వినాయక చవితి –ధర్మ సందేహాలు – సలహాలు – పరిహారాలు

వినాయక చవితి – సందేహాలు – సలహాలు – పరిహారాలు 

హిందువులు జరుపుకునే అత్యంత ముఖ్యమైన పండుగలలో వినాయక చవితి ఒకటి. వినాయకుని చవితి తిది మొదలు తొమ్మిది రోజులపాటు వివిధ రూపాలలో పూజించి, చివరి రోజు నిమజ్జనం చేయటాన్నే వినాయక చవితి పండుగగా జరుపుకొంటారు. అయితే ఇది ధార్మిక పరమైనది కాబట్టి, చాల మందికి చాల సందేహాలు ఉంటాయి. అంటే ఏ సమయంలో జరుపుకోవాలి ? ఎలాంటి విగ్రహాన్ని తీసుకోవాలి, ఏ సైజు లో ఉండాలి ? ఎన్ని ఒత్తుల దీపాన్ని వెలిగించాలి ? ఏ నునే వాడాలి ? లాంటి అనేక సందేహాలు ఉన్నాయి. అయితే అటువంటి వాటిలో ప్రధానంగా మరియు సాధారణంగా వచ్చే ప్రతీ సందేహానికి ఇక్కడ సమాధానం చెప్పటానికి ప్రయత్నిద్దాం. అయితే, ఇంకా ఏమైనా సందేహాలు ఉంటే క్రింది కంమెంట్లలో అడిగినా మేము తెలియ చేస్తాము. 

వినాయక చవితి ఏ సమయంలో జరుపుకోవాలి ? 

సాధారణంగా పూజ అనేది సూర్యోదయానికి పూర్వమే, బ్రాహ్మి ముహూర్తంలో చేయాలి. కాని ఈ వినాయక చవితిని శాస్త్రం ప్రకారం భాద్రపద శుద్ధ చవితి నాడు వినాయక చవితిగా జరుపుకోవాలి. కాబట్టి పంచాంగాన్ని అనుసరించి ఈ నేల (సెప్టెంబర్) రెండవ తారికుని చవితి తిది మొదలు అయినప్పుడు పూజను చేసుకోవచ్చు. పంచాంగ వివరాలు మన youtube ఛానల్ లో ప్రతీ రోజు తెలుపుతున్నాము. ఈ రోజు పంచాంగాన్ని క్రింది వీడియో లో చూడొచ్చు. 

వినాయకుని విగ్రహం దేనితో తయారు చేసినది ఉండాలి ? 

ప్రకృతికి హాని కలిగించనటువంటి మట్టితో చేసిన ప్రతిమను పూజించుట మంచింది. 

వినాయకుని విగ్రహం సైజు ఎంతుండాలి ? 

ఎప్పుడు కుడా ఇంటిలో పూజ చేసుకునే విగ్రహాల యొక్క సైజు 11 అంగులాలకు మించరాదు. 

ఎన్ని దీపాలు వెలిగించాలి ? 

రెండు దీపాలు వెలిగించాలి. మొదటిది పూజలో విఘ్నాలు కలుగకుండా గణనాయకుని పూజించే ప్రధమ పూజకు వెలిగించేది. రెండవది వినాయకుని వ్రతం చేసేటపుడు అంటే ప్రధాన పూజ కు వెలిగించేది. 

దీపంలో ఏ నునే ఉపయోగించాలి ? 

వినాయకునికి కొబ్బరి నూనెతో దీపం వెలిగించినా అత్యంత శుభదాయకం. 

దీపంలో ఎన్ని వత్తులు వేయాలి ? 

ప్రథాన దీపంలో ఐదు వత్తులు వేయటం మంచిది. 

21 పత్రాలలో అన్ని దొరకక పోతే ఏమి చేయాలి ? 

ఇరవైయొక్క పత్రాలతో వినాయకుని పుజించమని శాస్త్రం చెప్తుంది. కాని, వినాయకుని పూజించే ఈ ఇరవైయొక్క పత్రాలలో కొన్ని చాల అరదుగా లభిస్తాయి. అటువంటప్పుడు, అవి దొరకనప్పుడు. గణపతిని గరికతో పూజిస్తే అవి కుడా గరిక కు రెండు పోసలు ఉండే గరికతో పూజించాలి. అలా చేసిన వారికి మిగిలిన పత్రాలతో పూజ చేసిన సమానా ఫలితం లభిస్తుంది. 

ఏ పుష్పాలతో పూజించాలి ? 

సాధారణంగా ఇలాంటి సందర్బాలలో అనేక పుష్పాలతో గాననయకుడిని పుజిస్తుంటాం. కాబట్టి, దైవారాధనకు ఉపయోగించే అన్ని పుష్పాలను ఉపయోగించవచ్చు. కాకపోతే, ఎర్రమందారం తప్పక ఉండేలా చేసుకోండి. ఎందుకంటే ఇది మీకు విశేష ఫలితాన్ని ఇస్తుంది. 

వినాయకునికి ఏమేమి నైవేద్యంగా సమర్పించాలి ?

ఉండ్రాళ్లు, జిల్లేడు కాయలు, పాలతాలికలు, వడపప్పు, చలివిడి, పులిహోర, పాయసం. సాధారణంగా గణపతిని భోజన ప్రియుడు అంటారు. ఆయనకు ఉండ్రాళ్లు, కుడుములు, మోదకాలు అంటే మహా ఇష్టం.

వినాయక చవితినాడు చంద్రుడిని చూస్తే కలిగే దోషానికి పరిహారము ఏమిటి ? 

వినాయక చవితినాడు చంద్రుడిని చూడరాదని వ్రత కధలో వివరించారు. అది ఒక శాపం కాబట్టి వినాయక చవితి రోజు చంద్రున్ని చూడరాదు. కాని పొరపాటున చూసినా, వినాయకుని వ్రతం చేసిన అక్షతలను (అంటే స్వామి వారికి పుజించినవి) స్వామి వారికి నమస్కరించి, క్షమించమని వేడుకొని, నెత్తిన జల్లుకొన్నా పాపపరిహారం అవుతుందని సూచన. 

మీకు ఇంకేమైనా సందేహాలు ఉంటే క్రింది కంమెంట్లలో తెలిపినా వెంటనే స్పందించేదము. జై హింద్.

Comments