ఈ రోజు, ప్రజలు తెల్లని దుస్తులను ధరించి బయటికి వస్తారు మరియు ఏ ప్రదేశములో అయితే ఆడాలనుకుంటున్నారో ఆ ప్రదేశంలోకి అందరూ వచ్చి ఉల్లాసంగా గడుపుతారు.
ఆంధ్రా, తెలంగాణా : పట్టణాలలో స్వల్పస్థాయిలో జరుపుకుంటారుతెలంగాణ హైదరాబాదు మరియు ఇతర జిల్లాలో ఇది ప్రముఖంగా జరుపుకుంటారు.
(పంజాబ్ లో హోలీ జరుపుకొంటున్న దృశ్యం)
పంజాబ్ : పంజాబ్‌లో సిక్కులు కూడా ఈ పండుగను జరుపుకుంటారు. ఇక్కడ హోలీని హోలా మోహల్లా అంటారు.ఈ పండుగను భారీ ఎత్తున జరుపుకొంటారు. వాస్తవానికి, భారత దేశ మొత్తంలో ఆనంద్‌పూర్ సాహిబ్ లో జరిగే హోలీ ఉత్సవం చాలా పేరు గడించింది. విదేశాల నుండి కూడా ప్రజలు పంజాబ్‌కు వచ్చి వారి సంప్రదాయ పద్ధతిలో హోలీ పండుగను జరుపుకొంటారు.
(ఉత్తర్ ప్రదేశ్ లో హోలీ పండుగ జరుపుకొంటున్న దృశ్యం)
ఉత్తర్ ప్రదేశ్: హోలీ పండుగకు బర్సాన ప్రదేశం చాలా ప్రసిద్ధి. ఇక్కడ రాధా రాణి ఆలయంలో లాత్ మార్ హోలీ అనే క్రీడను ఆడతారు. లాత్ మార్ హోలీలో కొన్ని వేల మంది సాక్షిగా స్త్రీలు పురుషులను కర్రలతో కొడతారు మరియు హోలీ పాటలను పాడుకుంటూ, పెద్దగా శ్రీ రాదే లేదా శ్రీ కృష్ణ అంటూ పాడతారు. పరిశుద్ధమైన బ్రజ్ భాషలో బ్రజ్ మండలం హోలీ పాటలను పాడతారు.
బర్సానాలో హోలీ రోజున స్త్రీలు పురుషులను కర్రలతో వెంబడిస్తారు. పురుషులు రెచ్చగొట్టే పాటలు పాడుతూ స్త్రీలను ఆకర్షించడానికి ప్రయత్నిస్తారు. తరువాత స్త్రీలు కోపంతో వెళ్లి పురుషులను లాఠీలు అనే పొడవైన కర్రలను ఉపయోగించి కొడతారు పురుషులు వారితో ఉన్న డాలుతో కాపాడుకొంటారు. యు.పి సుల్తాన్పూర్‌లో హోలీ సరదాగా ఉంటుంది. అన్ని గ్రామాలు కలసి ఉత్సాహాంగా జరుపుకొంటారు.
(హోలీ పండుగ రోజు కృష్ణుని పూజించే దృశ్యం)
భగవంతుడైన కృష్ణుడి జన్మ స్థలం అయిన మథురలో మరియు బృందావన్లో హోలీ రోజు ప్రత్యేకమైన పూజలు చేస్తారు మరియు పండుగ చివరి 16 రోజులు, సంప్రదాయక పద్ధతులలో ఆచార వ్యవహారాలతో భగవంతుడైన కృష్ణుడిని పూజిస్తారు.మథుర, బృందావన్, బర్సానాలలో హోలీ జరుపుకొన్నట్లు బ్రజ్ ప్రాంతంలో మరియు దాని సమీప ప్రాంతాలైన హత్రాస్, ఆలీగర్, ఆగ్రాలలో కూడా కొంచెం అదేవిధంగా జరుపుకొంటారు.
ఉత్తరప్రదేశ్‌కు ఉత్తర తూర్పు జిల్లా గోరఖ్‌పూర్‌లో, హోలీ రోజు ఉదయాన ప్రత్యేకమైన పూజలను నిర్వహిస్తారు.హోలీ రోజును సంతోషకరమైన మరియు సంవత్సరంలో సౌభాగ్యవంతమైన దినంగా ప్రజలు భావిస్తారు. దీనినే హోలీ మిలన్ అని అంటారు.ఈ రోజు ప్రజలు ప్రతి ఇంటిని దర్శించి, హోలీ పాటలను పాడుతూ మరియు రంగు పొడిని (అబీర్) పూస్తూ వారి కృతజ్ఞతా భావాన్ని చాటుకుంటారు. హోలీ హిందూ పంచాంగ నెల ఫాల్గునం చివరి రోజన వస్తుంది కాబట్టి దీన్ని సంవత్సర ముగింపుగా కూడా భావిస్తారు. ప్రజలు క్రొత్త సంవత్సర హిందూ పంచాంగం (పంచాంగ్) ప్రకారం హోలీ రోజు సాయంకాలమే రాబోవు సంవత్సరములో హోలీ కొరకు ప్రణాళికలను ప్రారంభిస్తారు.
బీహార్ : బీహార్‌లో కూడా ఉత్తర భారత దేశం జరుపుకున్నట్లు హోలీని అదే స్థాయిలో మరియు మనోహరంగా జరుపుకొంటారు. ఇక్కడ కూడా, హోలిక పురాణం ప్రబలమైనది.ఫాల్గున పూర్ణిమ పర్వ దినానికి ముందు రోజు, ప్రజలు పెద్ద మంటలను వెలిగిస్తారు.వారు పేడ పదార్థాలను, ఆరాడ్ మరియు రెడి చెట్ల యొక్క కలప మరియు హోలీక చెట్టు, పంటలను కోసిన తరువాత మిగిలిన పొట్టును మరియు అవసరం లేని కలపను పెద్ద మంటలలో వేస్తారు. సంప్రదాయం ప్రకారం ఈ రోజు ప్రజలు వారి గృహాలను శుభ్రముగా ఉంచుకొంటారు.
(బీహార్ లో హోలిక సమయంలో మంటలను వేసి హోలీ ప్రారంభించిన దృశ్యం)
ప్రజలందరు హోలీక సమయమప్పుడు మంటల దగ్గరికి వస్తారు. ప్రజలందరి సమక్షములో పురోహితుడు మంటను ఆరంభిస్తాడు.తరువాత ఇతడు ఇతరులకు రంగును పూసి ఒక సూచనా ప్రాయంగా శుభాకాంక్షలు తెలుపుతాడు.తరువాత రోజు ఈ పండుగను రంగులతో ఉల్లాసముగా జరుపుకుంటారు. ఈ పండుగను పిల్లలు మరియు యువకులు చాలా ఆనందముగా జరుపుకొంటారు.ఈ పండుగను సాధారణంగా రంగులతో ఆడుకుంటారు, కొన్ని ప్రదేశాలలో ప్రజలు హోలీ పండుగను బురదతో కూడా ఆడుకొంటారు.హోలీ రోజున మంచి శృతితో జానపద పాటలను పాడతారు మరియు ప్రజలు డోలక్ యొక్క శబ్దానికి నాట్యం చేస్తారు.
(బెంగాల్ లో హోలీ హోలీ జరుపుకొంటున్న దృశ్యం)
బెంగాల్: డోల్ పూర్ణిమ ఉదయం వేళలలో, విద్యార్థులు కుంకుమ పువ్వు రంగు దుస్తులను మరియు పరిమళము వెదజల్లే పూల దండలను ధరిస్తారు.వారు పాటలు పాడతారు మరియు సంగీత పరికరాల అయిన ఎక్‌తార, డుబ్రి, వీణా మొదలగువాటి శ్రుతికి తగ్గట్టు నృత్యం చేస్తారు. వీక్షించే వారు కూడా ఉల్లాసంగా ఊగుతారు మరియు కొన్ని సంవత్సరాల వరకు గుర్తుండిపోతుంది. హోలీ పండగను 'డోల్ జాత్ర', 'డోల్ పూర్ణిమ' లేదా 'స్వింగ్ పండుగ' అని కూడా అంటారు.ఈ పండుగను సంప్రదాయ పద్ధతిలో జరుపుకుంటారు, పట్టణాల్లోని ముఖ్యమైన వీధులలో లేదా పల్లెల్లో కృష్ణుడి మరియు రాధా ప్రతిమలను అలంకరించి పల్లకిలో ఊరేగిస్తారు.ఆడవాళ్లు ఊగుతూ నాట్యం చేస్తున్నప్పుడు భక్తులు వాళ్ళ చుట్టూ తిరుగుతూ భక్తి పాటలను పాడతారు.అప్పుడు పురుషులు రంగు నీటిని మరియు రంగు పొడి అబీర్ జల్లుకొంటారు.
కుటుంబ పెద్దలు భగవంతుడైన కృష్ణుడిని మరియు అగ్నిదేవుడిని ప్రార్ధిస్తాడు. మరియు సాంప్రదాయకంగా కృష్ణుడి ప్రతిమలకు గులాల్ రంగు పూసి భోగ్‌ను అర్పిస్తారు. శాంతినికేతన్‌లో, హోలీ ఒక ప్రత్యకమైన సంగీత అభిరుచి కలిగి ఉంటుంది.సంప్రదాయమైన వంటకాలు మల్పోయే, కీర్ సందేష్, బాసంతి సందేష్ (సాఫ్రన్ యొక్క), సాఫ్ఫ్రన్ పాలు, పాయసం మొదలైనవి.
(ఒరిస్సా లో హోలి రోజున జగన్నాధుని ఊరేగింపు)
ఒడిషా : ఒడిషా ప్రజలు కూడా హోలీని ఇదే విధంగా జరుపుకొంటారు కానీ కృష్ణ మరియు రాధా విగ్రహాలకు బదులుగా పూరీలో ఉన్న జగన్నాధుడి విగ్రహాలను పూజిస్తారు.
(గుజరాత్ లో హోలీ సందర్భంగా భోగి మంటలను సిద్దం చేస్తున్న దృశ్యం)
గుజరాత్: భారత దేశంలోని గుజరాత్ రాష్ట్రంలో రంగుల పండుగ హోలీని శోభాయమానంగా జరుపుకుంటారు. ఫాల్గుణ నెలలో పౌర్ణమి రోజున వచ్చే హోలీ ముఖ్యముగా హిందువుల పండుగ, వ్యవసాయములో రబీ పంటలకు ఇది ఒక సూచనా ప్రాయముగా ఉంటుంది. పల్లెల యొక్క కూడళ్ళలో, కాలనీలలో మరియు వీధులలో భోగీ మంటలను వేస్తారు. ప్రజలు భోగీ మంటల ముందు ప్రార్థనలు చేస్తారు మరియు వారు అలా నృత్యం చేయటం మరియు పాటలు పాడటం వల్ల చెడు మన దరి చేరదని సూచనప్రాయంగా విశ్వసిస్తారు. గుజరాత్‌కు చెందిన వారు అందరు హోలీ పండుగ రోజున అధిక ఉత్సాహముతో మంటల చుట్టూ నాట్యము చేస్తారు.
(హోలీ సందర్భంగా కుండను కొట్టడానికి ప్రయత్నిస్తున్న యువకులు)
దక్షిణ భారత దేశంలో, గుజరాత్‌లోని అహ్మదాబాద్‌లో ఒక కుండలో మజ్జిగను వేసి వీధిలో వ్రేలాడదీస్తారు మరియు యువకులు ఆ కుండను పగులగొట్టడానికి ప్రయత్నిస్తారు అదేసమయములో వారిని ఆపుటకు అమ్మాయిలు వారిపై నీళ్ళను విసురుతారు, ఎందుకంటే కృష్ణుడు మరియు అతని స్నేహితులు వెన్న దొంగతనము చేస్తున్నప్పుడు వారిని 'గోపికలు' ఆపినట్లు ఆపుతారు. కృష్ణుడు వెన్న దొంగతనం చేయడానికి వస్తున్నప్పుడు జాగ్రత్తగా ఉండే వారిని ఎగతాళి చేస్తూ రంగులతో తడిసిన పురుషులు వీధులలో పెద్ద ఊరేగింపు నిర్వహిస్తారు. చివరికి ఏ యువకుడైతే ఆ కుండను పగులగొడతాడో అతడిని హోలీ రాజుగా కిరీటాన్నిస్తారు.
(మహారాష్త్రలో అంగరంగ వైభవంగా హోలిని సెలెబ్రేట్ చేసుకుంటున్న దృశ్యం)
మహారాష్ట్ర: మహారాష్ట్రలో, హోలీ ముఖ్యముగా హోలీక యొక్క మంటలతో అనుసంధానమై ఉంది. హోలీ పౌర్ణమిను షింగా వలె కూడా జరపుకొంటారు. పండుగకు ఒక వారం ముందు, యువకులు చుట్టుప్రక్కల ప్రదేశాలలో ఉన్న కలపను తీసుకువచ్చి అందరి ఇంటికి వెళ్లి డబ్బును పోగు చేస్తారు.హోలీ రోజున, ఒక ప్రదేశములో మంటకు చెక్కను పెద్ద కుప్పగా పోగు చేస్తారు. సాయంత్రం మంటలను వెలగిస్తారు. ఇంట్లో ఉన్న ప్రతి ఒక్కరు తిను బండారాలను మరియు భోజనం అర్పిస్తారు. పూరణ్ పోలి అనేది రుచికరమైన తినుబండారం మరియు పిల్లలు "హోలీ రే హోలీ పురాణచి పోలి" అని పాడతారు.షింగా దౌర్భాగ్యాలన్నింటిని తొలగిస్తుందని ప్రజలు విశ్వసిస్తారు.ఉత్తర భారత దేశంలో వలె రెండవ రోజు జరుపుకోకుండా సంప్రదాయంగా రంగపంచమి రోజున ఉత్సాహంగా రంగులతో ఆడుకొంటారు.
మణిపూర్: భారత దేశానికి ఈశాన్య దిశలో ఉన్న మణిపూర్‌లో హోలీ పండుగను ఆరు రోజులు జరుపుకొంటారు. 18వ శతాబ్దంలో వైష్ణవులు ప్రారంభించినా, ఇది కొన్ని శతాబ్దాల నుండి యోసంగ్ పండుగతో విలీనమైపోయింది.సంప్రదాయంగా, యువకులు రాత్రి వేళల్లో ఫాల్గునమాసము పౌర్ణమి రోజున 'తాబల్ చోంగ్‌బా' జానపద నృత్యాలతో జానపద పాటలతో అద్భుతముగా డోలును వాయిస్తారు.ఎలాగైతేనేమి, వెన్నల రాత్రుల్లో ప్రజలు విందులలో పాల్గొంటారు మరియు ప్రతిదీప్తి దీపం (ఫ్లోరిసెంట్ దీపాలు) ను ఉపయోగిస్తారు మరియు భోగీ మంటలకు ఎండు గడ్డిని మరియు రెమ్మలను ఉపయోగిస్తారు.బాలురు అమ్మాయిలకు తమతో 'గులాల్' ఆట ఆడమని డబ్బు ఇస్తారు.కృష్ణుడి గుడిలో, భక్తులు దేవుడి పాటలను పాడతారు, సంప్రదాయక పద్ధతిలో తెలుపు మరియు పసుపు తలపాగాలను ధరించి గులాల్ ఆడుతూ నృత్యం చేస్తారు.పండుగ చివరి రోజు, కృష్ణుడి గుడి ఆవరణలో ఇంఫాల్ దగ్గర సాంస్కృతిక కార్యక్రమాలను నిర్వహించి, ఊరేగింపు చేస్తారు.
(కాశ్మీర్ లో భారత జవాన్ లు హోలీ జరుపుకొంటున్నప్పటి దృశ్యం)
కాశ్మీర్: కాశ్మీర్‌లో పౌరులు మరియు భారత రక్షక దళ అధికారులు కూడా హోలీ సంబరాలను జరుపుకుంటారు. హోలీని ఎండ కాలమునకు ప్రారంభములో పంటలు కోయు సమయానికి సూచన, ఒకరిపై ఒకరు రంగు పొడిని మరియు రంగు నీళ్ళను విసురుకుంటూ, పాటలు పాడుకుంటూ, నృత్యము చేస్తూ, అధిక ఉత్సాహముతో పండుగను జరపుకొంటారు.
(ఢిల్లీ లో హోలీ పండుగను సెలెబ్రేట్ చేసుకుంటున్న దృశ్యం)
హర్యానా, గ్రామీణ ఢిల్లీ & పశ్చిమ యూపి: ఈ ప్రాంతములో కూడా హోలీ ప్రత్యమైన పద్ధతిలో వాళ్ళ సంప్రదాయం ప్రకారం జరపుకొంటారు, ఈ పండుగను ఆనందముగా మరియు అత్యుత్సాహముతో జరపుకుంటారు.
(నేపాల్ లో అక్కడి ప్రజలు హోలీ ని జరుపుకొంటున్న దృశ్యాలు)
నేపాల్: నేపాల్‌లో, పండుగలలో ఒక గొప్ప పండుగగా హోలీని పరిగణిస్తారు. నేపాల్‌లో 80 శాతం ప్రజలు హిందువులు ఉన్నారు, చాలా వరకు హిందువుల పండుగలను జాతీయ పండుగలుగా జరుపుకొంటారు మరియు దాదాపుగా ప్రతి ఒక్కరు ప్రాంతీయ భేదం లేకుండా జరుపుకొంటారు చివరికి ముస్లిములు కూడా ఘనంగా జరుపుకొంటారు. కొందరు క్రైస్తవులు ఉత్సవాల్లో పాలుపంచుకున్నా ఉపవాస దినాల్లో రావడం వలన చాలా మంది హోలీ పండుగ వేడుకల్లో పాలుపంచుకోలేరు. నేపాల్‌లో హోలీ పండుగ రోజు జాతీయ సెలవు దినం.
హోలీ పండుగను ప్రజలు తమ చుట్టుప్రక్కల వారిపై రంగులను జల్లుకుంటూ రంగు నీరును పోసుకుంటారు.అధిక ముఖ్యమైన ఘట్టం ఒకరిపై ఒకరు రంగు నీళ్ళను పోసుకోవటాన్ని లోలా (నీటి బుడగ అని అర్థం) అని కూడా అంటారు. వివిధ రంగులతో ఆడుకోవటం వల్ల వారి యొక్క బాధలు తొలగిపోయి, రాబోయే జీవితం ఆనందముగా ఉంటుందని నమ్ముతారు.
(విదేశాలలో హోలీ జరుపుకుంటున్న దృశ్యం)
భారత దేశ ప్రవాసులు: సంవత్సరాలు గడుస్తున్నకొద్ది, ప్రవాసభారతీయులు ఉంటున్న చాలా ప్రాంతాలలో అనగా ఆఫ్రికా, ఉత్తర అమెరికాలో, ఐరోపా మరియు దక్షిణ ఆసియాకు దగ్గర ఉన్న ప్రాంతాలలో హోలీ పండుగను ఘనంగా జరపుకుంటారు.
ప్రశ్న: 'తాబల్ చోంగ్‌బా' అనే జానపద నృత్యాలతో హోలీని ఏ ప్రాంతం వారు సెలెబ్రేట్ చేసుకుంటారు ?
A) గుజరాత్
B) బీహార్
C) మణిపుర్
D) ఉత్తర ప్రదేశ్
సరైన సమాధానాన్ని (ఆప్షన్ న్ని) క్రింది కామెంట్లలో రాయండి. విలువైన బహుమతులు గెలుచుకొండి.
గమనించండి: ఈ అవకాశం కేవలం subscribers కు మాత్రమే. అంటే పైన subscribe అనే ఆప్షన్ కనబడుతుంది గా. దాని మీద క్లిక్ చేసి మీ మెయిల్ ఎంటర్ చేసి. మీ మెయిల్ కి వచ్చిన కన్ఫర్మేషన్ లింక్ పై క్లిక్ చేసి ఓకే చేయండి. మీరు కుడా subscriber అవుతారు(ఈ విధంగా ఒకసారి subscribe చేసుకుంటే చాలు, ప్రతీ రోజు సబ్స్క్రయిబ్ చేసుకోనక్కర్లేదు, ప్రతీ రోజు ప్రశ్నకు సమాధానం రాస్తే చాలు సబ్స్క్రయిబ్ చేసుకున్న తరువాత). దీని వలన మీకు లాభం ఏమిటంటే ఇక్కడ ప్రచురించే ప్రతీ వ్యాసం కుడా మీకు ఉచితంగా మెయిల్ కు పంపబడుతుంది. ఒక వేల మీరు ఎప్పుడైనా మిస్ అయినా మీ మెయిల్ ద్వారా ఎప్పుడు కావాలంటే అప్పుడు చదువుకోవచ్చు.
గమనించండి: ఈ అవకాశం కేవలం subscribers కు మాత్రమే. అంటే పైన subscribe అనే ఆప్షన్ కనబడుతుంది గా. దాని మీద క్లిక్ చేసి మీ మెయిల్ ఎంటర్ చేసి. మీ మెయిల్ కి వచ్చిన కన్ఫర్మేషన్ లింక్ పై క్లిక్ చేసి ఓకే చేయండి. మీరు కుడా subscriber అవుతారు(ఈ విధంగా ఒకసారి subscribe చేసుకుంటే చాలు, ప్రతీ రోజు సబ్స్క్రయిబ్ చేసుకోనక్కర్లేదు, ప్రతీ రోజు ప్రశ్నకు సమాధానం రాస్తే చాలు సబ్స్క్రయిబ్ చేసుకున్న తరువాత). దీని వలన మీకు లాభం ఏమిటంటే ఇక్కడ ప్రచురించే ప్రతీ వ్యాసం కుడా మీకు ఉచితంగా మెయిల్ కు పంపబడుతుంది. ఒక వేల మీరు ఎప్పుడైనా మిస్ అయినా మీ మెయిల్ ద్వారా ఎప్పుడు కావాలంటే అప్పుడు చదువుకోవచ్చు.
ఇప్పుడు ప్రశ్నకు సరైన సమాధానం క్రింది కామెంట్లలో రాయండి.















Comments
Post a Comment
ఇక్కడ మీ కామెంట్ రాయండి