శ్రీమద్రామాయణము-బాలకాండ- తొమ్మిదవ సర్గ-Sri Valmiki Ramayanam in Telugu- Day - 9


గమనిక: హిందూ ధర్మం లోని అనేక విషయాను అందరికి చేరేలా చేయాలనీ, మన సంస్కృతి సంప్రదాయాల గురించి అందరికి తెలియ చెప్పాలని ప్రారంభించిన ఈ బ్లాగ్ ను మరింత విస్తృతం చేయటానికి, పాఠకులకు మరింత ఉత్సాహాన్ని నింపటానికి, నేటి నుండి మేము ప్రతీ వ్యాసం క్రింద ఆ వ్యాసానికి సంబంధించి ఒక ప్రశ్న అడుగుతాం, ఆ ప్రశ్నకు సమాధానం ఆ వ్యాసం లోనే ఉంటుంది. ప్రశ్న కూడా చాల సులభంగానే ఉంటుంది. పాఠకులు సమాధానాన్ని క్రింది కామెంట్లలో రాయాలి. అలా సరైన సమాధానం రాసిన వారిని ఎన్నుకొని వారికి ఒక బహుమతిని ఇస్తాము. ఆ బహుమతి కూడా చాలా విలువైనది ఇస్తాము (ధర లో కాదు, ధర్మం లో). ఉదాహరణకు, కొన్ని వస్తువులు ఇంటిలో కానీ వ్యాపార స్థలంలో కానీ చెప్పిన విధంగా ఉంచితే ఆ ప్రదేశం లో ఉన్న వాస్తు దోషాలు తొలగి చక్కటి ఆర్థిక స్థితిగతులు ఏర్పడతాయి. కానీ అలాంటి వస్తువు ఎవరికీ వారు కొనుక్కోవటం కంటే ఎవరైనా బహుమతిగా దానిని వారికీ తెలియకుండా ఇస్తే అది భగవంతుడు పంపిన దాని వాలే భావిస్తారు మరియు చాల మంది నమ్మకం ప్రకారం అలా బహుమతి రూపంలో వచ్చిన ఈ తరహా వస్తువు తప్పక సత్పలితాన్ని ఇస్తుందని అనుభవజ్ఞుల సలహా. కాబట్టి అంతటి విశేషం కలిగిన ఒక అద్భుతమైన వస్తువుని మీకు బహుమతి రూపంలో అందిస్తాము. దానికి గాని ఈ బ్లాగ్ లో ప్రచురించే ప్రతీ వ్యాసం క్రిందా అడిగిన ప్రశ్నకి కామెంట్ లలో సమాధానం రాయండి. అంతే విజేతలను మేమె నేరుగా సంప్రదించి వారి చిరునామా తెలిసుకొని బహుమతిని అందిస్తాము. ఈ బహుమతిని నెలలో వచ్చే ఒక శుభ తిది నాడు (అంటే ఆ వస్తవుకి/బహుమతి కి సంబందించిన తిది నాడు) పంపించటం జరుగుతుంది. కాబట్టి, ఈ కార్యక్రమంలో ఏ ఒక్క వ్యాసం మిస్ అవకుండా ఉండాలంటే వెంటనే పైన ఉన్న సబ్స్క్రయిబ్ అనే ఆప్షన్ మీద క్లిక్ చేసి మీ ఇమెయిల్ ఇచ్చి ఓకే చేయండి. మీ మెయిల్ ఓపెన్ చేసి చూసుకుంటే ఒక కన్ఫర్మేషన్ లింక్ వస్తుంది. దానిని ఓకే చేస్తే, ఈ బ్లాగ్ లో ప్రచురించే ప్రతీ వ్యాసం మీ మెయిల్ కి నేరుగా వస్తుంది. అక్కడి నుండి మీరు లింక్ ద్వారా ఆ వ్యాసం చదివి కామెంట్ లలో సమాధానం రాసి, బహుమతులు గెలుచుకోవచ్చు.



నేటి రామాయణ భాగం:

ఇదంతా జాగత్తగా గమనిస్తున్న సుమంతుడు ఏకాంతంగా దశరథునితో ఇలా అన్నాడు. 

“మహారాజా! ఋత్విక్కులు చెప్పిన మాటలు నేను విన్నాను. తమరికి సంతానము కలిగే విషయం గురించి పూర్వము సనత్కుమారుడు ఇతర ఋషులతో చెప్పగా నేను విన్నాను. అదేమిటంటే... 

కశ్యపునకు విభాండకుడు అనే కుమారుడు ఉన్నాడు. విభాండకుని కుమారుడు ఋష్యశృంగుడు. ఋష్యశృంగుడికి తన తండ్రి, తాను ఉన్న అరణ్యము తప్ప వేరు ప్రపంచము తెలియదు. అతను లోక ప్రసిద్ధము లైన రెండు రకముల బ్రహ్మచర్యములను అవలంబించిన వాడు. 

ఆ సమయంలో అంగదేశమును రోమపాదుడు అనే రాజు పరిపాలిస్తున్నాడు. అతడు అమితమైన బలపరాక్రమములు కలవాడు. అతడు ఎప్పుడూ ధర్మము తప్పి నడుస్తూ ఉంటాడు. 

ఆ రాజు అధర్మ ప్రవర్తన ఫలితంగా ఆయన దేశంలో తీవ్రమైన కరువు వచ్చింది. రోమపాదుడు తన రాజ్యంలో వచ్చిన కరువుకు ఎంతో దు:ఖించాడు. వెంటనే తన రాజ్యంలో ఉగ వృద్ధులైన బ్రాహ్మణులను పిలిపించాడు. “ఓ బ్రాహ్మణులారా! మీకు అన్ని ధర్మములు తెలుసు. ఈ అనావృష్టి పోవడానికి నా అధర్మ ప్రవర్తన వలన కలిగిన పాపము తొలగి పోవడానికి మంచి ఉపాయము చెప్పండి." అని అడిగాడు. 

దానికి ఆ బ్రాహ్మణులు ఇలా పలికారు. “ఓ మహారాజా! నీ పాపము పోవడానికి, ఈ కరువు నివారణకు ఒకటే ఉపాయము కలదు. విభాండకుని కుమారుడు, ఋష్యశృంగుడు అనే ముని కుమారుడు ఉన్నాడు. ఆయనను పిలిచి నీ కుమార్తె శాంత అనే కన్యను ఆయనకు ఇచ్చి వివాహం జరిపించు. ఈ అనావృష్టి తొలగిపోతుంది. కాని ఆ ఋష్యశృంగుడు ఇక్కడకు రావడమే చాలా కష్టం." అని అన్నారు. 

ఋష్యశృంగుని తన రాజ్యమునకు రప్పించుటకు తగిన ఉపాయము ఆలోచించాడు రోమపాదుడు. తన మంత్రులను పిలిచి “మీరు వెంటనే పోయి ఋష్యశృంగుని తీసుకొనిరండి" అని ఆజ్ఞాపించాడు. విభాండకునికి భయపడి వారు "మేము వెళ్లము" అని అన్నారు. కాని వారు ఋష్యశృంగుని తీసుకొని వచ్చుటకు ఒక ఉపాయమును చెప్తారు. అది ఏమంటే కొంతమంది వేశ్యలను పంపి స్త్రీ సాంగత్యము గురించి తెలియని ఋష్యశృంగునికి స్త్రీ సంగమము రుచి చూపించి, తీసుకొని రావచ్చును అనీ, అప్పుడు శాంతను ఋష్యశృంగునికి ఇచ్చి వివాహము చేసి అతని ఇంటనే ఉంచుకొన వచ్చును అనీ, ఋష్యశృంగుడు ఉన్నచోట సుభిక్షముగా ఉంటుందని తెలియజేసారు. 

రోమపాదుడు వారు చెప్పిన ప్రకారము చేసి ఋష్యశృంగుని తన రాజ్యమునకు రప్పించుకొని, తన కుమార్తె శాంతను ఇచ్చి వివాహము చేసాడు. ఓ దశరధమహారాజా! తమరు కూడా ఋష్యశృంగుని తీసుకొని వచ్చి యజ్ఞము జరిపించిన తమకు పుత్రసంతానము కలుగుతుంది అని చెప్పుకుంటుంటే నేను విన్నాను.”అని చెప్పాడు సుమంతుడు. ఆ మాటలకు ఎంతో సంతోషించాడు దశరథుడు. 

“సుమంతా, రోమపాదుడు ఋష్యశృంగుని తన రాజ్యమునకు ఎలా తీసుకు రాగలిగాడు. వివరంగా చెప్పు.” అని అడిగాడు దశరథుడు 

సుమంతుడు ఇలాచేప్పసాగాడు. 

ఇది వాల్మీకి విరచిత 
రామాయణ మహాకావ్యములో 
బాలకాండలో తొమ్మిదవసర్గ 
సంపూర్ణము.


నేటి ప్రశ్న:  రోమపాదుడు ఋష్యశృంగుని తన కూతురికి ఇచ్చి వివాహం చేయాలనీ ఎందుకు అనుకున్నాడు ?
A) ఋష్యశృంగు మంచివాడు కాబట్టి 
B) రోమపాదుని యొక్క కూతురు ఋష్యశృంగు తన భర్తగా కావాలనుకుంది కాబట్టి 
C) రోమపాదుడు ఋష్యశృంగు నకు రాజ్యాన్ని ఇవ్వటానికి 
D) చేసిన పాపలు పోవటానికి మరియు రాజ్య అనావృష్టి పోవడానికి

సరైన సమాధానం క్రింది కామెంట్లలో రాసి విలువైన బహుమతిని గెలుచుకొండి. జై హింద్.


Share on Whatsapp



Comments

  1. రాజ్యం లో అనావృష్టి పోవడానికి సుభిక్షంగా వుండడానికి

    ReplyDelete

Post a Comment

ఇక్కడ మీ కామెంట్ రాయండి