శ్రీమద్రామాయణము - బాలకాండ రెండవ సర్గ - Ramayanam in Telugu Day - 2


శ్రీమద్రామాయణము. 
బాలకాండ రెండవ సర్గ. 

నారదుడు చెప్పిన సంక్షిప్త రామాయణమును విని వాల్మీకి మహర్షి, మరియు ఆయన శిష్యులు నారదుని ఎంతో భక్తితో పూజించారు. తరువాత నారదుడు దేవలోకము వెళ్లిపోయాడు. 

తరువాత వాల్మీకి మహర్షి తమసానది తీరమునకు వెళ్లాడు. ఏ మాత్రం మలినము లేని ఒక రేవు వద్దకు వెళ్లాడు. తన శిష్యుని తనకు కావలసిన పాత, నార బట్టలు తెమ్మనాడు వాల్మీకి. ఆ రేవులో సారం చేయడానికి సంకలించాడు. ఆ ప్రకారంగా శిష్యుడు వాల్మీకికి చెంబు, నార బట్టలు ఇచ్చాడు. వాటిని తీసుకొని వాల్మీకి ఆ వనమంతా ఒక సారి కలయ చూచాడు. 

కొంచెం దూరంలో ఒక చెట్టు మీద నిర్ణయంగా విహరిస్తున్న కౌంచ పక్షుల జంటను చూచాడు. అంతలో ఒక బోయవాడు ఆ క్రౌంచ పక్షుల జంటలో మగపక్షిని తన బాణముతో నిర్దయగా కొట్టి చంపాడు. అమగపక్షి రక్తం కారుతూ కింద పడిపోయింది. కింద పడిపోయిన మగపక్షిని చూచి ఆడ పక్షి ఎంతో దు:ఖించింది. కింద పడ్డ మగపక్షి చుట్టూ తిరుగుతూ దీనంగా ఏడుస్తూ ఉంది. 

ఏడుస్తున్హ ఆ ఆడ పక్షిని చూచాడు వాల్మీకి. ఆయన మనసు ద్రవించిపోయింది. వాల్మీకి ఆ బోయవానిని చూచి ఇలా అన్నాడు. 

మా నిషాద ప్రతిష్ఠాం త్వమగమ: శాశ్వతీ సమా: | 
యత్ కౌఖ్యమిథునాదేకమవధి: కామమోహితమ్ ||

"ఓయీ బోయవాడా! నీవు మన్మధావస్థలో ఉన్ష పక్షుల జంటలో ఒక దానిని చంపావు. కాబట్టి నీవు కూడా అల్లాయుష్కుడవు అవుదువు కాక!" అనే వాక్యము వాల్మీకి నోటి వెంటవచ్చింది. 

అంతలో తనలో తాను ఇలా అనుకున్నాడు. “ఇదేమిటీ! నేను ఈ పక్షుల జంటను చూచి ఇలా అనుకోవడం ఏమిటి! నానోటి నుండి ఇటువంటి వచనములు రావడం ఏమిటి!" అని అనుకున్నాడు. వెంటనే తన నిమ్మని పిలిచి ఇలా అన్నాడు. ఆ క్రౌంచపక్షులలో ఒక దానిని బోయవాడు చంపగా, దానిని చూచి నేను చలించిపోయి పాదబద్ధంగా ఒక వాక్యము చెప్తారు. అది వృధా కారాదు. అది శ్లోకముగా ప్రసిద్ధి చెందుతుంది." అని పలికాడు వాల్మీకి. 

శిష్యుడు వెంటనే ఆ శ్లోకమును కంఠస్థము చేసాడు. తరువాత వాల్మీకి స్నానము చేయడానికి వెళ్లాడు. స్నానము చేసిన తరువాత తన ఆశ్రమమునకు పోతూ ఆ శ్లోకమునే మగగం చేసుకుంటున్నాడు. ఆయన వెంట భరద్వాజుడు అనే ఆయన శిష్యుడు వెంట వెళుతున్నాడు. వాల్మీకి ఆశ్రమమునకు పోయి తన నోటి వెంట వచ్చిన శ్లోకమును మగనం చేసుకుంటూ ధ్యానములో కూర్చున్నాడు. ఆ ధ్యానములో ఆయనకు ఇతర వాక్యాలు కథలు స్పూరించాయి. 

ఆసమయంలో బ్రహ్మదేవుడు వాల్మీకిని చూడటానికి ఆయన ఆశ్రమమునకు వచ్చాడు. బ్రహ్మగారిని చూచి వాల్మీకి సంభ్రమంతో లేచి చేతులు జోడించి నిలబడ్డాడు. బ్రహ్మదేవునికి అర్ఘ్యము, పాద్యము సమర్షించాడు. ఉచితాసనము మీద కూర్చోపెట్టాడు. బ్రహ్మదేవుని ఆదేశము మేరకు తాను కూడా ఒక ఆసనము మీద కూర్చున్నాడు. వాల్మీకి మనసులో మాతము ఆ రౌంచపక్షుల జంట గురించి ఆలోచిస్తున్నాడు. ఆ వ అందముగా విహరిస్తుగ ఆ క్రౌంచ పక్షుల జంటలో ఒక దానిని ఆ కూరుడు నిర్ణయగా కొట్టాడు కదా!" అని. ఆలోచిస్తున్నాడు. వాల్మీకి మనస్సు దు:ఖంతో నిండి పోయింది. ఆప్రయత్నంగా ఆ వాక్యము ఆయన నోటి వెంట వచ్చింది. 

ఆ వాక్యములను వినాడు బ్రహ్మ. “ ఓ వాల్మీకి మహల్ప! నీ నోట వివెంట వచ్చిన వాక్యము శ్లోకమే. అందుకు సందేహము లేదు. ఇది నా సంకల్టమే. నా సంకల్టము వల్లనే నీ నోటి వెంట ఆ వాక్యము వెలువడింది. అది శ్లోకము అయింది. నీవు పుణ్యప్రదమును, మగస్తులను రమింపచేయునదియును అగు రాముని యొక్క చరితమును శ్లోకరూపంలో కావ్యంగా రచించు. రాముడు ధర్మాత్ముడు. గుణవంతుడు. బుద్ధిమంతుడు. రాముని కధను నీకు నారదుడు చెప్పాడు కదా. అదే కధను సవిస్తరముగా చెప్పు. రాముడు, సీత, లక్ష్మణుడు, రాక్షసులు మొదలగు వారి గురించి నీకు తెలిసిన విషయములూ, తెలియని విషయములూ అగ్లీ ఇప్పుడు నీకు సష్టంగా గోచరమవుతాయి. ఈ రామాయణ కావ్యములో నీవు రాసిన ఏ ఒక్కమాట కూడా అసత్యము కాదు. కాబట్టి నీవు రామ కధను శ్లోకరూపంలో రచించు. ఈ చరాచర జగత్తు ఉగ్గంత వరకూ రామ చరిత్ర ఈ లోకంలో నిలిచి ఉంటుంది. నీ చే రచింప బడిన రామాయణ కావ్యము ఎంత కాలము ప్రచారంలో ఉంటుందో అంత కాలమూ నేను సృష్టించిన సమస్తలోకములలో నీవు నివసిస్తావు." అని పలికాడు బ్రహ్మదేవుడు. తరువాత బ్రహ్మదేవుడు అంతర్థానమయ్యాడు. 

ఇది అంతా విస్త్ర వాల్మీకి మహర్షి శిష్యులు ఆశ్చర్యపోయారు. రామాయణ కావ్యమునకు మూలమైన ఆ శ్లోకమును మరలా మరలా స్మరించుకుంటున్నారు. ఒకరితో ఒకరు చెప్పుకుంటూ మనం చేసుకుంటున్నారు. నాలుగు పాదములతో, సమసంఖ్యగల అక్షరములతో, మహర్షి నోటి నుండి వచ్చిన ఆ శ్లోకము శిష్యులు మాటిమాటికీ గాగం చేయడం వలన శ్లోకత్వము పొందింది. 

ఇదంతా గమనించిన వాల్మీకి మహర్షి రామాయణ మహా కావ్యమును అంతా ఇదే విధంగా శ్లోకరూపంలో రచిస్తాను" అని నిశ్చయించుకున్నాడు. వాల్మీకి మహర్షి రామ చరితమును ఉదారమైన పదములతో, మనోహరములైన అక్షరములతో కూలగ వందలాది శ్లోకములలో రచించాడు. ఆ మహా కావ్యము సమాసములతోనూ, సంధులతోనూ, వ్యుత్పత్తులతోనూ, సుమధురములు, అర్థవంతములు అయిన వాక్యములతోనూ అలరారింది. 

ఇది వాల్మీకి విరచిత 
శ్రీమద్రామాయణ మహాకావ్యములో 
బాలకాండలో రెండవ సర్గ 
సంపూర్ణము.

గమనిక: నిన్నటి నుండి ప్రారంభమయిన ఈ మహా కావ్యాన్ని ప్రతీనిత్యం భాగాలుగా చేసి మీకు అందించటం జరుగుతుంది. ఏ రోజు కూడా మిస్ అవకుండా చదవాలి అనుకునేవారు పైన subscribe అనే ఆప్షన్ కనబడుతుందిగా, అక్కడ క్లిక్ చేసి మీ ఇమెయిల్ అడ్రస్ ఎంటర్ చేసి మీ మెయిల్ కు వచ్చిన లింక్ ద్వారా కన్ఫర్మ్ చేస్తే ప్రతీ నిత్యం ఈ మహా పురాణాన్ని మీ మెయిల్ కి ఉచితంగా పంపించబడుతుంది. 

Comments