శ్రీమద్రామాయణము-బాలకాండ- ఐదవ సర్గ- రామాయణ కథా ప్రారంభము - Ramayanam in Telugu - Day -5 - The Begining


పూర్వము ఈ భూమినంతా ఎందరో మహారాజులు చక్రవర్తులు పరిపాలించారు. సగరుడు అనే మహారాజు సాగరమును తవ్వించాడు అని ప్రతీతి. సగరుడు త్రవ్వించాడు కాబట్టి దానికి సాగరము అని పేరు వచ్చింది అని నానుడి. సగరుడు ఇక్ష్వాకు వంశములోని వాడు. ఆ సగరునికి 60,000 మంది కుమారులు ఉండేవారు. ప్రస్తుతము మనము చదువుతుర్ణ రామాయణము కూడా ఆ ఇక్ష్వాకు వంశ రాజుల చరిత. 

సరయూ నదీ తీరంలో కోసల దేశము ఉండేది. ఆ దేశము ఎల్లప్పుడూ ధనధాన్యములతో నిండి సంతుష్టులైన ప్రజలతో అలరారుతూ ఉండేది. ఆ నగరంలో ఎన్నో సాంస్కృతిక సంఘములు ఉండేవి. నటీనటులు ఉండేవారు. ఆ నగరంలో ఎన్నో ఉద్యానవనములు ఉండేవి. ఆ నగరము చుట్టు శత్రువులు రాకుండా ఎత్తైన ప్రాకారములు ఉండేవి. ఆ ప్రాకారము వెలువల లోతైన అగడ్త ఉండేది. 

ఆ నగరములో ఏనుగులు, గుర్రములు, ఒంటెలు, గాడిదలు సమృద్ధిగా ఉండేవి. ఆ నగరము ఎల్లప్పుడూ వర్తకమునకు వచ్చిన వర్తకులతోనూ, కష్టము కట్టడానికి వచ్చిన సామంత రాజులతోనూ కిటకిటలాడుతూ ఉండేది. ఆ నగరములో రాజగృహములు, ఎత్తైన మేడలు, క్రీడాశాలలు సమృద్ధిగా ఉండేవి. ఆ నగరము సమతల ప్రదేశములో నిర్మింపబడినది. ఆ నగరములో గృహములు మొదలగు కట్టడములు పూర్తిగా కట్టబడి ఉగ్గవి. వృధాగా ఏ ప్రదేశము వదిలి పెట్టబడలేదు. 

ఆ నగరములో సంగీత వాద్య కచేరీలు ఎల్లప్పుడూ జరుగుతూ ఉండేవి. ఆ నగరంలో ఎంతో మంది యోధులు, వీరులు ఉండేవారు. వారు విలువిద్యలో సిద్ధహస్తులు. శబ్దవేది విద్యలో ప్రావీణ్యము సంపాదించినవారు. 

(శబ్దవేది అంటే టార్గెటను చూడకుండా కేవలం ఆ టార్గెట్ గుండివెలువడే శబ్దమును విని టార్గెట్లు కొట్టడం 

మాగరవులకు హాని చేయు కూర మృగములను ఆయుధములు ఉపయోగించికానీ, ఆయుధములు అందుబాటులో లేకుంటే ఒట్టి చేతులతో కానీ చంపగలిగిన బలపరాక్రమములు కలిగిన వారు అయోధ్యలో ఉండేవారు. అటువంటి సర్వలక్షణ సమన్వితమైన మహానగరమే అయోధ, కోసలదేశ రాజధాని. 

అయోధ్యను రాజధానిగా చేసుకొని దశరధ మహారాజు కోసల దేశమును పరిపాలిస్తున్నాడు. ఆ నగరములో నాలుగు జాతులవారు నివసించేవారు. అందులో బ్రాహ్మణ, క్షత్రియ, వైశ్యులు అందరూ పరమ నిష్టాగరిష్టులు. ప్రతిరోజూ అగిహెూత్రము చేసేవారు. వారందరూ వేద వేదాంగములు చదివిన వారు. మంచి గుణములతో అలరారే వారు. నిత్యము అతిధులకు అర్షదానము చేసేవారు. ఎల్లప్పుడూ సత్యమునే పలికే వారు. మహబుద్ధిమంతులు. అందరూ మహరుల మాదిరి స్వచ్ఛమైన జీవితమును గడుపుతున్నారు. 

ఇది వాల్మీకి విరచిత 
శ్రీమద్రామాయణ మహాకావ్యములో 
బాలకాండలో 
ఐదవ సర్గ సంపూర్ణము.

ఈ మహా కావ్యాన్ని ప్రతీనిత్యం భాగాలుగా చేసి మీకు అందించటం జరుగుతుంది. ఏ రోజు కూడా మిస్ అవకుండా చదవాలి అనుకునేవారు పైన subscribe అనే ఆప్షన్ కనబడుతుందిగా, అక్కడ క్లిక్ చేసి మీ ఇమెయిల్ అడ్రస్ ఎంటర్ చేసి మీ మెయిల్ కు వచ్చిన లింక్ ద్వారా కన్ఫర్మ్ చేస్తే ప్రతీ నిత్యం ఈ మహా పురాణాన్ని మీ మెయిల్ కి ఉచితంగా పంపించబడుతుంది. మీ అభిప్రాయాన్ని క్రింది కామెంట్లలో తెలియ చేయండి. దీనిని వాట్స్ ఆప్ లో మీ మిత్రులతో పంచుకోవటానికి. షేర్ మీద నొక్కినప్పుడు కాపీ లింక్ అనే దానిని క్లిక్ చేసి మీ ఫ్రెండ్స్ కి ఆ లింక్ ను పంపండి. జై హింద్.

Comments