, ఆర్ధిక పరిస్థితి మందగిస్తుంది. ఆరోగ్యం పట్ల జాగ్రత్త అవసరం.

కుంభ రాశి:
వీరికి ఈ రోజు బాగుంది. వీరికి రావలసిన ఆస్తి పాస్తులు ఏమైనా ఉంటే అవి వచ్చే అవకాశం ఉంది. ఆర్ధికంగా బాగుంది. ఆకస్మిక ధన ప్రాప్తి యోగం ఉంది. మిత్రులతో సఖ్యత బాగుంటుంది. వీరికి అన్ని విధాలా బాగుంది.

మీన రాశి:
అన్ని విధాలా బాగుంది. దూరపు బంధువులను కలుసుకునే అవకాసం ఉంది. మానసికంగా ఆనందంగా ఉంటారు. స్థిరాస్తి కొనే అవకాశం ఉంది. అన్నిటా మీదే పై చేయి అవుతుంది. ఆర్ధికంగా బాగుంది.

ప్రతీ నిత్యం కార్తీక పురాణాన్ని, పంచాంగ, జ్యోతిష్య వివరాలను మరియు అనేక భక్తి విశేషాలను మీ వాట్సాప్ కి ఉచితంగా పొందటానికి ఈ నెంబర్ ని సేవ్ చేసుకొని వాట్సాప్ లో హాయ్ అని మెసేజ్ చేయండి. నెంబర్: 9581451419

జై హింద్. హిందూ ధర్మం వర్ధిల్లాలి.

Comments